సాక్షి, అమరావతి: అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బీసీ సంఘాల ప్రతినిధులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ జనగణనపై శాసనసభలో తీర్మానం చేసిన సందర్భంగా సీఎం జగన్‌కు వారు ధన్యవాదాలు తెలిపి, సత్కరించారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆంజనేయులు, బీసీ సంక్షేమ సంఘం కోశాధికారి కన్నా మాష్టారు, రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి హనుమంతరావు, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె క్రాంతి కుమార్ సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. వారితో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ , ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, ఆర్ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే జోగి రమేష్, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహన్‌రావు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
చదవండి: ‘కట్ట’లు తెగిన అసహనం.. పరామర్శ పేరుతో చంద్రబాబు రాజకీయం
Comments
Please login to add a commentAdd a comment