కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెలుగుదేశం పార్టీ తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడానికి ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యల వల్ల ఇవాళ కాపులు బీసీలా? ఓసీలా? అన్న పరిస్థితి తలెత్తిందని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీ కాపు ప్రజా ప్రతినిధులు (మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) సోమవారం ముఖ్యమంత్రిని అసెంబ్లీ ఛాంబర్‌లో కలిశారు.