సీబీఐ వస్తుంది జాగ్రత్త! | arvind kejriwal warns his deputy of facing cbi enquiry | Sakshi
Sakshi News home page

సీబీఐ వస్తుంది జాగ్రత్త!

Published Thu, Jul 21 2016 9:06 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

సీబీఐ వస్తుంది జాగ్రత్త!

సీబీఐ వస్తుంది జాగ్రత్త!

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మండిపడ్డారు. కొత్తగా కట్టిన కాలేజి భవనాన్ని ప్రారంభించిన తన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ.. సీబీఐ ఏ నిమిషంలోనైనా రావొచ్చు, జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రధానమంత్రి మోదీ సీబీఐని పంపొచ్చు లేదా ఆ కాలేజి భవనాన్ని కట్టే అధికారం నీకు లేదని చెప్పొచ్చు అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే, మనీష్ సిసోదియా మీడియా సలహాదారు ఇంట్లో దోపిడీ జరిగిందంటూ గురువారం మరో ట్వీట్ చేశారు. అయితే దొంగలు కేవలం కొన్ని అధికారిక పత్రాలను మాత్రమే తీసుకెళ్లి విలువైన వస్తువులున్నింటినీ వదిలేశారని.. దీని వెనకాల ఎవరున్నారని ప్రశ్నార్థకం సంధించారు.

విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న మనీష్ సిసోదియా కొత్తగా నిర్మించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ కాలేజిని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీడబ్ల్యుడీ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా పాల్గొన్నారు. ఇలాంటి మంచి భవనం కట్టినందుకు జైన్ను సిసోదియా అభినందించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తమను ఇబ్బందులు పెట్టినా, తాము పనులు చేస్తూనే ఉన్నామని ఆయన అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement