చిలమత్తూరు బీసీ కాలనీలో పూసల మంజునాథ్(25) ఉరేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ జమాల్ బాషా తెలిపారు.
చిలమత్తూరు : చిలమత్తూరు బీసీ కాలనీలో పూసల మంజునాథ్(25) ఉరేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ జమాల్ బాషా తెలిపారు. ఆయన కథనం మేరకు... కాలనీకి చెందిన రాజప్ప, రమాదేవి దంపతుల రెండో కుమారుడైన మంజునాథ్ కొడికొండ చెక్‌పోస్టులోని జంగీ డాబాలో పని చేసేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువు చాలించాడు. అయితే బెంగళూరులో ఉంటున్న అతని తమ్ముడు ఈశ్వర్ మాట్లాడాలని అన్నకు ఫోన్ చేయగా స్పందన లేదు.
దీంతో కాలనీకి చెందిన మరో వ్యక్తికి ఫోన్ చేయగా.. ఆయన మంజునాథ్ కోసం వారి ఇంటి వద్దకు వెళ్లాడు. అయతే ఇంటికి తాళం వేసి ఉండగా, దుర్వాసన రావడంతో అనుమానంతో కిటీకీ తెరచి చూడగా ఉరికి వేలాడుతున్నట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.