- రిజర్వేషన్లపై కాపులకు ముద్రగడ పిలుపు
- మంజునాథ కమిష¯ŒS పర్యటనను విజయవంతం చేయాలి
ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కావు
Published Sat, Mar 11 2017 12:03 AM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM
కిర్లంపూడి (జగ్గంపేట) :
తూర్పుగోదావరి జిల్లాలో ఈనెల 22న నిర్వహించే మంజునాథ కమిష¯ŒS పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కాపులకు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం కిర్లంపూడిలో ఆయన స్వగృహంలో జిల్లాలోని అన్ని మండలాల ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలోను, పాదయాత్రలోను కాపులకు ఇచ్చిన బీసీ రిజర్వేష¯ŒS హామీని ఇప్పుడు సాధించుకోకపోతే భవిష్యత్తులో సాధించుకోలేమన్నారు. బీసీ రిజర్వేష¯ŒS సాధించుకోవాలంటే జిల్లాలో పర్యటిస్తున్న మంజునాథ కమిష¯ŒS ఎదుటకు అధిక సంఖ్యలో కాపులు తరలివచ్చి శాంతియుతంగా గాంధేయ మార్గంలో కాపుజాతికి రిజర్వేష¯ŒSలు లేకపోవడం వల్ల జాతి ఎదుర్కొంటున్న సమస్యలను, కష్టనష్టాలను వివరంగా విన్నవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిటీషు కాలంలో ఉన్న రిజర్వేష¯ŒSలను తొలగించడం వల్ల కాపు జాతి లక్షలాది ఉద్యోగాలు, కోట్లాది రూపాయలు నష్టపోయిందన్నారు. జాతి భవిష్యత్తు రిజర్వేష¯ŒS సాధనతోనే ముడిపడి ఉందన్నారు. రిజర్వేష¯ŒSల సాధన కోసం 14 నెలలుగా పోరాటం చేస్తున్నామన్నారు. బీసీ రిజర్వేష¯ŒS కమిష¯ŒS రిపోర్టు మీద ఆధారపడి ఉంటుందని జాతి యావత్తు అశ్రద్ధ చేయకుండా ఈ నెల 22న కాకినాడకు భారీ సంఖ్యలో తరలివచ్చి కమిష¯ŒS ముందు జాతి పడుతున్న సమస్యలను చెప్పుకోవాలి్సన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, సంగిశెట్టి అశోక్, కల్వకొలను తాతాజీ, తుమ్మలపల్లి రమేష్, తోట రాజీవ్, బస్వా ప్రభాకర్‌రావు, మలకల చంటిబాబు, ఆకుల భాగ్యసూర్యలక్ష్మి, బుర్రే వరలక్ష్మి, పెదిరెడ్డి రామలక్ష్మి, పేపకాయల రామకృష్ణ, తొగరుమూర్తి పాల్గొన్నారు.
Advertisement