obc reservations
-
మమత సర్కారుకు షాక్.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కారుకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం(మే22)న కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓబీసీ కోటాలోని పలు క్లాసులు చట్ట విరుద్ధమని పేర్కొంటూ కొట్టివేసింది. 2010 తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేసింది.2012 పశ్చిమబెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలో పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు డివిజన్ బెంచ్ తెలిపింది. ఓబీసీ వర్గీకరణ చట్టవిరుద్ధంగా ఉందని స్పష్టంచేసింది.అయితే, ఈ తీర్పును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఇది కచ్చితంగా బీజేపీ కుట్రేనని ఆరోపించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు ఎప్పటిలాగే అమలవుతాయన్నారు. -
PM Narendra Modi: కాంగ్రెస్ వస్తే దేశమంతటా కర్ణాటక మోడల్
ఆగ్రా/మొరేనా: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శల దాడిని రోజురోజుకూ ఉధృతం చేస్తున్నారు. సంపద పునఃపంపిణీ, ఓబీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ను ఇరుకున పెడుతున్నారు. ప్రజలు కష్టపడి సంపాదించి, దాచుకున్న సొమ్మును దోచేయడానికి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను, హక్కులను దొడ్డిదారిన కాజేసి, ఓటు బ్యాంక్‌కు కట్టబెట్టడానికి కాంగ్రెస్ పెద్ద కుట్ర పన్నిందని మరోసారి నిప్పులు చెరిగారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో, బరేలీ, షాజహాన్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని మొరేనా నగరంలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని మండిపడ్డారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే... అడ్డుగోడను నేను.. ‘‘మన తల్లులు, అక్కచెల్లెమ్మల సొత్తుపై కాంగ్రెస్ నాయకులు గురిపెట్టారు. అధికారంలోకి రాగానే తస్కరించాలని కుట్ర పన్నారు. మన ఆడపడుచుల సొమ్మును ఎవరూ దోచుకెళ్లకుండా నేను కాపలాదారుడిగా పనిచేస్తున్నా. మహిళలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా. ప్రజలకు, కాంగ్రెస్‌కు మధ్య ఒక అడ్డుగోడగా నేను నిల్చున్నా. ప్రజల ఆస్తులను కాంగ్రెస్ దోచుకోకుండా కాపాడుతున్నా. జనం ఆస్తులను, సంపదను ఎక్స్–రే తీస్తామని కాంగ్రెస్ రాజకుమారుడు అంటున్నారు. ప్రజలపై వారసత్వ పన్ను విధించాలని మరో కాంగ్రెస్ నాయకుడు చెబుతున్నారు. ఎవరైనా ఆస్తి సంపాదించి మరణిస్తే అందులో 55 శాతం ఆస్తిని స్వా«దీనం చేసుకొని, మిగతా 45 శాతం ఆస్తిని వారసులకు ఇస్తారట! ఇదెక్కడి న్యాయమో అర్థం కావడం లేదు. మతపరమైన రిజర్వేషన్లను మన రాజ్యాంగం అనుమతించదు. అయినా కాంగ్రెస్ పార్టీ మతం ఆధారంగా మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతోంది. తద్వారా రాజ్యాంగాన్ని కించపరుస్తోంది. మతం ఆధారంగా రిజర్వేషన్ల వ్యవస్థ తీసుకొచ్చేందుకు ఇప్పటిదాకా కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలను కోర్టులు తిరస్కరించాయి. అందుకే ఆ పార్టీ దొడ్డిదారిని ఎంచుకుంది. మైనార్టీలను ఓబీసీ కోటాలో చేర్చి రిజర్వేషన్లు ఇచ్చేస్తోంది. కర్ణాటకలో ముస్లింలను ఇప్పటికే చట్టవిరుద్ధంగా ఓబీసీ కేటగిరీలో చేర్చి, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ పదేపదే ఈ విషయం చెబుతోంది. మేనిఫెస్టోలో కూడా చేర్చింది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలుత ఆంధ్రప్రదేశ్‌లోనే ముస్లిం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. కేంద్రంలో అధికారంలోకి రాగానే కర్ణాటక మోడల్‌ను దేశమంతటా అమలు చేయాల న్నదే కాంగ్రెస్ కుయుక్తి. నేను కూడా ఒక ఓబీసీనే. కర్ణాటక మోడల్ నాకు ఆందోళన కలిగిస్తోంది. ఇక సామాన్య ప్రజల సంగతి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను, హక్కులను ఎవరూ తస్కరించకుండా రక్షణ కల్పించడానికి ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల కుటుంబాల్లో రెండు ఉద్యోగాలు ఉంటే అందులో ఒకటి బలవంతంగా లాగేసుకుంటారు. ముస్లింలకు కట్టబెడతారు. ఇలాంటి బుజ్జగింపు రాజకీయాలు మన దేశాన్ని ముక్కలు చేస్తాయని అందరూ తెలుసుకోవాలి. సంతుïÙ్టకరణ(ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తిపర్చడం) ద్వారా తుషీ్టకరణ(బుజ్జగింపు)ను అంతం చేయాలన్నదే మా ప్రయత్నం. అసలు లోగుట్టు ఇదే..ఎస్టేట్ డ్యూటీ(పన్ను)ని అప్పట్లో ప్రధాని రాజీవ్ గాంధీ రద్దు చేశారని కాంగ్రెస్ నాయకులు గొప్పగా చెబుతున్నారు. నిజానికి ఇందిరా గాంధీ మరణం తర్వాత ఆమె ఆస్తులను ప్రభుత్వం స్వా«దీనం చేసుకోకుండా కాపాడుకోవడానికి ఎస్టేట్ డ్యూటీని కుమారుడు రాజీవ్ గాంధీ రద్దు చేశారు. అసలు లోగుట్టు ఇదే. ఇందిరా గాంధీ నుంచి బదిలీ అయిన ఆస్తులను ఆమె కుటుంబంలో నాలుగు తరాలు చక్కగా అనుభవించాయి. ఇందిరా గాంధీ మరణం కంటే ముందు ఎస్టేట్ డ్యూటీతో భారీగా లాభపడిన కాంగ్రెస్ ఇప్పుడు అదే విధానం తీసుకురావాలని భావిస్తోంది. బీజేపీ ఉన్నంతకాలం కాంగ్రెస్ ఆటలు సాగవు. జనం ఆస్తులను కాజేసే ప్రయత్నాలను కచి్చతంగా తిప్పికొడతాం. -
Sharad Yadav: ‘మండల్’ అమలు వ్యూహం ఆయనదే!
దేశరాజధానిలో 2023 జనవరి 12న తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూసిన శరద్ యాదవ్ (75) మృతి దేశవ్యాప్తంగా ఆయన అనుయాయులను, ఆరాధకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఈ యువ ఎమర్జెన్సీ వ్యతిరేక విద్యార్థి నేత 1974 జయప్రకాష్ నారాయణ్ ఉద్యమ సమ యంలో 27 ఏళ్ల ప్రాయంలోనే పార్ల మెంటు స్థానంలో గెలుపొంది జాతీయ నేతగా మారారు. ఓబీసీ భావన, దాని వర్గీకరణ జాతీయ నిఘంటువుగా మారడానికి చాలాకాలానికి ముందే ఆయన శూద్ర, ఓబీసీ, సామాజిక శక్తుల ప్రతినిధిగా, సోషలిస్టు సిద్ధాంతవేత్తగా ఆవిర్భవించారు. రామ్మనోహర్ లోహియా, కర్పూరీ ఠాకూర్ (బిహార్‌కి చెందిన క్షురక సామాజిక బృందానికి చెందిన నేత)ల సోషలిస్టు సిద్ధాంత భూమిక నుంచి ఉత్తర భారతదేశంలో ఆవిర్భవించిన నూతన యువ శూద్ర, ఓబీసీ నేతల బృందంలో శరద్ యాదవ్ ఒక భాగమై ఉండేవారు. ఈ బృందంలోని ఇతర నేతలు తమ సొంత రాష్ట్రాలకే పరిమితమై పోగా, ఈయన మాత్రం జాతీయ ప్రముఖుడిగా మారారు. ఈ యువ బృందానికి చెందిన ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్‌లు జాతీయ రాజకీయాల నుంచి వెనుదిరిగి రాష్ట్ర రాజ కీయాలకు పరిమితమైపోగా, శరద్ యాదవ్ మాత్రం పార్లమెంటులోనే ఉండిపోయారు. ఏడు సార్లు లోక్‌సభ సభ్యుడిగా, మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా నెగ్గిన శరద్ యాదవ్ పార్లమెంటులో పేదల అనుకూల సమరాల్లో పోరాడుతూ వచ్చారు. హిందీలో చక్కటి వక్త, తార్కిక చింతనాపరుడైన శరద్ యాదవ్ రాజకీయ వ్యూహకర్తగా ఉండేవారు. ఈయన రాజకీయ వ్యూహం ఫలితంగానే నాటి ఉప ప్రధాని, జాట్ నేత అయిన దేవీలాల్ నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలోనూ... మండల్ నివేదికలోని ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ ఇచ్చే అంశాన్ని వీపీ సింగ్ అమలు చేయవలసి వచ్చింది. జనతా దళ్ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పరిణామాల గురించి శరద్ యాదవ్ వివరించి చెప్పారు. ‘మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సిందిగా జనతా దళ్ ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి మేము సోషలిస్టు నేతలందరినీ సమీకరించడం ప్రారంభించాము. ఇది జరగకుండా శూద్రులకు నిజమైన న్యాయం కలగదని మేము బలంగా నమ్మాము. మండల్ కమిషన్ సిఫార్సులను వీపీ సింగ్ సన్నిహితులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీన్ని అధిగమించడానికి ఆయన ఉపప్రధాని, ప్రముఖ జాట్ నేత దేవీలాల్ చౌదరి అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. చరణ్ సింగ్ జోక్యం కారణం గానే జాట్లను వెనుకబడిన వర్గాల జాబి తాలో మండల్ చేర్చలేక పోయారని తనకు తెలుసు. అయినప్పటికీ అనేక మంది స్థానిక జాట్ నేతలు, బృందాలు రిజ ర్వేషన్ కేటగిరీలో తమను చేర్చాల్సిందిగా తమ తమ రాజకీయ నేతలను ఒత్తి డికి గురి చేశారు. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న వీపీ సింగ్ గొప్ప ఎత్తు వేశారు. జాట్లను రిజర్వేషన్ జాబితాలో చేర్చడానికి తాను వ్యతిరేకమే అయినప్పటికీ, ప్రముఖ జాట్ నేత అయిన దేవీలాల్ జాట్లను చేర్చకుండా మండల్ సిఫార్సులను అమలు చేయబోరని వీపీ సింగ్‌కు కచ్చితంగా తెలుసు. జనతాదళ్ జనరల్ సెక్రెటరీ, పరిశ్రమల మంత్రీ అయిన చౌదరి అజిత్ సింగ్ కూడా వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ప్రచారం ప్రారంభించారు, ఓబీసీ జాబితాలో జాట్లను చేర్చాల్సిందేనని నొక్కి చెప్పసాగారు. దీంతో దేవీలాల్ రాజకీయ డైలమాలో చిక్కుకున్నారు. జాట్లను వెనుకబడిన వర్గంగా చేర్చిన ఘనత అజిత్ సింగ్‌కు దక్కకూడదని ఆయన కోరుకున్నారు. మరోవైపు, జాట్లను ఓబీసీ జాబితాలో చేర్చకుంటే తన సొంత జాట్ కమ్యూనిటీ నుంచి ఆగ్రహాన్ని చవిచూసే ప్రమాదాన్ని కూడా దేవీలాల్ కోరుకోలేదు. కాబట్టి, ఇది మండల్ కమిషన్‌పై చర్చకు ముగింపు పలుకుతుందని వీపీ సింగ్ భావించారు. ‘‘1990 ఆగస్టు 3న, వీపీ సింగ్ నాకు కబురంపి ‘సోదరా శరద్! చౌదరి దేవీలాల్ని ఇక ఏమాత్రం నేను సహించలేన’ని చెప్పారు. దేవీలాల్‌తో మాట్లాడతాననీ, ఈ అధ్యాయానికి శాశ్వతంగా ముగింపు పలుకుతాననీ నేను వీపీ సింగ్‌కు హామీ ఇచ్చాను. అయితే దేవీ లాల్‌ని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించవద్దని నేను వీపీ సింగ్‌ను అభ్యర్థించాను. కానీ అప్పటికే దేవీలాల్‌కి ఉద్వాసన పలుకుతున్న ఆదేశాన్ని తాను రాష్ట్రపతికి పంపేసినట్లు వీపీ సింగ్ సమాధాన మిచ్చారు. దీంతో నేను సంభాషణను ముగించాల్సి వచ్చింది. మరుసటి రోజు తన కార్యాలయానికి రావలసిందిగా వీపీ సింగ్ కబురంపారు. నేను వెళ్లాను. దేవీలాల్ గురించి చర్చించుకున్నాము. నన్ను విశ్వాసంలోకి తీసుకోవాలని వీపీ సింగ్ భావించారు. అలాగైతేనే నేను దేవీలాల్‌తో జతకట్టబోనని ఆయన భావించారు. దేవీలాల్ పక్షంలో నేను చేరినట్లయితే ప్రధానమంత్రిగా తాను ఎక్కువ కాలం కొనసాగలేనని వీపీ సింగ్ భావిస్తున్నారని దీనర్థం. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న నేను మండల్ కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేస్తున్నట్లు ప్రకటించాలని వీపీ సింగ్‌ను కోరాను. ఆయన 1990 ఆగస్టు 15న దీనిపై ప్రకటన వెలువరించడానికి మొదట అంగీకరించారు. కానీ ఆగస్టు 9వ తేదీనే ఆయన దాన్ని ప్రకటించాల్సి వచ్చింది. అలా ప్రకటించకపోయి ఉంటే నేను ఢిల్లీలో జరగనున్న దేవీ లాల్ ర్యాలీలో చేరడం తప్ప మరొక అవకాశం నాకు ఉండేది కాదు. మండల్ సిఫార్సులను అమలు చేస్తే అవి సమానతా సమాజాన్ని విశ్వసించి, దానికోసం కలగన్న అంబేడ్కర్, కర్పూరీ ఠాకూర్, లోహియా, జయప్రకాష్ నారాయణ్ స్వప్నాలు సాకారమవుతాయని నేను భావించాను. 1990 ఆగస్టు 6న వీపీ సింగ్ నివాసంలో సాయంత్రం 6 గంటలకు క్యాబినెట్ సమావేశం జరిగింది. మండల్ కమిషన్ సిఫార్సుల అమలు ఈ సమావేశ ప్రధాన ఎజెండా. సన్ని హితులు హెచ్చరిస్తున్నప్పటికీ, ఆ మరుసటి రోజు అంటే 1990 ఆగస్టు 7న కేంద్ర ప్రభుత్వం 27 శాతం రిజర్వేషన్లను ఓబీసీలకు కల్పిస్తూ మండల్ కమిషన్ చేసిన రికమంండేషన్ను అమలు చేస్తామని ప్రకటించింది. చివరకు 1990 ఆగస్టు 13న ఓబీసీ రిజర్వేషన్ అమలుకు కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. ఆగస్టు 10 నుంచే ఆధిపత్య కులాలు రిజర్వేషన్కి వ్యతిరేకంగా నిర సనలు ప్రారంభించాయి. నెలరోజుల పాటు విద్యార్థులు, బ్యూరోక్రాట్లు, టీచర్లు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ వ్యతిరేక నిర సనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. రహదారులు దిగ్బంధనకు గురయ్యాయి.’’ – ‘ది శూద్రాస్– విజన్ ఫర్ ఎ న్యూ పాత్’ అనే పుస్తకం నుంచి. అయితే, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను కల్పించాలన్న మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసేలా వీపీ సింగ్ ప్రభుత్వాన్ని ప్రేరేపించడంలో; వీధుల్లో మండల్ అనుకూల, వ్యతిరేక పోరాటాలను రగుల్కొల్పడంలో నాటి యువ శరద్ యాదవ్ తగిన పాత్ర పోషించకపోయి ఉంటే, భారతీయ శూద్ర/ఓబీసీలు ఈ రోజు దేశంలో ఈ స్థాయికి చేరుకుని ఉండేవారు కాదు. ఆర్ఎస్ఎస్/బీజేపీ శక్తులను నియంత్రిస్తున్న ద్విజులు మండల్ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఆనాడు శూద్ర/ఓబీసీలు భారీ స్థాయిలో మండల్ అనుకూల సామాజిక సమీకరణకు పూనుకోకపోయి ఉంటే, నేడు ఓబీసీలు తమకు నాయకత్వం వహించి, నరేంద్రమోడీ భారత ప్రధాని కావ డానికి ద్విజులు అమోదించి ఉండేవారు కాదు. చివరగా, ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ శూద్ర/ఓబీసీ నేతలు నేటి తమ రాజకీయ ప్రతిపత్తికి గాను శరద్ యాదవ్ అనే గొప్ప పోరాటకారుడికి ఎప్పటికీ రుణపడి ఉంటారు. - ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ ప్రతిపాదన లేదు
సాక్షి, న్యూఢిల్లీ: విద్య, ఉపాధి రంగాల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని సామాజిక కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి ప్రతిమా భౌమిక్ చెప్పారు. ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు తెలిపారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో కలిపి మొత్తం 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. జనాభా ప్రాతిపదికపై ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటూ దేశవ్యాప్తంగా వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి ప్రభుత్వానికి వినతులు అందుతున్నట్లు తెలిపారు. ఏపీలో మూడు రూర్బన్ మిషన్ క్లస్టర్ల అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌లోని అరకులోయ, ఏలూరు, రంపచోడవరం క్లస్టర్లను శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద ఎంపిక చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్‌జ్యోతి తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఈ మిషన్ కింద 21 విభాగాల్లో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల గురించి వివరించారు. గ్రామాల్లో రహదారులు, డ్రెయిన్ల నిర్మాణం, అగ్రి సర్వీసెస్ ప్రాసెసింగ్, విద్య, స్వయం సహాయక బృందాల ఏర్పాటుతో ఉపాధి కల్పన, ఆరోగ్య, వివిధ గ్రామాలను రోడ్లతో అనుసంధానం చేయడం, గ్రామాలకు పైపులతో తాగునీటి వసతి కల్పించడం, గ్రామీణ గృహనిర్మాణం, ప్రజారవాణా సౌకర్యాల కల్పన, సామాజిక మౌలిక వసతుల కల్పన, పర్యాటక ప్రోత్సాహం, గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించి, వీధిదీపాల ఏర్పాటు వంటి ప్రాజెక్టులను ఈ క్లస్టర్లలో చేపట్టినట్లు వివరించారు. ఆర్బిట్రేషన్ వ్యవస్థ స్వయంప్రతిపత్తితో పనిచేయాలి ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడం) ప్రక్రియలో న్యాయవ్యవస్థ జోక్యం తగ్గించి ఆర్బిట్రేషన్ సెంటర్ వీలైనంత స్వయంప్రతిపత్తి కలిగి ఉండేలా చట్టాన్ని రూపొందించాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభలో ‘ద న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్’ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సవరణ బిల్లు ద్వారా న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఇండియా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌గా మార్చే ప్రతిపాదనను స్వాగతించారు. ఇప్పటివరకు నగరాలకు మాత్రమే పరిమితమైన ఆర్బిట్రేషన్‌ను దేశవ్యాప్తం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని అభినందించారు. సవరణ బిల్లులో పొందుపరచాలంటూ ప్రభుత్వానికి నాలుగు ముఖ్యమైన సూచనలు చేశారు. ఆర్బిట్రేటర్ నియామకంలో కోర్టు జాప్యం కారణంగా కక్షిదారులకు ఖర్చులు అధికం అవుతున్నాయని, దీనివల్ల తాత్కాలిక ఆర్బిట్రేషన్లలో ఆర్బిట్రేటర్లను నియమించే అధికారం సంపూర్ణంగా ఇండియా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ కలిగి ఉండేలా చూడాలని సూచించారు. దీనివల్ల ఆర్బిట్రేషన్ ప్రక్రియలో న్యాయవ్యవస్థ జోక్యం తగ్గి ఆర్బిట్రేషన్ వ్యవస్థ స్వయంప్రతిపత్తి పెరుగుతుందని చెప్పారు. ఆర్బిట్రేషన్ కేసుల్లో అధికశాతం రిటైర్డ్ జడ్జీలను ఆర్బిట్రేటర్లుగా నియమించడం ఆందోళనకరమైన విషయమన్నారు. న్యాయవ్యవస్థలో ఉండే దీర్ఘకాల వాయిదాల పర్వం ఈ ప్రక్రియలోను మొదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘నేటి చీఫ్ జస్టిస్ రేపటి ఆర్బిట్రేటర్’ అనే నానుడి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. న్యాయవృత్తిలో నైపుణ్యం ఉన్నవారితో ఆర్బిట్రేటర్ సమాజం బలపడేలా చూడాలని కోరారు. అర్హులైన నిపుణులు మాత్రమే ఆర్బిట్రేషన్ సెంటర్లో పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్బిట్రేషన్ సెంటర్లకు సింగపూర్, హాంగ్‌కాంగ్‌ల మాదిరి అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా నిధులు ఖర్చుచేయాలని సూచించారు. ఈ బిల్లు ద్వారా దేశంలో స్నేహపూరితమైన ఆర్బిట్రేషన్ వాతావరణం నెలకొల్పుతున్నట్లు అంతర్జాతీయ సమాజానికి స్పష్టమైన సందేశం పంపించినట్లు అవుతుందన్నారు. వైఎస్సార్సీపీ ఈ బిల్లును స్వాగతిస్తూ మద్దతు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏపీ కొత్త జిల్లాల్లో ఓఎస్సీల ప్రతిపాదన వచ్చింది ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో వన్ స్టాప్ సెంటర్లు (ఓఎస్‌పీలు) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిందని కేంద్ర మహిళ, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. పాత 13 జిల్లాల్లో 14 ఓఎస్పీ కేంద్రాలను అనుమతించామని వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. 3,753 పోస్టులు ఖాళీ కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో 3,753 బ్యాక్లాగ్ ఫ్యాకల్టీ పోస్టులు భర్తీచేయాల్సి ఉందని కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్ సర్కార్.. వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నకు జవాబిచ్చారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం నిబంధనల అమలు వివిధ దశల్లో.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లోని అనేక నిబంధనలు అమలు చేశామని, మిగిలిన నిబంధనల అమలు వివిధ దశల్లో ఉన్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. నిబంధనల అమలు పురోగతిని సమీక్షిస్తున్నామని, ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో 29 సమీక్ష సమావేశాలు జరిగాయని బీజేపీ ఎంపీ జి.వి.ఎల్.నరసింహారావు ప్రశ్నకు బదులిచ్చారు. -
ఓబీసీల వర్గీకరణకు మోక్షం ఎప్పుడు?
ఓబీసీ కులాల వర్గీకరణ ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017 అక్టోబర్ 2న జస్టిస్ రోహిణి అధ్యక్షతన ముగ్గురు సభ్యుల జాతీయ కమీషన్‌ను ఆర్టికల్ 340 ప్రకారం ఏర్పాటు చేసింది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఓబీసీ) కోటాలో విద్యా, ఉద్యో గాల్లో 27 శాతం రిజర్వేషన్లు అనుభవిస్తున్న సుమారు 2640 కులాలను వర్గీకరించి, రిజర్వేషన్లు అమలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక సమర్పించడానికి ఈ కమిషన్‌కు మొదట 12 వారాల గడువు ఇచ్చింది ప్రభుత్వం. ఆ గడువును ఇప్పటికి 13 సార్లు పొడిగించి చివరగా నివేదిక సమర్పించడానికి 2023 జనవరి 31 చివరి తేదీగా నిర్ణయించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన ఓబీసీ కులాలు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల రాజకీయంగా నష్టపోతామనే భయంతో బీజేపీ ప్రభుత్వం ఓబీసీలను వర్గీకరించే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని 11 రాష్ట్రాల్లో బీసీ రిజ ర్వేషన్లను విద్యా, ఉద్యోగాల్లో వర్గీకరణ ద్వారా అమలు చేస్తున్నారు. బీసీ/ఓబీసీ కులాల మధ్య సామాజిక, విద్య, ఆర్థికపరమైన వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే కేంద్రం 27 శాతం రిజర్వేషన్లను ఓబీసీలకు అమలు చేస్తున్నప్పటికీ, నేటికీ కేంద్రంలో 1600 కులాలకు పైగా ఎలాంటి రిజర్వేషన్ల ఫలాలను పొందలేదని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఏ ఓబీసీ కులం అయితే జనసంఖ్య అధికంగా కలిగి సామాజికంగా, విద్యా పరంగా, ఆర్థికంగా బలంగా ఉంటుందో ఆకులం వారు.. వారి జనాభాకు మించి రిజర్వేషన్లు అనుభవించడం జరుగుతోంది. గత సంవత్సరం మార్చిలో కొన్ని పత్రికలకు లీకులు వదిలారు. వీటి ప్రకారం... ఓబీసీ కులాలు నేటి వరకు కేంద్ర ప్రభుత్వంలో రిజర్వేషన్ల ఫలాలను ఏమేరకు అనుభవించాయనే లెక్కలను, వారి జన సంఖ్యను పరిగణలోకి తీసుకొని జస్టిస్ రోహిణి కమీషన్ ఓబీసీలను నాలుగు గ్రూపులుగా వర్గీకరించింది. గ్రూప్–ఏలో 1,654 కులాలకు 2 శాతం, గ్రూప్– బీలో 534 కులాలకు 6 శాతం, గ్రూప్–సీలో 328 కులాలకు 9 శాతం, గ్రూప్–డీలో 104 కులాలకు 10 శాతం రిజర్వేషన్లను కేటా యించిది. అయితే ఈ లీకుల్లో నిజమెంతో తెలియదు. 1993 నుండి ఉద్యోగాల్లో, 2008 నుండి విద్యాసంస్థల్లో వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే, ఓబీసీలో బాగా వెనుకబడిన కొన్ని కులాలకైనా న్యాయం జరిగి ఉండేది. మండల్ కమిషన్ నివేదికపై తీర్పులో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం బీసీల వర్గీకరణకు ఆమోదం తెలిపింది. బీసీ రిజర్వేషన్లను వర్గీకరించకుండా అమలు చేయడం వలన వీరిలో ఐక్యత లోపించింది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థలైన పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 1994 నుండి బీసీలకు ఉమ్మడిగా అమలుపరుస్తున్న 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారు. అయినప్పటికీ బీసీ కులాలు ఉద్యమాలు చేయడం లేదు. ఇందుకు ప్రధాన కారణం 110కి పైగా బీసీ కులాలు రాజకీయ రిజర్వేషన్లు పొందలేదు, వారికి చెందని రిజర్వేషన్ల కోసం వారు ఎందుకు కొట్లాడుతారు? ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ఓబీసీల వర్గీకరణపై నియమించిన జస్టిస్ రోహిణి కమిషన్ నివేదిక సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఓబీసీల వర్గీకరణ వల్ల అత్యంత వెనుకబాటుకు గురైన కులాలవారూ ప్రయోజనం పొందడానికి మార్గం సుగమం అవుతుంది. (క్లిక్ చేయండి: విచారణ ఖైదీల వెతలు తీరేదెన్నడు?) - కోడెపాక కుమార స్వామి సామాజిక విశ్లేషకులు -
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నిలదీయండి: హరీశ్‌రావు
మణికొండ: బసవ లింగాయత్‌లను రాష్ట్ర ప్రభుత్వం బీసీలలో కలిపినా ఓబీసీలో కలిపేందుకు కేంద్రం తాత్సారం చేస్తుందని, ఆ విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని నిలదీయాలని మంత్రి టి.హరీశ్‌రావు సూచించారు. ఆదివారం హైదరాబాద్ నగర శివారు కోకాపేటలో ఎకరం భూమిలో రూ.10 కోట్ల నిధులతో నిర్మించ తలపెట్టిన బసవభవన్‌కు మంత్రులు పి.సబితారెడ్డి, మహామూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, జహిరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌లతో కలిసి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బసవేశ్వరుడి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేశామని, ఆయన జయంతిని అధికారికంగా జరుపుతున్నామని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఆయన పేరు పెడుతున్నామని వెల్లడించారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చామన్నారు. సమాజంలో ఎలాంటి కులాలు లేవని, అందరం సమానమేనని, మహిళలకు అన్ని హక్కుల కల్పించాలని పోరాడిన వ్యక్తి బసవేశ్వరుడని స్పీకర్ పోచారం పేర్కొన్నారు. అప్పట్లోనే కులాంతర వివాహం చేయించి బసవేశ్వరుడి చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు పయనించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలోఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మహామూద్‌అలీ, పి.సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు, ఎమ్మెల్యేలు పి.నరేందర్‌రెడ్డి, హన్మంత్ షిండే, క్రాంతికుమార్, భూపాల్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ ఎం.శివకుమార్, టీడీసీ చైర్మన్ ఉమాకాంత పాటిల్, బసవ సమన్వయ కమిటీ ప్రతినిధులు, లింగాయత్ సమాజం ప్రతినిధులు పాల్గొన్నారు. చదవండి: తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం -
ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధమే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. మెరిట్‌కు రిజర్వేషన్లు అడ్డంకి కాబోదని స్పష్టం చేసింది. కాగా ఇటీవల నీట్ పరీక్షల్లో ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లను రూ.8 లక్షల క్రీమీలేయర్ ఆధారంగా అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం జనవరి 7వ తేదీన తీర్పు వెలువరించింది. అయితే ఈ అంశంపై గురువారం సుప్రీంకోర్టు సుధీర్ఘంగా ఉత్తర్వులు వెలువరించింది. కాగా 2021-22 విద్యా సంవత్సరం నుంచి పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం 2021 జులైలో నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే అయితే కొంతమంది అభ్యర్థులు ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేపట్టకుండానే, ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేసేందుకు రూ.8 లక్షల వార్షికాదాయ పరిమితిని ప్రమాణంగా విధించిందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ అకడమిక్ సెషన్ నుంచి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయరాదని, ఈ కారణంగా నీట్ పీజీ కౌన్సిలింగ్ జాప్యమవుతుండటాన్ని నిరసిస్తూ వైద్యులు ఆందోళనలు చేస్తున్నారు. చదవండి: 'వైద్య నిపుణుల సూచనలతో బడులు ప్రారంభిస్తాం' మరోవైపు ప్రస్తుత కౌన్సిలింగ్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఈ కేసు తుది తీర్పునకు లోబడి భవిష్యత్తు రిజర్వేషన్ల అర్హతలు ఆధారపడి ఉంటాయని పేర్కొంది. ఈ కేసు తుది విచారణ మార్చి చివరి వారంలో చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. చదవండి: Corona: ఒక్కరోజే 3 లక్షల కేసులు..8 నెలల తర్వాత తొలిసారి.. -
రాష్ట్రాలకు ‘ఓబీసీ జాబితా’ అధికారాలు
న్యూఢిల్లీ: ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ) జాబితాలో మార్పులు/చేర్పులకు సంబంధించిన హక్కులను మళ్లీ రాష్ట్రాలకు కట్టబెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. అందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పిందని విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి. త్వరలో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాల(ఎస్ఈబీసీ)లను గుర్తించి వారిని ఓబీసీ జాబితాలో చేర్చే హక్కులు ప్రస్తుతం రాష్ట్రాలకు లేవని గతంలో సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు చెప్పడం తెల్సిందే. అంతకుపూర్వం రాష్ట్రాలకు ఈ హక్కులు ఉండేవి. అయితే, 102వ రాజ్యాంగ సవరణ తర్వాత రాష్ట్రాలకు ఈ హక్కులు లేవని కోర్టు తేల్చింది. జాతీయ బీసీ కమిషన్ విధివిధానాలను ఖరారుచేస్తూ 2018నాటి రాజ్యాంగ సవరణ చట్టంలో 338బీ ఆర్టికల్‌ను చేర్చారు. ఇదే చట్టంలోని ఆర్టికల్ 342ఏ ప్రకారం ఎస్ఈబీసీలను నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికే ఉంది. ఎస్ఈబీసీ జాబితాలో మార్పులు చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందంటూ మే ఐదున సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కొత్తగా మరాఠాలకు కోటా ఇస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ, 1992నాటి ‘మండల్’ తీర్పును విస్తృత ధర్మాసనానికి సమీక్షకోసం పంపలేమంటూ జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల ధర్మాసనం మే ఐదున సంచలన తీర్పు వెలువరించడం తెల్సిందే. ఈ తీర్పు తర్వాత రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. సమైక్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ తమ నుంచి కేంద్రం అధికారాలను లాగేసుకుందని రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. అందుకే మళ్లీ రాష్ట్రాలకు ఓబీసీ జాబితాలో మార్పులు చేసే అధికారాలు అప్పజెప్పే బిల్లుకు కేబినెట్ ఓకే చెప్పిందని సమాచారం. మరో ఐదేళ్లు సమగ్ర శిక్షా పథకం పాఠశాల విద్యకు సంబంధించిన సమగ్ర శిక్షా పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అంగన్వాడీలకు శిక్షిణనిచ్చే మాస్టర్ ట్రెయినర్లకు శిక్షణనివ్వడం, విద్యార్థినుల హాస్టళ్లలో శానిటరీ ప్యాడ్ మెషీన్ల ఏర్పాటు, సీనియర్ సెకండరీ స్కూళ్లలో కొత్త సబ్జెక్టులను నేర్పించడం, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 12వ తరగతి వరకూ విద్యాబోధన, తదితరాలను సమగ్ర శిక్షా పథకంలో భాగంగా అమలుచేయనున్నారు. మరో రెండేళ్లు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు 389 పోక్సో కోర్టులుసహా దేశవ్యాప్తంగా 1,023 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులను మరో రెండేళ్లపాటు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెస్తామని మంత్రి అనురాగ్ ఠాకూర్ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. కోర్టుల నిర్వహణకు కేంద్రం తన వాటాగా రూ.971.70 కోట్లు ఖర్చుచేయనుంది. ‘నిర్భయ’ నిధి నుంచి కేంద్రం తన వాటా నిధులను అందజేయనుంది. -
ఓబీసీలకు 27%.. ఈడబ్ల్యూఎస్‌కు 10%
న్యూఢిల్లీ: అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్ కోర్సుల్లో అఖిల భారత కోటా(ఏఐక్యూ) పథకంలో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు(ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం(2021–22) నుంచే ఇది అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న కీలకమైన ఈ నిర్ణయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘మెడికల్, డెంటల్ కోర్సుల్లో ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల ఏటా వేలాది మంది యువత ప్రయోజనం పొందుతారు. వారికి మరిన్ని గొప్ప అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. దేశంలో సామాజిక న్యాయానికి ఇదొక నూతన ఉదాహరణ’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. చరిత్రాత్మక నిర్ణయం ఆలిండియా కోటాలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌కు రిజర్వేషన్లు ఇవ్వడం చరిత్రాత్మక నిర్ణయమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. ‘‘వెద్య విద్య రంగంలో కేంద్ర సర్కారు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అండర్ గ్రాడ్యుయేట్/పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్ కోర్సుల్లో ఓబీసీ విద్యార్థులు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 10 శాతం రిజర్వేషన్ పొందుతారు’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ రిజర్వేషన్ అంశానికి ప్రభావవంతమైన పరిష్కారం కనిపెట్టాలని ప్రధాని మోదీ సోమవారం సంబంధిత మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏటా ఎంబీబీఎస్‌లో 1,500 మంది ఓబీసీ విద్యార్థులు, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 2,500 మంది ఓబీసీ విద్యార్థులు, ఎంబీబీఎస్‌లో 550 మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 1,000 మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు లబ్ధి పొందుతారు. వెనుకబడిన తరగతులకు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు తగిన రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోంది’’ అని పేర్కొంది. ఆరేళ్లలో 179 కొత్త మెడికల్ కాలేజీలు దేశంలో గత ఆరేళ్లుగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య ఏకంగా 56 శాతం పెరగడం విశేషం. 2014లో 54,348 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, 2020 నాటికి ఆ సంఖ్య 84,649కి చేరింది. ఇక మెడికల్ పోస్టుగ్రాడ్యుయేట్(పీజీ) సీట్లు సైతం 80 శాతం పెరిగాయి. 2014లో కేవలం 30,191 పీజీ సీట్లు ఉండగా, 2020 నాటికి 54,275కు చేరుకున్నాయి. దేశంలో 2014–2020 కాలంలో179 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం దేశంలో 558 మెడికల్ కాలేజీలు(289 ప్రభుత్వ, 269 ప్రైవేట్ కాలేజీలు) ఉన్నాయి. ఆలిండియా కోటా అంటే... అఖిల భారత కోటా(ఏఐక్యూ) పథకంలో దేశవ్యాప్తంగా ఓబీసీ విద్యార్థులంతా ప్రయోజనం పొందవచ్చు. కేవలం సొంత రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లోని ఏఐక్యూ మెడికల్, డెంటల్ సీట్ల కోసం పోటీ పడవచ్చు. ఇది కేంద్ర పథకమే కాబట్టి ఓబీసీలు ఎవరన్నది కేంద్ర జాబితా ఆధారంగా ఖరారు చేస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తొలుత 1986లో ఆలిండియా కోటా పథకాన్ని ప్రవేశపెట్టారు. స్థానికతతో సంబంధం లేకుండా ప్రతిభను బట్టి ఇతర రాష్ట్రాల్లోని అత్యున్నత మెడికల్ కాలేజీల్లో సైతం చదువుకొనే అవకాశాన్ని కల్పించడమే ఈ పథకం ఉద్దేశం. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న మొత్తం అండర్ గ్రాడ్యుయేట్ సీట్లలో 15 శాతం, మొత్తం పీజీ సీట్లలో 50 శాతం సీట్లను ఆలిండియా కోటా కిందకు చేరుస్తారు. వాస్తవానికి 2007 దాకా ఈ కోటా సీట్ల భర్తీకి ఎలాంటి రిజర్వేషన్లు ఉండేవి కావు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటూ 2007లో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు సైతం 27 శాతం రిజర్వేషన్ ఇస్తూ 2007లో ‘కేంద్ర విద్యా సంస్థలు(ప్రవేశాల్లో రిజర్వేషన్) చట్టాన్ని’ అమల్లోకి తీసుకొచ్చింది. సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, లేడీ హర్డింగ్ మెడికల్ కాలేజీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ వంటి కేంద్ర విద్యా సంస్థల్లోని ఈ రిజర్వేషన్లు అమలయ్యాయి. రాష్ట్రాల పరిధిలోని మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఆలిండియా కోటా భర్తీకి రిజర్వేషన్లు అమల్లోకి రాలేదు. ఉన్నత విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్ వర్గానికి 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో కేంద్ర సర్కారు రాజ్యాంగ సవరణ చేసింది. ఈ వర్గం కోసం 2019–20, 2020–21లో మెడికల్, డెంటల్ కాలేజీల్లో సీట్ల సంఖ్యను (సూపర్ న్యూమరరీ సీట్ల ద్వారా) పెంచింది. దాంతో అన్‌రిజర్వుడ్ కేటగిరీకి అందుబాటులో ఉండే సీట్ల సంఖ్య తగ్గలేదు. అయితే, ఆలిండియా కోటా సీట్ల భర్తీ విషయంలో ఈడబ్ల్యూఎస్‌కు రిజర్వేషన్ లభించలేదు. 2021–22 నుంచి ఆలిండియా కోటా సీట్ల భర్తీలో ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్‌కు రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. -
ఆ నిర్ణయం చారిత్రాత్మకం: మంత్రి కన్నబాబు
సాక్షి, విజయవాడ: అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రూ.8 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి వర్తిస్తుందన్నారు. ఉద్యోగ నియామకాల్లో కేంద్ర నిబంధనలను మార్పులు చేశారన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై గత ప్రభుత్వం గందరగోళం సృష్టించిందన్నారు. గత ప్రభుత్వ తీర్మానాలపై కేంద్రం లేఖలు రాసినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. కాపులను చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉదాహరణ అన్నారు. ‘‘బీసీ ఎఫ్ కేటగిరీ అని, మళ్లీ ఈడబ్ల్యూఎస్‌లో 5 శాతం పేరుతో రెండు తీర్మానాలు చేశారు. చంద్రబాబు గతంలో కాపులను మోసం చేసేలా తీర్మానం చేశారు. చంద్రబాబు దృష్టిలో కాపులు బీసీలా? ఓసీలా అర్ధం కాని పరిస్థితి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో చంద్రబాబు ఓటు బ్యాంకు రాజకీయాలతో కాపులు నష్టపోయారని.. కులాల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా బాబు వ్యవహరించారని కన్నబాబు దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన జీవోతో కాపులతోపాటు అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు అమలుచేస్తామన్నారు. అన్ని వర్గాలను ఆదుకోవాలనేదే సీఎం జగన్ సంకల్పమని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. -
ఏపీ: ‘ఓబీసీ’ల ఆదాయ పరిమితి పెంపు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లకు అర్హత ఆదాయ పరిమితిని పెంచింది. ప్రస్తుతం ఏడాదికి రూ.6 లక్షలుగా ఉన్న ఆదాయ పరిమితిని రూ.8 లక్షలుగా మార్చింది. ఈమేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక నుంచి రూ.8 లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉన్న ఓబీసీలు మాత్రమే క్రీమీలేయర్ పరిధిలోకి వస్తారు. అంతకన్నా తక్కువ ఆదాయమున్న వారంతా విద్య, ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్లకు అర్హత పొందుతారు. సర్టిఫికెట్ల జారీలో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులను రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆదేశించింది. -
బెంగాల్ రాజకీయాల్లో కీలక అంశం ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెంగాల్‌ను కుల రాజకీయాలు, సమీకరణాలే శాసిస్తున్నాయి. అభివృద్ధి మంత్రం జపించాల్సిన స్థానంలో రాజకీయపార్టీలు కుల సమీకరణాలే లక్ష్యంగా ప్రజలను మచ్చికచేసుకొనే పనిలో బిజీగా ఉన్నాయి. ఇన్నేళ్లుగా కుల రాజకీయాలకు దూరంగా ఉన్న బెంగాల్లో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కులమే రాజకీయ పార్టీలకు ప్రధానాస్త్రంగా మారింది. అధికార పీఠాన్ని వదులుకోవడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వరాదనే ఉద్దేశంతో వ్యూహాలు రచిస్తున్న టీఎంసీ ఒకవైపు, ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగాల్ కోటలో కమలాన్ని వికసింపచేయాలని ఉవ్విళ్లూరుతున్న కమలదళం మరోవైపు కుల సమీకరణాలపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. మేనిఫెస్టోల్లో ఓబీసీ అంశం బెంగాల్ అసెంబ్లీలో 50కి పైగా స్థానాల్లో కీలకంగా ఉన్న ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ)ను తమకు అనుకూలంగా మార్చుకొని ఎన్నికల్లో లబ్ధిపొందాలని బీజేపీ, టీఎంసీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత బుధవారం విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోలో మహిషి–తేలి, సాహా వంటి కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు మంజూరు చేయాలనే నిర్ణయం ఆయా వర్గాలను తమ వైపు తిప్పుకొనేందుకు చేసిన ఒక కీలక పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ చదరంగంలో తృణమూల్ ఆడిన ఈ పందెంతో కమలదళం సైతం పావులు కదిపింది. మూడు, నాలుగు రోజుల క్రితం బెంగాల్లో పర్యటించిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దీదీని విమర్శించారు. కొన్నేళ్లుగా ఓబీసీ కేటగిరీలో చేర్చేందుకు టీఎంసీ అడ్డుకుంటున్న కొన్ని కులాలను బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేరుస్తామని నడ్డా హామీ ఇచ్చారు. తాజాగా విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టోలో మండల్ కమిషన్ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకొని మహిష్య, తిల్లి, ఇతర హిందూ ఓబీసీ కులాలను ఓబీపీ రిజర్వేషన్లో చేరుస్తామని ప్రకటించింది. టీఎంసీ కంచుకోటగా పరిగణించే ఉత్తర 24 పరగణాలు, నాడియా జిల్లాలతో సహా దక్షిణ బెంగాల్‌లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ జనాభా ఉన్న జంగల్‌మహల్ జిల్లాల్లో 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కమలదళం క్షేత్రస్థాయిలో తమ వ్యూహాలను అమలు చేసి విజయం సాధించింది. అయితే బీజేపీకి 2019 సార్వత్రిక ఎన్నికలు కలిసిరావడానికి ప్రధాన కారణం ఓబీసీ ఓట్ల బదిలీ. వాస్తవానికి తూర్పు– పశ్చిమ మేదినీపూర్, హుగ్లీ, హౌరా జిల్లాల్లో బీజేపీ పట్టుపెంచుకుంది. దీంతో ఈ జిల్లాల్లోని ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ బల నిరూపణకు కలసివస్తాయని బీజేపీ పెద్దలు ఉవ్విళూరుతున్నారు. అదే సమయం లో తాయిలాలను ప్రకటించి తిరిగి అధాకారంలోకి రావాలని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది. ఇతర వర్గాలపై కన్ను: చాలాకాలంగా తృణమూల్ కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న మతువా, ఆదివాసీ, రాజవంశీ, బౌరి, బాగ్డి వంటి కులాల ప్రజలకు తాయిలాలు ప్రకటించడం ద్వారా మచ్చిక చేసుకొనేందుకు మమతా బెనర్జీ ఒకవైపు ప్రయత్నిస్తుంటే, మరోవైపు బీజేపీ నాయకులు కూడా ఈ వర్గాలను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా రాజవంశీలు, మతువాలపై కమలదళం ప్రత్యేక దృష్టిపెట్టింది. మతువాలకు సంబంధించి అనేక అంశాల్లో కీలక ప్రకటనలు చేయడంతో పాటు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని అమలు చేసే ప్రక్రియపై కమలనాథులు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. మతువా సామాజిక వర్గం తీర్థస్థలంగా భావించే ప్రాంతాన్ని మోడీ సందర్శించనున్నారు. బెంగాల్లో ఈ నెల 27న జరిగే తొలిదశ ఓటింగ్ ప్రక్రియతో మొత్తం ఎనిమిది దశల పోలిం గ్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. అయితే తొలిదశ పోలింగ్‌కు ఒక్కరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న బంగ్లాదేశ్‌కు వెళుతున్నారు. ఆ మరుసటి రోజు 27వ తేదీన మతువా సామాజిక వర్గం దైవంగా కొలిచే హరిచంద్ ఠాకూర్ జన్మస్థలం, మతువాలకు తీర్థస్థలం అయిన గుడాకాం దీని సందర్శిస్తారు. ప్రధాని మోదీ ఈ పర్యటనపై కమలదళం పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని సందర్శించే తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ నిలువనున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5 కోట్లకు పైగా మతువా వర్గ ప్రజల మనసుల్లో మోదీ చోటు సంపాదించుకున్నవారు అవుతారని బీజేపీ నాయకత్వం, మతువా మహాసంఘ్ నాయకులు భావిస్తున్నారు. 50 సీట్లపై ప్రభావం 2011లో తొలిసారి అధికారంలోకి వచ్చిన ఏడాదికి బెంగాల్ బ్యాక్వర్డ్ క్లాస్ బిల్లు–2012ను తీసుకొచ్చారు. ఈ జాబితాలో ముస్లింలలోని సయ్యద్, సిద్దిఖీ వర్గాలు మినహా మిగతా అందరినీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చింది. హిందువుల్లో సూత్రధర్, స్వర్ణకర్, తేలి, కుంభకర, కుర్మి, మంజి, మోదక్, కన్సారీ, కహార్, మిడాస్, కపాలి, కర్మకర్లను కూడా ఓబీసీ కులాల్లోకి చేర్చారు. వాస్తవానికి రాష్ట్రంలోని 50 సీట్లపై మహిష, తోమర్, తేలి కులాలు తమదైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 38 లక్షల మందికి బెంగాల్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఓబీసీ ధృవీకరణ పత్రాలను జారీచేసిందని సమాచారం. ఇదేకాకుండా ఇటీవల ఒక ప్రభుత్వ పథకం కింద వేలాదిమందిని ఓబీసీలుగా గుర్తించేందుకు నమోదు ప్రక్రియను మమతా ప్రభుత్వం చేసిందని అనధికార వర్గాల సమాచారం. చదవండి: నేనో పెద్ద గాడిదనని.. అతడి అసలు రంగును గుర్తించలేకపోయా: మమత పరాజయాన్ని మమతా బెనర్జీ ముందే ఊహించారు: ప్రధాని మోదీ -
ఓబీసీ బిల్లు– సామాజిక న్యాయం
స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1951లో జరిగిన మొదటి ఎన్నికల నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల వరకు పార్లమెంట్లో బీసీల ప్రాతినిధ్యం ఎన్నడూ కూడా పది నుంచి ఇరవై శాతానికి మించలేదు. ఇది బీసీలకు కరువైన సామాజిక న్యాయానికి ప్రతీక. ఇది తీర్చేందుకు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నో ఏళ్ల నుంచి బీసీలు కోరుతున్నా, అది పట్టిం చుకున్న నాథుడే కరువయ్యారు. కానీ, బీసీల కల నెరవేరేందుకు జూన్ నెల 21న వైఎస్సార్సీపీ రాజ్య సభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ఓబీసీ ప్రైవేటు బిల్లుతో ఆస్కారం చిక్కింది. భారత ప్రజా స్వామ్యంలో దీనిని ఒక చారిత్రక మలుపుగా పరిగణించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశించిన దాని కంటే అధిక మెజారిటీతో వైఎస్సార్సీపీ అధికారం లోకి వచ్చిన నెలరోజులలోపే పార్లమెంట్లో ఓబీసీల బిల్లు ప్రవేశపెట్టడం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓబీసీల అభివృద్ధిపై ఉన్న శ్రద్ధాసక్తులను ప్రతిబింబిస్తోంది. ఈ బిల్లుకు పది రాజకీయ పార్టీలు మద్దతివ్వడం హర్షణీయం. జూలై 12న ఓబీసీ ప్రైవేటు బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో తిరస్కరించడం విచారకరం. ఈ నేప«థ్యంలో, రాష్ట్ర స్థాయిలో జూలై 23న ఏపీలో తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుకు చట్టం చేసి బిల్లును అసెంబ్లీ ముందుంచిన వైఎస్ జగన్ ప్రభుత్వం దేశ చరిత్రలోనే నవశకానికి నాంది పలికింది. దేశ జనాభాలో దాదాపుగా 52 శాతంగా ఉన్న బీసీ కులాల్లోని అత్యధికులు సామాజికంగా, ఆర్థి కంగా, విద్య, ఉపాధి రంగాలలో వెనుకబడినవారే. ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనంతో బీసీలు స్వతహాగా అగ్రకులాల వారితో పోటీపడే సత్తా లేనివారు. అందువల్ల సామాజిక న్యాయం దృష్ట్యా ఎస్సీ, ఎస్టీలకు ఉన్నట్లు జనాభా ప్రాతిపదికన వారికి చట్టసభల్లో సరైన స్థానం లభించాల్సి ఉంది. బీసీలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లభిస్తే, వారు వారి సమస్యలు, వెనుకబాటుతనంపై తగు రీతిలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, అభివృద్ధికై అడుగులు వేసే ప్రయత్నం జరిగే అవకాశం ఏర్ప డుతుంది. దాంతోపాటు సమాజంలో ఇతర కులా లవలె వారికి సరైన గుర్తింపు, గౌరవప్రదమైన స్థానం లభిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు లభించిన రిజ ర్వేషన్ల వలన ఒకప్పుడు అతి దారుణమైన పరి స్థితులు ఎదుర్కొని సమాజంలో వివక్షకు గురైన వాళ్లు నేడు సమాజంలో విద్య, ఉపాధి రంగాల్లో, చట్టసభల్లో ప్రవేశం పొంది గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు ఒక అవకాశం లభించింది. అట్టి అవ కాశాన్నే నేడు బీసీలు కూడా కోరుకుంటున్నారు. ‘మేమెంతో మాకంత’ అనే సామాజిక న్యాయం అమలు చేసేందుకు దోహదపడేదిగా ఈ బిల్లును పరిగణించవచ్చు. బీసీల్లోని కొన్ని కులాలవాళ్లు ఉదాహరణకు కాటికాపరి, బుడబుక్కల, గంగి రెద్దుల, బుడగజంగాల తదితర కులాల వారికి సమాజంలో సగటు మనిషికి దక్కా ల్సిన గౌరవం, ఆదరణ దక్కకపోవడం బాధాకరం. ప్రస్తుత అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం 123వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించిన కీర్తి మూట గట్టుకుంది. అలాగే ఓబీసీ బిల్లుకు కూడా ఎలాగోలా పార్లమెంట్లో ఆమోద ముద్ర వేయించి బీసీల అభివృద్ధికి బాటలు వేస్తారని ఆశిద్దాం. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన దానికంటే అధిక మెజారిటీలో అధికారం కైవసం చేసుకున్న బీజేపీ (ఎన్డీయే) ఈ బిల్లును ప్రతి పాదించి ఉంటే ప్రజల్లో ఓబీసీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం పొందడంలో ఏ మాత్రం సంశయం ఉండేది కాదు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పార్లమెంట్లో ఆ పార్టీ తరఫున ప్రవేశపెట్టిన మొదటి బిల్లు ఇది. ప్రస్తుతానికి ఈ ప్రైవేటు బిల్లు వీగిపోయినప్పటికీ వైఎస్సార్సీపీకి ఎన్డీయేకి మధ్యగల సుహృద్భావ సంబంధాలు, పొరుగు రాష్ట్రాలతో ఉన్న మిత్ర సంబంధాలు అన్నింటినీ సమీకరించి, బిల్లు ఆమోదం పొందేలా జగన్ ఇకపై కూడా కృషి చేయాల్సి ఉంది. ఈ బిల్లు గెలుపోట ములతో సంబంధం లేకుండా, దేశంలోని ఏ రాజ కీయ పార్టీ ఎటువైపో నిర్ధారణ జరిగే గడియలు కూడా ఆసన్నమైనట్లేనని రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్తల భావన. అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు అదేపనిగా బీసీలు, వారి అభివృద్ధిపై ఒలకబోసే ప్రేమలోని సత్యాసత్యాలు బహిర్గతం కానున్నవి. పార్లమెంటులో వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టిన ఈ బిల్లు వీగిపోయినంత మాత్రాన బీసీలలో చిగురిం చిన ఆశాజ్యోతి ఆరిపోయినట్లు భావించకుండా, భవిష్యత్తులో మరింత శక్తితో దీని ఆమోదం కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రొ. ఎస్. సుదర్శన్‌రావు వ్యాసకర్త మాజీ ప్రిన్సిపల్, ఆర్ట్స్ కళాశాల, ఓయూ yesyesrao@yahoo.com -
10 శాతం రిజర్వేషన్లపై అయోమయం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల పిల్లలకు విద్యా, ఉద్యోగావకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం గత లోక్‌సభ ఎన్నికలకు రెండు నెలల ముందు, జనవరి నెలలో రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చిన విషయం తెల్సిందే. ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను కోత పెట్టకుండా, అగ్రవర్ణాల విద్యార్థులకు విద్యా సంస్థల్లో అడ్మిషన్లు ఇవ్వాలంటే ప్రస్తుతం ఉన్న సీట్లకన్నా 25 శాతం సీట్లను పెంచాలని, ఆ మేరకు తరగతి గదులను, సిబ్బందిని పెంచాలని పలు విద్యా సంస్థలు ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపించాయి. ఆ దిశగా ఇంతవరకు ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో విద్యా సంస్థల అధ్యాపకులు, ఈ కేటగిరీ కింద అడ్మిషన్లు కోరుతున్న విద్యార్థినీ విద్యార్థులు గందరగోళంలో పడుతున్నారు. గుంజాన్ మఖిజాని అనే 18 ఏళ్ల యువతి జర్నలిజం కోర్సులో చేరేందుకు ఢిల్లీ యూనివర్శిటీలోని హెల్ప్ డెస్క్‌ను ఆశ్రయించారు. తాను ఏడాదికి ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం కలిగి ఆర్థికంగా వెనకబడిన వర్గం కింద పది శాతం రిజర్వేషన్ల పరిధిలోకి వస్తానని చెప్పారు. అయితే సబ్–డివిజనల్ మేజిస్ట్రేట్ నుంచి ఆదాయం సర్టిఫికెట్ తీసుకరావాలని యూనివర్శిటీ వారు సూచించారు. దాంతో ఆమె అయోమయంలో పడ్డారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నుంచి ఆదాయం సర్టిఫికెట్ తీసుకరావడం ఆమెకెకాదు చాలా మంది విద్యార్థులకు కష్టం. ఇదే విషయమై సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌ను ప్రశ్నించగా, ఆదాయ పత్రాలను జారీ చేయాల్సిందిగా తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లే వని అన్నారు. పది శాతం రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలో తమకు మార్గదర్శకాలేవీ లేవని రాజస్థాన్‌లో ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఆదాయ, ఆస్తుల సర్టిఫికెట్లను చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఉత్తరప్రదేశ్‌లో విద్యార్థులు వాపోతున్నారు. -
చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతులకు(ఓబీసీ) లోక్‌సభ, శాసనసభల్లో జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించడానికి రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు–2018 (కొత్త ప్రకరణలుగా 330ఎ, 332ఎ చేర్చుట)ను ఆమోదించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కోరారు. గతంలో ఆయన ప్రవేశపెట్టిన ఈ ప్రైవేట్ బిల్లుపై చర్చకు శుక్రవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ అనుమతించారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో ముందుగా విజయసాయిరెడ్డి మాట్లాడారు. ‘‘దేశ జనాభాలో సగం కంటే ఎక్కువగా ఓబీసీలు ఉన్నారు. పార్లమెంట్లో ఓబీసీల ప్రాతినిధ్యం వారి జనాభాకు అనుగుణంగా లేదు. 1984లో లోక్‌సభలో ఓబీసీల ప్రాతినిధ్యం 11 శాతం, 2009లో 18 శాతం. ప్రస్తుత 17వ లోక్‌సభలో 20 శాతం లోపే ఉంది. దాదాపు 2,400 ఓబీసీ కులాలు ఉండగా, అందులో 2,200 కులాలకు పార్లమెంట్ ఉభయ సభల్లో, శాసన సభల్లో ఇప్పటివరకు ప్రాతినిధ్యమే లభించలేదు. వారు ఇప్పటికీ చట్టసభల్లో అడుగు పెట్టలేదని చెప్పాల్సి రావడం సిగ్గుపడాల్సిన అంశం. మెజారిటీ రాష్ట్రాల్లో ఓబీసీల జనాభా 50 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం 50.4 శాతం ఓబీసీలు ఉన్నారు. ఏపీ సీఎం ఇటీవల తన మంత్రివర్గంలో దాదాపు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 60 శాతం పదవులు కేటాయించారు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు కట్టబెట్టి ఆదర్శంగా నిలిచారు. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. ఓబీసీ వర్గాలకు జనాభా దామాషా ప్రకారం లోక్‌సభలో, శాసనసభలో సీట్లను రిజర్వ్ చేయాలి. ఆర్టికల్ 330, 332లు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల గురించి చెబుతున్నాయి. వీటికి అదనంగా ఓబీసీలకు సైతం వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు వర్తింపజేయాలి. అప్పుడే వారికి సామాజిక న్యాయం దక్కుతుంది. 2,400 ఓబీసీ కులాలు ఉండగా, 1,400 కులాలు చాలా పేదరికంలో ఉన్నాయి. ఓబీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసేందుకు తగిన వనరులు లేవు. 1953లో కేల్కర్ కమిషన్, 1978లో మండల్ కమిషన్‌ను నియమించారు. కేల్కర్ కమిషన్ 40 సిఫారసులు చేయగా, కేవలం 2 సిఫారసులను మాత్రమే అమలు చేశారు. 2021లో మరోసారి జనగణన ఉంటుంది. ఓబీసీలకు సంబంధించి సమగ్ర అధ్యయనం ఉండాలి. సమగ్ర ప్రశ్నావళి ఉండాలి. తద్వారా విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఓబీసీలకు చట్టపరమైన రక్షణ కల్పించాలి. వేధింపులు, అవమానాల నుంచి రక్షించాలి. ఓబీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. వారిలో సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలి. అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు పలకాలని, ఓబీసీలకు రిజర్వేషన్లు దక్కాలని కోరుతున్నా. ఈ బిల్లు ఆమోదం పొందాలని ఆశిస్తున్నా’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బిల్లుకు రాజకీయ పార్టీల మద్దతు రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లులపై శుక్రవారం దాదాపు 2 గంటల పాటు ఈ చర్చ జరిగింది. దాదాపు 10 రాజకీయ పార్టీలు ఈ చర్చలో పాల్గొన్నాయి. ఓబీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ బిల్లు ప్రవేశపెట్టినందుకు విజయసాయిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ సభ్యుడు బి.కె.హరిప్రసాద్ అభినందించారు. ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అమలైతేనే సామాజిక న్యాయం దక్కుతుందని తేల్చిచెప్పారు. బిల్లుపై రాజ్యసభలో బీజేపీ సభ్యుడు డాక్టర్ వికాస్ మహాత్మే, ఆర్జేడీ సభ్యుడు ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా, డీఎంకే సభ్యుడు టి.కె.ఎస్.ఇలంగోవన్, బీజేపీ సభ్యుడు రామ్‌కుమార్ వర్మ, కాంగ్రెస్ సభ్యుడు ఎల్.హనుమంతయ్య, సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు విశంభర్ ప్రసాద్, ఏఐఏడీఎంకే సభ్యుడు గోకులకృష్ణన్, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు ఛాయా వర్మ తదితరులు మాట్లాడారు. వైఎస్సార్సీపీ చొరవ భేష్ ధన్యవాదాలు తెలిపిన జస్టిస్ ఈశ్వరయ్య జనాభా దామాషా ప్రకారం ఓబీసీలకు పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలంటూ రాజ్యసభలో రెండు ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అఖిల భారత్ వెనుకబడిన తరగతుల సమాఖ్య అధ్యక్షుడు జస్టిస్ వి.ఈశ్వరయ్య ధన్యవాదాలు తెలిపారు. ప్రైవేటు బిల్లులో వైఎస్సార్సీపీ చూపిన చొరవ అభినందనీయమని ఆయన కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ తరహాలో జనాభా దామాషా ప్రకారం ఓబీసీలకూ రిజర్వేషన్లు అమలుచేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
3 భాగాలుగా ఓబీసీ కోటా?
దేశంలో విద్య, ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ)కు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్ అమలులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. దేశంలో ఓబీసీ కోటా అమలు తీరుతెన్నుల అధ్యయనానికి ఏర్పాటైన జస్టిస్ రోహిణి కమిషన్ ఓబీసీ కులాల్లో ఎవరెవరికి ఈ రిజర్వేషన్ వల్ల ఏ మేరకు లబ్ధి కలుగుతోందన్న అంశాన్ని పరిశీస్తోంది. ప్రస్తుతం ఓబీసీలో 2,633 కులాలున్నాయి. ఈ కులాలన్నిటీకీ ఉమ్మడిగా 27శాతం రిజర్వేషను అమలవుతోంది. వీటిలో కొన్ని కులాల వారు రిజర్వేషన్ వల్ల ఎక్కువ లబ్ధి పొందుతోంటే, మరికొన్ని కులాల వారికి ప్రయోజనం కలగడం లేదని కమిషన్ అభిప్రాయ పడినట్టు తెలిసింది. తేడాను దృష్టిలో పెట్టుకుని ఈ 27 శాతాన్ని మూడు భాగాలు చేయాలని, లబ్ధి స్థాయిని బట్టి ఆయా కులాలకు రిజర్వేషన్ అమలు చేయాలని కమిషన్ సిఫారసు చేయనున్నట్టు తెలిసింది. 27శాతంలో రిజర్వేషన్ వల్ల గరిష్టస్థాయిలో లబ్ధి పొందుతున్న కులాలకు 7శాతం, అసలేమీ ప్రయోజనం పొందని కులాలకు 10 శాతం, కొంత లబ్ధి కులాలకు 10శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కమిషన్ ప్రతిపాదించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. జూలై 31లోపు నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు జస్టిస్ రోహిణి తెలిపారు. పది కులాలకే ఎక్కువ లబ్ధి ఓబీసీ జాబితాలో ఉన్న వేల కులాల్లో కేవలం 10 ఉప కులాల వారే 25 శాతం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందుతున్నారని, 983 ఉప కులాల వారికి ఒక్క శాతం లబ్ధి కూడా చేకూరడం లేదని కమిషన్ తన సంప్రదింపుల పత్రంలో పేర్కొంది. స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1931 చేపట్టిన జనాభా లెక్కల్లో ఓబీసీల గణన జరిగింది. ఆ తర్వాత ఇంత వరకు ఓబీసీల గణన జరగలేదు. ఓబీసీ జనాభాపై కచ్చితమైన లెక్కలు అందుబాటులో లేనందున రోహిణి 1931నాటి ఓబీసీ లెక్కలనే పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సంప్రదాయకంగా రాళ్లను పాలిష్ చేసే కలైగర్లు, కత్తులు సానపట్టే సిక్లిగర్లు,సరనియాలు వంటి వృత్తిపరమైన కులాలలో పాటు అనేక వెనకబడిన కులాలకు ఓబీసీ రిజర్వేషన్ ఫలాలు ఎంత మాత్రం అందడం లేదని కమిషన్ పేర్కొంది. ‘ఈ కులాల జనాభా తక్కువేం కాదు. అయినా వారికి ఓబీసీ ప్రయోజనాలు అందడం లేదు. రాజకీయ ప్రాతినిధ్యం కూడా లేదు’అని కమిషన్ సభ్యుడు డా.జేకే బజాజ్ అన్నారు. అలాగే, ఆంధ్ర ప్రదేశ్‌లో భిక్షాటన చేసే బుద్బుదీలు, గోసాయన కులాల వారు కూడా ఓబీసీ వల్ల లాభం పొందలేకపోతున్నారని, అయితే ఈ కులాలకు చెందిన ఒకరిద్దరు ఐఐటీ వంటి సంస్థల్లో విద్యార్థులుగా కనిపిస్తున్నారని ఆయన వివరించారు. ఓబీసీ రిజర్వేషన్ వల్ల ఏ కులాలు ఎక్కువ లబ్ధి పొందాయి, ఏవి పొందలేదు అన్నది నిర్థారించడం కోసం కమిషన్ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ సహా దేశంలోని విద్యా సంస్థలు, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో గత మూడేళ్లుగా ఈ కోటా కింద పొందిన లక్ష అడ్మిషన్లను, ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వంలో ఈ కోటా కింద పొందిన 1,30,000 ఉద్యోగాలను పరిశీలించింది. కమిషన్ ప్రతిపాదనలు అమల్లోకి రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దీనిపై కేంద్ర సామాజిక న్యాయ, సాధికార శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ స్పందిస్తూ ‘ముందు కమిషన్ నివేదిక రానివ్వండి. దాన్ని అధ్యయనం చేసి ఏం చెయ్యాలో నిర్ణయిస్తాం’ అన్నారు. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే దేశంలో రాజకీయ సమీకరణాలు కూడా మారుతాయని పరిశీలకులు అంటున్నారు. ఉత్తరాదిన రాష్ట్రీయ జనతా దళ్, సమాజ్‌వాదీ పార్టీ, దక్షిణాన డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలు ఓబీసీల ఓటు బ్యాంకులు కలిగి ఉన్నాయి. -
అగ్రవర్ణ రిజర్వేషన్ రాజ్యాంగ స్వభావానికి విరుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వత్యిరేకిస్తూ బీసీ సంఘాలు సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. కేంద్రం తీరుపై మండిపడ్డారు. అగ్రకుల పేదల పేరుతో అగ్రకుల ధనికులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, చాతుర్వర్ణ వ్యవస్థను శాశ్వతంగా ఉంచేందుకే ఆర్ఎస్ఎస్ ఆలోచనలకు అనుగుణంగా ఈ రిజర్వేషన్ తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు. రాజ్యాంగ మూల స్వభావానికి విరుద్ధంగా ఈబీసీ రిజర్వేషన్లు ఇస్తున్నారని అన్నారు. సమానత్వానికి విరుద్ధంగా అగ్రకుల రిజర్వేషన్ల బిల్లు తెచ్చారని విమర్శించారు. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ నియామకాల్లో 13 పాయింట్ల రిజర్వేషన్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓబీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలలోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కులాలవారీగా జనగణన శాస్త్రీయంగా జరగాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని పేర్కొన్నారు. అణగారిన వర్గాలను బానిసలుగా అణగదొక్కేందుకే 10 శాతం ఈబీసీ రిజర్వేషన్‌ను తీసుకొచ్చారని మండిపడ్డారు. -
ఓబీసీ ఉప వర్గీకరణకు దేశవ్యాప్త సర్వే
న్యూఢిల్లీ: ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీలు) జనాభా అంచనా వేసేందుకు దేశవ్యాప్త సర్వే చేపట్టాలని జస్టిస్(రిటైర్డు)జి.రోహిణి కమిషన్ నిర్ణయించింది. నమ్మకమైన ఏజెన్సీ ద్వారా నిర్వహించే ఈ సర్వేకు రూ.200 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘ఓబీసీల కేంద్ర జాబితాలో 2,600కు పైగా కులాలున్నాయి. వీరి జనాభా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఓబీసీ జన గణన చేపట్టలేదు. ఓబీసీ కులాల జనాభాపై కచ్చితమైన లెక్క తేలాలంటే జాతీయ స్థాయి సర్వే తప్పనిసరి. పది లక్షలకు పైగా కుటుంబాల్లో జరిపే ఈ సర్వే బాధ్యతలను ఒక ఏజెన్సీకి అప్పగించాలని యోచిస్తున్నాం. 2011 సామాజిక–ఆర్థిక జనగణనకు కేటాయించిన బడ్జెట్‌ను బట్టి ఓబీసీ సర్వేకు రూ.200 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఈ మేరకు బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావంతో ఉన్నాం’ అని కమిషన్ తెలిపింది. ఓబీసీ రిజర్వేషన్లు అన్ని కులాల వారికి సమానంగా దక్కేందుకు అవసరమైన నిబంధనలు రూపొందించే ఉద్దేశంతో కేంద్రం 2017లో జస్టిస్(రిటైర్డు)జి.రోహిణి అధ్యక్షతన ఐదుగురు సభ్యుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర బీసీ కమిషన్ల, వివిధ కుల సంఘాలు, సంబంధిత వర్గాలతో చర్చలు జరిపింది. -
‘సమగ్ర సర్వే గణాంకాలు బయటపెట్టండి’
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గ్రామ స్వరాజ్యం కోసం తీసుకువచ్చిన చట్టాన్ని అమలు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఓ కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కొన్ని సాకులు అడ్డుపెట్టుకుని పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఓబీసీలకు రిజర్వేషన్ల్ అంశంలో అన్యాయం జరిగేలా టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని భట్టి ఆరోపించారు. ఓబీసీల సరైన గణన చేయమని కోర్టు చెప్పిందని, సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ డబ్బుతో సమగ్ర కుటుంబ సర్వే చేశారని, దానికి సంబంధించిన లెక్కలను బయట పెట్టాలని అన్నారు. జనాభా ప్రకారం ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ఓబీసీలకు...ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించండి
బరంపురం : ఓబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ రిజర్వేషన్ సాధన సంఘం అధ్యక్షుడు ప్రభాత్ సాహు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గంజాం జిల్లా వెనుకబడిన తరగతుల వికాస్ మంచ్ ఆధ్వర్యంలో దక్షిణాంచల్ ఆర్డీసీ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓబీసీల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. సుప్రీంకోర్టు 1993లో ఓబీసీ వర్గానికి 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఓబీసీలకు కర్ణాటకలో 69 శాతం, బీహార్‌లో 73 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 80 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారన్నారు. 1994లో జరిగిన కేబినేట్ సమావేశంలో ఓబీసీలకు 27 శాతం ఉన్న రిజర్వేషన్లను 11 శాతానికి పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓబీసీలకు తక్షణమే 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి.. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న ఓబీసీ విద్యార్థులకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే విద్యార్థులకు ఉచితంగా విద్యాభోదన అందించాలన్నారు. పరీక్షల సమయంలో ప్రత్యేక విద్యను అందించే శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఉన్నత విద్యను అభ్యసించే ఓబీసీలకు తక్కువ వడ్డీతో బ్యాంకులు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓబీసీ విద్యార్థులందరికీ నిర్దిష్ట సమయంలో ఓటరు కార్డులు పంపిణీ చేయాలన్నారు. వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఓబీసీలకు పదోన్నతులు కల్పించాలని కోరారు. ఓబీసీ వర్గ నిరుద్యోగులకు 50 శాతం సబ్సిడీతో కూడిన రుణాలు అందజేయాలన్నారు. అనంతరం డిమాండ్ల సాధనను కోరుతూ ఆర్డీసీకి వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో ఉపాధ్యక్షుడు చిత్రంజన్ మహరణ, కార్యదర్శి చంద్రమణి స్వంయి, ఓబీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కొలువుల్లోనూ వెనుకబాటే
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో ఓబీసీలు వెనుకబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని గణాంకాలను చూస్తే ఇది స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వంలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులుండేవి 69 శాఖలు. వాటిలో దాదాపు 16 లక్షల మంది ఉద్యోగులుండగా... అందులో 27 శాతం ఉద్యోగులు ఓబీసీ వర్గాలకు చెందినవారుండాలి. కానీ ఈ సంఖ్య 17 శాతానికి మించడం లేదు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేస్తుండగా.. మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం బీసీలకు అమలు చేస్తున్నారు. 1993 నుంచి ఓబీసీ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. కానీ ఈ వర్గానికి చెందిన ఉద్యోగుల సంఖ్య ఎస్సీ ఉద్యోగుల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు నాలుగు కేటగిరీల్లో ఉన్నారు. ఉన్నతస్థాయి పోస్టులు మినహాయిస్తే మిగతా స్థాయిల్లో వీరిని.. గ్రూప్ ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించారు. గ్రూప్–ఏ కేటగిరీలో ఎస్సీలు 11.5 శాతం ఉండగా.. ఓబీసీలు 6.9 శాతం ఉన్నారు. గ్రూప్–బీలో ఎస్సీలు 14.9 శాతం ఉండగా... ఓబీసీలు 7.3 శాతం ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగులు, వారి సామాజిక వర్గాల కోణంలో అధికారికంగా తీసుకున్న సమాచారం ఆధారంగా రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు ఇ.ఆంజనేయగౌడ్ ‘సామాజిక న్యాయం, భారతదేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో ఓబీసీలు’పేరుతో పుస్తకం ప్రచురించారు. అందులో ఈ గణాంకాలను పేర్కొన్నారు. నియామకాల్లో నిబంధనలకు నీళ్లు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గందరగోళంగా ఉంది. మండల్ కమిషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాల భర్తీ తరహాల్లో ఓబీసీ ఉద్యోగాల భర్తీలో మిగులు పోస్టులను క్యారీఫార్వర్డ్ చేయాలి. అలా చేస్తే ఆ పోస్టులు తిరిగి ఆయా వర్గాలకే వస్తా యి. కానీ ఓబీసీల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోంది. యూపీఎస్సీ ద్వారా జరుగుతున్న నియామకాల్లో ఓపెన్ కేటగిరీలో ఓబీసీ అభ్యర్థి ఉద్యోగం పొందినా.. ఆ పోస్టును రిజర్వేషన్ కోటాలో చూపిస్తున్నారు. దీంతో అభ్యర్థి తీవ్రంగా నష్టపోతున్నాడు. క్రీమీలేయర్ విధానంతోనూ ఓబీసీలకు నష్టం జరుగుతోంది. దాదాపు పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. పూర్తిస్థాయి పోస్టులు భర్తీ చేయకుండా సగానికిపైగా ఖాళీగా ఉంచుతున్నారు. ఎక్కువగా ప్రైవేటు, ఔట్సోర్సింగ్ పద్ధతిని పాటిస్తున్నారు. దీంతో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోంది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల అమ లు చేస్తే ఓబీసీలకు సగం వాటా దక్కుతుంది. అలా చేయకపోవడంతో వెనుకబాటుకు గురవుతున్నారు. – ఇ.ఆంజనేయగౌడ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు -
ముఖ్యమంత్రికి మళ్లీ షాక్
జైపూర్ : వసుంధరా రాజే ప్రభుత్వానికి రాజస్థాన్ హైకోర్టులో ఊహించని ఝలక్ తగిలింది. ఓబీసీ రిజర్వేషన్ బిల్లుపై స్టే విధిస్తూ గురువారం న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నాలుగు కులాలను ముఖ్యంగా గుజ్జర్లను లక్ష్యంగా చేసుకుని అక్కడి బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను 5 శాతానికి పెంచింది. ఈ మేరకు గత నెల చివరి వారంలో అసెంబ్లీలో బిల్లును పాస్ చేసింది కూడా. బంజారా, బల్దియా, లబానా- గదియా లోహర్, గదోలియా- గుర్జర్, గుజార్, రైకా, రెబరి, దెబసి, గదారియా, గాద్రి, గాయారి కులాలకు వీటిని వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం కోటా 50 శాతానికి మించి ఉండకూడదు. కానీ, ఇక్కడ తాజా పెంపుతో అది 54 శాతానికి చేరింది. అందుకే స్టే విధిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. గతంలోనే వసుంధరా రాజే ప్రభుత్వం ఒకసారి ఇలాంటి ప్రయత్నం చేసి న్యాయస్థానం నుంచి మొట్టికాయలు వేయించుకుంది. 2015లో వెనుకబడిన కులాల ప్రత్యేక చట్టం-2015 ద్వారా వారి రిజర్వేషన్లను 21 నుంచి 26 పెంచేందుకు యత్నించింది. అయితే కోర్టు ఆ చట్టాన్ని కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ యేడాది మే19న మరోసారి ప్రత్యేక వర్గంలోకి వారిని చేరుస్తూ ఓబీసీ జాబితాను తయారు చేసింది. అయితే ఆ సమయంలో గుజ్జర్ నేతలు కొత్త చట్టంపై తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కారు. చర్చల్లో తమతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రభుత్వం నడుచుకోవట్లేదంటూ ఆందోళన బాట పట్టారు. దీంతో చర్చల ద్వారా వారిని బుజ్జగించిన సీఎం వసుంధరా రాజే బిల్లును పాస్ చేయించారు. -
ఒక్కడే వణికించాడు
-
'హింసతో పరిష్కారం ఉండదు.. శాంతి ముఖ్యం'
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ప్రతి ఒక్కరూ సంయమనంతో ఉంటూ శాంతియుతంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్లో ఓబీసీ రిజర్వేషన్లకోసం పోరుబాట పట్టిన పటేళ్లకు విజ్ఞప్తి చేశారు. హింసతో ఎవరికీ ఎలాంటి మేలు జరగదని ఆయన గుర్తు చేశారు. పటేళ్లను ఓబీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ హార్దిక్ పటేల్ అనే 21 ఏళ్ల యువకుడి నాయకత్వంలో ఉద్యమం మొదలైన విషయం తెలిసిందే. తొలుత శాంతియుతంగా మొదలైన ఈ ఉద్యమం అనంతరం కొంత హింసాత్మక రూపం దాల్చింది. పలు చోట్ల వాహనాలు తగులబెట్టారు. అక్కడక్కడ ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఈ రోజు అక్కడ బంద్‌కు పిలుపునివ్వడం, అంతకుముందు హార్దిక్ పటేల్ అరెస్టు అనంతరం విడుదల వంటి ఘటనల నేపథ్యంలో కొన్ని చోట్ల అల్లర్లు తలెత్తాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఐదువేల బలగాలను కూడా దించింది. ఈ నేపథ్యంలోనే అంతా శాంతియుతంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మరోపక్క, హార్దిక్ పటేల్ ఓ మీడియాతో ఇంటర్వ్యూ ఇస్తూ హింసకు పాల్పడటం తమ ఉద్దేశం కాదని, తమ డిమాండ్‌ను అమలుచేయాలని శాంతియుతంగానే కోరుతున్నామని చెప్పారు. ప్రభుత్వమే అనవసరంగా పోలీసులను దించి తమపై దాడులు చేయిస్తుందని ఆరోపించారు.