అఫీషియల్‌ : అఖిల్‌తో ఆర్జీవీ | Akhil Akkineni next with Ram Gopal Varma | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 28 2018 10:47 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Akhil Akkineni next with Ram Gopal Varma - Sakshi

‘హలో’ సినిమాలో అఖిల్‌ అక్కినేని

అక్కినేని వారసుడిగా వెండితెర అరంగేట్రం చేసిన యంగ్ హీరో అఖిల్ ఒక సాలిడ్‌ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. తొలి సినిమా అఖిల్ తో తీవ్రంగా నిరాశపరిచిన ఈ యంగ్‌ హీరో తరువాతో హలో అంటూ ఆకట్టుకున్నాడు. అయితే కమర్షియల్ స్టార్ అనిపించుకునే స్థాయి సక్సెస్‌ మాత్రం దక్కలేదు. దీంతో తన మూడో సినిమాగా యువ దర్శకుడు వెంకీ అట్లూరితో ఓ సినిమా చేస్తున్నాడు అఖిల్.

ఇటీవల లాంచనంగా ఈ సినిమాను ప్రారంభించారు. మూడో సినిమా సెట్స్‌ మీదకు రాకముందే తన నాలుగో సినిమాను కూడా ప్రకటించాడు అఖిల్. అది కూడా సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో కావటం విశేషం. చాలా కాలం క్రితమే సక్సెస్‌కు దూరమైన వర్మ ప్రస్తుతం నాగార్జున హీరోగా ఆఫీసర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మే 25న రిలీజ్‌ కానుంది.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే నాగార్జున సొంత నిర్మాణ సంస్థలో అఖిల్‌ హీరోగా సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. శివ సినిమా తరువాత అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇదే కావటం విశేషం. ఈ సినిమాను యాక్షన్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపారు.

అంతేకాదు శివ సినిమా సమయంలో నాగార్జున కన్నా అఖిల్‌కు మంచి వాయిస్‌, మంచి స్టైల్‌ ఉందని అఖిల్‌ను ఆకాశానికెత్తేశాడు వర్మ.  ఇంకా కెరీర్‌లో నిలదొక్కుకోని సమయంలో వర్మ లాంటి వివాదాస్పద దర్శకుడితో అఖిల్ సినిమా చేయటం రిస్క్‌ అని భావిస్తున్నారు ఫ్యాన్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement