
సాక్షి, హైదరాబాద్ : వనస్థలీపురంలో భర్త చేతిలో హత్యకు గురైన కవిత అనే యువతి కేసుకు సంబంధించిన వివరాలను సీపీ మహేశ్ భగవత్ శనివారం మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘వనస్థలీపురానికి చెందిన విజయ్(25) ఆటో డ్రైవర్. భార్య కవిత(21)ఎవరితోనో మాట్లాడుతోందన్న అనుమానంతో చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. జూన్ 18న అర్థరాత్రి కవిత పడుకున్న తర్వాత చంపేశాడు. కరోనాతో చనిపోయిందని అందరినీ నమ్మించాడు.
ఎవ్వరినీ దగ్గరకు రానివ్వలేదు. మృత దేహాన్ని నల్గొండకి తీసుకొని వెళ్లి అంతిమ కార్యక్రమాలు కూడా చేశారు. ప్లాన్ ప్రకారమే ఈ హత్య జరిగింది. కవిత తల్లిదండ్రులకు అనుమానం రావటంతో వాళ్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారిస్తే అసలు విషయం తెలిసింది. రీ పోస్టుమార్టం చేస్తే నెగిటివ్ వచ్చింది’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment