మంజునాథ కమిటీ అభిప్రాయ సేకరణ
మంజునాథ కమిటీ అభిప్రాయ సేకరణ
Published Mon, Sep 19 2016 8:29 AM | Last Updated on Tue, Oct 9 2018 4:20 PM
తిరుపతి: కాపులను బీసీ కులాల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ మంజునాథ కమిటీ తిరుపతిలో ప్రజాభిప్రాయాలను సేకరిస్తోంది. రాష్ట్రంలో బీసీ కులాల్లో మార్పులు, చేర్పులు, ఆయా కులాల్లోని వ్యక్తుల సామాజిక, ఆర్థిక, విద్యా పరమైన అంశాలను అధ్యయనం చేసేందుకు కమిషన్ సభ్యులు ఆదివారం సాయంత్రం తిరుపతికి చేరుకున్నారు.
మున్సిపల్ కార్యాలయంలో కమిషన్ సభ్యులు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు. జనవరిలో ఏర్పాటైన ఏపీబీసీ కమిషన్‌కు జస్టిస్ కేఎల్ మంజునాథ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈయనతో పాటు కమిటీ సభ్యులు సుబ్రమణ్యం, సత్యనారాయణ, సెక్రటరీ కష్ణమోహన్ తిరుపతికి చేరుకున్నారు. వీరికి పద్మావతి అతిథి గహంలో అధికారులు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మంజునాథ్ మాట్లాడుతూ... జిల్లాలో 14 కులాలకు సంబంధించి మార్పులు, చేర్పులపై సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. వివిధ వర్గాల సామాజిక, విద్యా పరమైన స్థితిగతులపై అనుకూల, వ్యతిరేక అంశాలను కమిటీ దృష్టికి తేవచ్చన్నారు. అయితే దానికి సంబంధించిన బలమైన అంశాలను కమిటీకి వివరించాల్సి ఉంటుందని మంజునాథ చెప్పారు.
Advertisement