కేసీఆర్ అవినీతికి నిదర్శనమే వరంగల్ ఉప ఎన్నిక
టీపీసీసీ వర్కింగ్ {పెసిడెంట్ భట్టి
నిజామాబాద్‌లో కాంగ్రెస్ పాదయాత్ర
నిజామాబాద్: సీఎం కేసీఆర్ అవినీతికి నిదర్శనమే వరంగల్ ఉప ఎన్నిక అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చాయంటూ రాజయ్యను భర్తరఫ్ చేసి.. శ్రీహరికి ఆ స్థానం కట్టబెట్టడం వల్లే ఎన్నికలు వచ్చాయన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ వద్దంటూ నిజామాబాద్ మండలం మోపాల్ నుంచి మంచిప్ప వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సుమారు 10 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మంచిప్పలో బహిరంగసభలో భట్టి మాట్లాడారు. ‘‘అవినీతికి పాల్పడుతున్నారంటూ రాజ య్యను బర్తరఫ్ చేశావు.. మరి నీవు అవినీతికి పాల్పడుతున్నావు నిన్ను ఎవరు బర్తరఫ్ చేయాలి’’ అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.
రైతులకు సాగు నీటి ఇబ్బందులు లేకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరిచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడానికే పాదయాత్రలు చేస్తున్నామన్నారు. పెద్దమొత్తంలో కమీషన్ల కోసం మొదలెట్టిన రూ.36 వేల కోట్ల వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు కోసం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చంపేయాలని చూస్తున్నారని విక్రమార్క ఆరోపిం చారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై విడుదల చేసిన జీవో నంబర్ 28 ప్రకారం వేసిన కమిటీ నివేదికను బట్టబయలు చేయాలని మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి డిమాం డ్ చేశారు. సమావేశంలో శాసనమండలి కాం గ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ, మాజీమం త్రి పి. సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, తాహెర్‌బిన్ హందాన్, యాష్కీ మధుగౌడ్ పాల్గొన్నారు.