తిరుపతి కల్చరల్: తిరుపతికి చెందిన ఏడేళ్ల బాలుడు సంగరాజు మంజునాథ్ తన జ్ఞాపక శక్తితో 13 రికార్డులు కైవసం చేసుకున్నాడు. మేక్ మై బేబీ జీనియస్ ఆధ్వర్యంలో తిరుపతి విశ్వం స్కూల్లో బుధవారం వివిధ బుక్ ఆఫ్ రికార్డుల జ్యూరీ సభ్యుల సమక్షంలో మెమొరీ విన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వం స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న సంగరాజు మంజునాథ్ కేవలం 11 నిమిషాల 43 సెకన్లలో వంద వేమన పద్యాలు చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
బాలుడి ప్రతిభను గుర్తించి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డు, గోల్డన్ స్టార్ వరల్డ్ రికార్డు, సూపర్ కిడ్స్ రికార్డు, భారత్ బుక్ ఆఫ్ రికార్డు, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డు, స్టార్ వరల్డ్ రికార్డ్, యునెటైడ్ వరల్డ్ రికార్డు, లిటిల్ బుక్ ఆఫ్ రికార్డ్, వర్మ బుక్ ఆఫ్ రికార్డ్, బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ జ్యూరీ ప్రతినిధులు జ్ఞాపిక అందించి అభినందించారు.
బాలుడిని ప్రత్యేకంగా అభినందించి బుక్ ఆఫ్ రికార్డ్స్ జ్యూరీ సభ్యులు అంతర్జాతీయ చైల్డ్ అవార్డును ప్రదానం చేశారు. సభ్యులు మాట్లాడుతూ ఇంత చిన్న వయస్సులో అంత జ్ఞాపకశక్తి ఉండడం అద్భుతమన్నారు. మేక్ మై బేబీ జీనియస్ అధినేత భాస్కర్‌రాజు మాట్లాడుతూ బ్రెయిన్ బేస్ లెర్నింగ్ శిక్షణ ద్వారా తమబిడ్డ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం సంతోషంగా ఉందన్నారు.
బుడతడి బుర్ర గట్టిదే..
Published Thu, Oct 29 2015 1:36 AM | Last Updated on Tue, Oct 9 2018 4:20 PM
Advertisement
Advertisement