అమ్మ ఆశీర్వాదం | Huma Qureshi over the moon' to be directed by Deepa Mehta | Sakshi
Sakshi News home page

అమ్మ ఆశీర్వాదం

Published Sun, Nov 11 2018 5:53 AM | Last Updated on Sun, Nov 11 2018 5:53 AM

Huma Qureshi over the moon' to be directed by Deepa Mehta - Sakshi

అమీనా, దీపాతో హ్యూమా

రజనీకాంత్‌ ‘కాలా’ సినిమాలో జరీనా పాత్రలో కనిపించారు హ్యూమా ఖురేషీ. ఈ సినిమాలో హ్యూమాని రజనీకాంత్‌ చిట్టెమ్మా అని పిలిచిన సీన్స్‌ గుర్తుండే ఉంటాయి. ఇప్పుడీ చిట్టెమ్మ లీలాగా మారారు. కానీ సినిమా కోసం కాదు. ఓ వెబ్‌ సిరీస్‌ కోసం. దీపా మెహ్‌తా దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘నా ఫస్ట్‌ వెబ్‌ సిరీస్‌ ‘లీలా’లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నన్ను ఈ సెట్‌కి స్వయంగా మా అమ్మ (అమీనా ఖురేషీ) డ్రాప్‌ చేశారు. ఈ సిరీస్‌ సక్సెస్‌ కావాలని ప్రార్థనలు చేసి, నన్ను ఆశీర్వదించారు’’ అని పేర్కొన్నారు హ్యూమా ఖురేషి. ఈ సిరీస్‌ కోసం శంకర్‌ రామన్, పవన్‌ కుమార్‌లు కూడా వర్క్‌ చేస్తారని ఆమె పేర్కొన్నారు. అలాగే ఈ సిరీస్‌లో నటుడు సిద్ధార్థ్‌ ఓ లీడ్‌ రోల్‌లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. వెబ్‌ సిరీస్‌లతో పాటు వెండితెరపై రాణించేందుకు కూడా కథలు వింటున్నారట హ్యూమా ఖురేషి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement