సాక్షి, హైదరాబాద్: సివిల్స్ మెయిన్స్ అర్హులైన ప్రతీ అభ్యర్థి టాప్ ర్యాంక్ తెచ్చుకుని తెలంగాణకు పనిచేయాలని కోరకుంటున్నట్టు సీఎం రేవంత్ తెలిపారు. ఈ క్రమంలో సింగరేణి ఆధ్వర్యంలో సివిల్స్ అభ్యర్థులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. సివిల్స్ అభ్యర్థుల్లో విశ్వాసం పెంచేందుకే ఆర్థిక సాయం చేస్తున్నట్టు తెలిపారు.
ప్రజాభవన్‌లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సివిల్స్ మెయిన్స్ పరీక్షకు ఎంపికైన వారికి రూ.లక్ష చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అభయహస్తం చెక్కుల పంపిణీ జరిగింది. సింగరేణి ఆధ్వర్యంలో సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక సాయం అందజేశారు. సివిల్స్ మెయిన్స్ అర్హత సాధించిన 20 మందికి ఆర్థిక సాయం చేశారు.
ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఉపాధి, ఉద్యోగాల కోసమే తెలంగాణ సాధించుకున్నాం. ఇందుకోసమే యువత తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది. ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణలోనే ఎక్కువ అన్యాయం జరిగిందనే పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయలేదు. తెలంగాణ యువత సహకారంతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతిభవన్.. ప్రజాభవన్‌గా మారింది.
సివిల్స్ మెయిన్స్ పరీక్షకు ఎంపికైన వారికి శుభాకాంక్షలు. అభ్యర్థులు టాప్ ర్యాంకులో వచ్చి తెలంగాణకు పనిచేస్తే బాగుంటుంది. వెనుకబడిన రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సివిల్స్‌కు వెళ్తున్నారు. సివిల్స్ అభ్యర్థుల్లో విశ్వాసం పెంచేందుకే ఆర్థిక సాయం అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎప్పుడు పోటీ పరీక్షలు పెడతారో తెలియని పరిస్థితి ఉండేది. చిక్కుముడులు విప్పుతూ ఉద్యోగాలు ఇస్తున్నాం. మా ప్రయత్నాన్ని గమనించండి. రాష్ట్రంలో 14 ఏళ్లుగా గ్రూప్-1 నియామకాలు లేవు. 563 గ్రూప్-1 పోస్టులు భర్తీ చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment