Kapu reservation
-
2 వేల కోట్ల ప్యాకేజీ కోసం కాపు, ముస్లిం రిజర్వేషన్ల తాకట్టు
-
‘బీసీ రిజర్వేషన్ వల్ల కాపులకు ఉపయోగం లేదు’
అమరావతి: బీసీ రిజర్వేషన్ వల్ల కాపులకు ఉపయోగం లేదని తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహనరావు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేయొద్దని తాను చెప్పిన విషయాన్ని మరోసారి ప్రస్తావించారు రామ్మోహనరావు. కాపు ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రామ్మోహనరావు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ బీసీ రిజర్వేషన్ అనేది కాపుల సంక్షేమానికి కంటితుడుపు చర్యే తప్ప.. సామాజికంగా ఎటువంటి ప్రయోజనం లేదు. రాజకీయాల వల్ల కాపు అనే కులం డైవర్ట్ అయ్యింది. కాపు రిజర్వేషన్ ఉద్యమం వల్ల బీసీలకు కాపులు దూరమవుతున్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాపులకు బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదు. తునిలో పెట్టిన బీసీ రిజర్వేషన్ సభతో కాపులను అల్లరి మూకలుగా ముద్ర వేశారు. ఒకే సామాజికి వర్గానికి చెందిన వారు ఏపీ నుంచి ముగ్గురు సుప్రీం కోర్టు జడ్జిలయ్యారు. వారికేమీ రిజర్వేషన్లు లేవు’ అని వ్యాఖ్యానించారు రామ్మోహనరావు. -
కాపు ఉద్యమం నుంచి తప్పుకొంటా: ముద్రగడ
సాక్షి, విజయవాడ: టీవీ కార్యక్రమాలు, సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపై మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. తాను కాపు ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పదవులు, డబ్బు కోసం తాను ఉద్యమం చేయలేదని.. కాపు జాతికి మంచి జరిగేలా ఎన్నో ప్రయత్నాలు చేశానని గుర్తు చేశారు. తనను విమర్శిస్తున్న వారు ముందుండి నడిచి.. కాపులకు బీసీ రిజర్వేషన్లు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు... ‘‘సోషల్ మీడియాలో నాపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో తెలియదు. నేను ఉద్యమం చేయడానికి కారణం చంద్రబాబే. గతంలో ఆయన కాపులకు రిజర్వేషన్లు ఇస్తామన్నారు. నాపై విమర్శలు చేసేవాళ్లు డ్రైవర్ సీటులో కూర్చుని.. కాపులకు బీసీ రిజర్వేషన్లు తీసుకురావాలి’’అని సోమవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. -
కాపు రిజర్వేషన్లపై సీఎంకు ముద్రగడ లేఖ
కిర్లంపూడి: కాపు రిజర్వేషన్లపై మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. వివరాలిలా ఉన్నాయి.. ‘మీరు అడిగిన వారికి, అడగని వారికి ఇచ్చిన, ఇవ్వని హామీలను దానం చేసి దానకర్ణుడనిపించుకుంటున్నారు. మా కాపు జాతి చిరకాల కోరిక, పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ కోసం చేసిన పోరాటానికి మీ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది. 01–02–2016న మీడియాకి మీరిచ్చిన ఇంటర్వ్యూలో మా జాతి కోరిక సమంజసమని చెప్పారు. అసెంబ్లీలో కూడా మద్దతు ఇచ్చారు. ఈరోజు మా కోరికను దానం చేయడానికి మీకెందుకు చేతులు రావడం లేదు? ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయిక్, అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లాగా పూజలందుకోవాలే కానీ, పదవి మూన్నాళ్ల ముచ్చటగా చేసుకోవద్దు’ అని ముద్రగడ పేర్కొన్నారు. దయచేసి తమ జాతి రిజర్వేషన్ సమస్య తీర్చాలని ప్రధాని మోదీని కోరాలని సీఎం జగన్‌కు ముద్రగడ విజ్ఞప్తి చేశారు. -
కాపులపై బాబు ఉక్కుపాదం మోపినప్పుడు ఎక్కడున్నావ్ పవన్?
సాక్షి, అమరావతి: కాపులపై చంద్రబాబు ఉక్కుపాదాన్ని మోపినప్పుడు, కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని లాఠీలతో కుళ్లబొడిచి ఆయన భార్యను, కుమారుడిని బండ బూతులు తిడుతూ నిర్బంధించినప్పుడు నోరు విప్పని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. మంత్రి కన్నబాబు శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కన్నబాబు ఇంకా ఏమన్నారంటే.. ► వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కాపులకు మేలు చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారా? పాత మిత్రుడు చంద్రబాబుతో చెలిమిని పోగొట్టుకోలేక పవన్ మాట్లాడుతున్నారా? ► కాపు రిజర్వేషన్ పోరాటాన్ని ఎవరు నీరు గార్చారో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ► కాపులకు ఇచ్చిన మాట ప్రకారం 45–60 ఏళ్ల మధ్య వయస్కులైన కాపు మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు అందించడం ప్రారంభమైంది. కాపు నేస్తం కింద దరఖాస్తు చేసుకున్న 2,35,873 మంది మహిళలకు రూ.354 కోట్లను అందించాం. ► ఇంకా అర్హత ఉండి దరఖాస్తు చేసుకోని వారు ఎవరైనా ఉంటే వాళ్లకీ ఇస్తాం. ► వాస్తవం ఇలా ఉంటే.. పవన్ లాంటి వాళ్లు మా ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించడం విడ్డూరం. కాపు రిజర్వేషన్ ఉద్యమం తిరిగి తలెత్తకుండా ఉండేందుకే ఈ సాయం అందిస్తున్నట్టు మాట్లాడడం దారుణం. ► ఐదేళ్లలో చంద్రబాబు రూ.1,879.64 కోట్లను 2.54 లక్షల మంది కాపులకు ఇస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.4,770 కోట్లను ఇచ్చాం. -
కాపు రిజర్వేషన్లకు మా మద్దతు ఉంటుంది: సీఎం జగన్
-
సీఎం జగన్‌తో పార్టీ కాపు నేతలు భేటీ
సాక్షి, అమరావతి: కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెలుగుదేశం పార్టీ తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడానికి ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యల వల్ల ఇవాళ కాపులు బీసీలా? ఓసీలా? అన్న పరిస్థితి తలెత్తిందని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీ కాపు ప్రజా ప్రతినిధులు (మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) సోమవారం ముఖ్యమంత్రిని అసెంబ్లీ ఛాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ల అంశంపై తాజా పరిణామాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. కాపు రిజర్వేషన్ల అంశంపై సీఎం జగన్ మాట్లాడుతూ.. కాపుల రిజర్వేషన్ల విషయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పులేదని, మేనిఫెస్టోలో చెప్పినదానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లపై మంజునాథ్ కమిషన్ ఇచ్చిన నివేదికను పరిశీలించాల్సిందిగా పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబుకు సూచించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... ‘ కాపులను బీసీల్లో చేరుస్తూ 2017లో చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ పంపారు. తర్వాత ఈబీసీల్లో కాపులకు 5శాతం రిజర్వేషన్లు ఇస్తూ మరొక లేఖ రాశారు. అసలు కాపులను బీసీల్లో చేరుస్తూ ఇంతుకు ముందు పంపిన బిల్లు పరిశీలనలో ఉంచదలచుకున్నారా? దానికి కట్టుబడి ఉన్నారా? లేక ఉపసంహరించాలనుకుంటున్నారా? దీనిపై వెంటనే సమాధానం ఇవ్వాలని చంద్రబాబు సర్కార్‌ను కేంద్రం కోరింది. దీనిపై ఈ ఏడాది ఏప్రిల్ 4న కేంద్రం రాసిన లేఖకు చంద్రబాబు సమాధానం పంపలేదు. పేదరికం ప్రాతిపదికగా ఓసీల్లో పేదలకు ఈ పదిశాతం రిజర్వేషన్లు ఇచ్చారు. దాంట్లో కులాన్ని ప్రాతిపదికగా తీసుకునే అవకాశమే లేదు. కులాల పరంగా విభజించే హక్కులేదని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎలా ఇచ్చారు?. చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చడంపైనా, ఈసీబీల్లో ఇచ్చిన 5శాతం కోటాలపైనా న్యాయస్థానాల్లో కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అడుగు ముందుకు వస్తే ఈ కోట కింద సీట్లు, ఉద్యోగాలు పొందినవారి పరిస్థితి ఏమవుతుంది?. ఈబీసీ కోటాలో కాపులకు తాను ఇచ్చిన 5శాతం రిజర్వేషన్లు వాస్తవమే అయితే ఈ ఏడాది వైద్య, పీజీ సీట్లలో చంద్రబాబు సర్కార్ ఎందుకు అమలు చేయలేదు?. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో కూడా ఇదే పేర్కొన్నారు కదా?. పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకమైతే ఎవరు బాధ్యత వహిస్తారు?. ఓబీసీ జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే...అందులో కాపుల జనాభా యాభైశాతం కన్నా ఎక్కువే ఉంది కదా?. అలాంటప్పుడు దాన్ని 5శాతానికే కట్టడి చేస్తే వారికి అన్యాయం జరగదా?. ఈబీసీల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. దానికి విరుద్ధంగా అడుగులు వేయగలమా?. కేంద్రం ఈబీసీలకు రిజర్వేషన్లు ప్రకటించిన వారంలోపే మార్గదర్శకాలు ఇచ్చేసింది, కానీ చంద్రబాబు మాత్రం 2019, ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగితే.. మే 6న మార్గదర్శకాల కోసం కమిటీ వేశారు. ఈబీసీలకు కేంద్రం ఇచ్చిన కోటాలో అయిదు శాతం రిజర్వేషన్లు ఇస్తాననడం ద్వారా, ఇంతకు ముందు బీసీల్లో చేర్చే అవకాశం ఉందన్న కాపులకు కల్పించిన ఆశలమీద కూడా చంద్రబాబే నీళ్లు జల్లారు. కాపుల రిజర్వేషన్ల విషయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎప్పుడూ మార్పులేదు. మొదటి నుంచి మేం చెబుతున్నట్లే బీసీల హక్కులకు భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే కాపు రిజర్వేషన్లకు మనం వ్యతిరేకం కాదు. కాపు రిజర్వేషన్లకు ఎప్పుడూ మద్దతు ఉంటుంది, మేనిఫెస్టోలో చెప్పినదానికి కట్టుబడి ఉన్నాం. ఈ బడ్జెట్లో కాపులకు రూ.2వేల కోట్లు కేటాయించాం. కానీ చంద్రబాబు అయిదేళ్ల పాలనలో ఖర్చు చేసింది కేవలం రూ.1340 కోట్లే’ అని తెలిపారు. -
కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జక్కంపూడి రామ్మెహన్ తనయుడే రాజా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జక్కంపూడి కుటుంబం...ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటే ఉన్నారు. మరోవైపు జక్కంపూడి రాజాను కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించడంపై కాపు సామాజిక వర్గనేతలు హర్షం వ్యక్తం చేశారు. -
కాపులకు రిక్త హస్తమే!
సాక్షి, అమరావతి: కాపులను రాష్ట్ర ప్రభుత్వం మరోమారు మోసం చేసింది. సబ్సిడీ రుణాలు అంటూ వారాల తరబడి తిప్పుకుని ఇప్పుడు అయోమయంలో పడేసింది. 2018–19 సంవత్సరానికి గాను ఇప్పటి వరకు ప్రకటించిన లక్ష్యంలో 10 శాతం మందికి (6,630) మాత్రమే రుణాలు ఇచ్చింది. గత ఐదు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు పదేపదే చెప్పడంతో ఆన్లైన్ ద్వారా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. ఎంపీడీవో కార్యాలయాల వద్ద రెండు దఫాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. దరఖాస్తులు చేసుకునేందుకు వారం రోజులు పని మానుకోవాల్సి వచ్చింది. దరఖాస్తుకు కావాల్సిన సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకు మరో వారం తిరగాల్సి వచ్చిందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇంత చేస్తే ఎంపిక చేసిన ఎంపీడీవోలు ఇప్పుడు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఎన్నిసార్లు వెళ్లి అడిగినా నిధులు మంజూరు కాలేదు కాబట్టి తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. కాపుల జీవనోపాధి మెరుగుకు ఈ రుణాలు కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2018–19 సంవత్సరానికి 68,787 మందికి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.687.87 కోట్లు కేటాయించారు. అయితే మండల స్థాయిలో ఇంటర్వ్యూల అనంతరం కలెక్టర్లు రాష్ట్రంలో లక్ష్యానికి మించి 73,401 మందిని ఎంపిక చేశారు. వీరి కోసం రూ. 515.38 కోట్లు రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ మేరకు కాపు కార్పొరేషన్ 73,109 మందికి సబ్సిడీ విడుదల చేసింది. అయితే రుణాలు ఇచ్చింది మాత్రం కేవలం 6,636 మందికి రూ.49.27 కోట్లు మాత్రమే. అంటే ఇంకా 66,973 మందికి రుణాలు ఇవ్వలేదు. వీరందరు ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే వీరికి ఈ సంవత్సరం రుణాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈరోజు నుంచి ఎన్నికల హడావుడి మొదలైంది. రుణాలు పంపిణీ చేసే పనిలో ఏ అధికారి కూడా ఉండే అవకాశాలు లేవు. ఎన్నికల కోసం శిక్షణ, డ్యూటీ అలాట్మెంట్ వంటి పనుల్లో బిజీగా ఉంటారు. అందువల్ల ఈ సంవత్సరం రుణాలు ఎగ్గొట్టినట్లేనని చెప్పవచ్చు. నిధులు విడుదల కావాల్సి ఉంది సబ్సిడీ రిలీజ్ చేశాం. త్వరలోనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎంపికైన వారందరికీ రుణాలు పంపిణీ చేస్తాం. ఈనెల 15 నుంచి రుణాలు అందించే కార్యక్రమాన్ని ఆయా బ్యాంకులు చేపడతాయి. సబ్సిడీ నగదు నేరుగా బ్యాంకుల్లో జమవుతుంది. అందువల్ల బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు. – కోట్ల శివశంకర్‌రావు, ఎండీ, కాపు కార్పొరేషన్. -
కాపు రిజర్వేషన్ హామీ ఏమైంది?
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులను మోసం చేస్తూనే ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని వ్యాఖ్యానించారు. కాపులు ఈబీసీల్లో సగం అంటూ మరోసారి చంద్రబాబు కొత్త నాటకానికి తెర తీశారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఇచ్చిన కాపు రిజర్వేషన్ హామీ ఏమైందని, మంజునాథ కమిషన్ పేరుతో కాలయాపన చేశారంటూ మండిపడ్డారు. గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. కాపు సోదరులకు విజ్ఞప్తి చంద్రబాబు కాపులను ఏకాకిని చేసే కుట్రలు చేస్తున్నారని, ఈ కుయుక్తులను కాపు సోదరులంతా గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి మంజునాథ కమిషన్ నివేదిక ఇవ్వకుండానే అసెంబ్లీలో చట్టం చేశామన్నారన్నారు. కాపులందరూ బీసీలు అయిపోతారని హడావుడి చేశారని ఎద్దేవా చేశారు. కాపులు, బీసీల మధ్య చంద్రబాబు తగాదా పెడుతున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మొదటి నుంచి పోరాడింది వైఎస్ జగన్మోహన్రెడ్డేనని పేర్ని నాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హోదా కోసం పోరాటాలు చేస్తే జైలులో పెడతామని చంద్రబాబు బెదిరించారని, ఇప్పుడు హోదాపై యూటర్న్ తీసుకుని ధర్మపోరాట డ్రామాలాడుతున్నారని ఆయన విమర్శించారు. సంబరాలు చేసి మోసం చేశారు.. చంద్రబాబు చేసే మోసాన్ని కూడా ఆకాశాన్ని ఎత్తే మీడియాను చూస్తుంటే భయం వేస్తోంది. 2014లో తన అధికారం కోసం కాపుల్ని బీసీలలో చేరుస్తానని వాగ్దానం చేశారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రోడ్డేక్కేవరకు కూడా కాపులను మరిచిపోయారు. ఆ తర్వాత చంద్రబాబుకు కాపు రిజర్వేషన్లు గుర్తుకువచ్చాయి. మంజునాధ కమిషన్‌ను వేసి ముగిద్దామని చూశారు. జస్టిస్ మంజనాధ నివేదిక ఇవ్వకుండానే వారి సభ్యులతో రిపోర్ట్ తీసుకుని కాపులను బీసీలలో చేరుస్తన్నట్లు అసెంబ్లీలో ప్రకటన చేశారు. 13 జిల్లాల్లోని కాపు సోదరులు అందరి నోట్లలో స్వీట్లు తినిపించి మీరు బీసీలయ్యారంటూ సంబరాలు చేసి మోసం చేశారు. అప్పటినుంచి ఈరోజు వరకు కాపులు బీసీ సర్టిఫికేట్లు తెచ్చుకునే పరిస్థితి ఉందా?. ఎమ్మార్వో కార్యాలయాల్లో బీసీ ఎఫ్ సర్టిఫికేట్ అడిగితే ఎమ్మార్వోలు కాపులను ఎగతాళి చేసే పరిస్థితి. కాపులను ఎన్నిసార్లు బీసీలను చేస్తారు? అసలు కాపులను ఎన్నిసార్లు బీసీలను చేస్తారు. గతంలో అసెంబ్లీలో చేసింది ఏంటి?. గాలికి పోయే పేలాల పిండి కృష్ణార్పణం అన్నారంట ఓ పెద్దాయన. అదే రీతిలో ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థికంగా వెనకబడిన వారికి పదిశాతం రిజర్వేషన్లు ఇస్తే వాటిలో ఐదుశాతం ఇస్తున్నామంటూ చంద్రబాబు ప్రకటించారు. ఇది మోసపూరితం. ఈబీసీలలో కాపులకు సగం అంటూ మరోమోసానికి పాల్పడ్డారు. బీసీ వర్గాలందరితో కాపులకు తగాదా పెట్టారు. ఈరోజు ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణపేదలతో కూడా తగాదాలు పెట్టేపరిస్దితి చంద్రబాబు తెచ్చారు. కాపులను ఏకాకి చేసే కుట్ర చేస్తున్నారు. కాపులను మొన్న బీసీలను చేశామని చెప్పారు. నేడు ఈబీసీలను చేశామని అంటున్నారు. కాపులు బీసీలా? ఈబీసీలా మీరు ఏ కేటగిరిలో చేర్చారు చంద్రబాబు సమాధానం చెప్పండి. దళిత క్రైస్తవులందరిని ఎస్సీలను చేసేశామని నిన్న అసెంబ్లీలో ప్రకటన చేశారు. కాపులకు లాగా వారికి కూడా స్వీట్లు తినిపిస్తారేమో. గతంలో ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎస్సీలలో చిచ్చురేపి ఆ వేడిలో చలి కాసుకున్న వ్యక్తి చంద్రబాబు. దళిత క్ర్లైస్తవుల గురించి కేంద్రంతో కనీసం ఒక్కమాటైనా మాట్లాడారా?. తునిలో రైలు తగులబెట్టారని, రాజధానిలో తోటలు తగులపెట్టారు. పోలవరం ను అడ్డుకుంటున్నారు. విశాఖలో సమిట్లు పెడితే క్యాండిల్ ర్యాలీలు పెట్టి పెట్టుబడిదారులను భయభ్రాంతులను చేశారని వైఎస్ జగన్‌పై చంద్రబాబు అసెంబ్లీలో నిందలు వేశారు. మీ నిందారోపణలు దగాకోరు కుట్రలు విషయంలో మీ ఆధీనంలో ఉండే పోలీసులు వారు చేసిన దర్యాప్తులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపైగాని, జగన్‌పై గాని ఎందుకు వాటిని నిరూపించలేకపోయారు. ప్రత్యేక హోదా అంటే జైలులో వేస్తామని మీరంటే అయినప్పటికి హోదా కోసం పోరాటం చేసింది ఎవరు వైఎస్ జగన్ కాదా?’ అని పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. -
కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు
సాక్షి, అమరావతి/బి.కొత్తకోట: ఈబీసీలకు కేంద్రం ఇచ్చిన పదిశాతం రిజర్వేషన్లలో ఐదు శాతాన్ని రాష్ట్రంలో కాపులకు ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. మిగిలిన ఐదు శాతం రిజర్వేషన్లను ఈబీసీలకు ఇస్తామన్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి మంగళవారం టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మంత్రివర్గ సమావేశంలో కాపులకు రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పదిశాతం రిజర్వేషన్లలో ఐదుశాతం కాపులకు ఇవ్వాలని ఎప్పుడో కేంద్రానికి పంపించామని, కానీ అప్పుడు బీజేపీ ఒప్పుకోలేదన్నారు. నాలుగేళ్లలో పెన్షన్లను పది రెట్లు చేశామని, అగ్రిగోల్డ్ బాధితులకు రూ.250 కోట్లు ముందస్తు చెల్లింపు చేయనున్నామని, ట్రాక్టర్లపై త్రైమాసిక పన్ను తీసేశామని చెప్పారు. కోల్‌కతాలో జరిగిన సభతో బీజేపీ నాయకుల్లో భయం మొదలైందన్నారు. ఏపీకి ఎక్కువ నిధులిచ్చామన్న కేంద్రమంత్రి గడ్కరీ వ్యాఖ్యలు అబద్ధమని, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌కే ఎక్కువ నిధులిచ్చారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకన్నా ఏపీకి తక్కువ ఇచ్చారని, పోలవరం నెలలో చేస్తామని ఏడాది జాప్యం చేశారని, డీపీఆర్–2 ఆమోదానికి ఏడాది జాప్యం చేశారని ఆరోపించారు. ఏపీ అభివృద్ధి బీజేపీ వల్ల జరగలేదని, తమ స్వయంకృషి వల్లే జరిగిందన్నారు. 25న రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ‘పసుపుకుంకుమ’ సభలు నిర్వహిస్తామని చెప్పారు. ఈవీఎంలపై అనుమానాలను తెలిపేందుకు 22 పార్టీల ప్రతినిధులతో ఈసీని కలుస్తామని చెప్పారు. కాగా, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ మంగళవారం ఉండవల్లిలో చంద్రబాబును కలిసారు. రూ.2,600 కోట్లతో చిత్తూరుకు గండికోట నీరు వైఎస్సార్ జిల్లా గండికోట రిజర్వాయర్ నుంచి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతానికి తాగునీరు అందించేందుకు రూ.2,600 కోట్లతో పథకాన్ని చేపట్టామని సీఎం చెప్పారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దతిప్పసముద్రంలో కృష్ణా జలాలకు హారతి కార్యక్రమ సభ జరిగింది. మంత్రులు దేవినేని ఉమా, అమరనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభనుద్దేశించి సీఎం మాట్లాడారు. పశ్చిమ ప్రాంతంలో నెలకొన్న నీటిసమస్య తీర్చేందుకు గండికోట నుంచి రెండు టీఎంసీల నీటిని పైప్‌లైన్ ద్వారా తరలించి దాహార్తి తీర్చాలని కేబినెట్ భేటీలో నిర్ణయించామని తెలిపారు. కృష్ణానీరు 29న మదనపల్లెకు చేరనున్న సందర్భంగా జరిగే కార్యక్రమానికి హాజరవుతున్నట్టు తెలిపారు. -
‘ఎన్నికల వేళ కాపులంటే బాబుకు ప్రాణం’
సాక్షి, అమరావతి: ఓట్లను దండుకోవడానికే 2014 ఎన్నికల్లో టీడీపీ కాపుల రిజర్వేషన్ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కాపులను బీసీల్లో చేరుస్తామని హామీనిచ్చి మాట తప్పిన చంద్రబాబు మోసగాడని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్లపై ఉద్యమం చేపట్టిన తర్వాతే చంద్రబాబు కమిషన్ వేశాడని గుర్తు చేశారు. రిజర్వేషన్లపై పోరాడుతున్న ముద్రగడకు వైఎస్సార్సీసీ మద్దతు ఇచ్చిందని అన్నారు. కాపు రిజర్వేషన్లపై మంజునాథ కమిషన్ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా తూతూ మంత్రంగా కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. మంజునాథ కమిషన్ రిపోర్టుని ప్రజల ముందుంచాలని అంబటి డిమాండ్ చేశారు. కాపుల అభివృద్ధికి అయిదేళ్లలో 5 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పిన చంద్రబాబు కేవలం 1300 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు మాట తప్పడం, వెన్నుపోటు పొడవడం కొత్తకాదని అన్నారు. బాబుకు కాపుల ఓట్లపై ప్రేమ ఉంది కానీ, వారి సంక్షేమంపై లేదని అన్నారు. ఇచ్చిన మాట తప్పాలని చూస్తున్న ముఖ్యమంత్రిని గద్దె దించేవరకు కాపులు నిద్రపోవద్దని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీసీ అధికారంలోకి వస్తే కాపుల సంక్షేమానికి 10 వేల కోట్ల కేటాయిస్తామని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాపు రిజర్వేషన్‌పై వైఎస్ జగన్ అన్న మాటల్ని టీడీపీ నేతలు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఆదరణను చూసి తట్టుకోలేక పోతున్నారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల సంక్షేమానికి 10వేల కోట్ల రూపాయలు కేటాయిస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొట్టు సత్యనారాయణ అన్నారు. ప్రజల్లో జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. కాపు రిజర్వేషన్లపై జగన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తేనే కాపులకు మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
మాటల్ని వక్రీకరిస్తారా?
-
కులాల మధ్య చిచ్చు పెట్టారు