సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ నిధుల వెచ్చింపుకు కొత్త చట్టం అవసరం లేదని ప్రస్తుత సబ్ ప్లాన్‌కే చట్ట సవరణ చేస్తే సరిపోతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం ‘ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం’ పేరుతో కొత్త చట్టం అవసరం లేదని, దానికి బదులు సబ్ ప్లాన్ చట్టానికే సవరణ తేవాలని అసెంబ్లీలో పట్టుబ ట్టాలని నిర్ణయించింది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మండలిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, సీఎల్పీ ఉప నేతలు టి.జీవన్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు గురువారం చర్చించారు.
సబ్‌ప్లాన్ చట్టం తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని వారన్నారు. కాంగ్రెస్ చేసిన చట్టంలో ఇంతకంటే మెరుగైన అంశాలు చాలా ఉన్నాయన్నది వారి వాదన. సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయకుంటే బాధ్యులపై కేసులు పెట్టే ఆస్కారం కూడా పాత చట్టంలో ఉందని సభ్యులంటున్నారు. కొత్త చట్టంలో దాన్ని లేకుండా చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు నష్టం చేసేలా ఉన్న కొత్త చట్టంపై సీఎల్పీ నేత జానారెడ్డితో పాటు పార్టీ ముఖ్యనేతంతా సభలో గట్టిగా ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది.
‘సబ్ ప్లాన్’ చట్ట సవరణకే కాంగ్రెస్ పట్టు!
Published Fri, Mar 24 2017 1:25 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement
Advertisement