బీసీల సమస్యలను పరిష్కరించాలి..
Published Mon, Oct 24 2016 7:07 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
ఏలూరు(సెంట్రల్): బీసీల సమస్యలను పరిష్కరించాలని కొరుతూ బీసీ సబ్‌ప్లాన్– ప్రై వేట్ రంగంలో రిజర్వేషన్‌ల సాధన పోరాట వేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోరాట వేదిక జిల్లా కన్వీనర్ పిచ్చుక ఆదిశేషు మాట్లాడుతూ బీసీలకు జనాభా ప్రాతిపతికన రాయితీ రుణాలు ఇవ్వాలని, బీసీ సబ్‌ప్లాన్‌కు చట్ట బద్దత కల్పించాలన్నారు. ప్రైవేట్ రంగంలో 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, బీసీలకు సామాజిక రక్షణ చట్టం చేసి, వత్తిదారుల సంక్షేమానికి బ్యాంకు ఏర్పాటుచేయాలని, బీసీ జనాభా లెక్కలను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్.అప్పారావు, చోడవరపు రామారావు, కేల్ల వెంకటరమణ, కె.కన్నబాబు,ఎస్.నందేశ్వరరావు, రంభా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement