
నెల్లూరులో మంజునాథ కమిషన్ ఎదుట నిరసన
నెల్లూరు : నెల్లూరులో సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ పర్యటనలో సోమవారం గందరగోళం చోటుచేసుకుంది.
జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బీసీలు కమిషన్ ఎదుట నిరసనకు దిగారు. కాపులను బీసీల్లో చేర్చొద్దంటూ బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కమిషన్ పర్యటన రసాభాసగా మారింది. బీసీ కులాలను విడదీయడానికే కమిషన్ వేశారంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కమిషన్ పర్యటనపై ఎలాంటి సమాచారం, స్పష్టత లేదని వారు మండిపడ్డారు.