న్యూఢిల్లీ: దేశంలో చిన్నారుల అక్రమ రవాణాలో ఉత్తరప్రదేశ్, బిహార్, ఆంధ్రప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. కోవిడ్ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో చిన్నారుల అక్రమ రవాణా కేసుల్లో 68 శాతం పెరుగుదల నమోదైంది. 2016–22 సంవత్సరాల మధ్య గణాంకాల ఆధారంగా ప్రభుత్వేతర సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. జిల్లా వారీగా చూస్తే.. దేశంలోనే అత్యధికంగా జైపూర్ సిటీలో అత్యధికంగా చైల్డ్ ట్రాఫికింగ్ కేసులు నమోదవుతున్నాయి. టాప్ నాలుగు జిల్లాల్లో దేశ రాజధాని ఢిల్లీ ఉండటం గమనార్హం.
2016–22 మధ్య 18 ఏళ్లలోపు 13,549 మంది చిన్నారులను అక్రమ రవాణా నుంచి రక్షించగలిగారు. వీరిలో 9 ఏళ్లలోపు చిన్నారులు 2 శాతం మంది ఉండటం ఆందోళన కలిగించే అంశమని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. చిన్నారులను అత్యధికంగా పరిశ్రమల్లోనే వినియోగిస్తున్నట్లు తేలింది. హోటల్, ధాబాల్లో ఉండే సిబ్బందిలో 15.6% మంది, రవాణారంగంలో 13% మంది, వస్త్ర రంగంలో 11.18% మంది చిన్నారులు పనిచేస్తున్నారు. కాస్మెటిక్స్ పరిశ్రమల్లో 5, 8 ఏళ్ల బాలల్ని వాడుకుంటున్నట్లు నివేదిక తెలిపింది. కోవిడ్ అనంతరం చిన్నారులను పనిలో పెట్టుకోవడం అనేక రెట్లు పెరిగింది. కర్ణాటకలో చైల్డ్ ట్రాíఫికింగ్ 18 రెట్లు ఎక్కువైనట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment