BC leaders
-
వెనుకబడిన వర్గాలకు టీడీపీ వెన్నుపోటు
-
కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది? రగిలిపోతున్న బీసీ నేతలు!
టీడీపీ అధినేత చంద్రబాబుకు తనసామాజికవర్గ నేతలు ఉంటే.. ఇంక ఎవరితోనూ పని ఉండదు. బీసీలను అసలు పట్టించుకోరు. మూడున్నర దశాబ్దాలుగా కుప్పంలో చంద్రబాబును మోస్తున్న బీసీ నేతలు ఆయన తీరుతో మండిపడుతున్నారు. ఇంతకాలం తమతో పార్టీకి ఊడిగం చేయించుకుని ఇప్పుడు బయటి వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తారా అంటూ ఆగ్రహిస్తున్నారు. స్థానికంగా ఉన్నవారిని పక్కన పెట్టి ఇతర జిల్లాల నుంచి ఇంపోర్ట్ చేస్తే సహించేది లేదంటున్నారు. అసలు కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది? తెలుగుదేశం అనే ప్రాంతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకునే నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గంలో ఆయన కుర్చీ కదిలిపోతోంది. ఏడుసార్లుగా ఎమ్మెల్యేగా ఎన్నుకున్న కుప్పం ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినా కూడా సొంత నియోజకవర్గానికి కనీసం తాగు, సాగునీరు కూడా తీసుకురాలేకపోయారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కుప్పం దశ తిరిగింది. అన్నివిధాలుగానూ కుప్పం నియోజకవర్గాన్ని వైఎస్ జగన్ అభివృద్ధి చేస్తున్నారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా నది నీటిని కుప్పంకు తీసుకువచ్చి వారి దాహార్తిని తీర్చుతున్నారు. పొలాల్ని సస్యశ్యామలం చేస్తున్నారు. నియోజకవర్గం గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించారు. గండం నుంచి గట్టెక్కడానికి కుప్పం పార్టీని తన సామాజికవర్గానికి చెందిన ప్రకాశం జిల్లా నేత, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌కు అప్పగించారు. దీంతో దశాబ్దాలుగా పార్టీకి ఊడిగం చేసిన తాము పనికిరాకుండా పోయామా అంటూ అక్కడి బీసీ నేతలు చంద్రబాబు మీద మండిపడుతున్నారు. నియోజకవర్గంలోని బీసీ నేతలతో పాటు..కుప్పంలో ఆయనకు పీఏలుగా పనిచేసినవారిని కూడా పక్కన పెట్టేశారు. వారికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేసేశారు. దీంతో వారు లోపల ఉండలేక..బయటకు పోలేక అల్లాడిపోతున్నారు. ఇన్నేళ్ళుగా తమను వాడుకుని..ఇప్పుడు నిర్లక్ష్యం చూపిస్తున్నందుకు తామేంటో ఎన్నికల్లో చూపిస్తామని చంద్రబాబును హెచ్చరిస్తున్నారు కుప్పంలోని బీసీ సామాజికవర్గ నేతలు. తమను నమ్మకుండా బాధ్యతలు లేకుండా చేసినపుడు ఇంకా తాము టీడీపీకి, చంద్రబాబుకు ఎందుకు సేవ చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు ఇంతకాలం భారీ మెజారిటీ రావడానికి, అసలు ఆయన విజయం సాధించడానికి అక్కడ చేర్పించిన దొంగ ఓట్లే కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫిర్యాదుతో కుప్పంలో చంద్రబాబు చేర్పించుకున్న దొంగ ఓట్లలో 33 వేలకు పైగా తొలగించారు. అందుకే ఓటమి తప్పదని చంద్రబాబు భయపడుతున్నారు. ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామంటున్నారు అక్కడి బీసీ నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కుప్పంలో అధికార పార్టీ బాగా బలం పుంజుకుంది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో నిరాశా నిస్పృహలు ఆవరించాయి. ఒకవైపు కేడర్‌లో నైరాశ్యం..బీసీ నేతల్లో పార్టీ అధినేత పట్ల ఆగ్రహం..ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత...మొత్తం కలిపి కుప్పంలో చంద్రబాబు కోట కూలడం ఖాయమనే టాక్ నడుస్తోంది. -
బీసీలకు పదవులు ఇచ్చి పట్టాభిషేకం చేసింది సీఎం జగన్ ఒక్కడే
-
సీఎం జగన్ పాలనపై బీసీ లీడర్లు, కార్యకర్తల కామెంట్స్
-
Telangana: పాతిక సీట్లతో సర్దుకోండి!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బలహీన వర్గాల నేతలకు టికెట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ పార్టీ గళం మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా 34 అసెంబ్లీ స్థానాలను బీసీలకు ఇస్తామని ఆ పార్టీ పెద్దలు చెప్పినా ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గెలుపు అవకాశాలు ఉన్నాయని సర్వేల్లో తేలిన వారికి మాత్రమే టికెట్లు ఇవ్వగలమని.. మిగతా వారికి ఇవ్వలేమని హైకమాండ్ స్పష్టం చేసిందని అంటున్నాయి. రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన బీసీ నేతలు అధిష్టానం పెద్దలను కలసినప్పుడు ఈ సంకేతాలు ఇచ్చిందని పేర్కొంటున్నాయి. ఈ సారికి 25 అసెంబ్లీ స్థానాలతో సర్దుకోవాలని.. అధికారంలోకి వచ్చాక బీసీ నేతలకు ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాల్లో ప్రాధాన్యత ఇస్తామని, ఈ విషయాన్ని ఎన్నికలకు ముందే అధికారికంగా ప్రకటిస్తామని పెద్దలు చెప్తున్నారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇతర పదవులు ఇస్తామంటూ... ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌తోపాటు తెలంగాణలోని సామాజిక ముఖచిత్రం నేపథ్యంలో ఈసారి తమకు 40 అసెంబ్లీ స్థానాల్లో పోటీ అవకాశం కల్పించాలని కాంగ్రెస్ బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పోటీచేసే అర్హత ఉన్న 50మందికిపైగా నేతల పేర్లతో అధిష్టానానికి జాబితా కూడా అందజేశారు. కనీసం పీసీసీ అధ్యక్షుడు చెప్పిన విధంగా, రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో తీసుకున్న నిర్ణయం మేరకు 34 అసెంబ్లీ స్థానాలైనా ఇవ్వాలని వారు కోరుతున్నారు. కానీ 25కి మించి ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. రేవంత్ మాట ప్రకారం 34 సీట్లు ఇచ్చే పరిస్థితి లేకుంటే.. ఎన్ని తక్కువ ఇస్తే అన్ని నామినేటెడ్ పదవులు (ఎమ్మెల్సీ) ఇస్తామని, తెలంగాణలో అధికారంలోకి వచ్చాక 9 ఎమ్మెల్సీ స్థానాలను బీసీలకు కేటాయిస్తామని టికెట్ల కేటాయింపు సమయంలోనే పార్టీ పక్షాన అధికారికంగా ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది. దీంతోపాటు బీఆర్ఎస్ నుంచి నలుగురు బీసీలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ కూడా నలుగురు బీసీ నేతలకు రాజ్యసభ అవకాశం కల్పిస్తుందన్న హామీపై చర్చ జరుగుతోంది. ప్రతి లోక్‌సభ సీటు పరిధిలో రెండు సాధ్యం కాదంటూ..! రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ స్థానం పరిధిలో రెండు చొప్పున మొత్తం 34 అసెంబ్లీ టికెట్లను బీసీలకు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలో మాటిచ్చారు. కానీ తాజా పరిణా మాలతో ఈ హామీ అమలు సాధ్యమవడం లేద నే చర్చ పార్టీలో జరుగుతోంది. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు నేతృత్వంలో నిర్వహించిన సర్వేల్లో బీసీ సీనియర్ నేతలకు కూడా సాను కూలత రాలేదని.. ఈ క్రమంలో కచ్చితంగా గెలుపు వరకు రాగల బీసీ అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని అధిష్టానం పేర్కొన్నట్టు తెలిసింది. బీసీ నేతలు ఢిల్లీలో పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి నప్పుడు ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశార ని సమాచారం. పార్టీ అధికారంలోకి రావాలంటే సర్దుకుపోవాల్సి ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. బీఆర్ఎస్ 22 చోట్ల బీసీలకు అవకాశం ఇచ్చిందని.. ఆ పార్టీ కంటే ఒకట్రెండు స్థానాలు ఎక్కువే ఇస్తామని, ఇదే విషయాన్ని బీసీ వర్గాలకు వెల్లడించాలని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. సర్వేల ప్రాతిపదికన ఇది తప్పడం లేదని, సర్వేల విషయంలో ఏమైనా భిన్నాభిప్రాయాలుంటే తనకు తెలపాలని బీసీ నేతలకు కేసీ వేణు గోపాల్ సూచించినట్టు తెలిసింది. -
కాంగ్రెస్ బీసీ నేతల చలో ఢిల్లీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లోని బీసీ నాయకులు ఢిల్లీ బయలుదేరారు. ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన టీం బీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అధిష్టానం పెద్దలను కలిసేందుకు మంగళవారం హస్తిన పయనమయ్యారు. మాజీ ఎంపీ వి. హనుమంతరావు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఓబీసీ జాతీయ సమన్వయకర్త కత్తి వెంకటస్వామి మంగళవారమే ఢిల్లీ వెళ్లగా, మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, గాలి అనిల్‌కుమార్, సురేశ్ షెట్కార్ తదితరులు బుధవారం బయలుదేరనున్నారు. వీరంతా బుధ లేదా గురువారాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవనున్నారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఖరారు చేయనున్న అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో బీసీలకు కనీసం 34 స్థానాలు కేటాయించడమే ఎజెండాగా తెలంగాణ బీసీ నేతలు ఢిల్లీ బయలుదేరారు.ఇచ్చిన మాట నిలబెట్టుకోండి: ప్రదేశ్ ఎన్నికల కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ స్థానంలో రెండు అసెంబ్లీ సీట్ల చొప్పున మొత్తం 34 సీట్లను బీసీలకు కేటాయించాలని కోరుతూ టీం బీసీ నేతలు మంగళవారం హైదరాబాద్‌లో ఉన్న ముఖ్య నేతలను కలిశారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్‌కుమార్ యాదవ్, మహేశ్ కుమార్ గౌడ్, సురేశ్‌షెట్కార్, గాలి అనిల్‌కుమార్, ఎర్రశేఖర్, సంగిశెట్టి జగదీశ్వరరావు తదితరులు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మధుయాష్కీగౌడ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. బుధవారం అందుబాటులో ఉన్న నేతలు నల్లగొండ ఎంపీ, స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కూడా కలవనున్నారు. -
ఢిల్లీలోనే తేల్చుకుందాం
సాక్షి, హైదరాబాద్: బలహీన వర్గాల నేతలకు తగినన్ని టికెట్లు కేటాయించాల్సిందేనని, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 34 స్థానాలు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతల సమావేశం డిమాండ్ చేసింది. ఈ విషయంలో ఎందాకైనా కొట్లాడాలని, ఢిల్లీ వెళ్లి సోనియాగాం«దీ, రాహుల్, మల్లికార్జున ఖర్గే సమక్షంలోనే తేల్చుకోవాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా కూడా రాహుల్ ఓబీసీల పక్షాన మాట్లాడారని, తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం సర్వేల పేరుతో బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ సమావేశం అభిప్రాయపడింది. ఏఐసీసీ ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి అధ్యక్షతన ఆదివారం గాం«దీభవన్‌లో బీసీ నేతల సమావేశం జరిగింది. ఈ భేటీలో సీనియర్ నాయకులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీగౌడ్, సురేశ్ షెట్కార్, మహేశ్‌కుమార్‌గౌడ్, పొన్నం ప్రభాకర్, చెరుకు సుధాకర్, గాలి అనిల్‌కుమార్, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, మెట్టు సాయికుమార్, ముత్తినేని వీరయ్య వర్మలతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నేతలకు టికెట్ల కేటాయింపే ఎజెండాగా చర్చించారు. సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలివీ.. ♦ పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు సోమ లేదా మంగళవారాల్లో ఢిల్లీ వెళ్లాలి. అక్కడ సోనియా, రాహుల్, ఖర్గేను కలిసి తమ డిమాండ్లను వారి ముందుంచాలి. ♦ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు కచ్చితంగా 34 సీట్లు కేటాయించాలని కోరుతూ అందరి సంతకాలతో అధిష్టానానికి లేఖ రాయాలి. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతకు కూడా ఈ లేఖను అందజేయాలి. ♦ టికెట్ల కేటాయింపులో అన్ని కులాలకు ప్రాధాన్యమివ్వాలి. అభ్యర్థుల ప్రకటన కోసం విడుదల చేసే తొలిజాబితాలో బీసీ నేతల పేర్లు రాకుండా కుట్ర జరుగుతోంది. తొలి జాబితాలోనే బీసీ నేతల పేర్లను కూడా ప్రకటించాలి. ♦ బీసీలకు ఇచ్చే స్థానాలను ముందుగా గుర్తించి అక్కడ బీసీ నేతల పేర్లతోనే సర్వేలు జరపాలి. ♦ బీసీ నేతల్లో ఎవరికి టికెట్ వచ్చినా అందరం కలిసి గెలిపించుకోవాలి. ♦ పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో బీసీల వాటాను అమలు చేయాలి. పెరిక, పద్మశాలీలకు అన్యాయం బీసీ కులాల్లో పెద్ద సంఖ్యలో జనాభా ఉండే పద్మశాలీలతోపాటు పెరిక వర్గానికి చెందిన నాయకులకు పార్టీలో అన్యాయం జరుగుతోందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. పద్మశాలీల పక్షాన మునుగోడు నుంచి పున్నా కైలాశ్ నేత, ముషీరాబాద్ నుంచి సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, బాల్కొండ నుంచి ఈరవత్రి అనిల్ లాంటి నాయకులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో వారికి అవకాశం ఇవ్వాలనే చర్చ జరిగింది. నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి లాంటి లోక్‌సభ స్థానాల్లో రెండు స్థానాలను బీసీలకిచ్చే పరిస్థితి లేదని అంటున్నారని, సికింద్రాబాద్, భువనగిరి, నిజామాబాద్ లాంటి లోక్‌సభ స్థానాల పరిధిలో అవసరమైతే మూడు సీట్లు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి కామారెడ్డి ఎమ్మెల్యేగా పెరిక కులానికి చెందిన ఎమ్మెల్యే ఉన్నాడని, ఆయన సీటును కూడా కేసీఆర్ గుంజుకున్న నేపథ్యంలో తమ కులానికి కాంగ్రెస్‌లో అయినా న్యాయం చేయాలని వికలాంగ విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ కోరారు. -
ఎలక్షన్స్ వచ్చినపుడే టికెట్ అనేది పాత ముచ్చట.. మా ముచ్చట ఇనుకోండ్రి!
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీలకు అతీతంగా బీసీ నేతలు ఏకమవుతున్నారా? తమకూ ఒక అవకాశం ఇవ్వాలని తమ పార్టీలను కోరుతున్నారా? పోటీ చేయడానికి తగిన గ్రౌండ్ చేసుకుంటున్నారా? ఇంతకీ టిక్కెట్లు ఆశిస్తున్న బీసీ నేతలు ఎవరు? ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నారు? పార్టీలు బీసీ నేతల్ని ప్రోత్సహించడానికి సిద్దంగా ఉన్నాయా? వివరాలేంటో చూద్దాం.. ఉమ్మడి నల్గొండ రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న జిల్లా. అయితే ఇక్కడ పార్టీ ఏదైనా రెడ్డి సామాజికవర్గానిదే పై చేయిగా ఉంటుంది. అయితే జిల్లాలోని కొందరు బీసీ నేతలు తమకూ ఓ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారట. అప్పటికప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోరితే లాభం ఉండదనే ఉద్దేశంతో రెండు మూడేళ్లుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. సామాజిక కార్యక్రమాలతో ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారట. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ కోసం పోటీ పడుతున్న బీసీ నేతల సంఖ్య పెరిగిపోయిందట. అధికార బీఆర్ఎస్లోనే బీసీ నేతల పోటీ ఎక్కువగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. బీర్లకు చేయి అందిస్తే.. యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే ఇవ్వాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య కోరుతున్నారు. గత మూడున్నరేళ్లుగా నియోజకవర్గ కాంగ్రెస్‌కు అన్నీ తానై వ్యవహరిస్తున్నానని ఆయన అంటున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై పనిచేస్తున్నారు. తన పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు కులవృత్తులవారికి పనిముట్లను పంపిణీ చేస్తూ వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు కేటాయించే స్థానం ఆలేరు ఒక్కటే అన్న ప్రచారం సాగుతోంది. మిగతా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఓసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు ఉండటంతో వారిని కాదని అక్కడ బీసీలకు సీటు ఇచ్చే అవకాశం లేదు. ఇది అయిలయ్యకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. (మణిపూర్ ఘటనే కనిపిస్తోందా?.. పార్లమెంట్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాధితురాలు) మునుగోడుపై రవి ఆశలు మునుగోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి నారబోయిన రవి టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన భార్య జెడ్పీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రవి ఉప ఎన్నికల సందర్భంలో కూడా టిక్కెట్ ఆశించారు. ఆశావహుల లిస్ట్‌లో కూడా ఆయన పేరు ప్రముఖంగానే వినిపించింది. నియోజకవర్గంలో తన సామాజిక వర్గానికి 38 వేల వరకు ఓట్లు ఉన్నాయని తనకు అవకాశం ఇవ్వాలని జిల్లా మంత్రితో పాటు అధిష్టాన పెద్దలను కూడా నారబోయిన రవి కోరుతున్నారట. ఇప్పటికే ఆయన నియోజకవర్గం అంతా వాల్ రైటింగ్ విస్తృతంగా రాయించడంతో పాటు పోస్టర్లు కూడా ఖాళీ లేకుండా అతికిస్తూ జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తమ్ కాదంటే నాకే! కోదాడ నియోజకవర్గంలో మొదటి నుంచి గులాబీ టికెట్ ఆశిస్తున్నవారిలో వనపర్తి లక్ష్మీనారాయణ ఒకరు. ఈయన పెరిక సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్నారు. లక్ష్మీనారాయణ భార్య శిరీష కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్నారు. గత నాలుగేళ్లుగా కోదాడ టికెట్ ఆశిస్తూ లక్ష్మీనారాయణ అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గపు ఓట్లు కూడా నిర్ణయాత్మకంగా ఉండటంతో తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని లక్ష్మీనారాయణ నమ్మకం. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఆయన్ను మార్చి మరో వ్యక్తికి టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఒకవేళ మల్లయ్యను మారిస్తే మాత్రం తనను పరిగణలోకి తీసుకోవాలని పార్టీ పెద్దల వద్ద లక్ష్మీనారాయణ ప్రస్తావిస్తున్నారట. టికెట్ ఇవ్వకపోతే.. సెపరేట్ రూట్ హుజూర్ నగర్లో పిల్లుట్ల రఘు అనే సామాజిక కార్యకర్త కూడా ఎప్పటి నుంచో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ ప్లాన్ లో భాగంగానే నియోజకవర్గంలో గత నాలుగేళ్లుగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ఎవరు టికెట్ ఇచ్చినా పోటీ చేసేందుకు ప్రణాళిక తయారు చేసుకుంటున్నారట. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలను కలిసి తన కోరిక వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ నియోజకవర్గం నుంచి ఉత్తమ్‌కుమార్‌ను కాదని రఘుకు టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదనేది బహిరంగ విషయమే. (చదవండి: ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు) ఒకవేళ కుటుంబంలో ఒకరికే టికెట్ అనే కాంగ్రెస్ సూత్రంలో భాగంగా ఉత్తమ్ ఫ్యామిలీలో ఒకరికే టికెట్ ఆయన హుజూర్ నగర్లో కాకుండా కోదాడలో పోటీ చేయొచ్చని.. అలా జరిగితే తనకు అవకాశం ఇవ్వాలని రఘు కోరుతున్నారట. కాంగ్రెస్ నాయకత్వం ఆయన అభ్యర్థనను ఏవిధంగా తీసుకుంటుదనేది కీలకంగా మారనుంది. మరోవైపు మిగిలిన పార్టీల నేతలను కూడా కలిసి తాను చేసిన సామాజిక కార్యక్రమాలను చెప్తూ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. ఏ పార్టీ నుంచి అవకాశం రాకపోతే ఇండిపెండెంట్‌గా అయినా బరిలో దిగేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీలకు అతీతంగా బీసీ నేతలు టికెట్ రేసులోకి దూసుకువస్తున్నారు. పార్టీలు అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని ప్రకటించడంతో జిల్లా రాజకీయాలు రంజుగా మారనున్నాయి. -సాక్షి, పొలిటికల్ డెస్క్. -
Telangana:బీసీ దారిలో బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ అంశంలో కాంగ్రెస్‌పై మూకుమ్మడిగా విమర్శల దాడికి దిగిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మరో అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటీవల బీఆర్ఎస్లోని బీసీ మంత్రులు, నేతలు లక్ష్యంగా చేసిన విమర్శలు.. బీసీల్లో పట్టు కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిదాడికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ బీసీ నేతల కీలక భేటీ జరిగింది. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సంస్థల చైర్మన్లు ఇందులో పాల్గొన్నారు. భేటీపై కొన్ని గంటల ముందు మాత్రమే సమాచారం అందడంతో పరిమిత సంఖ్యలోనే బీసీ నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 25న విస్తృత స్థాయిలో బీసీ నేతల భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ను ప్రజాక్షేత్రంలో ఎండగడదాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటీవల బీసీ మంత్రులు, ఇతర నేతల పట్ల చేసిన వ్యాఖ్యలు, బీసీ నేత దాసోజు శ్రవణ్‌కు వచ్చిన బెదిరింపులు తదితర అంశాలు తలసాని ఆధ్వర్యంలోని భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. బీసీ సభల పేరిట ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ చేస్తున్న హడావుడి, సూర్యాపేటలో సభ నిర్వహించి బీసీ డిక్లరేషన్ ప్రకటించేందుకు చేస్తున్న సన్నాహాలపైనా నేతలు చర్చించారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం బీసీల కోసం అమలు చేసిన పథకాలు, చేకూరిన లబ్ధి తదితరాలను విశ్లేషించారు. ఆత్మ గౌరవ భవనాలు మొదలుకుని అన్ని బీసీ కులాల కోసం అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్‌ను ఎండగట్టాలని.. లేకుంటే కాంగ్రెస్ బీసీలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని భేటీలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. కార్యాచరణపై ఈ నెల 25న విస్తృత భేటీ బీసీల ఆత్మగౌరవాన్ని చాటడంతోపాటు బీసీల కోసం బీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలు, పథకాలను వివరించేందుకు ‘బీసీ గర్జన’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ బీసీ నేతలు నిర్ణయించారు. హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లా కేంద్రాల్లోనూ బీసీ ఆత్మగౌరవ సభలు నిర్వహించాలనే ఆలోచనకు వచ్చారు. రాష్ట్ర మంత్రివర్గం మొదలుకుని పార్లమెంట్, అసెంబ్లీ, ప్రభుత్వ కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలతో పరేడ్ నిర్వహించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. ఈ కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఈ నెల 25న హైదరాబాద్‌లో మరోమారు విస్తృత స్థాయి భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, 93బీసీ కుల సంఘాల నేతలను ఆహ్వానించనున్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే కాంగ్రెస్ భూస్థాపితమే.. – మంత్రులు తలసాని, శ్రీనివాస్‌గౌడ్, గంగుల హెచ్చరిక – త్వరలో బీసీ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి బీసీ ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా కించపర్చే ఆరోపణలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరు సరికాదని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్ మండిపడ్డారు. బీసీల జోలికొస్తే బీసీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. తలసాని కార్యాలయంలో బీసీ నేతల భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. బీసీలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ కొందరు కాంగ్రెస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. పెయిడ్ ఆర్టిస్టులతో బీసీల్లో కొట్లాట పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జనాభాలో 56శాతంగా ఉన్న బీసీలు ఆత్మగౌరవాన్ని వదులుకోబోరన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉందంటున్న కాంగ్రెస్ ఎంత మంది బీసీలకు ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీసీలను కదిలించేందుకు అవసరమైన కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. -
చాకిరీ మాది... పదవులు మీకా?
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యమివ్వడం ద్వారానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, 51కి తగ్గకుండా తమకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని టీపీసీసీ బీసీ నేతల సమావేశం డిమాండ్ చేసింది. ‘అగ్రవర్ణాల నేతలకు టికెట్లు ఇప్పటికే ఖరారయ్యాయి. వారంతా వారివారి నియోజకవర్గాల్లో పనిచేసుకుంటున్నారు. మరి, బీసీ నేతలకు టికెట్లు ఎప్పు డు ప్రకటిస్తారు? చాకిరీ మాది..సీట్లు, పదవులు మీకా? సమీకరణల పేరుతో ప్రతీసారి ఆఖరి నిమిషంలో టికెట్లు ఇస్తున్నారు. అలాకాకుండా 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలి. అప్పుడే నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పనిచేసుకునే అవకాశం లభిస్తుంది’అని సమావేశంలో పలువురు నేతలు వ్యాఖ్యానించారు. పార్టీలోని ఏ ఒక్క సామాజిక వర్గానికి తాము వ్యతిరేకం కాదని, కానీ జనా భా ప్రాతిపదికన తమ కోటా సీట్లు, పార్టీ పదవులు తమ కు ఇవ్వాల్సిందేనని ఉద్ఘాటించారు. పీసీసీ మాజీ అధ్య క్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, టీపీ సీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యల నేతృత్వంలో మంగళ వారం గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతల సమావేశం జరిగింది. ఇందులో 100 మందికిపైగా బీసీ నేతలు పాల్గొన్నారు. 1% జనాభా లేని వారితో సమానంగా టికెట్లా? సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, పార్టీలో తమ వర్గాలకు ప్రాధాన్యమివ్వాలని అటు ఏఐసీసీ, ఇటు టీపీసీసీలను కోరారు. ప్రతి పార్లమెంటు స్థానంలో కనీసం 3 అసెంబ్లీ స్థానాల చొప్పున 51కి తగ్గకుండా మెజార్టీ కులాలకు టికెట్లు కేటా యించాలని ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 30–32 సీట్లకే బీసీలను సరిపెడుతున్నారని, ఒక్క శాతం జనాభా లేని వారితో సమానంగా టికెట్లు ఇస్తున్నారన్నారు. బీసీల గురించి మాట్లాడితే తొక్కేస్తారనే భయం ఇప్పటికీ పార్టీలో ఉందని, పార్టీ పదవుల కేటాయింపులో మార్పు రావాలని చెప్పారు. జిల్లాల వారీగా సమావేశాలు దేశవ్యాప్తంగా బీసీ కులాలకు ప్రాధాన్యమివ్వాలన్న పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఓబీసీల జనగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తామని, పార్టీలో బీసీలకు తగిన ప్రాధాన్యమిస్తామని వెల్లడించిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకి కృతజ్ఞతలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించారు. బీసీలకు పెద్దపీట వేసిన కాంగ్రెస్‌ను దెబ్బతీయాలన్న ఆలోచనతో రాహుల్ ఓబీసీలను కించపర్చారంటూ బీజేపీ చేస్తున్న దు్రష్పచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరిని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. టీపీసీసీ ఆధ్వర్యంలో బీసీ గర్జన సభనిర్వహణపై మరోసారి సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఉన్న బీసీ కులాల జనాభా, ఓట్ల వివరాలతో కూడిన నివేదికను సోనియా, రాహుల్‌గాం«దీ, మల్లికార్జున ఖర్గేలకు అందజేయాలని నిర్ణయించారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్, పార్టీ నేతలు శ్యాంమోహన్ పాల్గొన్నారు. -
బీసీలను రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న సీఎం జగన్
భవానీపురం (విజయవాడ పశ్చిమ): దేశ చరిత్రలో బీసీలను గుర్తించడమే కాకుండా, వారిని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని పలువురు బీసీ సంఘాల నేతలు ప్రశంసించారు. మున్నెన్నడూ లేని విధంగా బీసీలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీసీలందరూ మూకుమ్మడిగా సీఎం జగన్‌కు మరోమారు పట్టం కట్టనున్నారని వారు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్లో ‘బీసీలు–జగనన్న ప్రభుత్వం ప్రాధాన్యత’ అంశంపై శనివారం జరిగిన చర్చా వేదిక నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ సామాజిక సాధికారత సాధనలో సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా శాసన మండలిలో ఈ స్థాయిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఏనాడూ ప్రాతినిథ్యం కల్పించిన దాఖలాల్లేవన్నారు. నాడు చంద్రబాబు సామాజిక అన్యాయానికి పాల్పడగా.. సీఎం జగన్ ఆయా వర్గాల సాధికారత కోసం నిబద్ధతతో అడుగులేస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్.కృష్ణయ్య ఫోన్లో తన సందేశాన్ని వినిపించారు. ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్‌యాదవ్, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బుద్ధా నాగేశ్వరరావు, బీసీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఎన్వీ రావు, రాష్ట్ర రజక సంఘాల గౌరవాధ్యక్షుడు డాక్టర్ రాచకొండ జాన్‌బాబు, ఎంబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎంవీవీఎస్‌ఎన్ మూర్తి పాల్గొన్నారు. -
టీడీపీకి బీసీలు బైబై..! కారణం ఇదే..
నాడు: గత టీడీపీ ప్రభుత్వం బీసీలను రాజకీయాలకే వాడుకుంది. కేవలం ఓటు బ్యాంక్‌గానే ఉపయోగించుకుంది. చట్టసభల్లోగానీ, రాజకీయ పదవుల్లోగానీ తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అణగదొక్కింది. నామమాత్రంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తూతూమంత్రంగా నిధులు విదిల్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే కూరలో కరివేపాకులా వాడుకుని పక్కనబెట్టింది. చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన అన్యాయం బీసీలకు బాగా అర్థమైంది. ఏళ్ల తరబడి మోస్తున్నా.. అడుగడుగునా అవమానాలే ఎదురవుతుండడంతో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ బాబుకు బైబై చెప్పే పరిస్థితి వచ్చింది. నేడు: ‘బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు.. వారు సమాజానికి బ్యాక్ బోన్లాంటి వారు’ అని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో ఉచ్ఛరిస్తూ వారికి అండదండగా నిలుస్తున్నారు. చట్టసభల్లో సైతం వారికి సముచిత స్థానం కల్పించారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన రాజకీయ పదవులు కట్టబెట్టారు. కార్పొరేషన్లకు కావాల్సిన నిధులు సమకూర్చారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు అనేక పథకాలు తీసుకొచ్చారు. బీసీల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి వేల కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలోనే పలువురు బీసీలు వైఎస్సార్సీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. గతంలో ఎప్పుడూ తమను ఇంతలా ఆదరించలేదని గొప్పగా చెప్పుకుంటున్నారు. సాక్షి, తిరుపతి: జిల్లాలోని బీసీ నాయకులు టీడీపీకి గుడ్‌బై చెబుతున్నారు. పార్టీలో సముచిత స్థానంలేక కొందరు.. బాబు సామాజికవర్గం దాడులకు భయపడి మరికొందరు.. చులకన చేసి మాట్లాడడంతో ఇంకొందరు రాజీనామాలు చేస్తున్నారు. ఆ పార్టీలో తగిన గుర్తింలేక ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంచి పేరున్న వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం టీడీపీకి, పార్టీ ఇచ్చిన పదవికి రాజీనామా చేశారు. తాజాగా చిత్తూరుకు చెందిన బీసీ నాయకుడు, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పి షణ్ముగం శుక్రవారం ఉదయం టీడీపీకి, తన పదవికి గుడ్‌బై చెప్పారు. ఇదివరకే చిత్తూరు నగర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మాపాక్షి మోహన్ టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీసీలే అధికం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీసీ సామాజికవర్గం వారే అధికం. మొత్తంగా 15 లక్షలకుపైగా ఓటర్లుండగా వీరిలో వన్నెకుల క్షత్రియ సామాజికవర్గానికి చెందిన ఓటర్లే సుమారు 40 శాతం ఉన్నారు. కుప్పం, నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం ఓట్లే కీలకం. అందుకే వారిలో ముఖ్యమైన కొందరిని ఎంపిక చేసుకుని టీడీపీ నేతలు ఇప్పటికీ ఎన్నికల వరకే వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాడులు చేస్తూ.. చులకనగా చూస్తూ బాబు సామాజికవర్గం నేతలు బీసీలను చులకన చేయడం, పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పించకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. మరో వైపు దాడులకు తెగబడుతున్నట్లు బాధితలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరుకు చెందిన పీ షణ్ముగంపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు దాడిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే షణ్ముగం ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఏకమవుతున్న బీసీలు టీడీపీలో బీసీలకు జరుగుతున్న అవమానాలను జీర్ణించుకోలేక ఆ సామాజికవర్గ నేతలంతా ఏకమవుతున్నారు. తిరుపతికి చెందిన డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో వన్నెకుల క్షత్రియులతో పాటు మిగిలిన బీసీ సామాజికవర్గం నాయకులు, కార్యకర్త లు రోజూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ స మావేశాల్లో టీడీపీ చేసిన అన్యాయాలు, ఆగడాలను ఎండగడుతున్నారు. శివరాత్రితర్వాత ఉమ్మడి చిత్తూ రు జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీలు సమావేశం ఏర్పా టు చేసి కార్యాచరణ ప్రకటించనున్నట్టు సమాచారం. బీసీల సాధికారత ఎక్కడ? బీసీల సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. చంద్రబాబు పార్టీని లాక్కున్న తర్వాత ఆ లక్ష్యాన్ని నీరుగార్చారు. బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నానని ప్రకటనలు చేసేవారే తప్ప క్షేత్రస్థాయిలో వారికి చేసింది శూన్యం. చంద్రబాబు హయాంలో బీసీలు దగాపడ్డారు. స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ అభ్యర్థి వరకు వారి సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. బీసీలను ఓట్ల కోసం వాడుకుని వదిలేశారు. టీడీపీలో ఎంత కష్టపడినా బీసీలకు న్యాయం, తగిన గౌరవం, గుర్తింపు లభించదు. 15 ఏళ్ల తన రాజకీయ జీవితంలో నన్ను నమ్మిన బీసీల కోసం నేను ఏమీ చేయలేకపోయాను. అందుకే టీడీపీకి రాజీనామా చేశాను. –డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి బీసీలను అణగదొక్కేందుకు కుట్ర టీడీపీ కోసం కష్టపడ్డాను. 32 ఏళ్లుగా పార్టీని నమ్మాను. చంద్రబాబు, లోకేష్, ముఖ్యనాయకులు వస్తే వారి కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అహర్నిశలు శ్రమించాను. అయితే పారీ్టలో నాకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. మొన్న లోకేష్ పర్యటనలో పులివర్తి నాని నాపై దాడిచేసేందుకు వచ్చారు. ఈ విషయాన్ని లోకేష్‌కు ఫిర్యాదు చేశాను. నానిపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే టీడీపీకి రాజీనామా చేశాను. చిత్తూరులో బీసీలను అణగదొక్కేందుకు కుట్రపన్నుతున్నారు. బీసీల దెబ్బ ఎలా ఉంటుందో టీడీపీ వారికి రుచిచూపిస్తాం. – పీ షణ్ముగం, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్, చిత్తూరు మొదలైన బుజ్జగింపుల పర్వం బీసీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడితుండడంతో చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు దిగారు. పలువురు మాజీ మంత్రులను బీసీ నాయకుల నివాసాలకు పంపుతున్నారు. చేసిన తప్పులను సరిదిద్దుతామని చెబుతున్నట్టు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అయితే టీడీపీకి ఇప్పటి వరకు చేసిన సేవలు చాలని, తమకు ఏ పార్టీ ప్రాధాన్యత కల్పిస్తుందో వారి వెంట నడుస్తామని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయాలు బయటకు రాకుండా ఉండేందుకు పార్టీకి రాజీనామా చేసిన వారిని టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం నుంచి లేఖలు విడుదల చేయడం గమనార్హం. చదవండి: రామోజీ దిగులు ‘ఈనాడు’ రాతల్లో కనపడుతోంది.. -
85వేల గళాల నినాదం...‘జయహో బీసీ’
సాక్షి, అమరావతి: రకరకాల పదవులు చేపట్టి రాజకీయ సాధికారతతో బీసీ ప్రతినిధులు భారీ ఎత్తున ‘జయహో బీసీ’ సభకు తరలి రావటం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. మహాసభ జరుగుతున్నంత సేపూ వారంతా ‘‘జయహో బీసీ... జయహో జగన్’’ అంటూ ఉరిమే ఉత్సాహంతో నినదించటంతో అంచనాలకు మించి మహాసభ సక్సెస్ అయినట్లు పార్టీ భావిస్తోంది. రాష్ట్ర మంత్రులు మొదలు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారితో పాటు వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల వైస్ ప్రెసిడెంట్లు, ప్రెసిడెంట్లు, జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్పర్సన్లు, వాటి డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వాటి డైరెక్టర్లు, పీఏసీఎస్ చైర్మన్లు వాటి మెంబర్లు, ఆలయ బోర్డు చైర్మన్లు... ఇలా దాదాపు 85 వేలకు పైగా బీసీ ప్రతినిధులు రాష్ట్రం నలుమూలల నుంచీ కదలిరావటమనేది గతంలో ఎన్నడూ జరగలేదని, ఒక్క వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే ఇది సాధ్యమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశిస్తున్నట్లు 175కు 175 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్సీపీని గెలిపించడానికి ఈ సభను ఓ కొత్త ఆరంభంగా చూడాలనేది వారి భావన. గత ఎన్నికలకు ముందు... అంటే 2019, ఫిబ్రవరి 17న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో తాము అధికారంలోకి వస్తే.. బీసీలకు చేసే మేలుపై బీసీ డిక్లరేషన్‌ను వైఎస్ జగన్ అప్పట్లో ప్రకటించారు. ఆ డిక్లరేషన్‌ను ఇపుడు తుచ తప్పకుండా అమలు చేస్తున్నారు. తొలి మంత్రివర్గంలో ఏడుగురు బీసీలకు స్థానం కల్పించి... పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఏకంగా 11 మంది బీసీలకు అవకాశమిచ్చారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకూ అన్నింటా బీసీలకే సింహభాగం పదవులిచ్చారు. టీడీపీ సర్కార్ ఐదేళ్లలో ఒక్క బీసీని రాజ్యసభకు పంపకపోతే.. మూడున్నరేళ్లుగా రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే... అందులో వాటిలో నాలుగింటిని బీసీలకే ఇచ్చి... నలుగురిని రాజ్యసభకు పంపారు సీఎం వైఎస్ జగన్. సంక్షేమ పథకాల ద్వారా రూ.1.63 లక్షల కోట్లను బీసీలకు అందిస్తే.. అందులో కేవలం డీబీటీ రూపంలోనే రూ.86 వేల కోట్లను ఆ వర్గాల ఖాతాల్లో జమ చేశారు. వీటన్నిటి ఫలితం ఈ జయహో బీసీ సభలో కనిపించిందనేది పార్టీ వర్గాల మాట. వైఎస్సార్సీపీకి వెన్నెముకలా నిలిచిన బీసీలు.. తమను ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకుని, అధికారంలోకి వచ్చాక తోకలు కత్తిరిస్తా, అంతుచూస్తానంటూ బెదిరించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన హయాంనూ... రాజ్యాధికారంలో, బడ్జెట్లో తమకు సింహభాగం వాటా ఇచ్చి సమున్నత గౌరవం ఇస్తున్న సీఎం జగన్ పాలనను బీసీలు పోల్చి చూసుకుంటున్నారు. బుధవారంనాటి బీసీ నేతల ప్రసంగాలన్నిటా ఇది స్పష్టంగా కనిపించింది కూడా. దేశ చరిత్రలో బీసీ సీఎం కూడా ఇవ్వని రీతిలో.. తమకు సమున్నత గౌరవం ఇస్తూ, కాలరెగరేసుకుని సగర్వంగా తిరిగేలా పాలిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు వెన్నెముకలా నిలబడాలని వారంతా సభాముఖంగా నినదించారంటే ఈ పాలన ఫలితమేనని వేరే చెప్పాల్సినపనిలేదు కూడా. మళ్లీ వైఎస్ జగన్‌ను సీఎంగా చేసుకుంటేనే.. తాము మరింత పురోభివృద్ధి సాధించగలుగుతామని బీసీలు భావిస్తున్నారనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. కదంతొక్కుతున్న శ్రేణులు అధికారంలోకి వచ్చాక తొలిసారి జులైలో నిర్వహించిన ప్లీనరీ గ్రాండ్‌సక్సెస్ అయ్యింది. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలను వివరిస్తూ గడపగడపకూ వెళ్తోన్న వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్‌కు జేజేలు పలుకుతుండటంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఈక్రమంలో నిర్వహించిన జయహో బీసీ మహాసభ గ్రాండ్ సక్సెస్ కావడమనేది తదుపరి ఎన్నికలకు కావాల్సిన కదనోత్సాహాన్ని శ్రేణుల్లో నింపిందనే చెప్పాలి. -
Jaiho BC: కదనోత్సాహం.. జయహో బీసీ.. జయహో జగన్
‘మేమంతా కాలర్ ఎగరేసుకుని తిరిగేలా మన సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారు.. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కానేకాదు.. బ్యాక్ బోన్ అని చేతల్లో నిరూపించారు. అందువల్లే మేమంతా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నాం.. అందువల్లే పార్టీ ఇచ్చిన ఒక్క పిలుపునకు ఇంత స్పందన.. సీఎం జగన్ మాట్లాడిన ప్రతి మాటకూ ప్రతిస్పందన.. ఈ జన సునామీని చూసిన చంద్రబాబుకు, దుష్టచతుష్టయానికి ఇక నిద్ర కరువే’ అని వైఎస్సార్సీపీ శ్రేణులు సమరోత్సాహంతో బల్లగుద్ది చెబుతున్నాయి. జయహో బీసీ మహాసభ ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: వెనుకబడిన కులాలే వెన్నెముక అనే నినాదంతో నిర్వహిస్తున్న ‘జయహో బీసీ మహాసభ’కు తరలిరావాలని వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపే ప్రభంజనమైంది.. దూరాభారాన్ని లెక్క చేయక ఒడిశా సరిహద్దులోని ఇచ్చాపురం, తమిళనాడు సరిహద్దులోని కుప్పం, కర్ణాటక సరిహద్దులోని హిందూపురం, తెలంగాణ సరిహద్దులోని మంత్రాలయం.. ఇలా రాష్ట్రం నలుమూలల నుంచి పోటాపోటీగా బీసీ ప్రజాప్రతినిధులు మంగళవారం రాత్రి నుంచే విజయవాడకు తరలివచ్చారు. బుధవారం ఉదయం 5 గంటలకే ఎముకలు కొరుకుతున్న చలిని ఖాతరు చేయకుండా.. మంచు తెరలను చీల్చుకుంటూ.. సూర్యోదయానికి ముందే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న మహాసభ ప్రాంగణానికి కడలి తరంగంలా పోటెత్తారు. ఉదయం 9 గంటలకు మహాసభ ప్రాంగణం జన సంద్రంగా మారింది. ప్రాంగణం కిక్కిరిసిపోవడంతో బందరు రోడ్డుతోపాటు ఇందిరాగాంధీ స్టేడియంకు నలువైపులా వేలాది మంది ప్రతినిధులు రహదారులపైనే ఉండిపోయారు. దాంతో మహాసభ ప్రారంభం కావాల్సిన షెడ్యూల్ సమయం ఉదయం 10 గంటల కన్నా 45 నిముషాల ముందే.. 9.15 గంటలకే ఆరంభమైంది. జ్యోతి ప్రజ్వలన చేసి.. మహాత్మా జ్యోతిరావు పూలే, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించి.. సభను ప్రారంభించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహాసభ ప్రాంగణానికి 12 గంటలకు చేరుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్.. 1.35 గంటల వరకు కొనసాగించారు. అప్పటి వరకు మహాసభ ప్రాంగణం నుంచి ఏ ఒక్కరూ కట్టు కదలలేదు. నేతలందరి ప్రసంగాలను శ్రద్ధగా విన్నారు. రహదారులపై గంటల తరబడి నిలబడిన వారూ అడుగు కదపకుండా ఎల్ఈడీ తెరలపై మహాసభను వీక్షిస్తూ ప్రసంగాలను ఆసక్తిగా ఆలకించారు. తలెత్తుకు తిరిగేలా సమున్నత గౌరవం ఏలూరులో 2019 ఫిబ్రవరి 17న బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్‌లో చెప్పిన దానికంటే మిన్నగా సీఎం వైఎస్ జగన్ చేస్తుండటం.. కాలరెగరేసుకుని సగర్వంగా తలెత్తుకునే రీతిలో సమున్నత గౌరవం ఇస్తూ పరిపాలిస్తుండటం వల్లే బీసీ ప్రజాప్రతినిధులు, ప్రతినిధులు కదనోత్సాహంతో మహాసభకు కదలి వచ్చారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరిన నాయీ బ్రాహ్మణులను తాత్కాలిక సచివాలయం సాక్షిగా తోకలు కత్తరిస్తా అంటూ చంద్రబాబు బెదిరించడం.. హామీలను నిలబెట్టుకోవాలని అడిగిన మత్స్యకారులను అంతుచూస్తానని భయపెట్టడం.. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని దళితుల పుట్టుకనే అవహేళన చేయడాన్ని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేసినపుడు ప్రతినిధుల నుంచి విశేష స్పందన లభించింది. ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపకుండా మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే.. మూడున్నరేళ్లలో రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే అందులో నలుగురు బీసీలను రాజ్యసభకు సీఎం వైఎస్ జగన్ పంపి తమకు సమున్నత గౌరవం ఇచ్చారని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన వీరన్న ‘సాక్షి’కి చెప్పారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, మహిళా, విద్యా సాధికారత సాధించేలా చేస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే తాము నడుస్తామని స్పష్టం చేశారు. శ్రేణుల్లో మరింత రగిలిన సమరోత్సాహం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత జూలై 8–9న నిర్వహించిన ప్లీనరీ గ్రాండ్ సక్సెస్ కావడంతో నూతనోత్సాహంతో శ్రేణులు కదం తొక్కుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ చేసిన దిశానిర్దేశం మేరకు గడప గడపకూ వెళ్లి.. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి ఒక్కరికీ వివరించి చెబుతూ ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో నిర్వహించిన జయహో బీసీ మహాసభకూ బీసీ ప్రతినిధులు పోటెత్తారు. ఏడాదికి బీసీ సబ్ ప్లాన్ కింద రూ.పది వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి దగా చేస్తే.. సీఎం వైఎస్ జగన్ ఏడాదికి రూ.15 వేల కోట్లు చొప్పున రూ.75 వేల కోట్లు ఇస్తానని మాట ఇచ్చి మూడున్నరేళ్లలోనే అంతకంటే అధికంగా రూ.1.63 లక్షల కోట్ల ప్రయోజనాన్ని తమకు చేకూర్చారని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండల పరిషత్ ఉపాధ్యక్షుడు తిరుమాను ధనుంజయ్ చెప్పారు. చంద్రబాబు చేసిన మోసాన్ని.. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న న్యాయాన్ని ఇంటింటికీ వెళ్లి వివరించి.. 175కు 175 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్సీపీని గెలిపించడమే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు. జయహో బీసీ మహాసభ అంచనాలకు మించి గ్రాండ్ సక్సెస్ కావడం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కదనోత్సాహాన్ని మరింతగా రగిల్చింది. లక్ష మందితో సభ.. ఎక్కడా స్తంభించని ట్రాఫిక్ మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన జయహో బీసీ మహాసభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి లక్ష మందికి పైగా ప్రతినిధులు హాజరైనప్పటికీ నగరంలో ఎక్కడా ట్రాఫిక్ స్తంభించడం అంటూ జరగలేదు. పోలీసు, ఇతర శాఖల పక్కా ప్రణాళిక, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు.. ప్రజల సహకారంతో ఎక్కడా ఇబ్బంది ఎదురు కాలేదు. వందల సంఖ్యలో వాహనాలకు పార్కింగ్ స్థలాలు వేర్వేరుగా కేటాయించడం.. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులో ఒక వైపున, బీఆర్టీఎస్ రోడ్డునకు ఇరువైపులా, ఏఎస్.రామారావు రోడ్డు, ఐదో నెంబరు బస్సు రూట్లలో వాహనాలను అనుమతించడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తలేదు. -
మహాసభకు 82,432 మంది బీసీ ప్రజాప్రతినిధులు
సాక్షి, అమరావతి: వెనుకబడిన వర్గాల ప్రజలను (బీసీలను) సమాజానికి వెన్నెముకలా తీర్చిదిద్దుతానంటూ 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో వైఎస్సార్సీపీ నిర్వహించిన బీసీ గర్జనలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడున్నరేళ్లుగా చిత్తశుద్ధితో అమలుచేసి చూపిస్తున్నారు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల కంటే ఆ వర్గాలకు అధిక ప్రయోజనం చేకూరుస్తున్నారు. ఇదే అంశాన్ని వివరించి.. రానున్న రోజుల్లో మరింత ప్రయోజనం కల్పిస్తామని బీసీలకు భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో బుధవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘జయహో బీసీ’ మహాసభను వైఎస్సార్సీపీ నిర్వహిస్తోంది. ఉదయం పదిగంటలకు ప్రారంభమయ్యే ఈ మహాసభలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ పాల్గొని.. గత మూడున్నరేళ్లుగా బీసీలకు చేస్తున్న మేలును, రానున్న రోజుల్లో కలిగించబోయే ప్రయోజనాలను వివరించనున్నారు. ఈ మహాసభకు 82,432 మంది బీసీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ.. వారికి పేరుపేరునా ఆహ్వానపత్రికలను పంపారు. వెనుకబడిన వర్గాలే వెన్నెముక నినాదంతో నిర్వహిస్తున్న ఈ మహాసభకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంతోపాటు విజయవాడ నగరాన్ని వైఎస్సార్సీపీ జెండాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విజయవాడ వారధిపై రెపరెపలాడుతున్న వైఎస్సార్సీపీ జెండాలు బీసీ డిక్లరేషన్‌లో చెప్పినదానికంటే అధికంగా.. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల కంటే ఆ వర్గాల ప్రజలకు మూడున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్ అధిక ప్రయోజనం చేకూర్చారు. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటు అందిస్తూ పేదరికం నుంచి గట్టెక్కించడం, అమ్మఒడి, విద్యాదీవెన వంటి పథకాలతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం, పరిపాలనలో సింహభాగం భాగస్వామ్యం కల్పించడం ద్వారా సమాజానికి వెన్నెముకలా బీసీలను తీర్చిదిద్దుతున్న అంశాన్ని సీఎం వైఎస్ జగన్ వివరించనున్నారు. రానున్న రోజుల్లోనూ ఇదేరీతిలో ప్రయోజనం చేకూరుస్తామని భరోసా ఇవ్వనున్నారు. స్థానికసంస్థల్లో బీసీలకు 34 శాతం.. ఎస్సీ, ఎస్టీలతో కలిపి 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 డిసెంబర్ 28న తమ ప్రభుత్వం జీవో జారీచేస్తే.. దీనిపై టీడీపీ నేతలను పురిగొల్పి సుప్రీం, హైకోర్టుల్లో కేసులు వేయించి.. రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించేలా చంద్రబాబు కుట్ర చేసిన తీరును వివరించనున్నారు. రిజర్వేషన్లు తగ్గించేలా చేసి బీసీ వర్గాలకు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచినా.. స్థానికసంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 34 శాతం కంటే అధికంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తీరును గుర్తుచేయనున్నారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన జ్యోతీరావు పూలే, సీఎం వైఎస్ జగన్‌ల కటౌట్లు సగర్వంగా తలెత్తుకునేలా పరిపాలన టీడీపీకి బీసీలే వెన్నెముక.. బీసీలు లేనిదే టీడీపీ లేదు.. అంటూ మాయమాటలు చెప్పే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఉదంతాలను సీఎం వైఎస్ జగన్ మరోసారి గుర్తుచేయనున్నారు. తమ హక్కులు పరిరక్షించాలని కోరిన నాయీ బ్రాహ్మణులను తోక కత్తిరిస్తానంటూ సచివాలయం సాక్షిగా చంద్రబాబు బెదిరించడాన్ని, ఇచ్చిన హామీని అమలు చేయాలని అడిగిన మత్స్యకారులను తాటతీస్తానంటూ చంద్రబాబు భయపెట్టిన తీరును గుర్తుచేయనున్నారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ సుప్రీంకోర్టు కొలీజియంకు చంద్రబాబు లేఖ రాయడాన్ని సీఎం వైఎస్ జగన్ ఎత్తిచూపనున్నారు. 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకపోవడాన్ని ఎత్తిచూపుతూ.. ఈ ముడున్నరేళ్లలో రాష్ట్ర కోటాలో ఎనిమిది రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే.. అందులో నలుగురు బీసీలను తాము రాజ్యసభకు పంపడాన్ని గుర్తుచేయనున్నారు. టీడీపీ సర్కార్ హయాంలో బీసీల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీస్తే.. తాము అన్నింటా సమున్నత గౌరవం వచ్చి బీసీలు సగర్వంగా తలెత్తుకునేలా పరిపాలిస్తున్న తీరును ముఖ్యమంత్రి వివరించనున్నారు. -
వచ్చే నెల 8న విజయవాడ లో బీసీల ఆత్మీయ సమ్మేళనం
-
YSR Congress Party: డిసెంబర్ 8న బీసీల ఆత్మీయ సమ్మేళనం
సాక్షి, తాడేపల్లి: సీఎం క్యాంప్ కార్యాలయంలో బీసీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స, బూడి ముత్యాలనాయుడు, వేణుగోపాలకృష్ణ, జయరాం, జోగి రమేష్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.. ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్ యాదవ్, పార్థసారథి, ఎంపీ మోపిదేవి హాజరయ్యారు. రాబోయే రోజుల్లో బీసీల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై చర్చించారు. సమావేశం అనంతరం బీసీ నాయకులు మాట్లాడుతూ.. డిసెంబర్ 8న విజయవాడలో బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందిరాగాంధీ స్టేడియంలో 10వేల మందితో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశానికి సీఎం జగన్‌ను ఆహ్వానిస్తామని తెలిపారు. మాది బీసీల ప్రభుత్వమన్నారు. మూడున్నరేళ్లలో బీసీలకు ఎన్నో పథకాలు అందించామన్నారు. డిక్లరేషన్‌లోని ప్రతి అంశాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని బీసీ నాయకులు పేర్కొన్నారు. చదవండి: (కుమారుడి వివాహానికి సీఎం జగన్‌ను ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే) -
ఓటమి భరించలేక బీసీ నేతలపై కుట్రలు...
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఓటమి భరించలేక బీసీ నేతలపై బీజేపీ కుట్రలు చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగహ్రం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు, ఈడీ, ఐటీ పేరిట బీసీ నేతలపై దాడులకు దిగిందని దుయ్యబట్టారు. గురువారం లండన్ నుంచి ఆయన ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేశారు. బీజేపీకి చేతనైతే బ్యాంకుల్లో రుణాల పేరిట రూ.కోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా వంటి ఘరానా మోసగాళ్లను దేశానికి పట్టుకు రావాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే గ్రానైట్ వ్యాపారంలో ఉన్న మంత్రి గంగుల కుటుంబంపై కక్ష కట్టి ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బలహీన వర్గాల మంత్రి కాబట్టే ఆయన్ను టార్గెట్ చేశారని, గంగులకు అన్ని విధాలా అండగా ఉంటామని, ఈడీ, ఐటీలకు బెదరబోమని స్పష్టం చేశారు. అకమ్ర దాడులతో తెలంగాణ నేతలను అణగదొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీ బీసీలకు వ్యతిరేకమనేది ఈ ఘటనతో సహా ఇప్పటికే ఎన్నో మార్లు రుజువైందని మంత్రి పేర్కొన్నారు. -
అయ్యన్న నేరాలకు బీసీలకు సంబంధమేంటి?
సాక్షి, అమరావతి/నెట్వర్క్: అయ్యన్నపాత్రుడిని అరెస్టుచేస్తే బీసీ నేతను అరెస్టుచేశారని టీడీపీ బీసీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటని పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అయ్యన్న తప్పుచేస్తే బీసీలకు ఏం సంబంధమని వారు సూటిగా ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోకుండా బీసీలపై దాడి అంటూ రాజకీయ లబ్ధిపొందేందుకు యత్నించడం చాలా హేయమని వారు వ్యాఖ్యానించారు. ఫోర్జరీ ఆరోపణలతో అయ్యన్నను సీఐడీ అరెస్టుచేసిన నేపథ్యంలో చంద్రబాబు సహా టీడీపీ నేతలు స్పందిస్తున్న తీరుపై మంత్రులు బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. వారు ఏమన్నారో వారి మాటల్లోనే.. అడ్డంగా దొరికిపోయిన దొంగ అయ్యన్న ‘అయ్యన్నపాత్రుడు నేరాలకు బీసీలకు ఏం సంబంధం ఉంది? దొంగ పనులు చేసి అడ్డంగా దొరికిపోయిన దొంగ అయ్యన్నను పోలీసులు అరెస్టుచేస్తే బీసీలకు అన్యాయం చేస్తున్నట్లు టీడీపీ నేతలు వక్రీకరించడం అన్యాయం. అయ్యన్న చేసిన తప్పులకు అయ్యన్నే బాధ్యుడు. వాటితో బీసీలకు ఏం సంబంధం? చట్టం ఎవరికీ చుట్టంకాదు. పంట కాలువను ఆక్రమించి ఇంటి గోడను నిర్మించిన ఆయనపై సీఐడీ చట్టప్రకారమే కేసు నమోదు చేసింది. ఆక్రమించిన ఇరిగేషన్ భూమిలో ప్రహరీ నిర్మాణానికి తాను ఎన్వోసీ ఇవ్వలేదని, అయ్యన్న హైకోర్టుకు నకిలీపత్రాలు సమర్పించారని జలవనరుల శాఖ ఈఈ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ జరిపిన దర్యాప్తులో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యాకే అరెస్టుచేశారు. ఇందులో కక్ష సాధింపు ఎక్కడ ఉందో చంద్రబాబు, టీడీపీ నేతలు చెప్పాలి..’ అని అన్నారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే తప్పుచేసిన వారు ఎవరైనా శిక్షార్హులే. అయ్యన్నపాత్రునికి ఒక న్యాయం చంద్రబాబుకు ఒక న్యాయం ఉండదు. బీసీలపై దాడి, అర్ధరాత్రి అరెస్టు అంటూ చంద్రబాబు వెకిలివాగుడు వాగుతున్నాడు. ప్రజా ప్రతినిధులు, పలుకుబడిగల నేతలను పోలీసులు రాత్రివేళల్లోనే అదుపులోకి తీసుకుంటారు. ఇది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఇక పవన్ కళ్యాణ్‌ని చంపేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అనడం హాస్యాస్పదం. కుట్రచేస్తే అది చంద్రబాబే చెయ్యాలి. – కొడాలి నాని, గుడివాడ ఎమ్మెల్యే తప్పుడు పనులకు టీడీపీ లైసెన్స్ ఇచ్చిందా? అయ్యన్నకు ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి ఆ పార్టీ ఏమైనా లైసెన్స్ ఇచ్చిందా? అరెస్టుచేసిన సమయంలో వీడియోలను పరిశీలిస్తే అయ్యన్న పోలీసులను తీవ్రస్థాయిలో బెదిరించారన్నది స్పష్టమవుతోంది. అయ్యన్న అరెస్టును బీసీలకు ముడిపెట్టి.. రాజకీయంగా లబ్ధిపొందాలని ప్రయత్నిస్తే బీసీలు వాటిని తిప్పికొడతారు. ఇక విశాఖ భూములపై తాము ప్రశ్నిస్తున్నందుకే తప్పుడు కేసులు పెడుతున్నారంటున్న టీడీపీ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఫోర్జరీలు చేసేవాడు సామాజిక కార్యకర్త అవుతాడా? టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ.. వీళ్లంతా ఏమైనా సంఘ సేవకులా? వీళ్లంతా రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీదారులు. ఈ ముఠాకు నాయకుడు చంద్రబాబు. నారా లోకేశ్ సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని సీఎం జగన్‌ను, ఆయన కుటుంబ సభ్యులతోపాటు వైఎస్సార్సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై సీఐడీ పోలీసులు దృష్టిసారించి చర్యలు తీసుకోవాలి. – తాడేపల్లిలో మీడియాతో మంత్రి బూడి ముత్యాలనాయుడు తప్పులు కప్పి పుచ్చుకునేందుకే రాద్ధాంతం అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతలు లేనిపోని ఆరోపణలతో రాద్ధాంతం చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అయ్యన్నపాత్రుడిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. పోలీసులు చట్టప్రకారం ఆయన్ను అరెస్టుచేస్తే బీసీలపై దాడిగా టీడీపీ నేతలు ఆరోపణలు చేయటం సిగ్గుచేటు. ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోకుండా బీసీలపై దాడి అంటూ రాజకీయ లబ్ధిపొందేందుకు యత్నించడం హేయం. అయ్యన్న తప్పులను కాపాడేందుకు టీడీపీ నాయకులు చేస్తున్న గగ్గోలును కట్టిపెట్టాలి. – మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అయ్యన్న అతిపెద్ద భూకబ్జాదారుడు రాష్ట్రంలో అత్యధికంగా భూకబ్జాలు చేసిన వ్యక్తి, గంజాయి దొంగ అయ్యన్నపాత్రుడే. న్యాయస్థానాలకు తప్పుడు పత్రాలు సమర్పించి రెవెన్యూ రికార్డుల్లో టాంపరింగ్ చేశారు. అధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా ఇష్టానుసారం అక్రమ నిర్మాణం చేపడితే చర్యలు తీసుకోకూడదా? ఆక్రమించిన భూమి ఎవరి నుంచి వచ్చిందో చెప్పాలి. ఆయన కొడుకు రాజేష్ ఐటీడీపీ ద్వారా సీఎంను, మహిళా మంత్రులపై సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నాడు. – ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫోర్జరీ చేయడం నేరం కాదా? ఒకవైపు అయ్యన్న తప్పు చేశాడంటూనే చంద్రబాబు మరోవైపు మమ్మల్ని తప్పుపట్టడం, దూషించటం ఏమిటి? ఫోర్జరీ డాక్యుమెంట్‌తో ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించుకుంటే తప్పుకాదా? అయ్యన్నపాత్రుడిని అరెస్టుచేస్తే బీసీ నేతను అరెస్టుచేశారని మాట్లాడుతున్నారు.. బీసీ నాయకులు తప్పుచేస్తే అరెస్టు చేయరా? అయినా అయ్యన్న తప్పుచేస్తే బీసీలకు ఏం సంబంధం? ఆ ఘటనకు కులాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారు. కులాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. రెండు సెంట్ల భూమి ఆక్రమించుకుంటే, కేసు పెడతారా? అరెస్టు చేస్తారా? అని చంద్రబాబు అంటున్నారు. అంటే అయ్యన్న చేసింది తప్పే అని ఒకవైపు అంటూనే, మరోవైపు అరెస్టు చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి దాన్ని హైకోర్టులో సమర్పించడం చంద్రబాబుకు తప్పుకాదు. ఇన్సైడ్ ట్రేడింగ్ చేయొచ్చు.. కానీ కేసు పెడితే మాత్రం ఓర్చుకోలేరు. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించే టైమ్ కూడా మాకులేదు. అలాంటప్పుడు ఆయనపై రెక్కీ చేయాల్సిన అవసరం అంతకన్నాలేదు. ఈ విషయంలో మాపై నిందలు వేస్తే చంద్రబాబుకే నష్టం. – మంత్రి జోగి రమేష్ అయ్యన్న పెద్ద కబ్జా కోరు టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పెద్ద కబ్జా కోరు, గంజాయి మాఫియా నడిపే 420. ఫోర్జరీ పత్రాలతో జలవనరుల శాఖకు చెందిన భూమిని ఆక్రమించుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా. అవినీతికి పరాకాష్ట అయిన అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేస్తే.. చంద్రబాబు, లోకేశ్ వెనకేసుకురావడం, గందరగోళం సృష్టించడం సిగ్గుచేటు. ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంటే బీసీలను ఇబ్బంది పెడుతోందని మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ఎస్సీ, బీసీలను హేళన చేసినందుకు గత ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలు టీడీపీ తాట తీశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీసీలకు తగిన న్యాయం చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. – మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు -
TS: బీజేపీ క్లియర్‌కట్ మెసేజ్.. పట్టు దొరికిందా?
తెలంగాణాలో హిందుత్వ కార్డు ద్వారా విస్తరించాలనేది బీజేపీ గేమ్‌ప్లాన్. హిందుత్వ విషయంలో దూకుడుగా ఉండే బండి సంజయ్‌కు పార్టీ బాధ్యతలు ఇవ్వడం ద్వారా బీజేపీ ఇప్పటికే క్లియర్‌కట్ మెసేజ్ ఇచ్చేసింది. హైదరాబాద్‌పేరును భాగ్యనగర్‌గా మారుస్తామంటూ ఇప్పటికే పలుసార్లు ప్రకటించింది. చార్మినార్-భాగ్యలక్ష్మి అమ్మవారి మందిరం అంశాన్ని కూడా రాబోయే ఎన్నికల్లో చర్చకు పెట్టే అవకాశం ఉంది. ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీని ముందు నుంచీ బీజేపీ టార్గెట్ చేస్తోంది. రజాకార్ల పార్టీతో కేసీఆర్ సంబంధాలంటూ కేసీఆర్‌ను యాంటీ హిందూగా బీజేపీ ప్రచారం చేస్తోంది. చదవండి: కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. రేవంత్‌కు ఊహించని ఫోన్ కాల్! ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సైతం కేసీఆర్ సర్కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని పదే పదే విమర్శిస్తున్నారు. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి యాంటీ ఎంఐఎం సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవడంలో ఇప్పటికే బీజేపీ ఒక అడుగు ముందుకు వేసింది. తమకంటూ బలమైన హిందుత్వ ఓటు బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకోవడంతో పాటు... ప్రభుత్వ వ్యతిరేక శక్తులను కలుపుకోవాలనే ద్విముఖ వ్యూహంతో బీజేపీ ముందుకు పోతోంది. హైదరాబాద్‌లో నివసించే నార్త్ ఇండియన్స్ బీజేపీకి అండగా నిలబడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో వీరి ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది. వీరితో పాటు తెలంగాణాలో బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాల్లో బీజేపీకి మంచిపట్టుంది. ఇక రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ చూస్తోంది. బండి సంజయ్ లాంటి బీసికి రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇవ్వడం ద్వారా తమది బీసీల పార్టీ అని బీజేపీ మేసేజ్ ఇచ్చింది. ఇప్పటికే ఓబీసీ వర్గానికి చెందిన మోదీ ప్రధానిగా ఉండటంతో.. సహజంగానే ఆ పార్టీకి తెలంగాణా బీసీల్లో పట్టుదొరికే అవకాశాలున్నాయి. అయితే తెలంగాణా రాజకీయ చరిత్ర చూస్తే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలందరూ ఏకపక్షంగా ఒకే పార్టీకి ఓటువేసిన ఉదాహరణలు చాలా తక్కువ. స్థానిక రాజకీయ సమీకరణాలు, అభ్యర్ధులను బట్టి బీసీ కులాల ఓటింగ్ మారుతూ ఉంటుంది. దీనికోసం బీజేపీ వివిధ సామాజిక వర్గాలకు చెందిన బలమైన బీసీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఉత్తర తెలంగాణాలో బలమైన బీసీ సామాజికవర్గం అయిన మున్నూరు కాపులకు కమలం పార్టీలో కీలక పదవులున్నాయి. అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ లాంటి మున్నూరు కాపునేతలకు పార్టీలో మంచి గౌరవం దక్కింది. ఇక ఈటలను చేర్చుకోవడం ద్వారా ముదిరాజ్ ఓటుబ్యాంకు తమవైపే ఉందని బీజేపీ అంటోంది. -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన బీసీ సంఘాల ప్రతినిధులు
సాక్షి, అమరావతి: అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బీసీ సంఘాల ప్రతినిధులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ జనగణనపై శాసనసభలో తీర్మానం చేసిన సందర్భంగా సీఎం జగన్‌కు వారు ధన్యవాదాలు తెలిపి, సత్కరించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆంజనేయులు, బీసీ సంక్షేమ సంఘం కోశాధికారి కన్నా మాష్టారు, రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి హనుమంతరావు, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె క్రాంతి కుమార్ సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. వారితో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ , ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, ఆర్ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే జోగి రమేష్, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహన్‌రావు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: ‘కట్ట’లు తెగిన అసహనం.. పరామర్శ పేరుతో చంద్రబాబు రాజకీయం -
సీఎం జగన్‌కు బీసీ నేతల కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: బీసీ జనగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ శాసన సభలో తీర్మానం చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బీసీ నేతలు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభలోని సీఎం కార్యాలయంలో సీఎం జగన్‌ను బుధవారం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, బీసీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిశారు. బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలు, వెనుకబడిన తరగతులను వెన్నెముక వర్గాలుగా తీర్చిదిద్దుతున్న వైనాన్ని ఆయా వర్గాలకు మరింతగా తెలియజెప్పేలా నాయకులు పనిచేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సూచించారు. -
బీసీ కులాల జనగణన తక్షణమే చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో ఎస్సీ, ఎస్టీల తరహాలోనే బీసీ కులాల గణన కూడా చేపట్టాలని పలు బీసీ సంఘాలు కోరాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాయి. ఆదివారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో పలువురు బీసీ సంఘాల నేతలు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో దిల్కుషా అతిథిగృహంలో భేటీ అయ్యారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం కులాల వారీగా 1931లో జనగణన చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఆ లెక్కలు తీయలేదని బీసీ సంఘాల నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 2011లో యూపీఏ హయాంలో కులాలవారీగా తీసిన లెక్కలను కూడా నేటి వరకు ప్రకటించలేదని చెప్పారు. కులగణన చేపట్టాలని బిహార్, ఒడిశా, తమిళనాడు అసెంబ్లీలు తీర్మానం చేశాయని, దేశంలోని 18 రాజకీయ పార్టీలు కూడా కులగణనకు మద్దతు ప్రకటిస్తూ ప్రధానికి లేఖలు రాశాయని వివరించారు. అనంతరం బీసీ సంఘాల నేతలు మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తికి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. కేబినెట్ మంత్రి హోదాలో ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కిషన్‌రెడ్డి కలిసిన వారిలో బీసీ సంఘాల నేతలు కనకాల శ్యామ్ కురుమ, తాటికొండ విక్రంగౌడ్, రావుల్‌కోల్ నరేశ్, మణిమంజరి, వరికుప్పల మధు, శివారాణి, బండిగారి రాజు, వెంకట్ తదితరులున్నారు. -
'ఏపీ ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకం'
సాక్షి, అమరావతి : బీసీల అభివృద్ధి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆదివారం సాక్షి టీవీతో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ' దేశంలో ఎవరు కూడా విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోలేదు.ఇతర రాష్ట్రాల్లో బీసీ లు ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఎవరూ కూడా ఇలా కార్పొరేషన్ లకు బీసీలను నియమించలేదు. బీసీలకు నాయకత్వం ఇవ్వడం శుభపరిణామం. బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తారు. సమగ్రంగా అభివృద్ధికి కృషి చేస్తున్నారు.ఇంత చిన్న వయస్సులో ఎన్నో పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజకీయంగా ఎవరు ఎదగకూడదు అనే మాత్రమే చూశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు..బీసీ కార్పొరేషన్ లలో మహిళలకు పెద్ద పీట వేయడం గొప్ప విషయం. రాష్ట్ర అభివృద్ధి, బీసీల సమగ్రాభివృద్ధి పట్ల సీఎం జగన్ ఉన్న కృషిని గర్వించదగ్గ విశేషం. (చదవండి : 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు వీరే..) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బి.వై.రామయ్య మాట్లాడుతూ... చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నిర్ణయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకోవడం హర్షనీయం. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికి అడుగు వేస్తున్నారు.కర్నూలు జిల్లా ను బిసి జిల్లా గా మార్చిన ఘనత వైఎస్ జగన్ కు దక్కుతుంది.అతి తక్కువ కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేసి సంక్షేమ పథకాలను అమలు చేశారు.33 వేల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలకు ఉపయోగించారు.10 వేల కోట్ల రూపాయలను బిసిలకు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు బిసిలను మోసం చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమాలు నిర్వహించి, రాష్ట్రంలోని పేద విద్యార్థులకు అమ్మ ఒడి, జగనన్న విద్య కానుకలను అందిస్తున్నారు.108,104 అంబులెన్స్, ఆరోగ్య శ్రీ పథకాలను అమలు చేసి, కరోనా వైరస్ సమయంలో కూడా ఉచితంగా సేవలందిస్తున్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేశారు. పేదల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో బీసీలకు పెద్ద పీట వేశారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బీసీలకు 670 డైరెక్టర్లను ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్. బీసీ కార్పొరేషన్ లలో 50 శాతం మహిళలకు కల్పించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావడం విశేషం. (చదవండి : ‘చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది’) పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ... సీఎం వైఎస్ జగన్ బీసీలకు పెద్ద పీట వేశారు. బీసీ గర్జనలో ఇచ్చిన మాటను వైఎస్ జగన్ ఈ రోజు అమలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా నిర్ణయాలు తీసుకున్నారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు చేయూత క్రితం సహాయం అందిస్తున్నారు. చెప్పిన మాట అమలు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ కృషి చేశారు. స్వాతంత్య్రం వచ్చిన అప్పటి నుంచి ఇలాంటి నిర్ణయాలు నేను చూడలేదు. విజయవాడ విశ్వ బ్రాహ్మణ కమిషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడిన కుటుంబం వైఎస్సార్ కుటుంబం. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు పెద్ద పీట వేసిన వ్యక్తి వైఎస్ జగన్.56 కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి బీసీల బంగారు భవిష్యత్తుకు తోడ్పాటు అందించారు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, పూలే కళలు కన్న కలలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారు.బాబు వస్తే జాబు వస్తుంది చెప్పి మోసం చేశాడు చంద్రబాబు, యువభేరి లో చంద్రబాబు ను ప్రశ్నించిన విద్యార్థులపై అక్రమ కేసులు, బెదిరింపు చేశారు. ప్రతి సంక్షేమ పథకాలలో మహిళలకు ఎక్కువగా ప్రాధాన్య ఇచ్చారు.బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, డైరెక్టర్లను కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. -
‘చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది’
సాక్షి, విశాఖపట్నం : బీసీల అభివృద్ధి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ బీసీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. వైఎస్సార్, జ్యోతిరావుపూలే విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే జోగి రమేష్, పార్టీనేతలు లేళ్ల అప్పిరెడ్డి, చల్లపల్లి మోహనరావు తదితరులు పాల్గొన్నారు. (చదవండి : 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు వీరే..) సీఎం జగన్‌కు ధన్యవాదాలు బీసీలకు 56 కార్పొరేషన్లు ఇవ్వడంపై వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. జిల్లా నుంచి నూతనంగా ఎన్నికైన చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్ నిర్ణయంతో బీసీలందరూ పండగ చేసుకుంటున్నారని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సీఎం జగన్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు సీఎం జగన్ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది అని ప్రశంసించారు. చంద్రబాబు నాయుడు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప చేసిందేమి లేదని విమర్శించారు. బీసీలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించడం కోసం సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బీసీల గుండెల్లో చిరస్థాయిగా సీఎం జగన్ నిలిచిపోతారని పేర్కొన్నారు.