అఖిల్ అక్కినేనితో రామ్ గోపాల్ వర్మ
అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తొలి సినిమాతో అభిమానులను నిరాశపరిచాడు. తరువాత హలో అంటూ పలకరించినా.. కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాడు. దీంతో మూడో సినిమా విషయంలో అఖిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అఖిల్ తదుపరి చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది.
అఖిల్ తన తదుపరి చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన మంజునాథ్ అనే యువ దర్శకుడి డైరెక్షన్‌లో చేయనున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రయల్ షూట్ కూడా చేశారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ ట్రయల్ షూట్ లో వర్మ కూడా పాల్గొన్నట్టుగా వార్తలు వినిపించాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ ఫొటోలు అఖిల్ తో వర్మ తెరకెక్కిస్తున్న షార్ట్ ఫిలింకు సబంధించినవన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment