![MLC Kavitha Comments On BJP After CBI Enquiry On Her - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/12/MLC%20Kavitha.jpg.webp?itok=YzVxXYM3)
సాక్షి, హైదరాబాద్: ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను అడ్డదారిలో బీజేపీ కూల్చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. బీజేపీ అరాచకాల్ని అడిగేటోళ్లు ఎవరూ లేరని ఆమె మండిపడ్డారు. దీనిపై యువతలో చైతన్యం తీసుకు రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబై విచారణ తర్వాత తొలిసారి కవిత స్పందించారు.
ఈ మేరకు తెలంగాణ జాగృతి విస్తృతస్థాయి సమావేశంలో సోమవారం మాట్లాడుతూ.. సిస్టమ్‌ను మనం కాపాడుకుంటే.. ఆ సిస్టమ్ మనల్ని కాపాడుతుందన్నారు. బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న వాళ్లను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు.
‘తెలంగాణ ఆడబిడ్డ కళ్లల్లోంచి నీళ్లు రావు నిప్పులు వస్తాయి. ఎవరు మాట్లాడితే వాళ్లపై సీబీఐ వస్తోంది. దేశ వ్యాప్తంగా సీబీఐ దాడులు జరుతున్నాయి. నాపై కూడా జరుగుతున్నాయి. సీబీఐ దాడులకు భయపడేది లేదు’ అని కవిత మరోసారి స్పష్టం చేశారు.
చదవండి: బీఆర్‌ఎస్ టికెట్ నాకే.. గెలిచేది నేనే: పట్నం సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment