
కాపు రిజర్వేషన్: మంజునాథ కమిషన్ పర్యటన
కాపు రిజర్వేషన్‌పై ఏర్పాటైన మంజునాథ కమిషన్ మంగళవారం రాత్రి ఏలూరుకు చేరుకుంది.
ఏలూరు: కాపు కులస్తులకు బీసీ రిజర్వేషన్ కల్పించే అంశంపై ఏర్పాటయిన మంజునాథ కమిషన్ క్షేత్రస్థాయి పర్యటన చేయనుంది. పశ్చిమగోదావరి జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం కమిషన్ మంగళవారం రాత్రి ఏలూరుకు చేరుకుంది.
కమిషన్ చైర్మన్ జస్టిస్ కేఎల్ మంజునాథ, సభ్యులు ప్రొఫెసర్ వి.సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ ఎం.పూర్ణచంద్రరావు, ఎస్.సత్యనారాయణ, మెంబర్ సెక్రటరీ ఎ.కృష్ణమోహన్‌లకు జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్, ఎస్పీ భాస్కర్ భూషణ్‌లు స్వాగతం పలికారు. అనంతరం కమిషన్‌తో సమావేశమయ్యారు. డిసెంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు జిల్లాలో కమిషన్ పర్యటిస్తుంది. బుధవారం ఉదయం ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో కుల సంఘాలు, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తుంది.