Manjunatha commission
-
కాపు రిజర్వేషన్లకు మా మద్దతు ఉంటుంది: సీఎం జగన్
-
సీఎం జగన్‌తో పార్టీ కాపు నేతలు భేటీ
సాక్షి, అమరావతి: కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెలుగుదేశం పార్టీ తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడానికి ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యల వల్ల ఇవాళ కాపులు బీసీలా? ఓసీలా? అన్న పరిస్థితి తలెత్తిందని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీ కాపు ప్రజా ప్రతినిధులు (మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) సోమవారం ముఖ్యమంత్రిని అసెంబ్లీ ఛాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ల అంశంపై తాజా పరిణామాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. కాపు రిజర్వేషన్ల అంశంపై సీఎం జగన్ మాట్లాడుతూ.. కాపుల రిజర్వేషన్ల విషయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పులేదని, మేనిఫెస్టోలో చెప్పినదానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లపై మంజునాథ్ కమిషన్ ఇచ్చిన నివేదికను పరిశీలించాల్సిందిగా పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబుకు సూచించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... ‘ కాపులను బీసీల్లో చేరుస్తూ 2017లో చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ పంపారు. తర్వాత ఈబీసీల్లో కాపులకు 5శాతం రిజర్వేషన్లు ఇస్తూ మరొక లేఖ రాశారు. అసలు కాపులను బీసీల్లో చేరుస్తూ ఇంతుకు ముందు పంపిన బిల్లు పరిశీలనలో ఉంచదలచుకున్నారా? దానికి కట్టుబడి ఉన్నారా? లేక ఉపసంహరించాలనుకుంటున్నారా? దీనిపై వెంటనే సమాధానం ఇవ్వాలని చంద్రబాబు సర్కార్‌ను కేంద్రం కోరింది. దీనిపై ఈ ఏడాది ఏప్రిల్ 4న కేంద్రం రాసిన లేఖకు చంద్రబాబు సమాధానం పంపలేదు. పేదరికం ప్రాతిపదికగా ఓసీల్లో పేదలకు ఈ పదిశాతం రిజర్వేషన్లు ఇచ్చారు. దాంట్లో కులాన్ని ప్రాతిపదికగా తీసుకునే అవకాశమే లేదు. కులాల పరంగా విభజించే హక్కులేదని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎలా ఇచ్చారు?. చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చడంపైనా, ఈసీబీల్లో ఇచ్చిన 5శాతం కోటాలపైనా న్యాయస్థానాల్లో కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అడుగు ముందుకు వస్తే ఈ కోట కింద సీట్లు, ఉద్యోగాలు పొందినవారి పరిస్థితి ఏమవుతుంది?. ఈబీసీ కోటాలో కాపులకు తాను ఇచ్చిన 5శాతం రిజర్వేషన్లు వాస్తవమే అయితే ఈ ఏడాది వైద్య, పీజీ సీట్లలో చంద్రబాబు సర్కార్ ఎందుకు అమలు చేయలేదు?. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో కూడా ఇదే పేర్కొన్నారు కదా?. పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకమైతే ఎవరు బాధ్యత వహిస్తారు?. ఓబీసీ జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే...అందులో కాపుల జనాభా యాభైశాతం కన్నా ఎక్కువే ఉంది కదా?. అలాంటప్పుడు దాన్ని 5శాతానికే కట్టడి చేస్తే వారికి అన్యాయం జరగదా?. ఈబీసీల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. దానికి విరుద్ధంగా అడుగులు వేయగలమా?. కేంద్రం ఈబీసీలకు రిజర్వేషన్లు ప్రకటించిన వారంలోపే మార్గదర్శకాలు ఇచ్చేసింది, కానీ చంద్రబాబు మాత్రం 2019, ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగితే.. మే 6న మార్గదర్శకాల కోసం కమిటీ వేశారు. ఈబీసీలకు కేంద్రం ఇచ్చిన కోటాలో అయిదు శాతం రిజర్వేషన్లు ఇస్తాననడం ద్వారా, ఇంతకు ముందు బీసీల్లో చేర్చే అవకాశం ఉందన్న కాపులకు కల్పించిన ఆశలమీద కూడా చంద్రబాబే నీళ్లు జల్లారు. కాపుల రిజర్వేషన్ల విషయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎప్పుడూ మార్పులేదు. మొదటి నుంచి మేం చెబుతున్నట్లే బీసీల హక్కులకు భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే కాపు రిజర్వేషన్లకు మనం వ్యతిరేకం కాదు. కాపు రిజర్వేషన్లకు ఎప్పుడూ మద్దతు ఉంటుంది, మేనిఫెస్టోలో చెప్పినదానికి కట్టుబడి ఉన్నాం. ఈ బడ్జెట్లో కాపులకు రూ.2వేల కోట్లు కేటాయించాం. కానీ చంద్రబాబు అయిదేళ్ల పాలనలో ఖర్చు చేసింది కేవలం రూ.1340 కోట్లే’ అని తెలిపారు. -
ఇంతకీ కాపులు ఓసీలా? బీసీలా?
హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ కర్నూరు జిల్లా నంద్యాలలో న్యాయవాది అనిల్ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ... హోదా కోసం ఎవరూ సూసైడ్ చేసుకోవద్దని కోరారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రెస్మీట్లో మాట్లాడుతూ..అధికారం కోసమే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ధర్మపోరాటం యాత్ర చేయాలనే ఆలోచన చంద్రబాబుకు నాలుగేళ్ల తొమ్మిది నెలల తర్వాత వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ మొదటి నుంచి పోరాడుతుందన్నారు. రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, ఢిల్లీ దీక్షకు జనాలను తరలించేందుకు అధికారులకు టార్గెట్లు పెట్టారన్నారు. నాడు హోదా అని ఉద్యమిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతానని హెచ్చరించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ డబ్బుతో దుబారా దీక్ష చేయబోతున్నారని విమర్శించారు. కాపులు ఓసీలా? బీసీలా? కాపులకు ఐదు శాతం రిజర్వేషన్‌పై అసెంబ్లీలో పెట్టిన బిల్లు చూస్తే ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదని తేలిపోతుందని ఉమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. కాపులను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. 2014కు ముందు కాపులను బీసీలలో చేరుస్తానికి తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పిన చంద్రబాబు...2017 డిసెంబర్ 1న మంజునాథ కమిషన్ వేశారని ఆయన గుర్తు చేశారు. ఆరు నెలల్లో నివేదిక కావాలని చెప్పి పలుమార్లు పొడిగింపు ఇచ్చి...చివరికి బలవంతంగా చైర్మన్ సంతకం లేకుండానే ఇద్దరు సభ్యుల నుంచి నివేదిక తీసుకున్నారన్నారు. మరి కాపులు ఓసీలా? బీసీలా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు జిమ్మిక్కులు చేయడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. అసెంబ్లీలో ఆ నివేదకను పెట్టి కాపులను బీసీలలో చేరుస్తున్నామని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పిన చంద్రబాబు...కేంద్రం ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చిన పదిశాతం రిజర్వేషన్లలో కాపులకు సగం ఇస్తున్నట్లు ప్రకటించారన్నారు. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు బిల్లు పెట్టడం కాపులను మోసం చేయడమే అని అన్నారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కాపులను బీసీలలో చేర్చాలనే ప్రతిపాదన ఏదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రాలేదని కేంద్రం తేల్చి చెప్పిందని ఉమ్మారెడ్డి వెల్లడించారు. ఎన్నికల ముందు జిమ్మికులు చేయడం బాబుకు అలవాటేనని అన్నారు. అయిదు శాతం రిజర్వేషన్లు కాపులకు ఇవ్వడానికి రాష్ట్రానికి అధికారం లేదన్నారు. కాపులను అటు బీసీలకు, ఇటు ఓసీలకు దూరం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. ఆర్థిక వెనకబాటుతనం మీద మాత్రమే 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని, కాపులకు 5శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత తేగలరా అంటూ ఉమ్మారెడ్డి ఈ సందర్భంగా సవాల్ చేశారు. -
ఇంతకీ కాపులు ఓసీలా? బీసీలా?
-
బీసీ కమిషన్ చైర్మన్ రాజీనామా
సాక్షి, అమరావతి: బీసీ కమిషన్ చైర్మన్ కేఎల్ మంజునాథ్ తన పదవికి రాజీనామా చేశారు. తాను నిర్వర్తించాల్సిన పని పూర్తయినందున పదవి నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపించారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుతో పూర్తిగా విసిగిపోయి ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించే అంశంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం బీసీ కమిషన్‌కు అప్పగించింది. ఈ కమిషన్‌కు కేఎల్ మంజునాథ్‌ను చైర్మన్‌గా నియమించింది. అన్ని జిల్లాల్లోనూ బీసీ కమిషన్ పర్యటించింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తులు పరిశీలించి, నివేదికను రూపొందించింది. నివేదికను కమిషన్ చైర్మన్ అధికారికంగా పంపించకముందే ఇది ముఖ్యమంత్రి చేతుల్లోకి వెళ్లింది. కమిషన్ సభ్యుల్లో తమకు అనుకూలురైన కొందరి చేత నివేదిక కాపీని చంద్రబాబు తెప్పించుకున్నారు. బీసీ కమిషన్‌కు ఏమాత్రం విలువ ఇవ్వకుండా తన ఇష్టప్రకారమే వ్యవహరించారు. దీంతో కమిషన్ చైర్మన్ మంజునాథ్ కినుక వహించారు. అప్పటి నుంచి కార్యాలయానికి కూడా రాలేదు. ముఖ్యమంత్రి నుంచి అవమానాలు ఎదురుకావడంతోపాటు ఆయన కనుసన్నల్లో పనిచేస్తున్న కమిషన్ సభ్యులు తనను లక్ష్యపెట్టకపోవడంతో మంజునాథ్ ఆవేదనకు గురై చివరకు పదవి నుంచి తప్పుకున్నట్లు సమాచారం. విలువ లేని కమిషన్‌కు చైర్మన్‌గా కొనసాగడం వ్యర్థమని ఆయన నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. నాకు కొన్ని విలువలు ఉన్నాయి: మంజునాథ్ పని లేకుండా జీతం తీసుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకే బీసీ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశానని కేఎల్ మంజునాథ్ చెప్పారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. తనకు కొన్ని విలువలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. బీసీ కమిషన్ పని డిసెంబర్లోనే పూర్తయిందని, అప్పటివరకే జీతం తీసుకున్నానని వెల్లడించారు. రెండేళ్లపాటు విధి నిర్వహణలో ఉన్నట్లు తెలిపారు. నివేదికను ప్రభు త్వానికి ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించగా... తాను మెంబర్ సెక్రటరీ కి ఇచ్చానని, అంటే తన పని పూర్తయినట్లేనని పేర్కొన్నారు. కమిషన్ సభ్యులు కొనసాగుతారా? వారు కూడా రాజీనామా చేస్తారా? అని అడగ్గా... ఆ విషయం నాకు తెలియదన్నారు. వారు కొనసాగాలనుకుంటే కొనసాగవచ్చని చెప్పారు. -
వర్మ శిష్యుడితో అఖిల్ కొత్త సినిమా
అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తొలి సినిమాతో అభిమానులను నిరాశపరిచాడు. తరువాత హలో అంటూ పలకరించినా.. కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాడు. దీంతో మూడో సినిమా విషయంలో అఖిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అఖిల్ తదుపరి చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. అఖిల్ తన తదుపరి చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన మంజునాథ్ అనే యువ దర్శకుడి డైరెక్షన్లో చేయనున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రయల్ షూట్ కూడా చేశారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ ట్రయల్ షూట్ లో వర్మ కూడా పాల్గొన్నట్టుగా వార్తలు వినిపించాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ ఫొటోలు అఖిల్ తో వర్మ తెరకెక్కిస్తున్న షార్ట్ ఫిలింకు సబంధించినవన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
మంజునాథ కమిషన్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి : కాపులను బీసీల్లో చేర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ నివేదికపై ఏపీ బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇచ్చే నివేదికే కమిటీ నివేదిక అని, కమిషన్ నివేదిక సెప్టెంబరులోనే పూర్తయిందని...ఈ నివేదిక ఏపీలో అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యంగా ఉంటుందని అన్నారు. శనివారం మంజునాథ్ ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ...కమిషన్ నివేదికను ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. ఆ నివేదిక ఇవ్వడానికి తాను వెళ్లడం లేదని, కమిషన్ కార్యదర్శి కృష్ణమోహన్ వెళతారన్నారు. కమిషన్‌లోని మిగిలిన ముగ్గురు సభ్యులు వ్యక్తిగతంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన సంగతి తనను అడగవద్దని, ఆ విషయాన్ని వాళ్లనే అడగాలని మంజునాథ్ అన్నారు. ఇప్పటివరకూ బీసీ కమిషన్ తరపున ఏపీ ప్రభుత్వానికి తాను ఎలాంటి నివేదిక ఇవ్వలేదన్నారు. బీసీ కమిషన్ నిబంధనల ప్రకారం నివేదిక పూర్తైన తర్వాత సభ్యులందరు కలిసి నివేదికపై తీర్మానం చేసిన తర్వాతనే ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. కమిషన్ సభ్యులందరి సంతకాలు లేకుంటే చట్టపరంగా అది బీసీ కమిషన్ నివేదిక కాదన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేశానని, బీసీ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందచేస్తామన్నారు. రేపటి నుంచి ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో తమ నివేదికను ప్రధాన కార్యదర్శి లేదా బీసీ సంక్షేమ కార్యదర్శికి అందచేస్తామని తెలిపారు. కాగా కాపు రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీల జాబితాలో చేర్చి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ సర్కార్ ...నిన్న సభలో బిల్లును ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించింది. -
నేను ఇచ్చే నివేదికే ఫైనల్: మంజునాథ
-
కాపులకు న్యాయం జరుగుతుందా?
సాక్షి, విజయవాడ : పోలవరం ప్రాజెక్ట్ అంశాన్ని ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు నాయుడు... కాపు రిజర్వేషన్లను తెరపైకి తీసుకొచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. శాస్త్రీయత లేని నివేదికలను ఆధారంగా చేసుకొని తీర్మానాలు చేస్తే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం మరోసారి కాపులను మోసం చేస్తుందని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన శనివారం విజయవాడలోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘కాపులను బీసీల్లో చేర్చే చిత్తశుద్ధి బాబులో కనిపించలేదు. కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో జరగలేదు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రిజర్వేషన్లు ఇస్తామని బాబు మూడున్నరేళ్లు కాలయాపన చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమానికి దిగటంతో గత్యంతరం లేక 19 నెలల తర్వాత మంజునాథ కమిషన్ వేశారు. కమిషన్ నివేదిక రాకుండానే అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. శాస్త్రీయత లేని నివేదిక ఆధారంగా బిల్లు పాస్‌చేస్తే... కాపులకు న్యాయం జరుగుతుందా?. అశాస్త్రీయ విధానం ద్వారా రిజర్వేషన్లు ఇస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు. తన బాధ్యతను ప్రధాని మోదీ నెత్తిన పెట్టి కాపులను మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలంటే సమగ్ర అధ్యయనం చేయాలని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ...చంద్రబాబు సర్కార్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. మంజునాథ నివేదిక రాకుండానే తీర్మానం పేరుతో కాపులను మోసం చేయాలని చూస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇంత తొందరపాటు ఎందుకు?.శాస్త్రీయంగా నివేదిక వచ్చిన తర్వాత బిల్లు పాస్ చేయొచ్చు కదా?. ఏ లెక్క ప్రకారం అయిదు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. శాస్త్రీయ పద్ధతి లేకుండా మోసపూరితంగా వ్యవహరించడం దురదృష్టకరం. హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటే కోర్టులు జోక్యం చేసుకుని కొట్టివేసే ప్రమాదం ఉంది. కోట్ల విజయభాస్కరరెడ్డి హయంలోనూ అదే జరిగింది. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్నది కూడా అలాంటి దుర్మార్గపు చర్యే. ఇప్పటికైనా పునరాలోచించి మంజునాథ కమిషన్ నివేదిక బహిర్గతం చేయండి. లేకుంటే చంద్రబాబును కాపులు క్షమించరు. ప్రభుత్వానికి మంజునాథ్ కమిషన్ రిపోర్టు చేసిన దాఖలాలు లేవు. మంజునాథ కమిషన్ నివేదిక ఎందుకు వెలుగులోకి రాలేదు. మెజార్టీ సభ్యులు ఇచ్చిన ప్రతిపాదననే పరిగణనలోకి తీసుకున్నారు. మంజునాథ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదు?. అసెంబ్లీలో హడావుడిగా తీర్మానం చేసి... కాపులంతా సంతోషంగా ఉన్నారనే భ్రమను చంద్రబాబు సర్కార్ చేస్తోంది. మంజునాథ్ కమిషన్ తీర్మానాలను చర్చించకుండా బిల్లును ఆసెంబ్లీలో ఆమోదించారు. కాపులకు 5శాతం రిజర్వేషన్ బిల్లును సభలో తీర్మానం చేసి, కేంద్రం నెత్తిన పడేసే యత్నం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ మీద నీలినీడలు మిమ్మల్ని భయపెడుతున్నాయి. ఆ దృష్టిని మరల్చేందుకే మంజునాథ కమిషన్ రిపోర్టును తెరమీదకి తెచ్చారు. మరోసారి కాపులను మోసం చేసే యత్నం చంద్రబాబు చేస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేతులు దులుపుకుని ఓట్ల కోసం చంద్రబాబు చేసిన యత్నమే ఇది.’ అని మండిపడ్డారు. -
కాపులకు న్యాయం జరుగుతుందా?
-
ఊళ్లో ప్రేమకథ
ఎస్.వి.ఎమ్. దర్శకత్వంలో మంజునాథ్ హీరోగా నటించి, నిర్మించిన ‘మా ఊరి ప్రేమకథ’ చిత్రీకరణ పూర్తయింది. త్వరలో పాటల్ని, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. మంజునాథ్ మాట్లాడుతూ – ‘‘వాస్తవ సంఘటనలతో పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన ప్రేమకథా చిత్రమిది. సినిమా చూస్తుంటే... మన ఊళ్లో ప్రేమకథ చూస్తున్నట్లు ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్పీడుగా జరుగుతున్నాయి’’ అన్నారు. తనిష్కా తివారి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు జయసూర్య స్వరకర్త. -
ముగ్గురి బలవన్మరణం
హిందూపురం రూరల్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు బలవన్మరణం చెందారు. హిందూపురం రూరల్ మండలం బేవినహళ్లిలో మంజునాథ్(26) బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ బాషా తెలిపారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జీవితంపై విరక్తితో ఉరేసుకుని తనువు చాలించినట్లు వివరించారు. ఇదే మండలం చౌళూరులో ఈడిగ నాగమ్మ(35) అనే వివాహిత కూడా బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ బాషా తెలిపారు. కొంతకాలంగా మతిస్థిమితం లేని ఆమె ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందినట్లు వివరించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నటు చెప్పారు. మనస్తాపంతో వృద్ధురాలు.. బత్తలపల్లి (ధర్మవరం) : బత్తలపల్లి మండలం గంటాపురంలో చిన్న అప్పస్వామి భార్య పుల్లమ్మ(62) విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. కొంతకాలంగా చిన్న అప్పస్వామి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. పుల్లమ్మ కడుపునొప్పితో బాధపడుతోంది. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ పెళ్లిళ్లైపోయాయి. ఎవరికి వారు వేరుగా కాపురాలుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉన్న తమను ఆదరించే వారు లేరన్న మనస్తాపంతో ఆమె సోమవారం విషపు గులికలు మింగి సమీపంలోని అప్రాచెరువులో మృతి చెందింది. బుధవారం అటుగా వెళ్లిన గొర్రెల కాపర్లు గుర్తించి ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ హారున్‌బాషా తమ సిబ్బందితో అక్కడికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
చిలమత్తూరు : చిలమత్తూరు బీసీ కాలనీలో పూసల మంజునాథ్(25) ఉరేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ జమాల్ బాషా తెలిపారు. ఆయన కథనం మేరకు... కాలనీకి చెందిన రాజప్ప, రమాదేవి దంపతుల రెండో కుమారుడైన మంజునాథ్ కొడికొండ చెక్‌పోస్టులోని జంగీ డాబాలో పని చేసేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువు చాలించాడు. అయితే బెంగళూరులో ఉంటున్న అతని తమ్ముడు ఈశ్వర్ మాట్లాడాలని అన్నకు ఫోన్ చేయగా స్పందన లేదు. దీంతో కాలనీకి చెందిన మరో వ్యక్తికి ఫోన్ చేయగా.. ఆయన మంజునాథ్ కోసం వారి ఇంటి వద్దకు వెళ్లాడు. అయతే ఇంటికి తాళం వేసి ఉండగా, దుర్వాసన రావడంతో అనుమానంతో కిటీకీ తెరచి చూడగా ఉరికి వేలాడుతున్నట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. -
మంజునాథ కమిషన్ సమావేశం రసాభాస
కాకినాడ: నగరంలో బుధవారం మంజునాథ కమిషన్ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రసాభాసగా మారింది. కాపులను బీసీలను చేర్చడంపై ఆంధ్రప్రదేశ్ మంజునాథ్ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. కాగా, కమిషన్ చేపట్టిన కార్యక్రమాన్ని కొందరు బీసీ నేతలు బహిష్కరించారు. కాపులతో రిజర్వేషన్లపై జరిగిన చర్చల్లో వివక్ష చూపించినట్లు ఆరోపించారు. ఇరువర్గాలు వాదనలు వినిపించే విషయంలో కాపులతో ఒక విధంగా.. మిగిలిన వారితో మరోలా కమిషన్ వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కావు
రిజర్వేషన్లపై కాపులకు ముద్రగడ పిలుపు మంజునాథ కమిష¯ŒS పర్యటనను విజయవంతం చేయాలి కిర్లంపూడి (జగ్గంపేట) : తూర్పుగోదావరి జిల్లాలో ఈనెల 22న నిర్వహించే మంజునాథ కమిష¯ŒS పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కాపులకు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం కిర్లంపూడిలో ఆయన స్వగృహంలో జిల్లాలోని అన్ని మండలాల ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలోను, పాదయాత్రలోను కాపులకు ఇచ్చిన బీసీ రిజర్వేష¯ŒS హామీని ఇప్పుడు సాధించుకోకపోతే భవిష్యత్తులో సాధించుకోలేమన్నారు. బీసీ రిజర్వేష¯ŒS సాధించుకోవాలంటే జిల్లాలో పర్యటిస్తున్న మంజునాథ కమిష¯ŒS ఎదుటకు అధిక సంఖ్యలో కాపులు తరలివచ్చి శాంతియుతంగా గాంధేయ మార్గంలో కాపుజాతికి రిజర్వేష¯ŒSలు లేకపోవడం వల్ల జాతి ఎదుర్కొంటున్న సమస్యలను, కష్టనష్టాలను వివరంగా విన్నవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిటీషు కాలంలో ఉన్న రిజర్వేష¯ŒSలను తొలగించడం వల్ల కాపు జాతి లక్షలాది ఉద్యోగాలు, కోట్లాది రూపాయలు నష్టపోయిందన్నారు. జాతి భవిష్యత్తు రిజర్వేష¯ŒS సాధనతోనే ముడిపడి ఉందన్నారు. రిజర్వేష¯ŒSల సాధన కోసం 14 నెలలుగా పోరాటం చేస్తున్నామన్నారు. బీసీ రిజర్వేష¯ŒS కమిష¯ŒS రిపోర్టు మీద ఆధారపడి ఉంటుందని జాతి యావత్తు అశ్రద్ధ చేయకుండా ఈ నెల 22న కాకినాడకు భారీ సంఖ్యలో తరలివచ్చి కమిష¯ŒS ముందు జాతి పడుతున్న సమస్యలను చెప్పుకోవాలి్సన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, సంగిశెట్టి అశోక్, కల్వకొలను తాతాజీ, తుమ్మలపల్లి రమేష్, తోట రాజీవ్, బస్వా ప్రభాకర్‌రావు, మలకల చంటిబాబు, ఆకుల భాగ్యసూర్యలక్ష్మి, బుర్రే వరలక్ష్మి, పెదిరెడ్డి రామలక్ష్మి, పేపకాయల రామకృష్ణ, తొగరుమూర్తి పాల్గొన్నారు. -
మంజునాథ కమిషన్ ఎదుట కులసంఘాల ఆందోళన
► అభిప్రాయాలు చెప్పేందుకు రావాలని పిలిచి లోనికి అనుమతించని పోలీసులు ► ఆగ్రహం వ్యక్తం చేసిన పలు సంఘాలు మొగల్రాజపురం (విజయవాడ తూర్పు) : మంజునాథ కమిషన్‌కు అభిప్రాయాలు చెప్పేందుకు రావాల్సిందిగా సమాచారం ఇచ్చి ఇప్పుడు లోపలకు రానీయకుండా ఆంక్షలు పెట్టడం సరికాదంటూ వివిధ కుల సంఘాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మంజునాథ కమిషన్ సోమవారం పీబీ సిద్ధార్థ ఆడిటోరియం ఆవరణలో కుల సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఆడిటోరియం లోపలకు పరిమిత సంఖ్యలోనే నాయకులను అనుమంతించడంపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ çసంఘాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కమిషన్‌కు వివరించి న్యాయం చేయమని అడుగుదామంటే లోపలకు వెళ్లనీయకపోవడం సరికాదంటూ నినాదాలు చేశారు. బీసీ డీ నుంచి ఎ లోకి మార్చాలి: బీసీడీ గ్రూపు నుంచి ఏ గ్రూపులోకి మార్చాలంటూ విజయవాడ నాగవంశం సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు ఎరుబోతు రమణరావు డిమాండ్ చేశారు. 44 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, వెనుకబడిన తరగతుల కమిషన్లను, వెనుకబడిన శాసనసభా కమిటీ వారికి అనేకసార్లు ఈ అంశంపై వివరించామని తెలిపారు. ఇప్పటికైనా తమను బీసీ ఎ గ్రూపులోకి మార్చాల్సిందిగా కోరారు. కమిషన్ ఎదుట హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయడానికి అధిక సంఖ్యలో నాగవంశీయులు కళాశాల దగ్గరకు వచ్చారు. ఆడిటోరియంలోపల కేవలం 300 మంది వరకే పరిమితం అని, అందువల్ల అందరినీ లోపలకు పంపడం సాధ్యం కాదని పోలీసులు స్పష్టం చేశారు. కేవలం పది మందికి మాత్రమే లోపలకు వెళ్ళాలని పోలీసులు ఆంక్షలు విధించడంతో నాగవంశీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గో బ్యాక్ మంజునాథ కమిషన్: రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు కొత్త కులాలను బీసీ జాబితాలో చేర్చడం అంటే ప్రస్తుతం ఉన్న బీసీ కులాలకు రిజర్వేషన్లను దూరం చేయడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వి.మహేష్ అన్నారు. మంజునాథ కమిషన్ ఎదుట తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో 55 శాతం ఉన్న బీసీ జనాభాకు కేవలం 25 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయని, ఎన్నో సంవత్సరాల నుంచి 50 శాతంకు పెంచాలని పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం ఉన్న రిజర్వేషన్లకే ఎసరు పెడుతుందని మండిపడ్డారు. చంద్రబాబు ఉచ్చులో కాపులు పడొద్దు: కాపులను బీసీ జాబితాలో చేరుస్తామంటూ చంద్రబాబునాయుడు కాపులను మోసం చేస్తున్నాడని ఆ ఉచ్చులో కాపు సోదరులు పడవద్దని బీసీ జనసభ అధ్యక్షుడు గంగాధర్ అన్నారు. మంజునాథ కమిషన్ ఎదుట హాజరై అభిప్రాయాన్ని తెలియజేయడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాపులను బీసీ జాబితాలో చేరుస్తామంటున్నాడని ఈ విషయాన్ని కాపులను గమనించాలని చెప్పారు. బుడబుక్కల సంఘం సంక్షేమ సోసైటీ వ్యవస్థాపకుడు దాసరి సత్యం మాట్లాడుతూ తమ కులాన్ని బీసీ జాబితా నుంచి తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర గంగిరెద్దుల కులస్తుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వై.చిన్న అమ్మోరయ్య మాట్లాడుతూ తమ కులాన్ని బీసీ ఏ నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. భారీగా పోలీసుల మొహరింపు..ట్రాఫిక్ కష్టాలు: మంజునాథ కమిషన్ అభిప్రాయ సేకరణ సందర్భంగా మొగల్రాజ్పురం పరిసర ప్రాంతాల్లోని రహదారులపై భారీగా పోలీసుల మోహరించారు. బోయపాటి శివరామకృష్ణయ్య కార్పొరేషన్ స్కూల్ దగ్గర నుంచి ట్రాఫిక్‌ను వి.పి.సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ రోడ్డులోకి మళ్లించారు. ఆ రోడ్డు వెడల్పు తక్కువుగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. సిద్ధార్ధ, మధర్‌ధెరిస్సా జంక్షన్లను కూడా పోలీసులు ఆధీనంలో ఉండటంతో ఎటువైపు వెళ్లాల్లో ద్విచక్రవాహనచోదకులకు తెలియలేదు. సిద్ధార్ధ జంక్షన్‌కు చేరుకున్న వారిని తిరిగి వెనక్కు వెళ్లాలని పోలీసులు చెప్పడంతో కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. -
నెల్లూరులో మంజునాథ కమిషన్ ఎదుట నిరసన
నెల్లూరు : నెల్లూరులో సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ పర్యటనలో సోమవారం గందరగోళం చోటుచేసుకుంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బీసీలు కమిషన్ ఎదుట నిరసనకు దిగారు. కాపులను బీసీల్లో చేర్చొద్దంటూ బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కమిషన్ పర్యటన రసాభాసగా మారింది. బీసీ కులాలను విడదీయడానికే కమిషన్ వేశారంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కమిషన్ పర్యటనపై ఎలాంటి సమాచారం, స్పష్టత లేదని వారు మండిపడ్డారు. -
మంజునాథా.. విను మా గాథ
బీసీ రిజర్వేషన్ల కమిషన్ ఎదుట వాదనలు వినిపించిన బీసీలు, కాపులు అడుగడుగునా ఆందోళనలు.. ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ ఏలూరు (మెట్రో) : తమను బీసీ జాబితాలో చేర్చి, తమ కులస్తులకు రిజర్వేషన్లు పునరుద్ధరించాలని కాపులు, వారిని బీసీ జాబితాలో చేర్చడానికి వీల్లేదని బీసీలు రాష్ట్ర బీసీ కమిషన్ ఎదుట వాదనలు వినిపించారు. ఎవరికి వారు సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో వెనుకబడి ఉన్నామంటూ కమిషన్‌కు గోడు వెళ్లబోసుకున్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర బీసీ కమిషన్ బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. వెనుకబడిన తరగతుల జాబితాలో మార్పులు, చేర్పులపై వివిధ కులాల వారినుంచి వినతులు స్వీకరించింది. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, కమిషన్ చైర్మన్, సభ్యులు బీసీ నాయకుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ప్రస్తుతం బీసీ జాబితాలో ఉన్నవారి నుంచి గ్రూపుల మార్పునకు సంబంధించి అభిప్రాయాలు సేకరించారు. ముందుగా యాదవ, సగర, కృష్ణబలిజ, కొప్పుల వెలమ, పోలినాటి వెలమ, వడ్డీ, గవర, చాటాడ, శ్రీవైష్ణవ కులస్తులు తమను గ్రూపు బీసీ ఏ గ్రూపులోకి మార్చాలని కోరారు. గ్రూపు బీలో ఉన్న కరికాల భక్తులు, కైకోలన్లు తమను గ్రూపు ఏలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు ఎస్.యానాదయ్య మాట్లాడుతూ తాము సామాజికంగా వెనుకబడి ఉన్నామన్నారు. జిల్లా సగర సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాడిశెట్టి గోపీరావు తమ కులం పేరును ఉప్పర నుంచి సగరగా మార్పు చేయాలని కోరారు. యాదవ సంక్షేమ సంఘ నాయకుడు కె.సూర్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ తమ గ్రూపు మార్పు చేసి ఆర్థికంగా చేయూత అందించాలని కోరారు. వీటిపై అభ్యంతరాలు తెలుసుకున్న చైర్మన్ అనంతరం కాపులు బీసీ జాబితాలో ఎందుకు చేర్చాలని కోరుతున్నారనే అంశంపై ఆ సామాజిక వర్గం నాయకుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కాపు నాయకులు ఏమన్నారంటే.. కాపు నాయకులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ మాట్లాడుతూ కాపులుగా పేరు గొప్పగా ఉన్నప్పటికీ విద్యాపరంగాను, ఆర్థికంగాను కాపులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులకు బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరించాలని కోరారు. జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు చినమిల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక పరంగా కాపులు వెనుకబాటులో ఉన్నారన్నారని కమిషన్‌కు తెలిపారు. సరైన వృత్తులు లేకపోవడం వల్ల కాపు మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బోడ నవీన్ మాట్లాడుతూ కాపులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. ఏలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కురెళ్ల రాంప్రసాద్ మాట్లాడుతూ కాపుల్లో అత్యధికులు వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారని, ఆ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దృష్టా్య కాపులు పేదరికంలో మగ్గుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్ర హస్తకళల చైర్మన్ పాలి ప్రసాద్ మాట్లాడుతూ కాపులు వెనుకబాటునుంచి బయటపడాలంటే బీసీ జాబితాలో చేర్చాలని కోరారు. కాపుల తరఫున ఆరేటి ప్రకాష్, న్యాయవాది నరహరశెట్టి శ్రీహరి తదితరులు వాదనలు వినిపించారు. బీసీ నాయకులు ఏమన్నారంటే.. కాపులు అన్నిఽవిధాలుగా అభివృద్ది చెందారని, సామాజికంగా వారు ఎటువంటి అసమానతలను ఎదుర్కొనలేదని, సామాజికంగా వెనకబడని వారిని బీసీలలో చేర్చడం సరికాదని బీసీల తరఫున న్యాయవాది రంగారావు వాదన వినిపించారు. కృష్ణదేవరాయుల వారసులుగా ఏ రంగంలో చూసినా కాపులదే ఆధిపత్యం ఉందన్నారు. బీసీ నాయకుడు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ కాపులను బీసీ జాబితాలో చేరిస్తే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కడియాల సూర్యనారాయణ మాట్లాడుతూ కాపులను బీసీ జాబితాలో చేరిస్తే తమ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. దళిత మహాసభ నాయకుడు చింతపల్లి గురుప్రసాద్ మాట్లాడుతూ అందరూ బీసీల జాబితాలో చేరతామంటే తమకు ఓసీ జాబితా కేటాయించి భూములను జాతీయం చేసి పేదలకు పంపిణీ చేయాలన్నారు. రాష్ట్ర గంగిరెద్దుల కులస్తుల సమాఖ్య అధ్యక్షుడు యడ్లపల్లి చినమోరయ్య మాట్లాడుతూ తమను అభివృద్ధి చేయాలని, తమ బతుకులకు వెలుగునివ్వాలని కోరారు. బీసీ సబ్‌ప్లాన్ సాధన పోరాట వేదిక జిల్లా కమిటీ కన్వీనర్ పిచ్చుక ఆదిశేషు మాట్లాడుతూ అన్నిరంగాల్లో అగ్రభాగాన ఉన్న కాపులను బీసీ జాబితాలో చేర్చవద్దన్నారు. బీసీ జాబితాలో వివిధ కులాలకు చెందిన నాయకులు, కాపు నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం వీరినుంచి వినతులు స్వీకరించిన బీసీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ముగించింది. -
‘మంజునాథ’ పర్యటనలో గందరగోళం
ఏలూరు: కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో బుధవారం పర్యటించింది. వెనుకబడిన కులాల వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకునే క్రమంలో ప్రారంభంలోనే గందరగోళం నెలకొంది. బీసీ కులాలను విడదీయడానికే కమిషన్ వేశారంటూ బీసీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. అందరి వాదనలు వినడానికే వచ్చామన్న బీసీ కమిషన్ తెలిపింది. కుల సంఘ పెద్దల జోక్యంతో ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. -
కాపు రిజర్వేషన్: మంజునాథ కమిషన్ పర్యటన
ఏలూరు: కాపు కులస్తులకు బీసీ రిజర్వేషన్ కల్పించే అంశంపై ఏర్పాటయిన మంజునాథ కమిషన్ క్షేత్రస్థాయి పర్యటన చేయనుంది. పశ్చిమగోదావరి జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం కమిషన్ మంగళవారం రాత్రి ఏలూరుకు చేరుకుంది. కమిషన్ చైర్మన్ జస్టిస్ కేఎల్ మంజునాథ, సభ్యులు ప్రొఫెసర్ వి.సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ ఎం.పూర్ణచంద్రరావు, ఎస్.సత్యనారాయణ, మెంబర్ సెక్రటరీ ఎ.కృష్ణమోహన్‌లకు జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్, ఎస్పీ భాస్కర్ భూషణ్‌లు స్వాగతం పలికారు. అనంతరం కమిషన్‌తో సమావేశమయ్యారు. డిసెంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు జిల్లాలో కమిషన్ పర్యటిస్తుంది. బుధవారం ఉదయం ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో కుల సంఘాలు, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తుంది. -
ఇరువర్గాలూ సామరస్యంతో మెలగాలి
మంజునాథ కమిషన్‌కు సమస్యను సూటిగా చెప్పండి వివాదాలు సృష్టిస్తే కఠిన చర్యలు నిఘా కెమెరాలను విస్మరించొద్దు దళితులపై దాడులు చేస్తే రౌడీ షీట్లు తెరుస్తాం జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ అమలాపురం టౌన్ : ఈ నెల 28, 29 తేదీల్లో కాకినాడలోని అంబేడ్కర్ భవ¯ŒSలో మంజునాథ కమిషన్ బహిరంగ విచారణ నిర్వహిస్నున్న క్రమంలో ఆ కమిషన్ ఎదుట పలు సామాజిక వర్గాల తమ అభిప్రాయాలు వినిపించి పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ సూచించారు. రెండు రోజుల పాటు సాగే ఈ విచారణకు జిల్లా వ్యాప్తంగా వివిధ సామాజిక వర్గాలు రెండు వర్గాలుగా రానున్న దృష్ట్యా శాంతి భద్రతలకు విఘాతం కల్గకుండా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు అమలాపురం పట్టణ పోలీసు స్టేష¯ŒSలో డీఎస్పీ లంక అంకయ్య, సీఐలతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన సమీక్షిండత విలేకర్లతో మాట్లాడారు. ఇరు వర్గాలు బల ప్రదర్శనలకు తావివ్వకుండా సమస్యను విద్యావేత్తల ద్వారా సవివరంగా చెప్పాలని ఆయన సూచించారు. సభాస్థలి దాదాపు 1,500 మందికి సరిపడుతుందని, అందులో ఇరు పక్షాలకు చెందిన చెరో 750 మందిని అనుమతిస్తామని ఎస్పీ చెప్పారు. మిగిలిన వారిని బయటే ఆపి ఇరు పక్షాలకు చెందిన వారికి సెక్టర్ల వారీగా ప్రత్యేక ఎ¯ŒSక్లోజర్లు పెట్టి అందులో ఉంచుతామన్నారు. విచారణ జరిగే ప్రాంతానికి రద్దీ సమస్య లేకుండా ట్రాఫిక్‌ను మళ్లిస్తామని తెలిపారు. విచారణకు వచ్చేవారు రెచ్చగొట్టే ప్రసంగాలు, వివాదాలు సృష్టించేలా ప్రవర్తిస్తే ద్రోన్లు, బాడీ వార్న్ కెమెరాలు చిత్రీకరిస్తున్నాయన్న విషయాన్ని విస్మరిం చొద్దన్నారు. కెమేరాలు గుర్తించిన అటువంటి వ్యక్తులపై కేసులు నమోదుచేస్తామని ఆయన హెచ్చరించారు. కుల వివాదాలకు తావివ్వద్దన్నారు. దళితులపై దాడులు చేస్తే రౌడీ షీట్లే దళితులపై ఎవరైనా దాడులు చేస్తే వారిపై రౌడీ షీట్లు తెరుస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. కోనసీమలో దళితులపై దాడుల ఘటనలు ఎక్కువగా ఉన్నాయని, ఇటీవల సూదాపాలెం, మోరి గ్రామాల్లో ఘటనల నేపధ్యంలో దళితులపై భౌతిక దాడులకు దిగే వారిని క్షమించే ప్రసక్తిలేదన్నారు. ఎవరైనా రౌడీయిజం, గుండాయిజంలో ప్రైవేటు సెటిల్మెంట్లు, స్థలాలు, భూముల కబ్జాలు చేస్తే సహించేది లేదన్నారు. ఆ పరిస్థితులు ఎదురైతే నేరుగా నా ఫో¯ŒSకు లేదా డీఎస్పీలకు ఫోన్లు చేసి పోలీసు శాఖను ఆశ్రయిస్తే బాధితులకు అండగా నిలిచి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. -
మంజునాథ కమిషన్ తూర్పు పర్యటన ఖరారు
హైదరాబాద్ : కాపులను బీసీల్లో చేర్చే అంశంపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన జస్టిస్ మంజునాథ కమిషన్ ఈ నెల 28, 29 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనుంది. ఈ కమిషన్‌ను కలిసేందుకు కేవలం 1500 మందిని మాత్రమే అనుమతిస్తామని ఎస్పీ రవిప్రకాశ్ చెప్పారు. కమిషన్ ముందు సామరస్య పూర్వకంగా తమ సమస్యలు చెప్పాలని ఎస్పీ సూచించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన మంజునాథ కమిషన్‌ను బీసీ సంఘాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. -
కాపులను బీసీల్లో చేర్చకపోతే ఉరేసుకుంటా
కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ నూజివీడు: ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్‌లో కాపులను బీసీల్లో చేర్చకపోతే తాను నూజివీడులో అందరిముందు ఉరేసుకుంటానని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామనుజయ చెప్పారు. నూజివీడులో ఆదివారం జరిగిన కాపు సంఘం కార్తీక వనసమారాధనలో ఆయన మాట్లాడారు. ఆయన చంద్రబాబును పొగుడుతుండటంతో విస్తుపోయిన కాపు సంఘస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలు కాపులకు చంద్రబాబు ఏం చేశాడంటూ నిలదీశారు. కాపులను బీసీల్లో చేరుస్తానని చెప్పి రెండున్నరేళ్లయినా చేర్చకుండా కమిషన్ పేరుతో కాలయాపన చేస్తున్న సంగతి తెలియదా అని ప్రశ్నించారు. కాపులను చంద్రబాబు ఎన్నికలపుడు ఓటుబ్యాంకుగా వాడుకున్నారు తప్పితే కాపులకు చేసిందేమీ లేదని స్పష్టంచేశారు. కాపు కార్పొరేషన్ రుణాలు కూడా ఎవరికీ రావడం లేదని, టీడీపీ నాయకులు సిఫార్సు చేసిన వారిలో కూడా కొందరికి మాత్రమే మంజూరవుతున్నాయని ధ్వజమెత్తారు. దీంతో కంగుతిన్న రామానుజయ వారికి సర్దిచెబుతూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా వారు శాంతించకపోవడంతో రామానుజయ మైక్ తీసుకుని.. మంజునాథ కమిషన్ నివేదిక ఇచ్చిన తరువాత కాపులను బీసీల్లో చేర్చడం ఖాయమని చెప్పారు. చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చకపోతే తాను నూజివీడులో అందరిముందు ఉరేసుకుంటానని ప్రకటించారు. మంజునాథ కమిషన్ ఇప్పటికే పది జిల్లాల్లో అభిప్రాయాలు సేకరించిందని, నివేదిక ఇచ్చిన తరువాత క్యాబినేట్లో ఆమోదించి కేంద్రప్రభుత్వానికి పంపుతారని ఆయన చెప్పారు. -
బీసీల హక్కులను దెబ్బతీస్తున్న మంజునాథ కమిషన్
కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంజునాథ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ బీసీల హక్కులను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని బీసీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం స్థానిక మద్దూర్‌నగర్‌లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే లక్ష్మినరసింహ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీ శేషఫణి, కులాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ పట్నం రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో మంజునాథ కమిషన్ పర్యటించిన తీరు బీసీల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. కడప, అనంతపురం, తిరుపతి ప్రాంతాల్లో జరిగిన బహిరంగ విచారణలో తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరిని బీసీ–ఏ జాబితాలో ఉన్న ఓ సామాజికవర్గానికి, తాము ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో బీసీ రిజర్వేషన్ కోల్పోయామని చెప్పిన బీసీ విద్యార్థులకు ఈ అంశాలు తమ పరిధిలో లేవని కేవలం కాపులను బీసీ జాబితాలో చేర్చాలా వద్దా అనే అంశంపైనే మాట్లాడాలని చెప్పిన మంజునాథ కమిషన్ కర్నూలు బహిరంగ సభలో మాత్రం అన్ని సమస్యలను రెఫర్ చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామాల పర్యటన గురించి కేవలం కాపు, ఒంటరి, బలిజ, తెలగ కులాలకు మాత్రమే సమాచారం అందించి విచారణ సజావుగా సాగుతుందని చెప్పడం తగదన్నారు. కొందరు బీసీ నాయకులు కూడా బీసీలకు నష్టం లేకుండా కాపు, బలిజలను బీసీలుగా గుర్తిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రెండు నాల్కల ధోరణిని ప్రదర్శించడం బాధాకరమన్నారు. జిల్లాలో తప్పుడు బీసీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్న వారి వివరాలను కూడా త్వరలో బహిర్గతం చేస్తామన్నారు. సమావేశంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి యాదవ్, విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు వీ భరత్‌కుమార్ పాల్గొన్నారు. -
మల్లన్న సేవలో మంజునాథ్ కమిటీ
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను మంజునాథ కమిటీ మంగళవారం దర్శించుకున్నారు. వీరిలో చైర్మన్ మంజునాథ్, సభ్యులు కృష్ణమోహన్, పూర్ణచంద్రరావు, సత్యనారాయణ, సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు. ప్రధానాలయ గోపురం వద్ద జేఈఓ హరినాథ్‌రెడ్డి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. స్వామివార్లకు రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేకపూజలను నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు పలుకగా, జేఈఓ స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలను అందజేశారు. వారి వెంట ఆర్డీఓ రఘుబాబు, ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ, తహశీల్దార్ విజయుడు, సీఐ విజయకృష్ణ, వన్‌టౌన్,టూటౌన్ ఎస్ఐలు వరప్రసాద్, ఓబులేష్, వీఆర్వో నాగచంద్రుడు తదితరులు ఉన్నారు. -
ఎవరి వాదన వారిది!
- రాష్ట్ర బీసీ కమిషన్‌కు పోటాపోటీగా కుల సంఘాల అభిప్రాయాలు - పాములపాడులో స్వల్ప వాగ్వాదం - కరివేనలో ప్రశాంతంగా ముగిసిన విచారణ పాములపాడు: కాపు, బలిజలను బీసీల్లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాష్ట్ర బీసీ కమిషన్ ఎదుట కుల సంఘాలు పోటాపోటీగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. మంగళవారం పాములపాడు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను జస్టీస్ మంజునాథ్, సభ్యులు ఎదుట వ్యక్తపరిచారు. అంతకు ముందు జస్టీస్ మంజునాథ్ మాట్లాడుతూ మండలంలోని కులాలు, జనాభా, వారి ఆర్ధిక, సామాజిక స్థితిగతుల గురించి వివరించాలని కోరగా.. తహసీల్దార్ నాగేంద్రరావును వినిపించారు. అనంతరం బీసీ, ఎస్సీ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే బీసీ జాబితాలో 140 కులాలున్నాయని, మరో 14 కులాలను చేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన విచారణను తప్పుబట్టారు. అలాగే బలిజ కులస్థులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్ర విభజన నేపథ్యంలో శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన సిఫారసులను ఏ మాత్రం పట్టించకోకుండా ఏకపక్ష నిర్ణయంతో రాష్ట్ర విభజన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా బలిజలు ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్నారని బీసీ సంఘం నాయకుడు సంజీవరాయుడు అనడంతో కొంత వాగ్వావాదం చోటు చేసుకుంది. జస్టీస్ మంఽజునాథ్ కల్పించుకొని ఒకరి గురించి ఇంకొకరు విమర్శించడం తగదని, ఎవరి వాదనలు వారు వినిపించుకోవాలని చెప్పడంతో వాగ్వాదం సద్దుమణిగింది. కుల సంఘాల నాయకులు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించి కార్యక్రమాన్ని ముగించారు. మంజునాథ్ కమిటీ సభ్యులు ఆచార్య వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, ఆచార్య మల్లెలపూర్ణచంద్రరావు, శ్రీమంతుల సూర్యనారాయణ, సభ్య కార్యదర్శి కృష్ణమోహన్, బీసీ వెల్ఫేర్ ఈడీ ఉశేన్సాహెబ్, ఆర్డీ రఘుబాబు, తహసీల్దార్ నాగేంద్రరావు, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖరనాయక్, సిబ్బంది, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
బీసీ కమిషన్ గో బ్యాక్
-
మంజునాథ్ గోబ్యాక్
–కాపులను బీసీలో చేర్చొద్దంటూ ప్రజా సంఘాల ఆందోళన - బీసీ కమిషన్ బహిరంగ విచారణ రసాభాసా – సంఘాలు సహకరించకపోవడంతో విచారణ వాయిదా కర్నూలు(హాస్పిటల్): కాపు, బలిజలను బీసీ కేటగిరిలో చేర్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్చే నిర్వహించిన బహిరంగ విచారణ రసాభాసాగా మారింది. సోమవారం బీసీ కమీషన్ చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బహిరంగ విచారణ నిర్వహించారు. విచారణ సమయంలో కార్యక్రమం ప్రారంభం కాకుండా సంఘాల నాయకులు అడ్డుతగిలారు. బీసీ కమిషన్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అరుపులు, కేకల మధ్య విచారణ కొనసాగించలేనని కమిషన్ చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ్ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అన్యాయం చేసే బహిరంగ విచారణ తమకు వద్దంటూ బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముందుగా యాదవ కులంలో గ్రూపులను మార్చాలంటూ వచ్చిన అభ్యంతరాలపై విచారణ ప్రారంభిస్తానని కమిషన్ చైర్మన్ చెప్పగానే చిన్నహాలులో 150 బీసీ కులాలకు సంబంధించి విచారణ చేపట్టి ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. హాలు బయట ఇంకా 2వేల మంది దాకా ఉన్నారని, వారందరి సమక్షంలో విచారణ జరిపితే న్యాయం జరుగుతుందన్నారు. ఇందుకోసం హాలు బయట కూడా మైకులు ఏర్పాటు చేశామని కమిషన్ చెప్పినా సంఘాల నాయకులు శాంతించలేదు. కమిషన్ ఎప్పటికీ బీసీలకు వ్యతిరేకం కాదని చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ్ చెప్పారు. ప్రశాంత వాతావరణం లేకపోతే బహిరంగ విచారణ చేయడం కుదరదని, సంఘాల నాయకులు సహకరించాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతిలో బీసీల రిజర్వేషన్‌పై విచారణ చేస్తామన్నారు. ఇదే సందర్భంగా సంచార జాతులకు చెందిన సుంకులమ్మ కులం వారు వచ్చి డోలు వాయిస్తూ, కొరడాలతో నాట్యం చేస్తూ నిరసన తెలిపారు. గంగిరెద్దు ఆడించేవారు సైతం హాలులోకి వచ్చి తమకు న్యాయం చేయాలని కోరారు. సంఘాల నాయకులు, సభ్యుల నినాదాల మధ్య కమిషన్ చైర్మన్ బహిరంగ విచారణను వాయిదా వేశారు. వినూత్న నిరసన కాపులను, బలిజలను బీసీ జాబితాలో చేర్చితే సహించేది లేదని పేర్కొంటూ బీసీ సంఘాల జేఏసీ నాయకులు మెడకు ఉరితాళ్లు కట్టుకుని అంబేడ్కర్ భవన్ నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. గేట్లను తోసుకుని బహిరంగ విచారణ జరిగే హాలులోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ, బీసీ జేఏసీ కన్వీనర్ అన్నా రామచంద్రయ్య, బీసీ సంక్షేమ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, కులాల ఐక్య వేదిక మహిళా నాయకురాలు పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ కాపులను బీసీలో చేర్చితే ఇప్పుడున్న బీసీలకు ఉరితాళ్లే గతవుతాయన్నారు. అన్ని రంగాల్లో కాపులు అభివృద్ధి చెందారని, కాపులు బీసీలే కాదని గతంలో ఏర్పాటు చేసిన అన్ని కమిషన్లు, హైకోర్టు తేల్చి చెప్పినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కులాల మధ్య చిచ్చుపెట్టి ఓట్ల రాజకీయం చేసేందుకు మంజునాథ్ కమిషన్ వేశారన్నారు. ఈ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు ఇప్పుడు అగ్రకులాలను బీసీ జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బహిరంగ విచారణ వాయిదా వేసి, కాపు కులాల అభ్యర్థనలను ఎలా స్వీకరిస్తారని ప్రశ్నించారు. ఇదే సమయంలో కాపు, బలిజ కులాలకు చెందిన నాయకులు, సభ్యులు ప్రతినినాదాలు చేశారు. కమిషన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో కమిషన్ విచారణ వాయిదా వేసింది. కార్యక్రమంలో సమాఖ్య జిల్లా అధ్యక్షులు భరత్‌కుమార్, బీసీ జనసభ నాయకులు టి.శేషఫణి, మాకం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆరే కటిక కులాన్ని బీసీ–డీ నుంచి ఎస్సీలో చేర్చాలని కోరుతూ జిల్లా ఆరే కటిక సమాజ్ నాయకులు కృష్ణాజిరావు, నాగేశ్వరరావు, చలపతిరావు తదితరులు డిమాండ్ చేశారు. సంచార జాతులైన బుడగ జంగాలకు ఎస్సీ కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంచార జాతుల వేదిక కమిటీ అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ కోరారు. భావసార క్షత్రియులకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని భావసార క్షత్రియ మండలి జిల్లా నాయకులు ధర్నా చేశారు. సంఘాలు సహకరించకపోవడంతోనే విచారణ వాయిదా బీసీ సంఘాలు సహకరించకపోవడం వల్లే బహిరంగ విచారణ వాయిదా వేశామని బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ్ చెప్పారు. విచారణ వాయిదా అనంతరం ఆయన ప్రభుత్వ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు సంబంధించి ఏ కులం వారైనా అభ్యర్థనలను విజయవాడలోని బీసీ కమిషన్ కార్యాలయానికి వచ్చి అందజేయవచ్చన్నారు. రాజ్యాంగానికి మించి రిజర్వేషన్లు చేయడం వీలుకాదన్నారు. 64 కులాలకు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పరిష్కరించేందుకు కమిషన్ జిల్లాల్లో పర్యటిస్తోందన్నారు. కొన్ని కులాలు బీసీలో నుంచి ఎస్టీల్లో చేర్చాలని అడుగుతూ అర్జీలు ఇస్తున్నారని, వారి సామాజిక, ఆర్థిక జీవనవిదానాలను పరిగణలోకి తీసుకుని నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, మల్లెల పూర్ణచంద్రరావు, శ్రీమంతుల సూర్యనారాయణ, కార్యదర్శి ఎ.కృష్ణమోహన్ పాల్గొన్నారు. -
కాపులను మభ్యపెట్టేందుకే మంజునాథ కమిషన్
అనంతపురం న్యూటౌన్ : కాపు సామాజిక వర్గం ప్రజలను మభ్యపెట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ మంజునాథ కమిషన్‌ను నియమించిందని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకరరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన అనంతపురంలోని ఆర్అండ్బీ అతిథిగహంలో విలేకరులతో మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పుబట్టారు. కమిషన్ కాపుల సామాజిక పరిస్థితులను వివరిస్తుందే తప్ప రిజర్వేషన్లపై సమీక్షించే అధికారం ఉండదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాపు, బలిజ రిజర్వేషన్లపై గతంలో పుట్టుస్వామి కమిషన్‌తో పాటు అనేక కమిటీలను నియమించారని, అవన్నీ బుట్టదాఖలు చేశారని విమర్శించారు. కాపు రిజర్వేషన్లను బీసీలు వ్యతిరేకించడం తగదన్నారు. ఆర్థికంగా చితికిపోయిన అన్ని కులాల వారికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆదుకుంటే.. రిజర్వేషన్ల అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇన్ని దశాబ్దాలలో రిజర్వేషన్లు లేని వర్గాల అభివద్ధికి ఎన్ని నిధులు కేటాయించారో ప్రభుత్వాలు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బుర్రా జయవర్దన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అల్లే మాధవరెడ్డి, రెడ్డి సంఘం రాష్ట్ర కార్యదర్శి నరేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బెంగళూరులో గ్యాంగ్ వార్
-
బెంగళూరులో గ్యాంగ్ వార్
బెంగళూరు: గత కొన్ని రోజులుగా కర్ణాటక రాజధాని బెంగళూరులో గ్యాంగ్ వార్ నడుస్తోంది. ఓ ఆస్తి వివాదంలో భానుకిరణ్ అనుచరుడు ఎర్నంపల్లి మధు జోక్యం చేసుకున్నాడు. దీంతో బెంగళూరుకు చెందిన మంజునాథ్ గ్యాంగ్ ఆగ్రహించి మధును కిడ్నాప్ చేసి చితకబాదింది. ఇక ముందు తాను ఎలాంటి సెటిల్ మెంట్లకు పాల్పడబోనని ఎంతగానో వేడుకోవడంతో మంజునాథ్ గ్యాంగ్ మధును విడిచిపెట్టింది. గతంలో మధును బెదిరించిన ఘటనకు సంబంధించిన ఓ వీడియోను మంజునాథ్ గ్యాంగ్ విడుదల చేసింది. భానుకిరణ్ పేరుతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మధు సెటిల్ భారీ మొత్తాలలో సెటిల్ మెంట్లకు పాల్పడుతున్నాడు. మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి (సూరి) హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకిరణ్ ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆర్థిక లావాదేవీలే సూరి హత్యకు కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. -
మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చండి
ధర్మవరం రూరల్ : ఇతర రాష్ట్రాల మాదిరిగా తమను ఎస్సీ జాబితాలో చేర్చి ఆదుకోవాలని తోలుబొమ్మల కళాకారులు కోరారు. కాపులను బీసీ జాబితాలో చేర్చే అంశంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు జిల్లాకు వచ్చిన జస్టిస్ మంజునాథ్ కమిషన్ సభ్యులు మంగళవారం ధర్మవరం మండలంలోని నిమ్మలకుంట గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ కేఎల్ మంజునాథ్, సభ్యులు ఆచార్య వెంకటేశ్వర సుబ్రమణ్యం, ఆచార్య మల్లెల పూర్ణచంద్రరావు, సత్యనారాయణ, కార్యదర్శి ఎ.కృష్ణమోహన్‌లు తోలుబొమ్మల కళాకారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తంగిశెట్టి అనే కళాకారుడు మాట్లాడుతూ బీసీ–బీలో ఉన్న తమకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా చేరడం లేదన్నారు. ఇతర రాష్ట్రాలలో తోలుబొమ్మల కళాకారులు దళితులుగా ఉంటూ ప్రయోజనాలు పొందుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తోలుబొమ్మ కళాకారులను కూడా ఎస్సీ జాబితాలోకి చేర్చాలని కోరారు. తోలుబొమ్మల కళాకారులకు ప్రభుత్వం పింఛన్ సదుపాయం కల్పించాలని రంగమ్మ అనే కళాకారిణి కోరారు. మీ విజ్ఞప్తులను ప్రభుత్వానికి నివేదిస్తామని సభ్యులు తెలిపారు. అనంతరం గ్రామంలో తిరిగి కళాకారులు ఇళ్లలో బొమ్మలు తయారు చేసే విధానాన్ని వారు పరిశీలించారు. జాతీయ అవార్డు గ్రహీత దళవాయి చలపతితో కమిషన్ చైర్మన్ ముచ్చటించారు. కార్యక్రమంలో ఆర్డీఓ బాలానాయక్, బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రమాభార్గవి, డీఎస్పీ వేణుగోపాల్, ఎంపీడీఓ సుధాకర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ నారాయణమూర్తి, బీసీ సంక్షేమ అధికారి పుల్లన్న, ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్ ఈశ్వరయ్య, ఏపీఎం శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
రచ్చ..రచ్చ
అనంతపురం న్యూటౌన్ : కాపులను బీసీ జాబితాలో చేర్చే అంశంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి జస్టిస్ మంజునాథ కమిషన్ చేపట్టిన బహిరంగ విచారణ ఉద్రిక్తత నడుమ కొనసాగింది. అనంతపురంలోని లలితకళాపరిషత్తులో సోమవారం ఉదయం 10.45 నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు విచారణ సాగింది. జస్టిస్ కేఎల్ మంజునాథ్ నేతృత్వంలో కమిషన్ సభ్యులు ఆచార్య వేంకటేశ్వర సుబ్రమణ్యం, ఆచార్య మల్లెల పూర్ణచంద్రరావు, సత్యనారాయణ, కృష్ణమోహన్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మల్లికార్జునరావు నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కాపులు, బీసీలు పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఓసీ నుంచి బీసీ జాబితాలోకి మార్చాలని బలిజ, ఒంటరి, కాపు, తెలగ, దొర, గోపిత బలిజ, వేళ్లలార్ కులస్తులు, బీసీల్లోనే ఇతర గ్రూపుల్లోకి మార్చాలని కురుబ, ఉప్పర, దూదేకుల తదితర కులాల వారు కోరుతున్నారంటూ కమిషన్ సభ్యులు ఆయా కులస్తుల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు, డిమాండ్ల సేకరణను ప్రారంభించారు. తొలుత ఉప్పర, కురుబ కులస్తులను ఆహ్వానించారు. ఈ రెండు కులాల వారు సభకు హాజరుకాలేదు. దీంతో దూదేకుల వారిని మాట్లాడించారు. ప్రస్తుతం బీసీ–బీలో ఉన్నామని, బీసీ–ఏలోకి మార్చాలని దూదేకుల సంఘం ప్రతినిధులు కమిషన్‌ను కోరారు. తాము ముస్లిం సంప్రదాయాలను పాటిస్తున్నప్పటికీ వారికి లభించే రాయితీలు తమకు అందడం లేదని వివరించారు. తర్వాత గోపిత బలిజ, దొర , వేళ్లలార్లకు అవకాశం ఇవ్వగా.. వీరూ గైర్హాజరయ్యారు. దీంతో బలిజలకు అవకాశం ఇచ్చారు. బలిజలు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో సంబంధం లేకుండా రాయలసీమలోని బలిజలను బీసీల్లోకి చేర్చాలని ఆ సంఘం ప్రతినిధులు కోరారు. ఇదే సందర్భంలో బీసీ ఉద్యోగసంఘం జిల్లా అధ్యక్షుడు పుట్టా శ్రీధర్, బీసీ జాక్ రాష్ట్ర కన్వీనర్ అన్నా రామచంద్రయ్య, నాయకులు సుధాకర్ యాదవ్, చంద్రశేఖర్ యాదవ్ తదితరులు జోక్యం చేసుకున్నారు. జనాభాలో బీసీలు 51శాతం ఉన్నారని, అయితే 27శాతం మాత్రమే రిజర్వేషన్లు అందుతున్నాయని చెప్పారు. బీసీల పరిస్థితి నేటికీSదయనీయంగా ఉందన్నారు. బలిజలు, కాపులు బంగారు, వజ్రాల వ్యాపారాలు చేస్తున్నారని, రాజకీయాలు, సినిమాల్లోనూ వారిదే ఆధిపత్యమని అన్నారు. వారి వ్యాఖ్యలపై రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షుడు వెంకట్రాముడు, నాయకులు అమర్నాథ్, జేఎల్ మురళి, వెంకటేశ్ తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరిని దృష్టిలో ఉంచుకుని వర్గం మొత్తాన్ని ఒకేలా పరిగణించడం సమంజసం కాదని, గాజుల వ్యాపారాలు, తోపుడుబండ్ల ద్వారా బతికేవారూ ఉన్నారని చెప్పారు. బలిజలు, కాపులను బీసీల్లో ప్రత్యేక కేటగిరీగా చేర్చాలని చెబుతున్నాం తప్ప బీసీలకు అన్యాయం చేయాలని కోరడం లేదన్నారు. దీంతో తిరిగి ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బలిజ సంఘం నేతల నిరసన బైఠాయింపు మంజునాథ్ కమిషన్ విచారణ ఏకపక్షంగా సాగిందంటూ బలిజలు లలితకళాపరిషత్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. బీసీలు ఘర్షణకు దిగుతున్నా పోలీసులు తమనే వారించారని ఆరోపించారు. కాపు ఉద్యమాన్ని అణచివేయడానికే ప్రభుత్వం ఇలా చేస్తోందన్నారు. వేర్వేరుగా విచారణ చేయాలని కమిషన్‌ను కోరినా వినకుండా కలిపి చేపట్టిందని, దీనివల్ల ప్రయోజనం లేదని అన్నారు. కాపు రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం సామాజికంగా బలంగా ఉన్న కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని బీసీ సంఘాల నేతలు అన్నారు. తద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. బీసీలు తమ అభిప్రాయాలను కమిషన్ ముందు చెప్పుకునేందుకు రాకుండా ప్రభుత్వం ఓ పథకం ప్రకారం టీడీపీ ఎమ్మెల్యే ఆర్.క్రిష్ణయ్యతో కేఎస్ఆర్ కాలేజీలో సభ పెట్టించిందని దుయ్యబట్టారు. కృష్ణయ్య కూడా బీసీల సమస్యలను పక్కనపెట్టి టీడీపీకి దన్నుగా నిలిచేలా వ్యవహరించారని విమర్శించారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం జస్టిస్ కేఎల్ మంజునాథ్ మాట్లాడుతూ ఏవర్గానికి అనుకూలంగా, వ్యతిరేకంగా కమిషన్ వ్యవహరించదని స్పష్టం చేశారు. కేవలం అభిప్రాయాలను సేకరించేందుకే వచ్చామన్నారు. ఎవ్వరూ అపోహలు చెందొద్దని సూచించారు. కమిషన్ ఎందుకు రావాల్సి వచ్చింది, కులాలు, వర్గీకరణ తదితర అంశాలపై మంజునాథ్ ప్రసంగించారు. కమిషన్ సూచించిన కులాలు కాకుండా ఇతర కులాల వారు తమ అభిప్రాయాలను చెప్పుకునేందుకు సభకు వచ్చారు. దీంతో వారి అభ్యర్థనను కమిషన్ సున్నితంగా తిరస్కరించింది. ఇతరులు ఎవరైనా ఉంటే విజయవాడకు వచ్చి నేరుగా తమతో కలవొచ్చని చెప్పారు. -
అనంతలో మంజునాథన్ కమీషన్ విచారణ
-
కాపుల సమస్యలు మంజునాథ్ కమిషన్‌కు తెలియజేయండి
కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు విజయవాడ (గాంధీనగర్) : కాపు కులస్తుల సమస్యలు, స్థితిగతులను జస్టిస్ మంజునాథ్ కమిషన్‌కు తెలియజేయాలని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు సూచించారు. స్థానిక హనుమంతరాయ గ్రంథాలయంలో కాపునాడు నగర కమిటీ ప్రమాణస్వీకారోత్సవం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరాన్ని మంజునాథ్ కమిషన్‌కు వివరించాలని చెప్పారు. జిల్లాలో కమిషన్ పర్యటన సందర్భంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్ల విషయంలో బీసీలు సహకరించాలని కోరారు. అనంతరం కాపునాడు నగర అధ్యక్షుడిగా యర్రంశెట్టి అంజిబాబు, రాష్ట్ర కార్యదర్శిగా రంగిశెట్టి సత్యనారాయణ, నగర మహిళా కార్యదర్శిగా వరలక్ష్మి ప్రమాణస్వీకారం చేశారు. వారికి రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు నియామకపత్రాలు అందజేసి అభినందించారు. అనంతరం పిళ్లా వెంకటేశ్వరరావును కాపునాడు నగర నాయకులు సన్మానించారు. కాపునాడు జిల్లా అధ్యక్షుడు బేతు రామ్మోహన్రావు, నాయకులు పానక్‌దేవ్, ఎం.జయప్రద, కె.రజనీ, జయశ్రీ, భానుకుమారి, కృష్ణ వందన పాల్గొన్నారు. -
మంజునాథ కమిషన్ పర్యటనలో ఉద్రిక్తత
-
మంజునాథ కమిషన్ పర్యటనలో ఉద్రిక్తత
-బీసీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం వైఎస్సార్‌జిల్లా: వైఎస్ఆర్ జిల్లా కడపలో మంజునాథ కమిషన్ పర్యటనలో ఉద్రిక్తత పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాపులను బీసీల్లొ చేర్చొద్దని కోరుతూ.. బీసీ కులాల రాష్ట్ర జేఏసీ మహిళ అధ్యక్షురాలు విజయలక్ష్మీ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని జడ్పీ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం మంజునాథ కమిషన్ ఈ రోజు కడపకు చేరుకుంది. ఈ అంశం పై తమ వాదనలు స్వీకరించాలని.. ఎట్టి పరస్థితుల్లోను కాపులను బీసీల్లో చేర్చొద్దని డిమాండ్ చేస్తూ ఆమె వంటిపై కిరోసిన్ పోసుకుంది. -
అగ్రకులాలను బీసీలో కలిపితే సహించం
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు అరండల్‌పేట: అగ్రకులాలను బీసీల్లో చేర్చే హక్కు ఏ కమీషన్‌కు లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు అన్నారు. శనివారం స్థానిక గుజ్జనగుండ్లలోని ప్రగడ కోటయ్య చేనేత భవన్లో జిల్లాలోని బీసీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. కాపులను బిసీల్లో చేర్చే అంశంలో మంజునాథ కమీషన్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. త్వరలో పదివేల మందితో బీసీల గుండెచప్పుడు కమీషన్‌కు వినిపించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. సంఘ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అంగిరేకుల ఆదిశేషు మాట్లాడుతూ చేనేత భవన్ వద్ద వసతిగృహం ఆనుకొని రైతుబజార్ నిర్మాణాన్ని అన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు కుమ్మరి క్రాంతికుమార్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి బీసీ సంఘాన్ని పటిష్టం చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే యువత, విద్యార్ధులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశానికి సంఘం నగర అధ్యక్షుడు కన్నా మాస్టారు అధ్యక్షత వహించారు. -
బీసీలకు పల్స్ సర్వే వేరుగా నిర్వహించాలి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు అరండల్‌పేట: మంజూనాథ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణను కలిపి నిర్వహించడంతో బీసీలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలపలేకపోతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం గుంటూరు బ్రాడీపేటలోని రాష్ట్ర సంఘ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి వంటి పట్టణంలో పోలీసు బందోబస్తు మధ్యలో మంజునాథ కమిషన్ సమక్షంలో బీసీలపై దాడులు జరిగాయని తెలిపారు. ఇలాంటి దౌర్జన్య వాతావరణంతో గ్రామీణ ప్రాంతాల్లోని బీసీలు కమిషన్ వద్దకు వచ్చి తమ బాధలన చెప్పుకోవడానికి భయపడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చురేపుతుందని మండిపడ్డారు. విలేకర్ల సమావేశంలో బీసీ జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఈడే మురళీకృష్ణ, నాయకులు అంగిరేకుల ఆదిశేషు, టీ శ్రీనివాస్‌యాదవ్, ఓలేటి శివాజీ, ఆలా అనంతరామయ్య, కుందుల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
బీసీల హక్కులను కాలరాస్తున్న కమిషన్
– కమిషన్ చైర్మన్ మంజునాథ ఫోటోలు దహనం కర్నూలు(అర్బన్): కాపులను బీసీ జాబితాలో చేర్చే అంశంపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంజునాథ కమిషన్ బీసీల హక్కులను కాల రాస్తోందని బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే లక్ష్మినరసింహ ఆరోపించారు. సోమవారం సాయంత్రం స్థానిక మద్దూర్‌నగర్‌లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య కార్యాలయం ఎదుట మెయిన్‌రోడ్డుపై బీసీ జనసభ నేతలు కమిషన్ చైర్మన్ మంజునాథ ఫొటోలను దహనం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహ మాట్లాడుతూ.. బీసీ కమిషన్ చైర్మన్‌గా ఉన్న మంజునాథ, కాపులను బీసీ జాబితాలో చేరిస్తే బీసీలకు ఎలాంటి నష్టం వాటిల్లదని చెప్పడం దారుణమన్నారు. బీసీ జాబితాలో ఉన్న 125 కులాలు నేటికి అసెంబ్లీ మెట్టు కూడా ఎక్కలేదని, 130 కులాలకు నేటి వరకు పార్లమెంట్లో ప్రాతినిథ్యం కూడా లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు కులానికి చెందిన 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వీరిలో ఐదుగురు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. తిరుపతిలో ప్రజాభిప్రాయం పేరిట బీసీలను లాఠీలతో కొట్టించడం దురదష్టకరమన్నారు. బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి ఈ విషయంపై ఎందుకు దష్టి సారించడం లేదన్నారు. త్వరలో రాష్ట్రంలోని మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో బీసీ జనసభ జిల్లా కన్వీనర్ వీ భరత్‌కుమార్, విద్యార్థి సమాఖ్య నాయకులు ముక్తార్‌బాషా, శివ, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. -
మంజునాథ కమిటీ ఎదుట నినాదాలు
-
మంజునాథ కమిటీ ఎదుట నినాదాలు
తిరుపతి: కాపులను బీసీ కులాల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ మంజునాథ కమిటీ తిరుపతిలో ప్రజాభిప్రాయాలను సేకరిస్తోంది. రాష్ట్రంలో బీసీ కులాల్లో మార్పులు, చేర్పులు, ఆయా కులాల్లోని వ్యక్తుల సామాజిక, ఆర్థిక, విద్యా పరమైన అంశాలను అధ్యయనం చేసేందుకు వచ్చిన కమిటీ సభ్యులు..సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో కాపులను బీసీల్లో చేర్చడంపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా.. ఓవైపు తమను బీసీల్లో చేర్చాలంటూ కాపులు, మరోవైపు కాపులను బీసీల్లో చేర్చొద్దంటూ బీసీలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇరు వర్గాల నినాదాలతో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. -
మంజునాథ కమిటీ అభిప్రాయ సేకరణ
తిరుపతి: కాపులను బీసీ కులాల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ మంజునాథ కమిటీ తిరుపతిలో ప్రజాభిప్రాయాలను సేకరిస్తోంది. రాష్ట్రంలో బీసీ కులాల్లో మార్పులు, చేర్పులు, ఆయా కులాల్లోని వ్యక్తుల సామాజిక, ఆర్థిక, విద్యా పరమైన అంశాలను అధ్యయనం చేసేందుకు కమిషన్ సభ్యులు ఆదివారం సాయంత్రం తిరుపతికి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషన్ సభ్యులు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు. జనవరిలో ఏర్పాటైన ఏపీబీసీ కమిషన్‌కు జస్టిస్ కేఎల్ మంజునాథ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈయనతో పాటు కమిటీ సభ్యులు సుబ్రమణ్యం, సత్యనారాయణ, సెక్రటరీ కష్ణమోహన్ తిరుపతికి చేరుకున్నారు. వీరికి పద్మావతి అతిథి గహంలో అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మంజునాథ్ మాట్లాడుతూ... జిల్లాలో 14 కులాలకు సంబంధించి మార్పులు, చేర్పులపై సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. వివిధ వర్గాల సామాజిక, విద్యా పరమైన స్థితిగతులపై అనుకూల, వ్యతిరేక అంశాలను కమిటీ దృష్టికి తేవచ్చన్నారు. అయితే దానికి సంబంధించిన బలమైన అంశాలను కమిటీకి వివరించాల్సి ఉంటుందని మంజునాథ చెప్పారు. -
నరికిన తలతో పోలీస్ స్టేషన్‌కు..!
హడలిపోయిన పోలీసులు అప్పు తీర్చలేదని ఘోరం సొమ్మసిల్లిపడిపోయిన హతుడి తల్లి దొడ్డబళ్లాపురం : ఒక వ్యక్తి తల నరికి అదే తల పట్టుకుని నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగి పోయిన సంఘటన దేవనహళ్లి తాలూకా విశ్వనాథపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కెంపతిమ్మనహళ్లి నివాసి మంజునాథ్ (26) హత్యకు గురైన వ్యక్తి. ఉగనవాడి గ్రామానికి చెందిన శశికుమార్ హత్యచేసిన నిందితుడు. నిందితుడు శశికుమార్ హతుడు మంజునాథ్‌కు రూ.27వేలు అప్పు ఇచ్చాడు. అప్పు తిరిగివ్వడంలో ఇద్దరి మధ్య తరచూ గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మాట్లాడాలని చెప్పి మంజునాథ్‌ను ఉగనవాడి గ్రామం శివారు లోని నిర్జనప్రదేశానికి పిలిచాడు శశికుమార్. అప్పటికే కొడవలితో సిద్ధంగా ఉన్న శశశికుమార్ మంజునాథ్ తల నరికివేసాడు. ఆదివారం రాత్రే నిందితుడు నరికిన తలతో పాటు విశ్వనాథపురం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పోలీసులకు లొంగి పోయాడు. మొండెం లేని తలను చూసిన పోలీసుల కళ్లు బైర్లు కమ్మాయి. తక్షణం పోలీసులు ఘటన జరిగిన స్థలాన్ని చేరుకుని తలలేని మంజునాథ్ మొండాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ అమిత్‌సింగ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘనపై వివరాలు తెలుసుకున్నారు. విశ్వనాథపుర పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాబు హామీని నిలబెట్టుకోవాలి : ముద్రగడ
విజయవాడ: కాపు రిజర్వేషన్లపై ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చెప్పారు. విజయవాడలో ఆదివారం ఆయన మాట్లాడుతూ...కాపు రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ నివేదికను త్వరగా ప్రభుత్వానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన తుది శ్వాస వరకు కాపు జాతి కోసం పోరాడుతానని... కాపుల్లో ఉన్న పేదలకు ఫలాలు అందించడమే తన ధ్యేయమని ముద్రగడ అన్నారు. -
మంజునాథ కమిషన్‌లో ముగ్గురి నియామకం
కాపులను బీసీలలో చేర్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ మంజునాథ కమిషన్‌లో ముగ్గురు సభ్యులను నియమించారు. 1993 నాటి ఆంధ్రప్రదేశ్ వెనకబడిన వర్గాల చట్టంలో మూడో సెక్షన్ ప్రకారం సంక్రమించిన అధికారాలతో ఈ సభ్యులను నియమిస్తున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వులలో పేర్కొంది. సామాజిక శాస్త్రవేత్త, ఆంధ్రా యూనివర్సిటీలో రిటైర్డ్ ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, బీసీల అంశానికి సంబంధించి ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన ఇద్దరు వ్యక్తులు.. ఆంధ్రా యూనివర్సిటీలో రిటైర్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ మల్లెల పూర్ణచంద్రరావు, ఏయూ కాలేజి ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ మాజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాముల సత్యనారాయణలను నియమింస్తున్నట్లు తెలిపింది. -
మాదిగలను మోసం చేసిన బాబు
మంజునాథ్ కమిషన్ పర్యటనను అడ్డుకుంటాం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు గుత్తి: ఎన్నికల సమయంలో మాదిగల చిహ్నమైన డప్పు కొట్టి తాను పెద్ద మాదిగనవుతానని చెప్పి తీరా గద్దెనెక్కాక మాదిగలను మోసం చేసి చంద్రబాబు రాష్ట్రంలోనే పెద్ద మోసగాడని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు విమర్శించారు. పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద శనివారం సాయంత్రం మాదిగల సమరభేరి బహిరంగ సభను నిర్వహించారు. అంతకు ముందు మన్రోసత్రం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా వచ్చి రాయలసీమ జిల్లాల ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఎంఎస్ రాజు మాట్లాడుతూ ఆర్థిక, రాజకీయ, సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉన్న కాపులకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి ఎస్సీ వర్గీకరణ ఎందుకు గుర్తుకులేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మంజునాథ్ కమిషన్‌ను అడ్డుకుంటామన్నారు. కాపులు ఒక రైలు కాలిస్తేనే కాపు కార్పొరేషన్‌కు చంద్రబాబు వెయ్యి కోట్లు కేటాయించారన్నారు. 100 రైళ్లు కాల్చే సత్తా మాదిగలకు ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీలపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబును గద్దెదించే సత్తా మాల,మాదిగలకు ఉందన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కుంటి మద్ది ఓబులేసు, రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు రమణ, జిల్లా అధ్యక్షడు కణేకల్ క్రిష్ణ, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు బొంగ సంజయ్, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నె చిరంజీవి, రాష్ట్ర నాయకులు కెరటాల మల్లేష్, జిల్లా అధికార ప్రతినిధి తిరుపాల్, జిల్లా ఉపాధ్యక్షుడు నగేష్, గుత్తి మండల,పట్టణ అధ్యక్షులు అంజన్ ప్రసాద్, సుధాకర్, టౌన్ కార్యదర్శి మధుబాబు,గౌరవాధ్యక్షుడు ఎల్లప్ప, పట్టణ ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
బుడతడి బుర్ర గట్టిదే..
తిరుపతి కల్చరల్: తిరుపతికి చెందిన ఏడేళ్ల బాలుడు సంగరాజు మంజునాథ్ తన జ్ఞాపక శక్తితో 13 రికార్డులు కైవసం చేసుకున్నాడు. మేక్ మై బేబీ జీనియస్ ఆధ్వర్యంలో తిరుపతి విశ్వం స్కూల్లో బుధవారం వివిధ బుక్ ఆఫ్ రికార్డుల జ్యూరీ సభ్యుల సమక్షంలో మెమొరీ విన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వం స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న సంగరాజు మంజునాథ్ కేవలం 11 నిమిషాల 43 సెకన్లలో వంద వేమన పద్యాలు చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. బాలుడి ప్రతిభను గుర్తించి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డు, గోల్డన్ స్టార్ వరల్డ్ రికార్డు, సూపర్ కిడ్స్ రికార్డు, భారత్ బుక్ ఆఫ్ రికార్డు, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డు, స్టార్ వరల్డ్ రికార్డ్, యునెటైడ్ వరల్డ్ రికార్డు, లిటిల్ బుక్ ఆఫ్ రికార్డ్, వర్మ బుక్ ఆఫ్ రికార్డ్, బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ జ్యూరీ ప్రతినిధులు జ్ఞాపిక అందించి అభినందించారు. బాలుడిని ప్రత్యేకంగా అభినందించి బుక్ ఆఫ్ రికార్డ్స్ జ్యూరీ సభ్యులు అంతర్జాతీయ చైల్డ్ అవార్డును ప్రదానం చేశారు. సభ్యులు మాట్లాడుతూ ఇంత చిన్న వయస్సులో అంత జ్ఞాపకశక్తి ఉండడం అద్భుతమన్నారు. మేక్ మై బేబీ జీనియస్ అధినేత భాస్కర్‌రాజు మాట్లాడుతూ బ్రెయిన్ బేస్ లెర్నింగ్ శిక్షణ ద్వారా తమబిడ్డ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం సంతోషంగా ఉందన్నారు. -
3రోజులు ఒంటరిగా శవాల మధ్య బాలుడు
-
జగద్గిరిగుట్టలో దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని జగద్గిరి గుట్టలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక కమలా ప్రసన్ననగర్ కాలనీలో శుక్రవారం దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాలనీలో ఉండే మంజునాథ, లీల లు భార్యభర్తలు. వీరికి ఏడాది వయస్సు ఉన్నపాప ఉంది. అయితే ఈ రోజు ఉదయం దంపతులిద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చిన్నారి ఏడుస్తుండటంతో గమనించిన స్థానికులు సంఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలిని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్యహత్యకు గల కారణాలు, ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది -
భర్త బారినుంచి కాపాడాలని ఫిర్యాదు
హొసూరు: పెళ్లి చేసుకొని మోసగించి, తన పేరు మీద ఉన్న ఆస్తిని తాకట్టు పెట్టి రూ.లక్ష, నగలు కాజేసి, మరో అమ్మాయిని పెళ్లి చేసుకొన్న తన భర్త నుంచి కాపాడి డబ్బు, నగలు ఇప్పించి న్యాయం చేయాలని ఓ మహిళ హొసూరు మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన శనివారం చోటు చేసుకొంది. ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. హొసూరు యూనియన్ ప్యారండపల్లి సమీపంలోని గాంధీనగర్‌లో నివసిస్తున్న క్రిష్ణప్ప కొడుకు మంజునాథ్ 2012లో రేణుకను పెళ్లి చేసుకొన్నాడు. ఈ పెళ్లికి ముందే మరో ఇద్దరు అమ్మాయిలతో పెళ్లిళ్లు చేసుకున్నాడు. విషయం తెలియక రేణుక మళ్లీ పెళ్లి చేసుకుంది. ఆమెకు ఆడపిల్ల పుట్టి ఐదు నిమిషాలకే మరణించింది. వ్యాపారం కోసం ఆర్థికంగా సాయం చేయమని డిమాండ్ చేయడంతో తల్లిదండ్రులు ఇచ్చిన ఎకరం నేల తాకట్టు పెట్టి లక్షరూపాయలు వడ్డీకి తీసిచ్చింది. బంగారు నగలు కూడా ఇచ్చానని, గత కొద్ది రోజుల నుంచి వదలి వెళ్లిపోయాడని, మొబైల్‌కు ఫోన్ చేస్తే మరోఅమ్మాయి మాట్లాడుతోందని రేణుక వివరించింది. తన భర్తతో నీకేం పని అని ఆ మహిళ బెదరిస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
ఆక్రమణల తొలగింపు... మిన్నంటిన ఆక్రందనలు
ఇళ్లను కూల్చరాదని అడ్డుకున్న మహిళలు బలవంతంగా ఇళ్ల నుంచి బయటకు పంపిన పోలీసులు రెండు రోజులు సమయం ఇవ్వాలని వేడుకున్న బాధితులు హైకోర్టు స్టేతో ఆక్రమణల తొలగింపునకు తాత్కాలిక బ్రేక్ కోలారు : పేదల ప్రతిఘటన మధ్య నగర సమీపంలోని కోలారమ్మ చెరువులో బుధవారం ఆక్రమణల తొలగింపు ప్రారంభమైంది. అయితే బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో తొలగింపునకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆర్డీవో మంజునాథ్ నేతృత్వంలో బుధవారం ఉదయం ఏడుగంటలకే అధికారులు జేసీబీలతో కోర్టు సర్కిల్ సమీపం నుంచి ఆక్రమణల తొలగింపు ప్రారంభించారు. అయితే కొంతమంది తమ ఇళ్లనుంచి హడావుడిగా ఇళ్లనుంచి సామగ్రిని బయటకు తీసుకురాగా మరికొందరు ఇళ్లను కూల్చవద్దని బీష్మించుకూర్చున్నారు. అయితే పోలీసులు ఇళ్ల యజమానులను బలవంతంగా బయటకు పంపి సామాగ్రిని బయటకు తరలించారు. కొందరు మహిళలు బయటకు రాకుండా తాళం వేసుకొని ఇంట్లోనే బైఠాయించారు. తమను ఇంట్లోనే ఉంచి నివాసాన్ని కూల్చాలని, తాము ఇంటి సమేతంగా సమాధి అవుతామని తలుపులు వేసుకున్నారు సీఐ శివకుమార్ సిబ్బంది సహాయంతో బలవంతంగా తలుపులు తెరచి ఇంటిలో ఉన్న మహిళలను మహిళా పోలీసు సిబ్బంది సహాయంతో బయటకు పంపారు. ఈ నేపథ్యంలో ఓ వృద్ధురాలు సొమ్మసిల్లి కిందపడిపోయింది. రెండు రోజులు గడువియ్యండి ఇళ్లను కూల్చివేయడానికి అధికారులు రాగా మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. సామగ్రిని తరలించడానికి రెండు రోజుల గడువు ఇవ్వాలని వేడుకున్నారు. ఆర్డీవో చేతులు పట్టుకుని మరీ వేడుకున్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నందువల్ల తామేమి చేయలేదని ఆయన నిస్సహాతను వ్యక్త పరిచారు. మరో ఇంటి యజమాని అయితే ఏకంగా జేసీబీకి అడ్డు తగిలి తన ఇంటిని కూల్చవద్దని వేడుకున్నారు. పోలీసులు అతనిని బలవంతంగా పక్కకు లాగేశారు. హైకోర్టు స్టే ఓ వైపు ఆక్రమణల తొలగింపు కొనసాగుతుండగా మరో వైపు కొందరు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. వారి విన్నపాన్ని పరిశీలించిన కోర్టు స్టే మంజూరు చేయడంతో ఆక్రమణల తొలగింపును నిలిపివేశారు. భాధితులు అక్కడి నుంచి తరలి వెళ్లడానికి వారం రోజులు గడువు ఇవ్వాలని హైకోర్టు సూచించినట్లు సమాచారం -
నో ఛాన్స్ !
మోడీ మంత్రి వర్గంలో పలువురికి దక్కని చోటు అధిష్టానం నుంచి లభించని స్పష్టమైన హామీ రిక్త హస్తాలతో బీజేపీ ఎంపీల తిరుగు ముఖం పైరవీలు చేయొద్దని సుతి మెత్తగా క్లాస్ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని ఉద్బోధ సీనియర్ల నేతృత్వంలో మంత్రి వర్గం కూర్పుపై కసరత్తు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్రంలో ఈ నెల 26న ఏర్పడబోయే నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో చేరాలని ఆశించిన అనేక మంది ఎంపీలకు నిరాశ ఎదురైంది. మోడీతో పాటు బీజేపీ అధిష్టానం వారి ఆశలపై నీళ్లు చల్లింది. మంత్రి పదవులకు పైరవీలు చేయొద్దని సుతి మెత్తగా వారించింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుసటి రోజే మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, సదానంద గౌడలతో పాటు కొత్తగా ఎన్నికైన సురేశ్ అంగడి, శోభా కరంద్లాజె, రాజ్య సభ సభ్యుడు ఆయనూరు మంజునాథ్ ఢిల్లీకి వెళ్లారు. అయితే పార్టీ అధిష్టానం నుంచి సానుకూల స్పందన కనిపించక పోవడంతో వారంతా మంగళవారం రాత్రి బెంగళూరుకు తిరుగు ముఖం పట్టారు. కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసే రోజున తిరిగి ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్నారు. కర్ణాటక భవన్ సమీపంలోనే ఉన్న గుజరాత్ భవన్లో వారంతా మోడీని కలుసుకున్నారు. కేంద్ర మంత్రులు కావాలన్న తమ ఆకాంక్షను ఆయన ముందు బయట పెట్టారు. అయితే మంత్రి పదవుల కోసం పైరవీలు చేయవద్దని మోడీ వారికి సూచించినట్లు తెలిసింది. గుజరాత్లో కూడా తాను ఇలాంటి పరిణామాలను ప్రోత్సహించ లేదని చెప్పారని సమాచారం. పైగా మంత్రి పదవిలో ఏముంటుందని వారినే ప్రశ్నించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎంపీలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇటీవలి ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చినందున, పార్టీని గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని ఉద్బోధించారు. కాగా వీరంతా పార్టీ అగ్ర నాయకులను కలుసుకున్నప్పుడు కూడా సానుకూల స్పందన లభించలేదు. పార్టీ అధిష్టానానికి ప్రతి నాయకుని బలం, బలహీనతలు తెలుసునని, దానిని బట్టే మంత్రి వర్గంలో ఎవరికి అవకాశం ఇవ్వాలో నిర్ణయమవుతుందని చెప్పినట్లు సమాచారం. పార్టీలోని సీనియర్లు కొందరు ఇదివరకే మంత్రి వర్గం కూర్పుపై కసరత్తును ప్రారంభించినట్లు తెలిసింది. మోడీ మూడ్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో ఎవరికీ అంతుబట్టదని, కనుక ఆయనతో ఎదురు మాట్లాడకుండా తిరిగి వచ్చేశామని ఢిల్లీకి వెళ్లిన ఎంపీలలో ఒకరు తెలిపారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, కేంద్ర మాజీ మంత్రి అనంత కుమార్‌లతో కలసి ఢిల్లీకి వెళ్లిన ఎంపీలు రాష్ట్ర ప్రతినిధిబృందంగా అధిష్టానాన్ని, మోడీని కలుసుకున్నారు.