హైదరాబాద్ : సింగరేణి అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లో సింగరేణి అవినీతిపై ప్రశ్నించిన కార్మికులపై టీఆర్ఎస్, టీజీబీకేఎస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలో డిపెండెంట్ కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.