సాక్షి, హైదరాబాద్: ఒక చిన్న బర్త్‌డే పార్టీ.. రెండు కుటుంబాల్లోని మొత్తం 25 మందిని రిస్క్‌లోకి నెట్టేసింది. వారందరికీ కరోనా వైరస్ సోకింది. వీరిలో ఇద్దరు ఇప్పటికే మృతి చెందగా, మిగిలినవారు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మలక్‌పేట్‌గంజ్‌లో పల్లినూనె వ్యాపారం చేసే వ్యక్తి (52) ద్వారా ఆయన భార్య సహా వనస్థలిపురంలో ఉంటున్న తల్లిదండ్రులకు, సోదరుడికి, ఆయన భార్యకు, వారి ఇద్దరి పిల్లలకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయం తెలియక పల్లినూనె వ్యాపారి సోదరుడు ఏప్రిల్ 23న ఇంటి వద్దే తన బిడ్డ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. (కరోనా క్యాబ్లు వచ్చేశాయ్!)
హుడా సాయి నగర్‌లోని ఐటీ ఉద్యోగి తల్లి సహా బీఎన్‌రెడ్డిలోని ఎస్‌కేడీనగర్ లోని సోదరి కుటుంబ సభ్యులు సహా పలువురు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇలా ఒక చిన్న బర్త్‌డే పార్టీ.. ఆ రెండు కుటుంబ సభ్యులందరినీ ఇబ్బందు ల్లో పడేసింది. వీరిలో పల్లినూనె వ్యాపారి తండ్రి సహా రెండో కుమారుడు కూడా ఇప్పటికే మృతి చెందారు. ఇక మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తి ద్వారా మొత్తం 13 మందికి వైరస్ సోకింది. కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు ఆయన ఇంటి పక్కన ఉండే కార్పెంటర్ కుటుంబానికి కూడా కరోనా వచ్చింది. (కరోనాకు ధూమపానం మంచిదేనట!)
Comments
Please login to add a commentAdd a comment