
బాబు హామీని నిలబెట్టుకోవాలి : ముద్రగడ
కాపు రిజర్వేషన్లపై ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చెప్పారు.
విజయవాడ: కాపు రిజర్వేషన్లపై ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చెప్పారు.
విజయవాడలో ఆదివారం ఆయన మాట్లాడుతూ...కాపు రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ నివేదికను త్వరగా ప్రభుత్వానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన తుది శ్వాస వరకు కాపు జాతి కోసం పోరాడుతానని... కాపుల్లో ఉన్న పేదలకు ఫలాలు అందించడమే తన ధ్యేయమని ముద్రగడ అన్నారు.