Leela
-
లైఫ్ స్టయిల్ మారుద్దాం..!
ఈ రోజుల్లో...ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం!? పిల్లలు ఎలా ఎదుగుతున్నారు? ఉరుకుల పరుగుల జీవనంలో ఇవన్నీ సహజమే అని వదిలేస్తే ..‘భవిష్యత్తు తరాలు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు’ అంటున్నారు లీ హెల్త్ డొమైన్ డైరెక్టర్ లీలారాణి. ఆరోగ్య విభాగంలో న్యూట్రాస్యు టికల్, ఫుడ్ సప్లిమెంట్ ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధిపై దృష్టిపెట్టే ఈ సంస్థ ద్వారా మన జీవనవిధానం వల్ల ఎదుర్కొనే సమస్యలకు మూలకారణాలేంటి అనే విషయంపై డేటా సేకరించడంతో పాటు, అవగాహనకు కృషి చేస్తున్నారు. హెల్త్ అండ్ వెల్నెస్, సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ ఏపీ చాంబర్స్, విశాఖపట్నం జోన్ చెయిర్ పర్సన్‌గానూ ఉన్న లీలారాణి మహిళలు, పిల్లల ఆరోగ్య సమస్యలపై డేటా వర్క్, బేసిక్ టెస్ట్‌లు చేస్తూ తెలుసుకుంటున్న కీలక విషయాలను ఇలా మన ముందుంచారు.. ‘‘ప్రస్తుత జీవన విధానం, తీసుకునే ఆహారం వల్ల పిల్లలకు ఎలాంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తున్నాయి అనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు స్కూళ్లవైపుగా డేటా సేకరించాలనుకున్నాం. ముందు 8–10 ఏళ్ల పిల్లలకు స్కూళ్లలో ఇటీవలప్రారంభించాం. ఊర్జాప్రాజెక్టులో భాగంగా బేసిక్ న్యూట్రిషన్ ఫోకస్డ్ ఫిజికల్ ఎగ్జామినేషన్స్ చేస్తున్నాం. ఈ టెస్ట్ ద్వారా పిల్లల్లో .. ఆహారానికి సంబంధించిన సమస్యలు ఏమన్నాయి, తల్లిదండ్రులు– కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఎంత సమయం గడుపుతున్నారు, శారీర చురుకుదనం, డిజిటల్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, నిద్ర సమస్యలు ఏంటి.. ఇలా కొన్నింటితో ఒక ప్రశ్నాపత్రం రూపొందించాం. పిల్లల దగ్గర సమాధానాలు తీసుకొని, వాటిలో ప్రధాన సమస్యలపై ఫోకస్ పెట్టాం. ఆంధ్రా, తెలంగాణలోని స్కూళ్లలో పెద్ద స్థాయిలో డేటా తీసుకోవాలని ప్రారంభించాం. ఇప్పుడైతే 200 మంది పిల్లలతో విశాఖపట్నంలో ఈ డేటా మొదలుపెట్టాం. 8–15 ఏళ్ల వయసులో .. పిల్లలతో కలిసి రోజువారి జీవనవిధానం గురించి చర్చించినప్పుడు ‘మా పేరెంట్స్ బిజీగా ఉంటారు. వాళ్లు డిజిటల్ మీడియాను చూస్తారు, మేమూ చూస్తాం.’ అని చెబుతున్నారు. ఈ వయసు పిల్లలు సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉండటమే కాకుండా, చురుకుగా ఉంటున్నారు. కారణం అడిగితే – ‘అమ్మనాన్నలను ఏదైనా విషయం గురించి అడిగితే చెప్పరు. అందుకని డిజిటల్లో షేర్ చేసుకొని తెలుసుకుంటాం’ అంటున్నారు. తెలియని వ్యక్తులతో పరిచయాలు ఈ విధంగా పెంచుకుంటూ సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి స్కూళ్లలో ఎలాంటి గేమ్స్ ఉన్నాయి, ఇంటి బయట ఎలా ఉంటున్నారు,.. అనేది కూడా ఒక డేటా తీసుకుంటున్నాం. 8–15 ఏళ్ల లోపు పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోవడం వల్ల వారు యంగేజ్కు వచ్చేసరికి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తించాం. ఊబకాయమూ సమస్యే ఎగువ మధ్యతరగతి పిల్లల్లో ఊబకాయం అనేది ప్రధాన సమస్యగా ఉంది. డబ్యూహెచ్ఓ సూచించిన టెస్ట్‌లు చేసినప్పుడు ఈ విషయాలు గుర్తించాం. వాటిలో శారీరక చురుకుదనం లోపించడమే ప్రధానంగా కారణంగా తెలుసుకున్నాం. బయట జంక్ ఫుడ్ నెలలో ఎన్ని సార్లు తీసుకుంటున్నారు అనేదానిపైన రిపోర్ట్ తయారుచేశాం. పిల్లల నుంచి సేకరించిన రిపోర్ట్‌ను ఆ స్కూళ్లకు ప్రజెంట్ చేస్తున్నాం. ఆ రిపోర్ట్‌లో ‘మీ స్కూల్ కరిక్యులమ్‌లో చేర్చదగిన అంశాలు అని ఓ లిస్ట్ ఇస్తున్నాం. వాటిలో, చురుకుదనం పెంచే గేమ్స్‌తో పాటు న్యూట్రిషన్ కిచెన్, గార్డెనింగ్.. వంటివి ఒకప్రాక్టీస్గా చేయించాలని సూచిస్తున్నాం. ముందుగా 40 ఏళ్ల పైబడినవారితో.. రెండేళ్ల క్రితం ఒక కార్పోరేట్ సెక్టార్లో దాదాపు పది వేల మందికి (40 ఏళ్లు పైబడినవారికి) ఎన్జీవోలతో కలిసి బిఎమ్డి టెస్ట్ చేశాం. వీరిలో బోన్డెన్సిటీ తక్కువగా ఉండటమే కాకుండా, మానసిక ప్రవర్తనలు, నెగిటివ్ ఆలోచనలు, స్ట్రెస్ ఇండెక్స్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్.. వంటివి దేని వల్ల వస్తున్నాయి అనేది తెలుసుకున్నాం. నిజానికి 60 ఏళ్ల పైబడి న వారి బోన్ డెన్సిటీ బాగుంది. కారణం, ఆ రోజుల్లో వారు చేసే శారీరక శ్రమయే కారణం. ఇప్పుడది తగ్గిపోయింది. పరిష్కారాలూ సూచిస్తున్నాం.. ఎక్కడైతే టెస్ట్‌లు చేశామో, వారి జీనవవిధానికి తగిన సూచనలూ చేస్తున్నాం. ఆరోగ్య సమస్యలు ఏవి అధికంగా వస్తున్నాయో తెలుసుకుని, వాటిని పరిష్కరించుకునే విధానాలను సూచిస్తున్నాం. చాలావరకు ఈ వయసు వారిలోనూ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లే సమస్యలు. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్ నుంచి ఈ సమస్య అధికంగా ఉంది. పని ప్రదేశంలో శరీర కదలికలు లేకపోడం, అక్కడి వాతావరణం, స్క్రీన్ నుంచి వచ్చే సమస్యలు, డిజిటల్ ఎక్స్పోజర్.. వీటన్నింటినీ ఒక్కొక్కరి నుంచి తీసుకొని వారికి తగిన సూచనలు ఇస్తూ వచ్చాం. సమస్యలు ఎక్కువ ఉన్నవారి బాల్య దశ గురించి అడిగితే మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. బాల్య దశ కీలకం పెద్దవాళ్లలో సమస్యలు గమనించినప్పుడు వారి బాల్య దశ కీలకమైందని గుర్తించాం. దీంతో పిల్లల్లోనే ముందుగా సమస్యను పరిష్కరిస్తే మంచిదని, పిల్లల్లో పరీక్షలు చేసినప్పుడు వారిలో బోన్డెన్సిటీ సమస్య కనిపించింది. దీని గురించి డాక్టర్లతో చర్చించినప్పుడు మూల కారణం ఏంటో తెలిసింది. ఒకప్పుడు గ్రామాల్లో పిల్లలు పరిగెత్తడం, గెంతడం, దుమకడం.. వంటివి చాలా సహజసిద్ధంగా జరిగిపోయేవి. వారి ఆటపాటల్లో శారీరక వ్యాయామం చాలా బాగుండేది. అది ఈ రోజుల్లో లేదు. క్రీడలు కూడా వృత్తిపరంగా ఉన్నవే తప్ప ఆనందించడానికి లేవు. ఒక స్ట్రెస్ నుంచి రిలీవ్ అయ్యే ఫిజికల్ యాక్టివిటీ రోజులో ఇన్ని గంటలు అవసరం అనేది గుర్తించి, చెప్పాలనుకున్నాం. భవిష్యత్తులో రాబోయే ఆరోగ్యసమస్యలను భరించడం కన్నా ముందే జాగ్రత్తపడటం మంచిది. మధ్య తరగతే కీలకం మధ్యతరగతి, దానికి ఎగువన ఉన్న పిల్లల్లో శారీరక చురుకుదనం లోపం ఎక్కువ కనిపించింది. వారి ఎముక సామర్థ్యం బలంగా లేకపోతే భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్యసమస్యలను ఎదుర్కోక తప్పదు. పిల్లలు ఎదిగే దశలో వారి ఆహారం, అలవాట్లు బాగుండేలా చూసుకోవాలి. ఈ విషయంలో కార్పొరేట్ కన్నా ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు బాగానే ఉన్నారు. ఈ అన్ని విషయాలపై ఇంకా చాలా డేటా సేకరించాల్సి ఉంది. ముందు మానసిక సమస్యలు అనుకోలేదు. కానీ, సైకలాజికల్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. కుటుంబంలో ఉన్నవారితో సరైన ఇంటరాక్షన్స్ తగ్గిపోయినట్టుగా తెలుస్తోంది. ఎక్కువ డిజిటల్ మీడియాలో ఉండటం వల్ల కంటి సమస్యలు, కుటుంబంతో గ్యాప్ ఏర్పడం వంటివి జరుగుతున్నాయి. ఈ విషయాలను అవగాహన చేసుకొని, మన జీవన విధానంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది’ అని తెలియజేశారు. లీలారాణి. – నిర్మలారెడ్డి -
సెల్ నెంబరే కీలకం!
బంజారాహిల్స్: సినీ ఫక్కీలో జరిగిన జూబ్లీహిల్స్ దొంగతనం కేసులో నిందితుడి జాడ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఒక వైపు టాస్‌్కఫోర్స్ పోలీసులు, ఇంకోవైపు క్రైం పోలీసులు ఎనిమిది బృందాలుగా రాష్ట్రంతో పాటు సరిహద్దులు, ఇతర రాష్ట్రాలను జల్లెడపడుతున్నాయి. ఎనిమిది గంటల పాటు గర్భిణిని బంధించి మెడపై కత్తి పెట్టి రూ.10 లక్షలతో ఉడాయించిన ఘటనలో నిందితుడు వాడిన సెల్‌ఫోన్ నెంబర్ కీలకంగా మారనుంది. మూడుచోట్ల ఈ సెల్‌ఫోన్ వినియోగించడంతో పోలీసులు టవర్‌డంప్ చేస్తూ నిందితుడు ఎవరెవరితో మాట్లాడాడు.. ఫోన్ నెంబర్ ఏంటి అన్నదానిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఒకటి, రెండు రోజుల్లో నిందితుడి ఆచూకీ పట్టుకునే దిశలో పోలీసులు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. వైన్ బాటిల్ ఖాళీ చేశాడు... జూబ్లీహిల్స్ రోడ్ నెం.52లో నివసించే ప్రముఖ వ్యాపారి నడింపల్లి సత్యనారాయణ రాజు అలియాస్ ఎన్ఎస్ఎన్.రాజు ఇంట్లోకి గురువారం రాత్రి గుర్తు తెలియని ఆగంతకుడు ప్రవేశించాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఎన్ఎస్ఎన్ రాజు ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించాడు. అదే సమయంలో శుభకార్యం ముగించుకొని ఇంటికి వచ్చి న రాజు..ఆయన పెద్ద కూతురు అత్త, మామలు ఇంట్లోకి రాగా వారి వెనుకాలనే నిందితుడు కూడా ప్రవేశించాడు. కొద్దిసేపటికే ఇంట్లోకి వచ్చిన పనిమనిషి అక్కడ నిల్చున్న ఆగంతకుడిని చూసి ఎన్ఎస్ఎన్.రాజు పెద్ద కూతురి అత్త, మామల డ్రైవర్ అని భ్రమపడి లోనికి వెళ్లిపోయింది. కొద్దిసేపట్లోనే పెద్ద కూతురు అత్తమామలు వెళ్ళిపోగా రాజు ఆయన భార్య లీల తమ గదిలో నిద్రించారు. మరో గదిలో చిన్న కూతురు నవ్య వర్క్‌ఫ్రం హోం ముగించుకొని రాత్రి 1.30 గంటల సమయంలో వాట్సాప్ మెసేజ్ చూస్తుండగా ఆగంతకుడు ఆమె బెడ్రూమ్లోకి ప్రవేశించాడు. అరిస్తే పొడిచేస్తానంటూ కత్తి చూపి బెదిరించాడు. దీంతో ఆమె నోరు మెదపలేదు. తనకు రూ. 20 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. ఇంట్లో అరకిలో ఆభరణాలు ఉన్నాయని, తన చెవులకు రూ.15 లక్షల విలువ చేసే వజ్రాలు పొదిగిన కమ్మలు ఉన్నాయని, అవి తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేయగా తనకు కేవలం డబ్బులే కావాలని, నగలు కాదని చెప్పాడు. ఓ వైపు ఆమెతో మాట్లాడుతూనే ఇంకోవైపు ఇంట్లోనే ఉన్న వైన్ తాగుతూ..ఆమెతో ముచ్చటిస్తూ మరో వైపు తన ఫోన్లో చాటింగ్‌చేస్తూ ఇంకోవైపు రూ.20 లక్షలు ఎలాగైనా తెప్పించాలంటూ ఆమెపై ఒత్తిడి పెంచాడు. మాట వినకపోతే పొడుస్తానంటూ తరచూ ఆమెను బెదిరించసాగాడు. ఆమె ఇంటి విషయాలపై కూడా చర్చించాడు. మీ అక్క నాలుగేళ్ల కూతురు ఉండాలి కదా..ఆమె ఎక్కడ అంటూ ప్రశ్నించాడు. మీ గుట్టు మొత్తం నాకు తెలుసు డబ్బులు లేవంటే నమ్మను అంటూ లీలను హెచ్చరించాడు. ఇంట్లో నుంచే ఫోన్లో చాటింగ్ చేస్తూ వారితో మాట్లాడుతూ వారి యోగ క్షేమాలు తెలుసుకుంటూ కుటుంబ వివరాలు కనుక్కుంటూ డబ్బులు వచ్చేదాకా కాలంగడిపాడు. రెక్కీ నిర్వహించిన సమయంలో రోడ్డుపై ఒకసారి నిందితుడు ఫోన్లో మాట్లాడినట్లుగా ఇక్కడ సీసీ ఫుటేజీలు స్పష్టం చేస్తున్నాయి. ఇంట్లో ఛాటింగ్ చేసిన విషయం కూడా బాధితురాలు తెలిపింది. షాద్‌నగర్‌లో కారు దిగి బస్టాప్‌కు వెళ్లే క్రమంలో ఓ చోట ఆగి ఫోన్ మాట్లాడినట్లుగా అక్కడి సీసీఫుటేజీలు వెల్లడిస్తున్నాయి. ఈ మూడు సంఘటనల్లో సెల్‌ఫోన్ సిగ్నల్స్‌పైనే పోలీసులు ప్రధానంగా దృష్టిపెట్టారు. తనది నాందేడ్ అని నిందితుడు చెప్పిన క్రమంలో ఓబృందం అటు వైపు వెళ్ళింది. మరో బృందం బెంగళూరుకు, గోవాకు, ముంబైకి వెళ్ళింది. -
ఆరు గంటలు.. ఇంట్లోనే మకాం వేసి.. 10 లక్షలు దోచేసి.. క్యాబ్‌లో చెక్కేసి..
బంజారాహిల్స్ (హైదరాబాద్): తల్లి, కూతురును కత్తితో బెదిరించి ఓ ఆగంతకుడు రూ.10 లక్షలతో ఉడాయించాడు. నిందితుడి కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం. 52లో ప్రముఖ వ్యాపారి ఎన్.ఎస్.ఎన్.రాజు నివాసం ఉంటున్నారు. కుటుంబం అంతా గురువారం రాత్రి ఓ శుభకార్యానికి వెళ్లి శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి వరకు ఇంటి పరిసరాల్లో కాపుకాసిన ముసుగు ధరించిన ఓ యువకుడు.. గోడ మీదుగా నిచ్చెన వేసుకొని ఇంటి ఆవరణలో దిగాడు. రాజు కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్తున్న సమయంలోనే వారి కళ్లుగప్పి లోనికి ప్రవేశించాడు. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో రాజు కూతురు నడింపల్లి నవ్య (30) ఉంటున్న గదిలోకి వెళ్లి కత్తి చూపించి బెదిరించాడు. ఈ హఠాత్ పరిణామంతో ఎనిమిదిన్నర నెలల నిండు గర్భిణి అయిన నవ్య.. ఆ ఆగంతకుడిని చూసి వణికిపోయింది. అరిచేందుకు యత్నించగా.. ఆమెను కత్తితో పొడుస్తానని హెచ్చరించాడు. రూ.10 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. తన ఒంటి మీద, బీరువాలో ఉన్న నగలు ఇస్తానని తన దగ్గర నగదు లేదని ఆమె వేడుకుంది. అయినాసరే ఆ దొంగ వినిపించుకోలేదు. ఈ క్రమంలో నవ్య పెట్టిన కేకలతో అప్రమత్తమైన ఆమె తల్లి లీల(54) ఆ గదిలోకి పరిగెత్తుకురాగా.. ఆ ఆగంతకుడు ఆమెను కూడా కత్తితో బెదిరించి ఓ మూలన కూర్చోబెట్టాడు. ఎవరికైనా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బులు తెప్పించాల్సిందిగా బెదిరించాడు. దీంతో నవ్య డబ్బులు కావాలని తన భర్తకు ఫోన్ చేసింది. ఆయన రూ. 8 లక్షలు ఆమె బావతో పంపించాడు. దీంతో లీల గేటు వద్దకు వచ్చి అతడి నుంచి నగదు తీసుకొని లోనికి వెళ్లింది. ఈ విషయం ఎవరికైనా చెప్తే కూతురును హత్య చేస్తానని బెదిరించడంతో ఆమె రూ. 8 లక్షలు తీసుకొచ్చిన అల్లుడికి ఈ విషయం చెప్పలేదు. ఈ విషయాలు ఏమీ తెలియని ఎన్.ఎస్.ఎన్.రాజు తన గదిలో నిద్రిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉదయం 10 గంటల సమయానికి తల్లీ, కూతురు ఇంట్లో ఉన్న రూ. 2 లక్షల నగదు కలిపి మొత్తం రూ.10 లక్షలను నిందితుడి చేతిలో పెట్టారు. అనంతరం నవ్య మొబైల్ ఫోన్ నుంచి ఓలా క్యాబ్ బుక్ చేయగా ఆగంతకుడు అందులో పరారయ్యాడు. షాక్ నుంచి తేరుకున్న బాధితులు ఉదయం 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓలా క్యాబ్‌లో నిందితుడు షాద్‌నగర్ బస్టాప్‌లో దిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆరుగంటల పాటు తల్లీ, కూతురును గదిలో బంధించి రూ. 10 లక్షలతో ఉడాయించిన ఆగంతకుడిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. క్లూస్‌టీమ్, డాగ్‌స్కా్వడ్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. క్యాబ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు తెలుగు, ఇంగ్లిష్‌లో మాట్లాడినట్లు క్యాబ్ డ్రైవర్ వెల్లడించడంతో పోలీసులు పాత నేరస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు. -
బ్రూక్‌ఫీల్డ్ చేతికి లీలా హోటల్స్!
ముంబై: కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ భారత ఆతిథ్య రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ సంస్థ హోటల్ లీలా వెంచర్‌ను చెందిన హోటళ్లను, బ్రాండ్‌ను రూ.4,500 కోట్లకు కొనుగోలు చేయనున్నదని సమాచారం. భారీ రుణభారంతో కుదేలైన హోటల్ లీలా వెంచర్‌కు ఈ డీల్ ఊరట నిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హోటల్ లీలా వెంచర్‌కు రూ.3,799 కోట్ల మేర రుణభారం ఉంది. తుది దశలో డీల్...! ఈ డీల్‌లో భాగంగా హోటల్ లీలా వెంచర్‌కు సంబంధించిన మొత్తం ఐదు లగ్జరీ హోటళ్లలో కనీసం నాలుగింటిని బ్రూక్‌ఫీల్డ్ కొనుగోలు చేయనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్‌లో భాగంగా ఈ హోటల్‌కే చెందిన ఆగ్రాలోని ఒక భారీ నివాస స్థలాన్ని కూడా బ్రూక్‌ఫీల్డ్ కొనుగోలు చేయనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్ బహుశా... వచ్చే ఏడాది ఆరంభంలోనే పూర్తికావచ్చని అంచనా. డీల్ దాదాపు తుది దశలో ఉందని, డీల్ సంబంధ వివరాలు నెల రోజుల్లోపలే వెల్లడవుతాయని, లీలా బ్రాండ్‌ను కూడా బ్రూక్‌ఫీల్డ్ కొనుగోలు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. 4– 5 ఏళ్ల నుంచి ప్రయత్నాలు 1986లో సి.పి.కృష్ణన్‌నాయర్ ప్రారంభించిన హోటల్ లీలా వెంచర్స్... ఒకప్పుడు ఇండియన్ హోటల్స్ కంపెనీ, తాజ్ హోటల్స్, ఈఐహెచ్లకు గట్టి పోటీనిచ్చింది. ప్రస్తుతం హోటల్ లీలా వెంచర్ ఐదు లగ్జరీ హోటళ్లను నిర్వహిస్తోంది. న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, ఉదయ్‌పూర్‌లో ఉన్న ఈ లగ్జరీ హోటళ్లలో మొత్తం గదుల సంఖ్య 1,400గా ఉంది. రుణ భారం తగ్గించుకోవడానికి 2014లో వాణిజ్య రుణ పునర్వ్యస్థీకరణ కోసం హోటల్ లీలా వెంచర్ ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో తన రుణాలను అసెట్ రీస్ట్రక్చరింగ్ సంస్థ, జేఎమ్ ఫైనాన్షియల్ ఏఆర్సీకి బదిలీ చేసింది. 2017 సెప్టెంబర్‌లో జేఎమ్ ఏఆర్సీకి రూ.275 కోట్ల విలువైన 16 లక్షల షేర్లను కేటాయించడం ద్వారా రుణాన్ని ఈక్విటీగా మార్చింది. హోటల్ లీలా వెంచర్లో జేఎమ్ ఏఆర్సీకి 26 శాతం వాటా ఉంది. భారీగా పేరుకుపోయిన రుణ భారాన్ని తగ్గించుకోవడానికి హోటళ్లను, ఖాళీ స్థలాన్ని విక్రయించాలని హోటల్ లీలావెంచర్ గత నాలుగు–ఐదేళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. -
అమ్మ ఆశీర్వాదం
రజనీకాంత్ ‘కాలా’ సినిమాలో జరీనా పాత్రలో కనిపించారు హ్యూమా ఖురేషీ. ఈ సినిమాలో హ్యూమాని రజనీకాంత్ చిట్టెమ్మా అని పిలిచిన సీన్స్ గుర్తుండే ఉంటాయి. ఇప్పుడీ చిట్టెమ్మ లీలాగా మారారు. కానీ సినిమా కోసం కాదు. ఓ వెబ్ సిరీస్ కోసం. దీపా మెహ్తా దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘నా ఫస్ట్ వెబ్ సిరీస్ ‘లీలా’లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నన్ను ఈ సెట్‌కి స్వయంగా మా అమ్మ (అమీనా ఖురేషీ) డ్రాప్ చేశారు. ఈ సిరీస్ సక్సెస్ కావాలని ప్రార్థనలు చేసి, నన్ను ఆశీర్వదించారు’’ అని పేర్కొన్నారు హ్యూమా ఖురేషి. ఈ సిరీస్ కోసం శంకర్ రామన్, పవన్ కుమార్‌లు కూడా వర్క్ చేస్తారని ఆమె పేర్కొన్నారు. అలాగే ఈ సిరీస్‌లో నటుడు సిద్ధార్థ్ ఓ లీడ్ రోల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. వెబ్ సిరీస్‌లతో పాటు వెండితెరపై రాణించేందుకు కూడా కథలు వింటున్నారట హ్యూమా ఖురేషి. -
నమ్మను.. నా భార్య బతికే ఉంటుంది
పేపర్ తెరిచినా, టీవీ ఆన్ చేసినా.. ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్తను చంపిన భార్య అని ఒక వార్త, భార్య తనంతట తానుగా విడాకులు కోరితే భరణం ఇచ్చే బాధ తప్పుతుందనే కుయుక్తి పన్నే భర్త.. తరచూ ఇలాంటి వార్తలే కనిపిస్తున్నాయి. సమాజంలో బంధాలు బలహీనపడుతున్నాయని ఆవేదనను మిగులుస్తూ పేజీ తిప్పేస్తాం. ఇలాంటి స్వార్థాల మధ్య రాతికి పూచిన పువ్వులా పరిమళించిందో ప్రేమ. ‘బంధం’ అంటే ఇదీ, ఇలా ఉండాలి.. అని సంతోషపడే సంఘటన ఇది. ఏడడుగుల బంధం, ఏడు జన్మల బంధం.. ఇద్దరు మనుషులను ఒకరి కోసం మరొకరు బతికేలా చేస్తుందని నిరూపించిన సినిమా కథలాంటి వాస్తవం. విజేంద్ర సింగ్ రాథోడ్‌ది రాజస్తాన్ రాష్ట్రంలోని అజ్మీర్. అతడి ఉద్యోగం ట్రావెల్స్ ఆఫీస్‌లో. ఉద్యోగరీత్యా విజేంద్ర అనేక పుణ్యక్షేత్రాలు, ఇతర పర్యాటక ప్రదేశాలకు వెళ్లాడు. అయితే కేదార్నాథ్ (చార్ధామ్) యాత్రకు మాత్రం తన భార్య లీలను కూడా తీసుకెళ్లాలనుకున్నాడు. అలాగే ఆమెకోసం టికెట్ తీసుకున్నాడు. ఇది జరిగింది 2013లో. విలయం విడదీసింది జూన్ నెల 12వ తేదీ.. ఐదేళ్ల క్రితం కేదార్‌నాథ్‌ను ఊహించని రీతిలో భారీ వరదలు ముంచెత్తిన రోజది. కొండ చరియలు విరిగి పడి, భవనాలు కూలిపోయి, రోడ్లు కొట్టుకుపోయి, మనుషులను చెట్టుకొకర్ని పుట్టకొకర్ని విసిరేసిన విపత్తు అది. నాలుగు రోజుల పాటు విజేంద్ర, లీల ఒకరి చేతిని ఒకరు వదలకుండా కాపాడుకోగలిగారు. ఆ తర్వాత... ఆ ప్రళయం లీలను విజేంద్ర నుంచి దూరం చేసి ఏ తీరానికి చేర్చిందనేది ఆ ఇద్దరికీ తెలియదు. తానెక్కడున్నదీ తెలియక, జీవిత భాగస్వామి ఎక్కడున్నదీ ఆచూకీ లేక ఇద్దరూ తల్లడిల్లిపోయారు. విజేంద్ర భార్య కోసం వెతుకుతున్నాడు. అతడి చేతిలో ఉన్న ఏకైక ఆధారం లీల ఫొటో మాత్రమే. కనిపించిన ప్రతి ఒక్కరికీ ఆమె ఫొటో చూపిస్తూ ‘‘ఈమెను చూశారా, తెలిస్తే చెప్పండి’’ అని అభ్యర్థిస్తున్నాడు. రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి కానీ లీల ఆచూకీ లేదు. వరద తగ్గుముఖం పట్టి మామూలు పరిస్థితికి వచ్చింది. లక్షల్ని తృణీకరించాడు ఉత్తరాఖండ్ ప్రభుత్వాధికారులు కనిపించకుండా పోయిన వారిని మరణించి ఉండవచ్చనే నిర్ధారణకు వచ్చేశారు. వాళ్ల వాళ్లకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించేశారు. ఆ జాబితాలో లీల పేరు కూడా ఉంది. లీల పేరుతో ఎక్స్‌గ్రేషియా తొమ్మిది లక్షలు తీసుకుని అజ్మీర్‌కి వెళ్లి పొమ్మని విజేంద్ర బాధ చూడలేక మనసు కదిలిపోయిన వాళ్లంతా చెప్పారు. లీల బతికి లేదని నమ్మడానికి అతడు ఇష్టపడలేదు, ఆమె పేరుతో ఇచ్చే డబ్బు తాకడానికి అతనికి మనసొప్పలేదు. తన భార్య బతికే ఉంటుందనీ, తనకు ఎక్స్‌గ్రేషియా అక్కర్లేదనీ ఆమెను వెతకడానికి మరో ఊరికి వెళ్లిపోయాడు. అలా వెయ్యి గ్రామాలకు తక్కువ కాకుండా తిరిగాడు. విజేంద్రను ఇంటికి వచ్చేయమని పిల్లలు ప్రాధేయపడ్డారు. ఆస్తుల్ని అమ్మేశాడు చివరికి వారి మాట విని ఇంటికి వెళ్లాడు విజేంద్ర. కానీ అక్కడ ఉండిపోవడానికి కాదు. స్థిరాస్తులు అమ్మేసి పిల్లలు బతకడానికి ఓ మార్గాన్ని చూపించి, కొంత డబ్బు తీసుకుని మళ్లీ భార్యను వెతకడానికి బయలుదేరాడు. ఊళ్లో వాళ్లు, బంధువులు, ఇంట్లో వాళ్లు కూడా అతడికి మతిపోయిందనే నిర్ధారణకు వచ్చేశారు. విజేంద్ర మాత్రం తన నమ్మకాన్ని కోల్పోలేదు. ఊరూరూ తిరగ్గా తిరగ్గా ఉత్తరాఖండ్, గొంగోలీ గ్రామంలో ఒకరు చెప్పిన మాటతో అతడికి ప్రాణం లేచివచ్చింది. ఆనవాళ్లననుసరించి లీల ఉన్న చోటకు వెళ్లాడు. ఆ ఒకరు చెప్పినట్లే లీల మతిస్థిమితం లేని కండిషన్లో కనిపించింది. మౌనంగా కూర్చుని ఉంది. ఎవరైనా పలకరిస్తే పలుకుతుంది, అది కూడా ఒకటి– రెండు మాటలే. ఎవరైనా ఏదైనా పెడితే తింటుంది. ఎవరూ పెట్టకపోతే అలాగే ఉంటుంది. ఇవీ ఆమె గురించి ఆ గ్రామస్థులు చెప్పిన మాటలు.వరదలు, ఒంటరితనం, భయంతో కూడిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదామె. బంధానికి కొత్త నిర్వచనం వెంటనే లీలను అజ్మీర్‌కి తీసుకొచ్చాడు విజేంద్ర. ఇన్నేళ్లు ఏమైపోయిందనే ప్రశ్నలు అడిగితే ఆమె మెదడులో కల్లోలం ఏర్పడుతుందేమోననే ఆందోళనతో... ఇంట్లో వాళ్లు ఎవరూ ఏమీ అడగడం లేదామెను.వేళకు భోజనం పెట్టి తినమని, నీళ్లు పెట్టి స్నానం చేయమని పిల్లలకు చెప్పినట్లు ఆమెకు చెబుతున్నారు. ఆమె మానసిక స్థితి మెరుగుపడుతుందని, ముఖంలో నవ్వు విరుస్తుందనే నమ్మకంతో ఎదురు చూస్తున్నాడిప్పుడు విజేంద్ర. భార్యాభర్తల బంధానికి కొత్త నిర్వచనం చెప్పిన భర్త విజేంద్ర. అతడి గురించి తెలిసిన బాలీవుడ్ నిర్మాత సిద్ధార్థ రాయ్ కపూర్ ఇప్పుడు సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు. – మంజీర -
గుండూరావ్ గెలుపును అడ్డుకోగలరా ?
జయనగర : గాంధీనగర నియోజకవర్గంలో గత నాలుగు ఎన్నికల్లో వరుసగా విజయం సాధిస్తున్న కేపీసీసీ కార్యాధ్యక్షుడు దినేశ్ గుండూరావ్ గెలుపు అడ్డుకట్ట వేయడానికి బీజేపీ, జేడీఎస్ పార్టీలు వ్యూహాలు పన్నుతున్నారు. గత రెండు ఎన్నికల్లో దినేశ్ గుండూరావ్ ప్రత్యర్థిగా పోటీ చేసిన పీసీ.మోహన్ ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి బరిలోకి దిగడానికి పలువురు టికెట్లు కోసం పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి నగర కార్యదర్శి ఎస్.నరేశ్‌కుమార్, చిక్కపేటే కార్పోరేటర్ లీలా శివకుమార్, ఆమె భర్త ఎల్.శివకుమార్, మాజీ ఎంఎల్సీ రామచంద్రేగౌడ కుమారుడు సప్తగిరిగౌడ, విశ్రాంత ఏసీసీ గంగాధర్, మాజీ కార్పోరేటర్ గోపాలకృష్ణ పేర్లు వినబడతున్నాయి. ఇక జేడీఎస్ పార్టీనుంచి సర్వోదయ నారాయణస్వామి టికెట్ రేసులో ఉండగా ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తమిళ ఓటర్లు కలిగిన గాంధీనగరలో ఈసారి ఏడీఎంకే పార్టీ నుంచి అభ్యర్థి బరిలోకి దిగే అవకాశం ఉంది. బెంగళూరు సెంట్రల్ లోకసభ నియోజకవర్గంలో బీజేపీ గెలుపొందగా నియోజకవర్గ పరిధిలో ఐదుగురు కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. గాంధీనగర నియోజకవర్గంలో చాలాప్రదేశాలు వాణిజ్య కేంద్రాలుగా ఉన్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గాంధీనగర, ఓకళిపుర, సుభాష్‌నగర, కాటన్‌పేటే మురికివాడ ప్రాంతాలు ఉన్నాయి, అన్నిమతాలకు చెందిన ఓటర్లు గాంధీనగర నియోజకవర్గంలో ఉన్నారు. గాంధీనగర నియోజకవర్గం ఏర్పడినప్పటికీ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ గత ఏడాది కురిసిన భారీవర్షాలకు ఆనందరావ్ రైల్వేఅండర్పాస్ వద్ద వర్షం నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మెజస్టిక్ వరకు ట్రాఫిక్సమస్య తలెత్తుతోంది. ఓకళిపుర జంక్షన్లో మల్లేశ్వరం, మెజస్టిక్, మాగడిరోడ్డుకు అనుసంధానంగా భారీ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులు గత ఐదేళ్లుగా జరుగుతున్నాయి. ఇటీవల టెండర్ష్యూర్ పథకం కింద కొన్ని రోడ్లు అభివృద్ధి చేపట్టారు. రాష్ట్రంలో అత్యంత పాత నియోజకవర్గంగా ఉన్న గాంధీనగర ను ఆదర్శనియోజకవర్గంగా తీర్చిదిద్దాలని డిమాండ్ ప్రజల్లో నెలకొంది. గాంధీనగర నియోజకవర్గ పరిధిలో 7 వార్డులు ఉండగా అందులో 5 వార్డుల్లో కాంగ్రెస్ కార్పోరేటర్లు ప్రాతినిథ్యం వహిస్తుండగా, రెండు వార్డుల్లో బీజేపీ కార్పోరేటర్లు గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,23,224 ఓట్లు కాగా పురుష ఓటర్లు 1,16,240, మహిళాఓటర్లు 1,06,978 ఓట్లు ఉన్నారు. కెంపేగౌడ బస్టాండు, కర్ణాటక ప్రజల ఆరాధ్యదైవం అణ్ణమ్మదేవి ఆలయం ఇక్కడే ఉంది. -
అమ్మాయి గోల శ్రీకృష్ణ లీల
సంచలన్ ఫిలింస్ పతాకం పై ప్రసాద్ లక్కన నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘అమ్మాయి గోల శ్రీకృష్ణ లీల’. కథానాయికగా లీల నటించారు. ఈ సినిమా టీజర్‌ను ప్రతాని రామకృష్ణగౌడ్, పి. సత్యారెడ్డి, మోహన్ రెడ్డిలు ఆవిష్కరించారు. ప్రతాని మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా ద్వారా ఆనందంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇలాంటి సినిమాను నిర్మించినందుకు నిర్మాతకు నా అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని అన్నారు. దర్శక–నిర్మాత లక్కన ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘సినిమా చాలా పవర్ఫుల్ మీడియమ్. దీని ద్వారా ఆక్యూప్రెజర్ వైద్య విధానాన్ని చెప్పదలచుకున్నాం. వినోదంతో పాటు ఆరోగ్య సంబంధమెన ఆలోచనలు రేకెత్తించే సన్నివేశాలు ఉంటాయి’’ అని అన్నారు. శ్రీకర సంగమేశ్వరా, యార్లగడ్డ శైలజ, రమణ చాందిని తదితరులు నటించిన ఈ సినిమాకు కెమెరా: ఆనంద్, ఎడిటింగ్: వర్మ, కథ–మాటలు: విద్వాన్ ప్రసాద్. -
లీల మాయలో..!
ఫ్రెండ్స్‌తో సరదాగా హాయిగా తిరిగే ఆ కుర్రాణ్ణి ప్రేమలో పడేసిందో చిన్నది. ఆమె పేరు లీల. పేరుకు తగ్గట్టే తన అందంతో అతణ్ణి మాయ చేసింది. అసలే చెల్లి వాళ్ల ఫ్రెండ్. ప్రేమగా ఆమెతో మాటలు కలిపాడు. మరి అతని ప్రేమ ఎన్ని మలుపులు తిరిగిందనే కథాంశంతో లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. ‘ఏ మాయచేశావే’ తర్వాత నాగచైతన్య హీరోగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. రచయిత కోన వెంకట్ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంజిమా మోహన్ కథానాయిక. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను టర్కీలో చిత్రీకరించారు. ఈ నెల 16 నుంచి 20 వరకూ జరిగే షూటింగ్‌తో ఈ సినిమా పూర్తవుతుంది. దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ- ‘‘ఎ.ఆర్. రెహ్మాన్ వినసొంపైన పాటలు అందించారు. ఇటీవల యూ-ట్యూబ్‌లో విడుదల చేసిన ‘ఎల్లిపోమాకే...ఎదనే వదిలి పోమాకే’ పాట ఇప్పటికే హిట్ అయింది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: డెక్మాక్ ఆర్థర్, ఆర్ట్: రాజీవన్. -
3రోజులు ఒంటరిగా శవాల మధ్య బాలుడు
-
జగద్గిరిగుట్టలో దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని జగద్గిరి గుట్టలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక కమలా ప్రసన్ననగర్ కాలనీలో శుక్రవారం దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాలనీలో ఉండే మంజునాథ, లీల లు భార్యభర్తలు. వీరికి ఏడాది వయస్సు ఉన్నపాప ఉంది. అయితే ఈ రోజు ఉదయం దంపతులిద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చిన్నారి ఏడుస్తుండటంతో గమనించిన స్థానికులు సంఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలిని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్యహత్యకు గల కారణాలు, ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది -
మాంగల్య బలం
రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లా భికంపుర గ్రామానికి చెందిన విజేంద్ర ఒక ట్రావెల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. జూన్ 12, 2013లో భార్య లీలతో పాటు, 30 మంది ప్రయాణికులతో తాను చేసే ట్రావెల్ కంపెనీ బస్సులో చార్ధామ్ యాత్రకు వెళ్లాడు. కానీ, దురదృష్టం మృత్యువరదైంది. చెల్లిని కోల్పోయిన అన్న, కొడుకును కోల్పోయిన తండ్రి, తండ్రి చావు చూసిన కొడుకు... గుండె చెరువయ్యేంత విషాదం. ఈ వరదల్లో విజయేంద్ర కూడా తన భార్య లీలను కోల్పోయాడు. ఆమె కోసం వెదకని చోటు లేదు. కలవని అధికారి లేడు. మొక్కని కాలు లేదు. ఎక్కడా ఆమె జాడలేదు. వారాలు గడిచాయి. నెలలు గడిచాయి. ఏడాదిన్నర అయింది. బంధువులందరూ ఆశ వదులుకున్నారు. ఆమె చనిపోయిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి, 9 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా ఇచ్చింది. కానీ విజేంద్రకు ఎక్కడో ఒక నమ్మకం. తన భార్య ఎక్కడో ఒక చోట బతికే ఉందని. దేవుడి దయ తన మీద ఉందని. అందుకే... ఏ రోజు అయితే తన భార్య కనిపించకుండా పోయిందో, ఆరోజు నుంచి ఉత్తరాఖండ్‌ను విడిచివెళ్లలేదు అతను. చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా భార్యను వెదుక్కుంటూ వేలాది గ్రామాలకు వెళ్లాడు. కనిపించిన వారికల్లా ఆమె ఫోటోను చూపించాడు. 2015 జనవరి 27. చివరికి ఎవరో చెప్పారు. ‘‘గోంగోలి అనే ఊళ్లో ఒక అమ్మాయి మతిస్థిమితం లేకుండా తిరుగుతోంది. నీ దగ్గర ఉన్న ఫొటోలో ఉన్న అమ్మాయిలాగే ఉంది’’ అని చెప్పారు. పరుగుపరుగున ఆ ఊరికెళ్లాడు విజేంద్ర. అదృష్టం ఏమిటంటే ఆమె అతడి భార్యే! దురదృష్టమేమిటంటే... లీలా ఇప్పుడు మాట్లాడడం లేదు. ఎవరినీ గుర్తు పట్టడం లేదు కూడా. అయితే ఇప్పుడిప్పుడే మార్పు వస్తోందట. ఆమె తిరిగి మామూలు మనిషయ్యే రోజు కోసం, జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసుకునే రోజు కోసం ఇంటిల్లిపాది ఆశగా ఎదురుచూస్తోంది.