
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. అంతేకాక 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ముద్రగడ స్పష్టం చేశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనంతపురం వచ్చిన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వంగవీటి రంగా హత్య తర్వాత టీడీపీని కాపులు ఓడించిన విషయాన్ని ముద్రగడ గుర్తు చేశారు.
అంతకన్నా ఘోరంగా చంద్రబాబుకు గుణపాఠం చెప్పేందుకు ప్రస్తుతం కాపులంతా సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. 13 జిల్లాల ప్రతినిధులతో చర్చించి నిర్ణయిస్తామని ముద్రగడ స్పష్టం చేశారు. అవసరాన్ని బట్టి పవన్ కల్యాణ్‌తో కూడా చర్చిస్తామని, మోసం, దగా చేసిన చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేస్తామని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment