గత కొన్ని రోజులుగా కర్ణాటక రాజధాని బెంగళూరులో గ్యాంగ్ వార్ నడుస్తోంది. ఓ ఆస్తి వివాదంలో భానుకిరణ్ అనుచరుడు ఎర్నంపల్లి మధు జోక్యం చేసుకున్నాడు. దీంతో బెంగళూరుకు చెందిన మంజునాథ్ గ్యాంగ్ ఆగ్రహించి మధును కిడ్నాప్ చేసి చితకబాదింది. ఇక ముందు తాను ఎలాంటి సెటిల్ మెంట్లకు పాల్పడబోనని ఎంతగానో వేడుకోవడంతో మంజునాథ్ గ్యాంగ్ మధును విడిచిపెట్టింది.