కింగ్ నాగార్జున, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. నాగ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగ్ సరసన హీరోయిన్ ఉండదట. రొమాంటిక్ హీరోగా తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న కింగ్ పై ఈ సినిమాలో ఒక్క రొమాంటిక్ సీన్ కూడా ఉండదట.
గతంలో గగనం సినిమాలో నాగ్ ఈ తరహా పాత్రలో కనిపించాడు. ఇప్పుడు వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా పూర్తి యాక్షన్ మోడ్ లో సాగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం తొలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 1నుంచి బ్రేక్ తీసుకోనుంది. తిరిగి అఖిల్ 'హలో' రిలీజ్ అయిన తరువాత రెండో షెడ్యూల్ ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అప్పుడే హీరోయిన్ ను కూడా ఫైనల్ చేసి ప్రకటిస్తారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment