సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం కలిశారు. క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగులకు సీఎం అండగా ఉంటానని స్పష్టం చేశారని తెలిపారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం సంతోషకరం: బండి శ్రీనివాసరావు
‘‘12వ పీఆర్‌సీ ప్రకటించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఉద్యోగులకు కావాల్సిన రాయితీలను ప్రకటించారు. ఉద్యోగులూ ప్రభుత్వంలో భాగస్వామ్యమేనన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం సంతోషకరం. చాలావరకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించారు’’ అని బండి శ్రీనివాసరావు అన్నారు. 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రకటించినందుకు ధన్యవాదాలు. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నా’’ అని బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతం: శివారెడ్డి
ఏపీఎన్జీవో కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ, పీఆర్‌సీ కమిషన్ వేసినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘టీడీపీ హయాంలో పీఆర్‌సీ కమిషన్ అడిగినందుకు గుర్రాలతో తొక్కించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు. ఇచ్చిన మాటలను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. సీఎం జగన్ నిర్ణయంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల 23 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. రెగ్యులర్ ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చినట్టే కాంట్రాక్ట్ ఉద్యోగులకూ వస్తాయి. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతమైనవి’’ అని శివారెడ్డి అన్నారు.
చదవండి: 99 శాతం పూర్తి.. దేశ చరిత్రలోనే తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment