
ప్రజాభవన్ వేదికగా సమావేశం.. హాజరుకానున్న టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ బీసీ నేతల(BC Leaders)తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) భేటీ కానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలసి ఆయన బీసీ నాయకులతో సమావేశం కానున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులగణన జరగడం, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం త్వరలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పార్టీ బీసీ నేతలకు కర్తవ్యబోధ చేసేందుకు గాను ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.