నరికిన తలతో పోలీస్ స్టేషన్‌కు..! | With the conversion of the head to the police station ..! | Sakshi
Sakshi News home page

నరికిన తలతో పోలీస్ స్టేషన్‌కు..!

Published Tue, Aug 23 2016 1:57 AM | Last Updated on Tue, Oct 9 2018 4:20 PM

నరికిన తలతో పోలీస్ స్టేషన్‌కు..! - Sakshi

నరికిన తలతో పోలీస్ స్టేషన్‌కు..!

హడలిపోయిన పోలీసులు
అప్పు తీర్చలేదని ఘోరం
సొమ్మసిల్లిపడిపోయిన హతుడి తల్లి

 

దొడ్డబళ్లాపురం : ఒక వ్యక్తి తల నరికి అదే తల పట్టుకుని నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగి పోయిన సంఘటన దేవనహళ్లి తాలూకా విశ్వనాథపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కెంపతిమ్మనహళ్లి నివాసి మంజునాథ్ (26) హత్యకు గురైన వ్యక్తి. ఉగనవాడి గ్రామానికి చెందిన శశికుమార్ హత్యచేసిన నిందితుడు. నిందితుడు శశికుమార్ హతుడు మంజునాథ్‌కు రూ.27వేలు అప్పు ఇచ్చాడు. అప్పు తిరిగివ్వడంలో ఇద్దరి మధ్య తరచూ గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మాట్లాడాలని చెప్పి మంజునాథ్‌ను ఉగనవాడి గ్రామం శివారు లోని నిర్జనప్రదేశానికి పిలిచాడు శశికుమార్. అప్పటికే కొడవలితో సిద్ధంగా ఉన్న శశశికుమార్ మంజునాథ్ తల నరికివేసాడు.


ఆదివారం రాత్రే నిందితుడు నరికిన తలతో పాటు విశ్వనాథపురం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పోలీసులకు లొంగి పోయాడు. మొండెం లేని తలను చూసిన పోలీసుల కళ్లు బైర్లు కమ్మాయి. తక్షణం పోలీసులు ఘటన జరిగిన స్థలాన్ని చేరుకుని తలలేని మంజునాథ్ మొండాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ అమిత్‌సింగ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘనపై వివరాలు తెలుసుకున్నారు. విశ్వనాథపుర పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement