
సాక్షి, హైదరాబాద్: ‘బీసీలపై టీఆర్‌ఎస్ మొసలి కన్నీరు కారుస్తోంది. ప్రతి విష యంలో టీఆర్‌ఎస్ ఆర్భాటం పెరిగింది. దీనికి తగినట్టే సీఎం కేసీఆర్ చుట్టూ చేరిన బీసీ నేతలు ఆయనకు భజన చేస్తున్నారు’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఎంబీ భవన్‌లో పార్టీ నేతలు వెంకట్, జ్యోతి, చెరుపల్లి సీతారాములు, ఎమ్మెల్యే సున్నం రాజయ్యతో కలసి బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘మూడున్నరేళ్లుగా ఏం చేశారు? బడ్జెట్‌లో కేటా యించిన రూ. 5 వేల కోట్లలో ఎంత ఖర్చు చేశారు? బీసీ సబ్–ప్లాన్ చట్టం ఏమైంది?’ అని ప్రభుత్వాన్ని తమ్మినేని ప్రశ్నించారు.
సంచార జాతుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఇంత వరకు ఎంబీసీ కులాల నిర్ధారణ జరగలేదని విమర్శించారు. కౌలుదారులకూ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయవేదికను జనవరిలో ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే ఏప్రిల్‌లో జరగనున్న పార్టీ జాతీయ మహాసభల లోగోను తమ్మినేని ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment