మనస్థాపంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య | Software commits suicide by family problems | Sakshi
Sakshi News home page

మనస్థాపంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Published Sat, Jun 6 2015 10:56 PM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

మనస్థాపంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య - Sakshi

మనస్థాపంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

బోడుప్పల్: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ శివశంకర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ శ్రీసాయినగర్‌లో నివసించే లారెన్స్ డిసౌజ, వెలైట్ డిసౌజ కుమారుడు లోయడ్ స్పాస్కై డిసౌజ (30) హబ్సిగూడలోని జెన్‌ప్యాక్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో వారికి సర్ధి చెప్పి తల్లిదండ్రులతో కలిసి వుంటున్నారు. కుటుంబ కలహాలతో తీవ్ర మనస్థాపం చెందిన లోయడ్ స్పాస్కై ఇంట్లోని ఫ్యాన్‌కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement