Sub Plan
-
అట్టడుగు వర్గాలకు సాయంలో.. 'ఏపీ అద్వితీయం'
సాక్షి, అమరావతి: ఎస్సీ ఉప ప్రణాళిక అమలుతో పాటు ఎస్సీ కుటుంబాలకు సహాయం చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని మరే ఇతర రాష్ట్రం అమలుచేయని విధంగా ఎస్సీ ఉప ప్రణాళికను గత ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఏపీ అమలు చేసినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. 2022–23 మూడో త్రైమాసికం వరకు(ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ పథకాల అమలు పురోగతిపై నివేదికను ఆ శాఖ శనివారం విడుదల చేసింది. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా ఆ కుటుంబాలకు సాయం అందించడం, రైతుల వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, పట్టణ పేదలకు సాయం అందించడంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘చాలామంచి’ పనితీరు కనబరించిందని ఆ నివేదిక కితాబిచ్చింది. లక్ష్యాల్లో 90 శాతానికి పైగా అమలుచేసిన రాష్ట్రాలను చాలామంచి పనితీరు కనబరిచినట్లు, 80–90 శాతం మేర అమలుచేసిన రాష్ట్రాలు ‘మంచి పనితీరు’ కనబరిచినట్లు.. అలాగే 80 శాతం లోపల అమలుచేసిన రాష్ట్రాల పనితీరు బాగోలేని రాష్ట్రాలుగా నివేదిక వర్గీకరించింది. ఏపీలో 33.57 లక్షల కుటుంబాలకు సాయం.. ఎస్సీ ఉప ప్రణాళిక కింద దేశంలోని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గత ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం 34,68,986 ఎస్సీ కుటుంబాలకు సాయం అందించినట్లు ఆ నివేదిక పేర్కొంది. అయితే.. అందులో ఒక్క ఏపీలోనే ఏకంగా 33,57,052 కుటుంబాలకు సహాయం అందించారు. అలాగే, గతంలో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా 29,10,944 కుటుంబాలకు సాయం అందించగా.. అదే ఇప్పుడు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు విడుదల చేసిన నివేదికలో ఆ సంఖ్య 33,57,052కు పెరిగింది. అంటే.. మూడునెలల వ్యవధిలో అదనంగా 4,46,108 ఎస్సీ కుటుంబాలకు సాయం అందించింది. మిగతా మరే ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ లక్ష మంది ఎస్సీ కుటుంబాలకు కూడా సహాయం చేయలేదని నివేదిక స్పష్టంచేసింది. ఒక్క కర్ణాటకలో మాత్రమే 22,884 కుటుంబాలకు ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా సాయం అందించగా మిగతా రాష్ట్రాలు అంతకన్నా తక్కువగా వేల, వందల సంఖ్యలోనే సహాయం అందించాయి. పట్టణ పేదలకు సాయంలో కూడా.. అలాగే, గత ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పట్టణాల్లోని 5,98,194 పట్టణ పేద కుటుంబాలకు సాయం అందించగా అందులో ఒక్క ఏపీలోనే 5,05,962 పేద కుటుంబాలకు సాయం అందించినట్లు నివేదిక వెల్లడించింది. ఇదే గతంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఇచ్చిన నివేదికలో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతంలోని 3.47 లక్షల మందికి సాయం అందించినట్లు పేర్కొనగా ఇప్పుడు డిసెంబర్ వరకు ఇచ్చిన నివేదికలో ఆ సంఖ్య 5,05,962కు పెరిగినట్లు పేర్కొంది. అంటే మూడు నెలల వ్యవధిలో పట్టణాల్లోని 1.58 లక్షల పేద కుటుంబాలకు అదనంగా సాయం అందించినట్లు తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో పేదలకు సాయం అందించడంలోనూ ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ‘వ్యవసాయ’ విద్యుత్ కనెక్షన్లలోనూ అగ్రగామి.. అంతేకాక.. రాష్ట్రంలో రైతుల వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలోనూ ఆంధ్రప్రదేశ్ ‘చాలామంచి’ పనితీరు కనబరిచినట్లు నివేదిక తెలిపింది. 2022–23లో 24,852 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా మూడో త్రైమాసికం నాటికి (ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) లక్ష్యానికి మించి 98,447 వ్యవసాయ పంపు సెట్లకు ఏపీ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు నివేదిక తెలిపింది. మరే ఇతర రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయలేదు. ఉపాధి హామీ కింద రాష్ట్రంలో గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 1,78,182 మందికి కొత్తగా జాబ్‌కార్డులను మంజూరు చేసినట్లు నివేదిక పేర్కొంది. అలాగే, ఆ సమయంలో కూలీలకు వేతనాల రూపంలో రూ.3,898.20 కోట్లు చెల్లించినట్లు నివేదిక వెల్లడించింది. ఏపీలోని 55,607 అంగన్వాడీలతో పాటు 257 ఐసీడీఎస్‌లు నూటికి నూరు శాతం పనిచేస్తున్నట్లు నివేదిక స్పష్టంచేసింది. -
అక్షరక్షరంలో పైత్యం నిండిన రాతలు.. మీ బాబూ మళ్లించారు రామోజీ!
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో అన్నీ చక్కగా భేషుగ్గా అనిపించినవి ఇప్పుడు జగన్ పాలనలో అవే అంశాలు బాబు రాజగురువు రామోజీరావుకు పెద్ద తప్పుగా అనిపిస్తున్నాయి. బాబు చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు అన్నట్లుగా ఉన్నాయి ఆయన రాతలు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు సంబంధించి ‘పేరుకే చట్టం.. ఎన్నేళ్లున్నా.. ఏం లాభం?’ శీర్షికతో గుండెలు బాదుకున్న రామోజీ.. బాబు బాగోతాన్ని దాచేసి ఆ కథనంలో ప్రస్తుత ప్రభుత్వంపై తన పైత్యాన్ని అక్షరక్షరంలో నింపారు. బాబు పథకాలకూ ఎస్సీ కాంపొనెంట్ నిధులు చంద్రబాబు పాలనలోనే అనేక పథకాలకు ఎస్సీ, ఎస్టీ కాంపొనెంట్ నిధులు ఖర్చుచేశారు. అప్పట్లో అనేక పథకాలకు ఎస్సీ కాంపొనెంట్ నిధులను కేటాయించారు. నాటి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు 2018 మార్చిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఉదా.. సామాజిక పెన్షన్లలో భాగంగా దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులకు ఎన్టీఆర్ పెన్షన్ స్కీమ్, పొలంబడి, పొలంబడి–చంద్రన్న రైతు క్షేత్రాలు, జవహర్ నాలెడ్జ్ సెంటర్లలో మెంటార్లకు ఇచ్చే గౌరవ వేతనాలు, మధ్యాహ్న భోజన పథకం (పౌష్టికాహారం), పిల్లలు, తల్లులకు ప్రత్యేక పోషకాహారం, అన్న అమృతహస్తం, డ్వాక్రా మహిళలకు శానిటరీ నాప్కిన్స్, ఎన్టీఆర్ జలసిరి, ఎన్టీఆర్ సుజల స్రవంతి, చంద్రన్న పెళ్లికానుక, ఎన్టీఆర్ విద్యావసతి స్కీమ్, మా ఇంటి మహాలక్ష్మి వంటి అనేక పథకాలకు ఎస్సీ కాంపొనెంట్ (ఉప ప్రణాళిక) నిధులను కేటాయించారు. కానీ, ఈ వాస్తవాలను వక్రీకరించి అల్లిన కథనం వెనుక రామోజీకి ఉన్న ఉద్దేశాలు జగమెరిగినవే. జగన్ పాలనలోనే ఎక్కువ మేలు.. ఇక చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ కాంపొనెంట్‌కు ఖర్చుచేసిన నిధులకు మించి ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలోనే ఖర్చుచేసిందన్నది గణాంకాలే చెబుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 వరకు ఐదేళ్ల కాలంలో ఎస్సీ ఉప ప్రణాళిక కోసం రూ.33,625.49 కోట్లు కేటాయిస్తే ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019–20 నుంచి 2022 డిసెంబర్ వరకు మూడున్నరేళ్ల కాలంలో రికార్డు స్థాయిలో రూ.48,899.66 కోట్లు ఖర్చుచేసింది. చదవండి: ఎందుకీ గగ్గోలు?.. ఇప్పుడు ఎవరి ఇల్లు తగలబడుతోంది? అంటే ఐదేళ్లలో టీడీపీ సర్కార్ కేటాయించిన మొత్తానికంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.15,274.17 కోట్లు అదనంగా కేటాయించడం రికార్డు. ఎస్టీల కోసం చేసిన ఖర్చుచూస్తే.. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.12,487.48 కోట్లు ఖర్చుచేస్తే, ప్రస్తుత ప్రభుత్వం మూడున్నరేళ్లలో రూ.15,589.38 కోట్లు ఖర్చుచేసింది. అంటే గత ప్రభుత్వం ఐదేళ్లలో కేటాయించిన మొత్తంకంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో రూ.3,101.9 కోట్లు అదనంగా ఖర్చుచేసింది. కానీ, ఇవేమి పరిగణనలోకి తీసుకోని ఈనాడు నిధుల కోత అంటూ వక్రీకరించి గుండెలు బాదుకుంటోంది. బాబు హయాంలో నిధుల మళ్లింపు అంశాన్ని మరుగునబెట్టి ప్రస్తుత ప్రభుత్వంపై బురదజల్లుతోంది. -
AP: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్.. మరో పదేళ్లు పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిర్దేశించిన సబ్‌ప్లాన్ (ఉప ప్రణాళిక)ను ప్రభుత్వం మరో పదేళ్లు పొడిగించింది. ఈ మేరకు ఆదివారం ఆర్డినెన్స్‌ను జారీచేసింది. దళిత, గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం పదేళ్ల కాలపరిమితితో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం ఈ నెల 23తో ముగియనుంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సబ్‌ప్లాన్‌ను కొనసాగించేందుకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆయా వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్డినెన్స్ తేవడం గొప్ప విషయం ఈ సందర్భంగా పలువురు మంత్రులు, వివిధ ప్రజా సంఘాల నేతలు స్పందించారు. ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున స్పందిస్తూ.. సబ్‌ప్లాన్ చట్టం 2013 జనవరి 23 నుంచి అమలులోకి వచి్చందని.. చట్ట ప్రకారం పదేళ్ల తర్వాత ఇప్పుడు రద్దయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనిపై సకాలంలో సీఎం వైఎస్ జగన్ స్పందించి.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదంతో ముందుగానే ఆర్డినెన్స్ తేవడం గొప్ప విషయమన్నారు. దీంతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపట్ల సీఎం తనకున్న ప్రేమను మరోసారి చూపించారని కొనియాడారు. సబ్‌ప్లాన్ మరో పదేళ్లు కొనసాగేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, దేశంలో మెరుగ్గా సబ్‌ప్లాన్ అమలుచేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవడం వెనుక సీఎం జగన్ చిత్తశుద్ధే కారణమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి.. వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ అన్నారు. సబ్‌ప్లాన్‌ను మరో పదేళ్లు పొడిగించడం హర్షణీయమంటూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సీపీఎం, కేవీపీఎస్, సెంటర్ ఫర్ దళిత స్టడీస్ హర్షం ఇక ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తేవడం పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఒ.నల్లప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, సెంటర్ ఫర్ దళిత స్టడీస్ (హైదరాబాద్) చైర్పర్సన్ మల్లేపల్లి లక్ష్మయ్య, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్, ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్‌నాయక్ వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తంచేశారు. అలాగే, జాతీయ దళిత హక్కుల చైర్మన్ పెరికె ప్రసాదరావు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేరాజోత్ హనుమంతు నాయక్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్తా యోనారాజు కూడా ముఖ్యమంత్రి నిర్ణయంపట్ల సంతోషం వ్యక్తంచేశారు. సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటామన్నారు. -
ఎస్సీ సబ్‌ప్లాన్ అమల్లో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం
-
పసుపు-కుంకుమకు సబ్ ప్లాన్ నిధులు
-
‘సబ్ ప్లాన్’ చట్ట సవరణకే కాంగ్రెస్ పట్టు!
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ నిధుల వెచ్చింపుకు కొత్త చట్టం అవసరం లేదని ప్రస్తుత సబ్ ప్లాన్‌కే చట్ట సవరణ చేస్తే సరిపోతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం ‘ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం’ పేరుతో కొత్త చట్టం అవసరం లేదని, దానికి బదులు సబ్ ప్లాన్ చట్టానికే సవరణ తేవాలని అసెంబ్లీలో పట్టుబ ట్టాలని నిర్ణయించింది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మండలిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, సీఎల్పీ ఉప నేతలు టి.జీవన్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు గురువారం చర్చించారు. సబ్‌ప్లాన్ చట్టం తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని వారన్నారు. కాంగ్రెస్ చేసిన చట్టంలో ఇంతకంటే మెరుగైన అంశాలు చాలా ఉన్నాయన్నది వారి వాదన. సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయకుంటే బాధ్యులపై కేసులు పెట్టే ఆస్కారం కూడా పాత చట్టంలో ఉందని సభ్యులంటున్నారు. కొత్త చట్టంలో దాన్ని లేకుండా చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు నష్టం చేసేలా ఉన్న కొత్త చట్టంపై సీఎల్పీ నేత జానారెడ్డితో పాటు పార్టీ ముఖ్యనేతంతా సభలో గట్టిగా ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది. -
బీసీల సమస్యలను పరిష్కరించాలి..
ఏలూరు(సెంట్రల్): బీసీల సమస్యలను పరిష్కరించాలని కొరుతూ బీసీ సబ్‌ప్లాన్– ప్రై వేట్ రంగంలో రిజర్వేషన్ల సాధన పోరాట వేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోరాట వేదిక జిల్లా కన్వీనర్ పిచ్చుక ఆదిశేషు మాట్లాడుతూ బీసీలకు జనాభా ప్రాతిపతికన రాయితీ రుణాలు ఇవ్వాలని, బీసీ సబ్‌ప్లాన్‌కు చట్ట బద్దత కల్పించాలన్నారు. ప్రైవేట్ రంగంలో 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, బీసీలకు సామాజిక రక్షణ చట్టం చేసి, వత్తిదారుల సంక్షేమానికి బ్యాంకు ఏర్పాటుచేయాలని, బీసీ జనాభా లెక్కలను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్.అప్పారావు, చోడవరపు రామారావు, కేల్ల వెంకటరమణ, కె.కన్నబాబు,ఎస్.నందేశ్వరరావు, రంభా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాలకు పాల్పడితే పోరాటం
ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక నెల్లూరు, సిటీ: ఎస్సీ కాలనీల్లో అభివృద్ధి పనులకు మంజూరైన సబ్‌ప్లాన్ నిధుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడితే పోరాటం తప్పదని ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర కార్యదర్శి బి.శ్రీనివాసులు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్లో అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రజలకు తెలుసన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మేయర్ అజీజ్, అధికారులు దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎస్సీ సబ్‌ప్లాన్ కాంట్రాక్ట్ పనులను ఎస్సీ, ఎస్టీ, వడ్డెర కులాల వారికి 15 శాతం కేటాయించాల్సి ఉందని, అయితే కార్పొరేషన్లో మేయర్,అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వేదిక జిల్లా అధ్యక్షులు పరుశు మస్తానయ్య, లాలాకృష్ణ, మామిడి శ్రీనివాసులు, సత్యనారాయణ, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సబ్‌ప్లాన్ నిధులతో పనులు ప్రారంభించరా..?
ఎమ్మెల్యేలు అనిల్, కోటంరెడ్డి నెల్లూరు సిటీ: రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లలో సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టిన పనులు చివరి దశలో ఉండగా, మంత్రి నారాయణ సొంత జిల్లాలోని కార్పొరేషన్లో మాత్రం ఇప్పటికీ ప్రారంభంకాలేదని నెల్లూరు నగర , రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. సబ్‌ప్లాన్ నిధుల పనులు ప్రారంభం కాకపోవడంపై మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లును వారు కలిశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడారు. నెల్లూరు కార్పొరేషన్‌కు మంజూరైన సబ్‌ప్లాన్ నిధులు రూ.38 కోట్లతో పనులు ప్రారంభం కాకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేషన్లో కాంట్రాక్టర్లు సిండికేటై 8 ప్యాకేజీలుగా చేశారన్నారు. సెప్టెంబర్ ఏడో తేదీలోపు టెండర్లను పిలుస్తామని కమిషనర్ చెప్పారని, 15లోపు ప్రక్రియ పూర్తికాకపోతే కార్పొరేషన్ కార్యాలయానికి తాళాలను వేస్తామని హెచ్చరించారు. అనంతరం కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధికి నిధులు వచ్చాయని చెప్పారు. కార్పొరేషన్ అభివృద్ధికి మంత్రి నారాయణ నిధులను తీసుకురావాల్సి ఉందని, అయితే ఉన్న నిధులతో కూడా పనులను ప్రారంభించలేదని దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో సైతం కార్పొరేషన్ తీరును ఎండగడతామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, గోగుల నాగరాజు, దేవరకొండ అశోక్, నాయకులు కుంచాల శ్రీనివాసులు, వందవాసి రంగ, మునీర్ సిద్ధిఖ్, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్లో బీసీలకు 50శాతం నిధులివ్వాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ సెక్రటరీ జనరల్ వకుళాభరణం హుస్నాబాద్ : రాష్ర్ట బడ్జెట్లో బీసీలకు 50శాతం నిధులు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ సెక్రటరీ జనరల్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు డిమాండ్ చేశారు. పట్టణంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనాభా దామాషా పద్ధతిన చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ను రూ.2వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీల్లోని 70కులాల్లో ఇప్పటికీ 40 సంచారకులాలుగా అభిముక్త జాతులుగా బతుకీడుస్తున్నాయని, వీరి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బీసీలకు ప్రత్యేకంగా సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలన్నారు. కులవృత్తుల్లోని నిపుణులకు వందశాతం రారుుతీతో రుణాలు అందజేయూలన్నారు. అంతకముందు పట్టణంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అనభేరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరి గోపీనాథ్, సంకల్ప స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు వలుస సుభాష్, నాయకులు పిడిశెట్టి రాజు, నాగం కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ తల్లి కడుపుకోత పాపం ఎవరిది?
వైద్యశాఖ వైఫల్యమా- పోషకాహార లోపమా? ఏడాదిలో 190 మంది శిశువులు, 14 మంది బాలింతలు మృతి 20 సబ్‌ప్లాన్ మండలాల్లోని గిరిజనేతరుల్లోనే మరణాలు అధికం పెరుగుతున్న మాతాశిశుమరణాలు సీతంపేట:అటు సర్కారు... ఇటు అధికారులు ఏ సమావేశం ఏర్పాటు చేసినా మాతా శిశు మరణాలు తగ్గాలని ఉద్బోధిస్తున్నారు. అది కంఠశోషగానే మిగిలిపోతోంది. తల్లులకు కడుపుకోత తప్పడంలేదు. మార్పు కార్యక్రమం ద్వారా ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడంలేదు. జిల్లాలో 20 సబ్‌ప్లాన్ గిరిజన మండలాల్లో మాతా శిశుమరణాలు ఎక్కువగా ఉన్నాయి. విశేషమేమిటంటే గిరిజనేతరుల్లోనే ఎక్కువగా మరణాలు సంభవించడం గమనార్హం. ఏప్రిల్ 2014 నుంచి మార్చి 2015 వరకు అధికారిక గణాంకాల ప్రకారం 190 మంది శిశువులు మృతిచెందగా వీరిలో 177 మంది గిరిజనేతరులుండగా 13 మంది గిరిజన శిశువులున్నాయి. అలాగే 14 మంది తల్లులు మరణించగా వీరిలో 12 మంది గిరజనేతరులు, ఇద్దరు గిరిజన తల్లులు ఉన్నారు. అనధికారికంగా మృతుల సంఖ్య ఎక్కువే ఉంటుందనేది నిర్వివాదాంశం. గిరిజన ప్రాంతాల్లో కొండలపై ఉన్న గ్రామాల్లో ఇంటివద్దే ప్రసవాలు జరిగి ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. అవి లెక్కలోకి రావడం లేదు. ఇదీ పరిస్థితి... ఐటీడీఏ పరిధిలోని 20 మండలాల్లో 27 పీహెచ్‌సీలు, మరో 10 సీహెచ్‌సీలు ఉన్నాయి. ప్రాధమిక ఆరోగ్య ఉపకేంద్రాలు 151, ఏరియా ఆస్పత్రులు రెండున్నాయి. వీటి ద్వారా సకాలంలో వైద్యసేవలందాలి. అలాగే ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ఉంది.ప్రసవానికి ముందు 15 రోజులు, ప్రసవం తర్వాత మరో పక్షం రోజులు ఆసుపత్రిలోనే ఉంచడానికి వీలుగా బర్త్ వెయిటింగ్ రూంలను సీతంపేట, కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి ఆరోగ్య కేంద్రాల్లో నెలకొల్పారు. వీటి పై చైతన్యం లేకపోవడంతో ఇంటి వద్దే ప్రసవాలు జరిగి మరణించే సందర్బాలు ఎన్నోఉన్నాయి. పోషకాహారం మాటేమిటి ?... ఐసీడీఎస్ పరిధిలో ఏడు గిరిజన ప్రాజెక్టులున్నాయి. వీటిలో 946 అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు సుమారు 8,500ల మంది ఉన్నారు. అంతేకాకుండా వీరఘట్టం, సారవకోట, కొత్తూరు, సీతంపేట, మందస, పాలకొండ, ఇచ్చాపురం రూరల్ పరిధిలో అమృతహస్తం అమలవుతోంది. సీతంపేట, కొత్తూరులో 109 న్యూట్రిషియన్ కేంద్రాలు కూడా నడుస్తున్నాయి. ఇన్ని ఉన్నా సరైన పోషకాహారం అందకే మాతాశిశుమరణాలు సంభవిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఐటీడీఏ ఉపవైద్యాశాఖాధికారి ఎం.పి.వి.నాయక్ వద్ద సాక్షి ప్రస్తావించగా గిరిజనుల్లో మాతా శిశుమరణాలు తగ్గాయని తెలిపారు. ఐటీడీఏ ద్వారా పాలప్యాకెట్లను కూడా సరఫరా చేస్తున్నామని తెలిపారు. -
మీడియా పాయింట్
బీసీలకు సబ్‌ప్లాన్ ప్రకటించాలి ప్రభుత్వం బీసీలకు సబ్‌ప్లాన్ ప్రకటించడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. జనాభా ప్రాతిపదికన బీసీ వర్గాలకు బడ్జెట్లో తగిన నిధుల కేటాయింపులు జరగక అన్యాయం జరిగింది. ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశాల పట్టింపు లేదు. సాగునీరు, ఉద్యోగాల భర్తీ, నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం వహిస్తోంది. మిగిలిన ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. -ఆర్.రవీంద్రకుమార్, సీపీఐ ఎమ్మెల్యే సబ్‌ప్లాన్‌పై ప్రభుత్వ వైఖరి ఏమిటి? ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ఈ నిధులను ఖర్చు చేయకుండా ఇతర పథకాలకు దారి మళ్లించడంపై కేసులు పెడ్తాం. బడ్జెట్ సమావేశాల్లో ప్రజాస్వామ్య విలువలను ప్రభుత్వం మంటగలిపింది. ప్రతిపక్షాలను బయటకు గెంటేసి సభ నిర్వహిస్తోంది. - సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ ఎమ్మెల్యే సింగరేణి కార్మికులకు వేతనాలు పెంచాలి కోల్ ఇండియా మాదిరిగా సింగరేణి కార్మికులకు వేతనాలు పెంచి రెగ్యులరైజ్ చేయాలి. కార్మిక సంఘాలతో కుదిరిన ఒప్పందాలను అమలు చేయాలి. ఎన్నికల ముందు వాగ్దానాలు చేసిన విధంగా ఉద్యోగ నియామకాలను చేపట్టాలి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. నిరుద్యోగులను మోసం చేయకుండా ప్రభుత్వం ఖాళీ పోస్టుల్లో భర్తీ చేయాలి. - సున్నం రాజయ్య, సీపీఎం ఎమ్మెల్యే ఇందిరా పార్క్‌ను చెరువుగా మార్చవద్దు ఆహ్లాదకర ఇందిరా పార్క్‌ను చెరువుగా మారుస్తామని సీఎం ప్రకటించడం తగదు. హుస్సేన్‌సాగర్ కాకుండా ఇందిరా పార్క్‌లో గణేష్ నిమజ్జనం ఎలా సాధ్యం. ఇందిరా పార్క్ వాకర్స్ కూడా ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని సత్వరమే ఉపసంహరించుకోవాలి. సాగర్ శుద్ధి పేరుతో మురుగు నీరు బస్తీల్లో వదలడాన్ని వ్యతిరేకిస్తున్నాం. -కె.లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేయండి ప్రభుత్వ యంత్రాంగంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేస్తే.. మూడు లక్షల ఉద్యోగ ఖాళీలు ఏర్పడుతాయి. అపుడు వీటిని భర్తీ చేయాలి. ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం వద్ద తగిన ప్రణాళిక లేదు. కాంట్రాక్టు పోస్టులను క్రమబద్ధీకరించాలి లేదా రద్దుచేయాలి. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయి పోస్టులపై ప్రభుత్వ సీఎస్ కమలనాథన్ కమిటీకి లేఖ రాయడం దారుణం. దీనిపై ఆర్థికశాఖ మంత్రి ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదు. - చింతల రాంచంద్రారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే సభను తప్పుదోవ పట్టిస్తున్న మంత్రి హరీశ్ శాసన సభను మంత్రి హరీశ్‌రావు తప్పుదోవ పట్టిస్తున్నారు. కమలనాథన్ కమిటీ కేవలం 1700 ఉద్యోగాలకు సంబంధించినదే. మిగితా పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నిస్తే మంత్రి హరీశ్‌రావు సభను తప్పుదోవ పట్టించే విధంగా వ్యహరిస్తున్నారు. నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు వెంటనే ఉద్యోగఖాళీల్లో నియామకాలు చేపట్టాలి. -రాంమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటై పది మాసాలు గడుస్తున్నా ఉద్యోగాల నియామకాలు ఎప్పుడు చేపడుతారో స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. వయస్సు పెరుగుతుండటంతో ఆత్మస్థ్యైర్యం కోల్పోతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం మాట తప్పింది. - వంశీచంద్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే -
సబ్‌ప్లాన్‌పై దుమారం
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై విపక్షాల ముప్పేట దాడి సబ్‌ప్లాన్ చట్టాన్ని ఇంకా అడాప్ట్ చేసుకోలేదన్న ఉప ముఖ్యమంత్రి కడియం వ్యాఖ్యలపై మండిపాటు విపక్షాల ఆందోళనలతో అట్టుడికిన శాసనసభ హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల అమలులో సర్కారు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రం ఏర్పాటై 9 నెలలు గడిచినా ఇంతవరకు సబ్‌ప్లాన్ అమలుకు సంబంధించిన నిబంధనలను సైతం రూపొందించలేదని ఎండగట్టాయి. సబ్‌ప్లాన్ అమలు తీరును సమీక్షించేందుకు ఆర్నెల్ల కోసారి ముఖ్యమంత్రి నేతృత్వంలో జరగాల్సిన కౌన్సిల్ సమావేశాన్ని ఇప్పటివరకు నిర్వహించలేదని దుమ్మెత్తిపోశాయి. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంలు ముప్పేటదాడికి దిగడంతో మంగళవారం శాసనసభలో పలుమార్లు గందరగోళం ఏర్పడింది. విపక్షాల ప్రశ్నలకు బదులిచ్చే క్రమంలో ‘సబ్‌ప్లాన్ చట్టాన్ని ఇంకా తెలంగాణ ప్రభుత్వం అడాప్ట్ చేసుకోలేదు’ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించడం అగ్నికి ఆజ్యం పోసింది. కాంగ్రెస్ సభ్యురాలు జె.గీతారెడ్డి సభా నిర్వహణ నియమావళిలోని 344వ నిబంధన కింద ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు అంశాన్ని లేవనెత్తారు. 2014-15 బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపులతో పోల్చితే వ్యయం చాలా తక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 15 శాతం మాత్రమే విడుదలయ్యాయన్నారు. విడుదల కాని నిధులు మురిగిపోకుండా వచ్చే బడ్జెట్ కేటాయింపుల్లో జమచేసే విధంగా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టానికి సవరణలు చేయాలని సూచించారు. మాల, మాదిగ మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారని సంపత్‌కుమార్ (కాంగ్రెస్) ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందిస్తూ గత బడ్జెట్లో కేటాయించిన నిధులు విడుదల కాకపోవడానికి గల కారణాలను వివరించారు. ఉప ప్రణాళికల చట్ట సవరణ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, గీతారెడ్డి చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఈ చట్టాన్ని ఇంకా తెలంగాణకు అడాప్ట్ చేసుకోలేదని, ఆ సమయంలో ఈ మేరకు సవరణలు చేస్తామన్నారు. మంత్రి సమాధానంపై బీజేపీఎల్పీనేత లక్ష్మణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాన్ని అడాప్ట్ చేసుకోడానికి ఒక్కరోజు చాలని, ఇంతకాలం ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. సబ్‌ప్లాన్ చట్టాన్ని ఇంకా అడాప్ట్ చేసుకోకపోవడం శోచనీయమని గీతారెడ్డి వ్యాఖ్యానించారు. ఇది దళితులైన మాకు చెంపపట్టు అన్నారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నంలో చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. అడాప్ట్ చేసుకోడానికి 9 నెలలు ఎందుకు ఆగారని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పీకర్ అనుమతితో భట్టి విక్రమార్క మాట్లాడుతుండగా, హోంమంత్రి నాయిని అడ్డుపడ్డారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయన్నారు. -
ప్లాన్ ప్రకారమే...
అమలాపురం :ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో దళిత కాలనీల్లో చేపట్టిన రహదారుల నిర్మాణాన్ని నిలుపుదల చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. తద్వారా ఎస్సీ, ఎస్టీల ప్రాంతాల్లో నిధులు కచ్చితంగా ఖర్చు పెట్టాలనే చట్టాన్ని బాబు సర్కారు అపహాస్యం చేసినట్టయింది.దళితులు నివసించే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించే 15 శాతం నిధులను మిగిలిన ప్రాంతాల్లో ఖర్చు చేస్తున్నారని, దీనివల్ల దళితులు నివసించే ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం చేసింది. ఈ క్రమంలో తమ ప్రాంతాల అభివృద్ధికి ఢోకా ఉండదని దళితులు భావించారు. సబ్‌ప్లాన్, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో గత ప్రభుత్వం జిల్లాలోని అనేక గ్రామాల్లో రూ.21.20 కోట్లతో సుమారు 415 సీసీ రోడ్లు నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది. రూ.5 లక్షలతో చేపట్టే సీసీ రోడ్లను ఎంపీడీఓ సమక్షంలో గ్రామసభలు పెట్టి పనులను గుర్తించారు. నిధులు కేటాయించిన అనంతరం మున్సిపల్, స్థానిక, సాధారణ ఎన్నికలు రావడంతో ‘కోడ్’ కారణంగా చాలా చోట్ల పనులు చేపట్టలేకపోయారు. జిల్లాలో ఇప్పటివరకు కేవలం పదిశాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి. నిధుల వినియోగానికి గడువు పెట్టకపోవడం కూడా పనులు మందకొడిగా సాగడానికి కారణమైంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో పనులు కొనసాగించాలని పంచాయతీరాజ్ శాఖ భావించింది. అయితే ఇటీవల పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం నిధులు లేవనే సాకుతో సబ్‌ప్లాన్ పనులు నిలిపివేయాలని జీఓ ఎంఎస్ నంబరు 389 జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో వివిధ దశల్లో ఉన్న రహదారుల నిర్మాణాలు స్తంభించాయి. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసినా బిల్లులు వస్తాయన్న నమ్మకం లేక కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. కేటాయించిన నిధులను ప్రభుత్వం నిలిపివేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సర్పంచ్‌లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, దళిత సంఘాలు మండిపడుతున్నాయి. సబ్‌ప్లాన్ చట్టం ద్వారా తమకు మేలు జరుగుతుందనుకుంటే.. చంద్రబాబు ప్రభుత్వం దానిని అపహాస్యం చేస్తూ జీఓ జారీ చేయడం సమంజసంగా లేదని దళిత సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. తక్షణం ప్రభుత్వం జీఓ 389ను ఉపసంహరించుకుని, సబ్‌ప్లాన్ నిధులతో పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పక్కాగా అమలు..
-
సబ్ ‘ప్లాన్’ లేదు
సాక్షి,కడప: జిల్లాలో సబ్ ప్లాన్ పనులకు గ్రహణం పట్టింది. ఎస్సీ సబ్ ప్లాన్ (ఎస్సీపీ), ట్రైబల్ సబ్ ప్లాన్(టీఎస్పీ) నిధులతో ఎస్సీ,ఎస్టీ ఆవాసాలలో సిమెంట్, లింక్‌రోడ్లు, డ్రైనేజీ పనులకోసం పంచాయతీరాజ్‌శాఖ గత ఏడాది మే నెలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు పంపింది. 40 శాతం కంటే ఎక్కువ ఎస్సీ, ఎస్టీ జనాభా కలిగిన కాలనీల ప్రాతిపదికతో అంచనాలను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఎస్సీపీ కింద 1299 హ్యాబిటేషన్లల్లో రూ. 176.90 కోట్లు ,టీఎస్పీ ద్వారా 275 ఆవాసాల్లో రూ. 32 కోట్లతో పనుల జాబితాను రూపొందించి గత ఏడాది మే నెలలో ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రతిపాదనలు అటకెక్కించి మళ్లీ అధిక ఎస్సీ,ఎస్టీ జనాభా కలిగిన గ్రామాలను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసి పనుల జాబితాను పంపాలని జూన్‌లో ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఎస్సీపీ నిధుల కింద బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాలను ఎంపిక చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో అధికంగా ఎస్సీలున్నప్పటికి ప్రభుత్వం వివక్ష చూపింది. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో దాన్ని పక్కనపెట్టి బద్వేలు నియోజకవర్గాన్ని ఎంపిక చేయడం గమనార్హం. బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాలలోని ఎస్సీ కాలనీల్లో రూ.7.82 కోట్లతో, జిల్లాలో అధిక జనాభా గల ఎస్టీ ఆవాసాల్లో రూ. 1.98 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధంచేసి అప్పట్లోనే ప్రభుత్వానికి పంపారు. అయితే ఇంత వరకు వీటి గురించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నోడల్ ఏజెన్సీ పట్టించుకోలేదు. ఫిబ్రవరి చివరిలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ లోపు వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిధులు మంజూరు చేయకపోతే సబ్ ప్లాన్ నిధులతో ప్రతిపాదించిన పనులకు గ్రహణం పట్టనుంది. బద్వేలు నియోజక వర్గానికి ప్రాధాన్యం బద్వేలు, మైదుకూరు నియోజక వర్గాలలోని ఆవాసాల్లో అధిక జనాభాను దృష్టిలో ఉంచుకొని మొత్తం 22 పనులను రూ. 7.84 కోట్లతో ప్రతిపాదించారు. ఇందులో అధిక శాతం ఎస్ వెంకటాపురంలో రూ. 1.14 కోట్లు, పెద్దులపల్లె రూ.35 లక్షలు, కవలకుంట్ల రూ. 30 లక్షలు, పుల్లారెడ్డిపల్లె రూ. 35 లక్షలు, కుంభగిరి రూ. 47.76 లక్షలు, వరికుంట్ల రూ.33.60 లక్షలు, రెడ్డిపల్లె రూ.33 లక్షలు, ఎస్ రామాపురం రూ.2.17 కోట్లు .. ఇలా బద్వేలు నియోజకవర్గంలోని అన్ని ముఖ్యమైన ప్రతిపాదనలతో కలిపి రూ. 7.17 కోట్లు ఉన్నాయి. మెదుకూరు నియోజకవర్గంలో రూ. 66.60 లక్షల నిధుల్లో అధికంగా బి.మఠం మడలంలోని గుండాపురంలో రూ. 50 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. టీఎస్పీ నిధులకు సంబంధించి.. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని గంగరాజుపోడు ఎస్టీ కాలనీలో రూ. 61.28 లక్షలు, కడప డివిజన్లో పెద్దబిడికి రూ. 30 లక్షలు, గాలివీడు మండలంలోని పందికుంట రూ. 12.50 లక్షలు, మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె సుగాలితాండా రూ. 5.75 లక్షలు, ఖాజీపేట మండలంలోని సుగాలితాండ రూ. 7లక్షలు, మైలవరం మండలంలో కోన- అనంతపురం రోడ్డు నిర్మాణానికి రూ. 50 లక్షలు, బి.మఠం ఎస్టీ హాస్టల్ వద్ద సీసీ రోడ్డు కోసం రూ. 10 లక్షలు, సుండుపల్లె ఎస్టీ హాస్టల్ వద్ద రూ. 7.50 లక్షలు, మినీ గురుకులం మంగంపేట వద్ద రూ. 8.30 లక్షలు, పులివెందుల నగరి గుట్ట వద్ద రూ. 6 లక్షలు, ప్రొద్దుటూరు మండలం గోపవరం ఎస్టీ హాస్టల్ వద్ద రూ. 1.45 లక్షల రూపాయలతో రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని ప్రతిపాదించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపు నిధులు మంజూరు కాకపోతే ఈ పనుల ప్రతిపాదనలు అటకెక్కినట్లే. ప్రతిపాదనలు పంపాం సబ్‌ప్లాన్ నిధులకు సంబంధించి ఇప్పటికే రెండుమార్లు ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నోడల్ ఏజెన్సీ నిధులు మంజూరు చేయాల్సి ఉంది. - జగత్‌కుమార్, పీఆర్ ఎస్ఈ, కడప -
‘ఉత్త’ ప్రణాళిక!
యాచారం, న్యూస్‌లైన్ : దళితులు, గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఉద్దేశించిన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. దేశంలోనే ప్రప్రథమంగా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను రూపొందించి చట్టబద్ధత కల్పించామని.. రూ.కోట్ల రూపాయలు వారి సంక్షేమానికి కేటాయించామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. అరకొర నిధులు విడుదల చేస్తూ ఉప ప్రణాళికను ‘ఉత్త’ ప్రణాళికగా మార్చేస్తోంది. కాలనీల్లో అభివృద్ధి పనులు వెంటనే చేపట్టనున్నట్టు ప్రజా ప్రతినిధులు, అధికారులు నమ్మబలకడంతో దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీలు అరకొర నిధులు మంజూరు కావడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. ఉదాహరణకు యాచారం మండలంలోని 20గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం దళితులు, గిరిజనులు రెండువేలకు పైగా అర్జీలు పెట్టుకున్నారు. అధికంగా ఇళ్లు, సీసీ రోడ్లు, డ్రెయినేజీ కాల్వలు, వీధి లైట్లు, కమ్యూనిటీ భవనాలు, తాగునీటి సరఫరా మెరుగు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మండల పరిధి 20 గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో నేటికీ సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఇక నందివనపర్తి అనుబంధ తండాలైన బొల్లిగుట్ట, ఎనెకింది, నీలిపోచమ్మ తండా, మంతన్‌గౌరెల్లి పరిధిలోని భానుతండా, కేస్లీతండా, మంతన్‌గౌడ్, కొత్తపల్లి తండా, తక్కళ్లపల్లి అనుబంధ ఎర్రగొల్ల తండా, వేపపురితండా ఇలా మండలంలోని 19 తండాల్లో మౌలిక వసతులు అటుంచి కనీస రోడ్డు కూడా లేకపోవడంతో గిరిజనులు నిత్యావసరాల కోసం కాలినడకన కిలోమీటర్ల దూరంలోని గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రతిపాదనలు రూ.30కోట్లకు.. మంజూరైంది రూ.7.30లక్షలే! ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద చేపట్టాల్సిన పనుల కోసం ప్రతిపాదనలు పంపాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన క్షేత్రస్థాయి సిబ్బంది దరఖాస్తులను పరిశీలించి అభివృద్ధి పనుల విలువ లెక్కకట్టారు. 20 గ్రామాలు, 19 తండాల్లో అభివృద్ధి పనుల కోసం రూ.30 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపా రు. అయితే ఇళ్లు, సీసీ రోడ్లు, డ్రెయినేజీ వ్యవ స్థ నిర్మాణాలు, తాగునీటి సమస్య పరిష్కారాలకు నిధుల మంజూరును పక్కన పెట్టిన ఉన్నతాధికారులు కేవలం ఒక్క కమ్యూనిటీ భవన నిర్మాణానికి మాత్రమే నిధులు విడుదల చేశారు. మొత్తం 12 గ్రామాల్లో కమ్యూనిటీ భవనాలు ప్రతిపాదించగా, ఒక్క మంతన్‌గౌరెల్లిలో మాత్రమే నిర్మించడానికి రూ.7.30లక్షలు మంజూరయ్యాయి. ఇటీవల మంతన్‌గౌరెల్లిలో పర్యటించిన ఎంపీడీఓ.. ఎస్సీ కాలనీ లో కమ్యూనిటీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరైన విషయం గ్రామస్తులకు తెలియజేశారు. కాగా, మంతన్‌గౌరెల్లి గ్రామంలోనే కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరైన విషయం తెలుసుకున్న మిగతా గ్రామాల ఎస్సీ కాలనీవాసులు తమ దరఖాస్తులను అధికారులు పక్కనపెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు జిల్లాలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి కన్పిస్తున్నది.