
బాలీవుడ్ బ్యూటీ హ్యూమాఖురేషీ, సిద్ధార్థ్ (బొమ్మరిల్లు ఫేమ్)లకు జోడీ కుదిరిందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. రజనీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘కాలా’ సినిమాతో హ్యూమా తెలుగువారికీ సుపరిచితమే. ఈ ఢిల్లీ భామ తాజాగా సిద్ధార్థ్‌తో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. అయితే.. ఇది సినిమా కాదు. ఓ వెబ్ సిరీస్.
బాలీవుడ్ దర్శకురాలు దీపా మెహతా హిందీలో రూపొందిస్తున్న ఈ సిరీస్‌లో వీరు నటించనున్నారని టాక్. దీపా మెహతా దర్శకత్వంలో 2012లో వచ్చిన ‘మిడ్‌నైట్స్ చిల్డ్రన్’ అనే చిత్రంలో సిద్ధార్థ్ నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తెరకెక్కించనున్న వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఇటు సిద్ధార్థ్, అటు హ్యూమా పచ్చజెండా ఊపారట. సిద్ధార్థ్ ప్రస్తుతం తమిళంలో ‘సైతాన్ కా బచ్చా’ సినిమాలో నటిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని తమిళ సినిమాలకూ కమిట్ అయ్యారాయన. హ్యూమా కూడా కథలు వింటున్నారట.
Comments
Please login to add a commentAdd a comment