ఇరువర్గాలూ సామరస్యంతో మెలగాలి | manjunatha commission | Sakshi
Sakshi News home page

ఇరువర్గాలూ సామరస్యంతో మెలగాలి

Published Fri, Nov 25 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

manjunatha commission

  • మంజునాథ కమిషన్‌కు సమస్యను సూటిగా చెప్పండి
  • వివాదాలు సృష్టిస్తే కఠిన చర్యలు
  • నిఘా కెమెరాలను విస్మరించొద్దు
  • దళితులపై దాడులు చేస్తే రౌడీ షీట్లు తెరుస్తాం
  • జిల్లా ఎస్పీ రవి ప్రకాష్‌
  • అమలాపురం టౌన్‌ :
    ఈ నెల 28, 29 తేదీల్లో కాకినాడలోని అంబేడ్కర్‌ భవ¯ŒSలో మంజునాథ కమిషన్‌ బహిరంగ విచారణ నిర్వహిస్నున్న క్రమంలో ఆ కమిషన్‌ ఎదుట పలు సామాజిక వర్గాల తమ అభిప్రాయాలు వినిపించి పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ సూచించారు. రెండు రోజుల పాటు సాగే ఈ విచారణకు జిల్లా వ్యాప్తంగా వివిధ సామాజిక వర్గాలు రెండు వర్గాలుగా రానున్న దృష్ట్యా  శాంతి భద్రతలకు విఘాతం కల్గకుండా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు అమలాపురం పట్టణ పోలీసు స్టేష¯ŒSలో డీఎస్పీ లంక అంకయ్య, సీఐలతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన సమీక్షిండత విలేకర్లతో మాట్లాడారు. ఇరు వర్గాలు బల ప్రదర్శనలకు తావివ్వకుండా సమస్యను విద్యావేత్తల ద్వారా సవివరంగా చెప్పాలని ఆయన సూచించారు.  సభాస్థలి దాదాపు 1,500 మందికి సరిపడుతుందని, అందులో ఇరు పక్షాలకు చెందిన చెరో 750 మందిని అనుమతిస్తామని ఎస్పీ చెప్పారు. మిగిలిన వారిని బయటే ఆపి ఇరు పక్షాలకు చెందిన వారికి సెక్టర్ల వారీగా ప్రత్యేక ఎ¯ŒSక్లోజర్లు పెట్టి అందులో ఉంచుతామన్నారు. విచారణ జరిగే ప్రాంతానికి రద్దీ సమస్య లేకుండా  ట్రాఫిక్‌ను మళ్లిస్తామని తెలిపారు. విచారణకు వచ్చేవారు  రెచ్చగొట్టే ప్రసంగాలు, వివాదాలు సృష్టించేలా ప్రవర్తిస్తే ద్రోన్లు, బాడీ వార్న్‌ కెమెరాలు చిత్రీకరిస్తున్నాయన్న విషయాన్ని విస్మరిం చొద్దన్నారు. కెమేరాలు గుర్తించిన అటువంటి వ్యక్తులపై కేసులు నమోదుచేస్తామని ఆయన హెచ్చరించారు. కుల వివాదాలకు తావివ్వద్దన్నారు.
    దళితులపై దాడులు చేస్తే రౌడీ షీట్లే
    దళితులపై ఎవరైనా దాడులు చేస్తే వారిపై రౌడీ షీట్లు తెరుస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. కోనసీమలో దళితులపై దాడుల ఘటనలు ఎక్కువగా ఉన్నాయని, ఇటీవల సూదాపాలెం, మోరి గ్రామాల్లో ఘటనల నేపధ్యంలో దళితులపై భౌతిక దాడులకు దిగే వారిని క్షమించే ప్రసక్తిలేదన్నారు. ఎవరైనా రౌడీయిజం, గుండాయిజంలో ప్రైవేటు సెటిల్‌మెంట్లు, స్థలాలు, భూముల కబ్జాలు చేస్తే సహించేది లేదన్నారు. ఆ పరిస్థితులు ఎదురైతే నేరుగా నా ఫో¯ŒSకు లేదా డీఎస్పీలకు ఫోన్లు చేసి పోలీసు శాఖను ఆశ్రయిస్తే బాధితులకు అండగా నిలిచి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. 
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement