
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అన్యాయంపై అందరూ రగిలిపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి ప్రశ్నించారు. బీసీలపై జస్టిస్ ఈశ్వరయ్య లేవనెత్తిన అంశాలపై చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యాలపై బీసీలు ఆధారపడరని, చంద్రబాబు బీసీలను వ్యతిరేకంగా రిపోర్టు ఇచ్చింది వాస్తవంకాదా? అని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రిపై సీబీఐ విచారణ జరిపించాలి. చంద్రబాబు పాలనలో ఒక్క బీసీకైనా న్యాయం జరిగిందా? బలహీన వర్గాల ప్రజలు చంద్రబాబుకు తగ్గిన బుద్ధి చెబుతారు. ఒకవేళ నిజం అయితే చంద్రబాబుని వెంటనే బర్తరఫ్ చేయాలి’ అని పార్థసారథి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment