సాక్షి, హైదరాబాద్: నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాలు డిమాండ్ చేశాయి. నయీమ్‌తో సత్సంబంధాలు నెరిపిన ప్రభుత్వ పెద్దలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని సూచించాయి. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతున్న ఐదుగురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, 24 మంది ఐపీఎస్ అధికారులు నయీమ్‌తో సన్నిహితంగా మెలిగి లబ్ధి పొందారని, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే రుజువులతో సహా ఆ జాబితా బయటపడుతుందని బీసీ అనుబంధ సంఘాల ప్రతినిధులు అరుణ్, గుజ్జ కృష్ణ, నరసింహగౌడ్, నీల వెంకటేశ్ తదితరులు పేర్కొన్నారు.
‘నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలి’
Published Sun, Nov 6 2016 4:11 AM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM
Advertisement