SP Raviprakash
-
ఎన్నికలకు సర్వసన్నద్ధం
సాక్షి, ఏలూరు : సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాలో పోలీసు యంత్రాంగం సన్నద్ధంగా ఉం దని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్టు ఏలూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమవర్మ, ఎస్పీ ఎం.రవిప్రకాష్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఏపీ డీజీపీ ఠాగూర్ అన్ని జిల్లాల పోలీసు అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్ని కల నిర్వహణ సిబ్బంది నియామకాలు, ఏర్పాట్లపై పోలీసు అధికారుల నుంచి డీజీపీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎన్నికల సందర్భంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నామని, ఇప్పటివరకూ రూ.1.50 కోట్ల నగదు, 30.134 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. 1,761 మద్యం బాటిల్స్, 33 లీటర్ల సారా, 206 కిలోల నల్ల బెల్లం పట్టుకున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా 2,007 మంది వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేయడంతో పాటు 25 లైసెన్స్‌లు లేని ఆయుధాలను, 366 లైసెన్స్ ఉన్న ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లాల సరిహద్దుల్లో 11 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని సమస్యాత్మక, కీలక ప్రాంతాల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను ని యమించామన్నారు. ఎన్నికల సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట కార్యాచరణ ప్రణా ళికతో పనిచేస్తున్నామని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం అన్ని భద్రతా చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో రౌడీషీటర్లు, కిరాయి హంతకులు, పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించామని, ఎక్కడైనా గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి చైతన్యవంతులను చేస్తున్నామన్నారు. -
ఇరువర్గాలూ సామరస్యంతో మెలగాలి
మంజునాథ కమిషన్‌కు సమస్యను సూటిగా చెప్పండి వివాదాలు సృష్టిస్తే కఠిన చర్యలు నిఘా కెమెరాలను విస్మరించొద్దు దళితులపై దాడులు చేస్తే రౌడీ షీట్లు తెరుస్తాం జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ అమలాపురం టౌన్ : ఈ నెల 28, 29 తేదీల్లో కాకినాడలోని అంబేడ్కర్ భవ¯ŒSలో మంజునాథ కమిషన్ బహిరంగ విచారణ నిర్వహిస్నున్న క్రమంలో ఆ కమిషన్ ఎదుట పలు సామాజిక వర్గాల తమ అభిప్రాయాలు వినిపించి పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ సూచించారు. రెండు రోజుల పాటు సాగే ఈ విచారణకు జిల్లా వ్యాప్తంగా వివిధ సామాజిక వర్గాలు రెండు వర్గాలుగా రానున్న దృష్ట్యా శాంతి భద్రతలకు విఘాతం కల్గకుండా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు అమలాపురం పట్టణ పోలీసు స్టేష¯ŒSలో డీఎస్పీ లంక అంకయ్య, సీఐలతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన సమీక్షిండత విలేకర్లతో మాట్లాడారు. ఇరు వర్గాలు బల ప్రదర్శనలకు తావివ్వకుండా సమస్యను విద్యావేత్తల ద్వారా సవివరంగా చెప్పాలని ఆయన సూచించారు. సభాస్థలి దాదాపు 1,500 మందికి సరిపడుతుందని, అందులో ఇరు పక్షాలకు చెందిన చెరో 750 మందిని అనుమతిస్తామని ఎస్పీ చెప్పారు. మిగిలిన వారిని బయటే ఆపి ఇరు పక్షాలకు చెందిన వారికి సెక్టర్ల వారీగా ప్రత్యేక ఎ¯ŒSక్లోజర్లు పెట్టి అందులో ఉంచుతామన్నారు. విచారణ జరిగే ప్రాంతానికి రద్దీ సమస్య లేకుండా ట్రాఫిక్‌ను మళ్లిస్తామని తెలిపారు. విచారణకు వచ్చేవారు రెచ్చగొట్టే ప్రసంగాలు, వివాదాలు సృష్టించేలా ప్రవర్తిస్తే ద్రోన్లు, బాడీ వార్న్ కెమెరాలు చిత్రీకరిస్తున్నాయన్న విషయాన్ని విస్మరిం చొద్దన్నారు. కెమేరాలు గుర్తించిన అటువంటి వ్యక్తులపై కేసులు నమోదుచేస్తామని ఆయన హెచ్చరించారు. కుల వివాదాలకు తావివ్వద్దన్నారు. దళితులపై దాడులు చేస్తే రౌడీ షీట్లే దళితులపై ఎవరైనా దాడులు చేస్తే వారిపై రౌడీ షీట్లు తెరుస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. కోనసీమలో దళితులపై దాడుల ఘటనలు ఎక్కువగా ఉన్నాయని, ఇటీవల సూదాపాలెం, మోరి గ్రామాల్లో ఘటనల నేపధ్యంలో దళితులపై భౌతిక దాడులకు దిగే వారిని క్షమించే ప్రసక్తిలేదన్నారు. ఎవరైనా రౌడీయిజం, గుండాయిజంలో ప్రైవేటు సెటిల్మెంట్లు, స్థలాలు, భూముల కబ్జాలు చేస్తే సహించేది లేదన్నారు. ఆ పరిస్థితులు ఎదురైతే నేరుగా నా ఫో¯ŒSకు లేదా డీఎస్పీలకు ఫోన్లు చేసి పోలీసు శాఖను ఆశ్రయిస్తే బాధితులకు అండగా నిలిచి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. -
ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించం
నేడు పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష పక్కాగా ఏర్పాట్లు కాకినాడ క్రైం : పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఆదివారం ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రం లోపలికి అనుమతించబోమన్నారు. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 37 క్యాంపస్‌లలో 60 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు శనివారం ఆయన తెలిపారు. ఈ పరీక్షకు 33,964 మంది విద్యార్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. కాకినాడలో 31 క్యాంపస్‌ల్లోని 45 కేంద్రాల్లో 19,600 మంది, రామచంద్రపురంలో రెండు క్యాంపస్‌ల్లోని రెండు సెంటర్లలో 1,859 మంది, పెద్దాపురంలోని 4 క్యాంపస్‌ల్లోని 13 సెంటర్లలో 12, 505 అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పరీక్ష జరుగుతుందని తెలిపారు. çహాల్ టికెట్లు ఇప్పటికే ఆ¯ŒSలైన్లో అభ్యర్థులందరూ తీసుకున్నారని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభ సమయాని కంటే ఒక గంట ముందు 9 గంటలకు విధిగా పరీక్ష కేంద్రాలకు హాల్ టికెట్‌తో హాజరు కావాలని సూచించారు. సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు, వాచీలు, పె¯ŒSడ్రైవ్‌లు తదితర వస్తువులను లోనికి అనుమతించబోమన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇతర సమాచారం కోసం జేఎ¯ŒSటీయూకే కన్వీనర్‌ను సంప్రదించాలని సూచించారు. కానిస్టేబుల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆదివారం నిర్వహించే పరీక్షకు రాజమహేంద్రవరం రీజియ¯ŒS పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రీజినల్ కో–ఆర్డినేటర్, నన్నయ వర్సిటీ ప్రిన్సిపాల్ ఆచార్య కె.ఎస్.రమేష్ తెలిపారు. స్థానిక విలేకరులతో శనివారం ఆయన మాట్లాడుతూ రీజియ¯ŒS పరిధిలో 20 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 9892 మంది అభ్యర్థులు హాజరుకానున్నారన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులకు తొలిసారి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గ్రహించి బయోమెట్రిక్ నమోదు చేయించుకున్న తరువాతే పరీక్ష కేంద్రాల నుంచి బయటకు వెళ్లాలని సూచించారు. ఈ సమయంలో సాంకేతికంగా ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అబ్జర్వర్లను నియమించినట్టు తెలిపారు. అభ్యర్థులు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్నుతో మాత్రమే సమాధానాలను ఓఎంఆర్ షీట్లలో గుర్తించాలన్నారు. సమావేశంలో సహాయ రీజనల్ కో–ఆర్డినేటర్ డాక్టర్ డి.జ్యోతిర్మయి పాల్గొన్నారు. -
సైబర్ నేరాల అదుపునకు ప్రత్యేక బృందాలు
ఎస్పీ రవి ప్రకాష్ ఐ.పోలవరం : జిల్లాలో సైబర్ నేరాల అదుపునకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ అన్నారు. పాత యింజరంలో ఉన్న మండల పోలీస్ స్టేషన్‌ను ఆయన మంగళవారం తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో యువత సైబర్ నేరాలకు, వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉందని దీనిని ఆదిలోనే నియంత్రించేలా తగు చర్యలు తీసుకొంటున్నామన్నారు. అలాగే అమలాపురం సూదాపాలెంలో దళితులపై జరిగిన సంఘటన పునరావృతం కాకుండా చూస్తామన్నారు. జిల్లాలో ఈ ఏడాది క్రైం రేటు 20 శాతం తగ్గిందన్నారు. హైవే దాబాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. పక్కనే ఉన్న యానం నుంచి అధిక సంఖ్యలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు తెలిసిందని, వీటి అదుపుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల పోలీసులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందని అన్న విలేకరుల ప్రశ్నకు చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పులు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదన్నారు. ఇప్పటికే జిల్లాలో ఒక సీఐని వీఆర్‌లో ఉంచామని అలాగే హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, ఎస్ఐని సస్పెండ్ చేశామన్నారు. తుని జాతీయ రహదారిపై చేసిన నిఘాలో లారీల నుంచి అక్రమంగా నగదు వసూలు చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు లైఫ్ జాకెట్లు ధరించాలని, దీనిపై మత్యకార గ్రామాల్లో అవగాహన ఏర్పాటు చేయాలని డీఎస్పీ అంకయ్యకు సూచించారు. అలాగే జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సీఐ కేటీవీటీ రమణరావు, ఎస్ఐ టి.క్రాంతికుమార్, సిబ్బంది ఉన్నారు. -
మావోయిస్టుల్లోనే కొరియర్లు ఉన్నారు
జిల్లా ఎస్పీ ఎన్. రవిప్రకాష్ నెల్లిపాక : పోలీసులకు మావోయిస్టుల్లోనే కొరియర్లు ఉన్నారని జిల్లా ఎస్పీ ఎన్. రవిప్రకాష్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం ఎటపాక లో విలేకరుల సమావేశంలో దీనిని మావోయిస్టుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్లంటూ అమాయక ప్రజలను కిరాతకంగా హత్యలు చేయటం మానుకోవాలని ఆయన మావోయిస్టులను హెచ్చరించారు. ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటూ అభివృద్ధి నిరోధకులుగా మారుతున్న మావోయిస్టులకు ప్రజలే తగిన బుద్ధి చెపుతారన్నారు. ఇటీవల చింతూరు మండలంలో ఓపాస్టర్గా పనిచేస్తున్న గొత్తికోయను మావోయిస్టులు హత్య చేయడాన్ని ఎస్పీ తీవ్రంగా ఖండించారు. ఆ పాస్టర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. బూటకపు హత్యలు చేస్తున్న మావోయిస్టులను అంతమొందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఏజెన్సీ ప్రజలకు తాము పూర్తి అండగా ఉంటామని, గిరిజనులు, వలస ఆదివాసీలు ధైర్యంగా ఉండాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎటపాక ఓఎస్డీ డాక్టర్ ఫకీరప్ప, చింతూరు ఏఎస్పీ శ్వేత, ఎటపాక సీఐ వీరయ్యగౌడ్, ఎస్సై నాగరాజు పాల్గొన్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు చింతూరు : మావోయిస్టులకు వ్యతిరేకంగా మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం పోస్టర్లు వెలిశాయి. లచ్చిగూడెం గ్రామానికి చెందిన మారయ్య అనే పాస్టర్‌ను శనివారం మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో ఆ చర్యను ఖండిస్తూ పోస్టర్లు వెలిశాయి. మారయ్య ఫొటోలతో ఉన్న ఈ పోస్టర్లలో మానవత్వాన్ని మంటగలిపిన మావోలు. మాటల్లోనే సమాజ స్థాపన.. చేతల్లో అమాయకుల, ప్రజా సేవకుల హత్యలు. మావోయిజం అంటే హత్యలతో, మందుపాతర్లతో భయభ్రాంతులను చేయడమేనా అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. -
ముద్రగడకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే యత్నం
రాజమండ్రి : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో భార్యతో కలిసి ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. దీక్ష విరమించి వైద్యానికి సహకరించాలని అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేసినా ఆయన ప్రతిఘటించారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు దీక్ష విరమించేది లేదని ముద్రగడ స్పష్టం చేశారు. కాగా ముద్రగడపై ఆత్మహత్యయత్నం కేసు మాత్రమే నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా కొన్నిచోట్ల ముందస్తు అరెస్ట్‌లు చేసినట్లు ఆయన శనివారమిక్కడ వెల్లడించారు. ముద్రగడ దీక్ష కొనసాగుతోందని, ఆయన వైద్యానికి నిరాకరిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. మరోవైపు కాపు ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసేసి బంద్ పాటిస్తున్నారు. అయితే పోలీసులు దగ్గరుండి బలవంతంగా షాపులు తెరిపిస్తున్నారని కాపు నేతలు మండిపడుతున్నారు. బంద్ విజయవంతం కాకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బైక్‌లపై వెళ్లే యువకులను కూడా పట్టుకుని దౌర్జన్యంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ముద్రగడ దీక్షకు మద్దతుగా కాపు నేతలు రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లలో కాపు నేతలను గృహ నిర్బంధం చేశారు. పాలకొల్లు నియోకవర్గ కాపు అధ్యక్షుడు వంగా నర్సింహారావు, ఏలూరు పట్టణ కాపు అధ్క్షుడు బోనం వెంకట నర్య్య, కాపు కార్యదర్శి జక్కంపూడి కుమార్, జిల్లా కాపు నాయకుడు ముచర్చ శ్రీరామ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. దుకాణాలు, వర్తక వ్యాపారులు బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. ముద్రగడ దీక్షను అణగదొక్కాలని ప్రయత్నిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
మావోయిస్టుల యత్నాలను తిప్పికొడుతున్నాం..
రంపచోడవరం :ఆంధ్రా ఒడిశా సరిహద్దులో పట్టు సాధించేందుకు మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారని ఎస్పీ ఎం.రవిప్రకాష్ అన్నారు. రంపచోడవరం ఏఎస్పీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనమైత్రి, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గిరిజనులకు పోలీసులు దగ్గరయ్యారని పేర్కొన్నారు. గిరిజనులు తమ సమస్యల పరిష్కారానికి చింతూరు పోలీస్ స్టేషన్‌కు నిర్భయంగా వస్తున్నారని చెప్పారు. ఎటపాక వైటీసీ కేంద్రంగా గిరిజన యువతకు పారా మెడికల్ కోర్సుల్లో శిక్షణ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒడిశా, విశాఖ ఏజెన్సీలలో మావోయిస్టులు ఆర్మీ మిలీషియూ సభ్యులతోనే మనుగడ సాగిస్తున్నారని చెప్పారు. తూర్పు ఏజెన్సీలో మావోయిస్టు దళాల సంచారం ఉందని, వారి కదలికలపై గట్టి నిఘా ఉందని తెలిపారు. రంపచోడవరం ఏఎస్పీ అడ్నాన్ నయూం ఆస్మీ పాల్గొన్నారు. -
'తూర్పు గోదావరికి బయట వ్యక్తులు రావొద్దు'
కాకినాడ : కాపు ఐక్యగర్జన సభకు అనుమతిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. సభ జరుపుకునేందుకు అనుమతి ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మాత్రం సీఎం ప్రకటనతో విభేదించారు. కాపు సభకు అనుమతి ఇవ్వలేదని ఆయన వివరణ ఇచ్చారు. అనుమతి లేకుండా సభకు హాజరయ్యారనే 27మంది నేతలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కాగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తన సతీమణితో కలిసి శుక్రవారం నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్న నేపథ్యంలో రేపటి నుంచి తూర్పు గోదావరి జిల్లాకు బయట వ్యక్తులు రావొద్దని ఎస్పీ సూచించారు. జిల్లాల నుంచి బయట వ్యక్తులు ఎవరైనా వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా 10వేలమంది పోలీసులు మోహరించారని, 58 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. తుని ఘటన కు సంబంధించి నమోదు చేసిన కేసులపై పారదర్శకంగా దర్యాప్తు జరుగుతోందని, అమాయకులను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయమని ఆయన తెలిపారు. -
అవినాష్‌కు 15 రోజుల రిమాండ్
సామర్లకోట : మానవ హక్కుల సంఘం మాటున మోసాలకు, దురాగతాలకు పాల్పడి, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేరాబత్తుల అవినాష్ దేవ్‌చంద్రను పోలీసుల హైడ్రామా మధ్య శుక్రవారం రాత్రి పెద్దాపురం సబ్ జెయిల్‌కు తరలించారు. పెద్దాపురం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ రవిప్రకాష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్టు పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే ఎస్పీ వచ్చే సమయానికే అవినాష్‌ను పెద్దాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తీసుకువచ్చారు. అప్పటికే కోర్టు సమయం దాటిపోవడంతో జడ్జి ఎస్.శ్రీనివాస్ ఇంటి వద్ద హాజరు పర్చారు. సుమారు గంట విచారణ చేసిన తరువాత జడ్జి ఈనెల 27 వరకు రిమాండ్ విధించారు. దాంతో పోలీసులు భారీ భద్రత మధ్య పెద్దాపురం సబ్ జెయిల్‌కు తరలించారు. కాగా పెద్దాపురం పోలీసులు అవినాష్‌పై పెట్టిన కేసులు (క్రైమ్ నెం.63/2015 యు/ఎస్.419,420,506,170 ఆర్/డబ్లు 34 ఐపీసీ) కూడా బెయిల బుల్ కావడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నారుు. ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టడం వల్ల అవినాష్ వెంటనే విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు. అవినాష్ ఉపయోగించిన కారును, సెల్ ఫోనును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేకాధికారి డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కోర్టుకు తీసుకు వచ్చిన సమయంలో అవినాష్‌ను చూడటానికి అనేక మంది వచ్చారు. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా కో ఆర్డినేటర్ అరెస్టు అమలాపురం టౌన్ : కాగా మానవ హక్కుల వేదిక పేరుతో జిల్లాలో అక్రమ వసూళ్లు, దందాలకు దిగిన అవినాష్ మోసాలు తవ్వేకొద్దీ బయటపడుతున్న క్రమంలోనే హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ పేరుతో కొందరు వ్యక్తులు చేసిన అక్రమాలు వెలుగు చూశాయి. పెద్దాపురం మండలం కొండపల్లి వేదికగా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా కో ఆర్డినేటర్‌గా చెప్పుకుంటున్న అదే గ్రామానికి చెందిన కోండ్రు సతీష్‌ను అమలాపురం పోలీసులు శుక్రవారం అరెస్టు చే శారు. అమలాపురం పట్టణ సీఐ వై.ఆర్.కె.శ్రీనివాస్ అరెస్టు చేసిన సతీష్‌ను విలేకరులకు చూపి, వారి మోసాలను వివరించారు. చెన్నై కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అంటూ నకిలీ ఐడెంటిటీ కార్డులు, కరపత్రాలు ముద్రించి గ్రామాల్లో, పట్టణాల్లో యువకులను సభ్యులుగా చేర్చుకుంటున్నారు. సంస్థకు రాష్ట్ర కార్యదర్శిగా జి.డి.గోపి, ఆర్గనైజర్‌గా ఉబయతుల్లాఖాన్, రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా తిరుమలరెడ్డి వ్యవహరిస్తూ జిల్లా శాఖకు సతీష్‌ను కో ఆర్డినేటర్‌గా నియమించారు. సతీష్ జిల్లాలో పలు చోట్ల యువకుల వద్దకు వెళ్లి తమ ఆర్గనైజేషన్‌లో చేరితే పదవులతోపాటు ఐడెంటిటీ కార్డులు ఇస్తామని, వాటితో ప్రభుత్వ కార్యాలయాలకు, హాస్టళ్ల వంటి సంస్థలకు వెళ్లి ప్రశ్నించే హక్కు ఉంటుందని, పోలీసులు కూడా భయపడతారని నమ్మించాడు. సభ్యత్వానికి రూ.5వేల చొప్పున వసూలు చేశాడు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి బెదిరిస్తే ఇచ్చే సొముమ్ల్లో కొంత తమకు ఇవ్వాలన్న షరతు పెట్టాడు. అమలాపురానికి చెందిన తొమ్మిదిమందికి నకిలీ ఐడెంటిటీ కార్డులు జారీ చేశాడు. అవినాష్ ఉదంతం బయటపడగానే అమలాపురం గడియారస్తంభం సెంటర్లో ఈ ఆర్గనైజేషన్ పేరుతో ఉన్న ఫ్లెక్సీని పోలీసులు సీజ్ చేసి అందులోని ఫోటోల ఆధారంగా కొందరి అదుపులోకి తీసుకుని విచారించగా తీగలాగితే డొంక కదిలినట్టు ఈ బోగస్ మానవహక్కుల వేదిక మోసాలు వెలుగు చూశారుు. ఈనెల 9న పెద్దాపురంలో తమ సంస్థ అంతర్జాతీయ సభ నిర్వహిస్తున్నట్టు ఖరీదైన ఆహ్వాన పత్రాలు ముద్రించి, వాటిపై హోంమంత్రి, జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లను ముద్రించి వారు హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. దీనిపై అమలాపురం పోలీసులు ఆరా తీయగా ఆ ప్రజాప్రతినిధులెవరూ తమకు ఆహ్వానాలు లేవని చెప్పారు. కాగా సతీష్‌తోపాటు ఆ ఆర్గనైజేషన్ రాష్ట్ర నాయకులైన గోపి, ఖాన్, తిరుమల రెడ్డితోపాటు మరో 10మందిపై కేసులు నమోదు చేశామని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని సీఐ చెప్పారు. వీరిపై 415, 419, 420, 471, 384 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. సతీష్‌ను కోర్టులో హాజరుపరిచామని చెప్పారు.