మంజునాథ కమిషన్ పర్యటనలో ఉద్రిక్తత
-బీసీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
వైఎస్సార్‌జిల్లా: వైఎస్ఆర్ జిల్లా కడపలో మంజునాథ కమిషన్ పర్యటనలో ఉద్రిక్తత పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాపులను బీసీల్లొ చేర్చొద్దని కోరుతూ.. బీసీ కులాల రాష్ట్ర జేఏసీ మహిళ అధ్యక్షురాలు విజయలక్ష్మీ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని జడ్పీ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం మంజునాథ కమిషన్ ఈ రోజు కడపకు చేరుకుంది. ఈ అంశం పై తమ వాదనలు స్వీకరించాలని.. ఎట్టి పరస్థితుల్లోను కాపులను బీసీల్లో చేర్చొద్దని డిమాండ్ చేస్తూ ఆమె వంటిపై కిరోసిన్ పోసుకుంది.