మాట్లాడుతున్న తోలేటి శ్రీకాంత్
భవానీపురం (విజయవాడ పశ్చిమ): దేశ చరిత్రలో బీసీలను గుర్తించడమే కాకుండా, వారిని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని పలువురు బీసీ సంఘాల నేతలు ప్రశంసించారు. మున్నెన్నడూ లేని విధంగా బీసీలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీసీలందరూ మూకుమ్మడిగా సీఎం జగన్‌కు మరోమారు పట్టం కట్టనున్నారని వారు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్‌లో ‘బీసీలు–జగనన్న ప్రభుత్వం ప్రాధాన్యత’ అంశంపై శనివారం జరిగిన చర్చా వేదిక నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ సామాజిక సాధికారత సాధనలో సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు.
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా శాసన మండలిలో ఈ స్థాయిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఏనాడూ ప్రాతినిథ్యం కల్పించిన దాఖలాల్లేవన్నారు. నాడు చంద్రబాబు సామాజిక అన్యాయానికి పాల్పడగా.. సీఎం జగన్ ఆయా వర్గాల సాధికారత కోసం నిబద్ధతతో అడుగులేస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్.కృష్ణయ్య ఫోన్‌లో తన సందేశాన్ని వినిపించారు.
ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్‌యాదవ్, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బుద్ధా నాగేశ్వరరావు, బీసీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఎన్‌వీ రావు, రాష్ట్ర రజక సంఘాల గౌరవాధ్యక్షుడు డాక్టర్ రాచకొండ జాన్‌బాబు, ఎంబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎంవీవీఎస్‌ఎన్ మూర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment