నగరంలోని జగద్గిరి గుట్టలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక కమలా ప్రసన్ననగర్ కాలనీలో శుక్రవారం దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాలనీలో ఉండే మంజునాథ, లీల లు భార్యభర్తలు. వీరికి ఏడాది వయస్సు ఉన్నపాప ఉంది. అయితే ఈ రోజు ఉదయం దంపతులిద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చిన్నారి ఏడుస్తుండటంతో గమనించిన స్థానికులు సంఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలిని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్యహత్యకు గల కారణాలు, ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Published Fri, Sep 4 2015 12:35 PM | Last Updated on Thu, Mar 21 2024 11:24 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement