breaking news
mudragada padmanabham
-
మా నాన్నను బ్రతికించడం కోసం జగన్ గారు చేసిన ప్రయత్నం
-
ఆ రోజు భారతి గారు మమ్మల్ని పిలిపించినప్పుడు.. ముద్రగడ గిరిబాబు ఎమోషనల్ కామెంట్స్
-
ముద్రగడ సంస్మరణ సభకు మళ్లీ వెళ్తావా?
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ దివంగత నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైనందుకు టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. సంస్మరణ సభకు వెళ్లడాన్ని తప్పుబడుతూ ఆయన సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై బొండా ఉమా నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ఆదివారం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు రాగా.. చంద్రబాబు తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. వివరణ తీసుకునే బాధ్యతను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడుకు అప్పగించినట్లు సమాచారం. రగిలిపోతున్న కాపులు ఈ పరిణామంపై టీడీపీలోని కాపు నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాపు సామాజికవర్గానికి చెందిన ఒక దివంగత నేత సంస్మరణ సభకు హాజరుకావడాన్ని కూడా తప్పుగా చూడటమేంటన్న ప్రశ్న వారి నుంచి వినిపిస్తోంది. పారీ్టలోని కాపు నేతలపైనే ఇలా ఆంక్షలు పెడుతుండటాన్ని తాము సహించలేకపోతున్నామని వారంటున్నారు. ముద్రగడ మరణించాక కూడా ఆయనపై శత్రుత్వ భావాన్ని కొనసాగించడంపై చర్చ పార్టీలో మొదలైంది. బతికున్నప్పుడు ఆయన ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయతి్నంచి.. ఇప్పుడు ఆయన సంస్మరణ సభకు వెళ్లిన సొంత ఎమ్మెల్యే పైనే చర్యలకు సిద్ధపడటంపై కాపు సామాజికవర్గంలో అసంతృప్తిని మరింత పెంచుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరణించిన నాయకుడికి నివాళి అర్పించే విషయంలో కూడా రాజకీయ రంగులు పులమడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేం..! కన్నీళ్లు పెట్టుకున్న గిరిబాబు
-
నా సోదరి క్రాంతి చేసింది మహాపాపం: ముద్రగడ గిరిబాబు
సాక్షి, కాకినాడ జిల్లా: ‘‘మా తండ్రి ముద్రగడ పద్మనాభం మరణం మా కుటుంబానికి తీరని లోటు’’ అని ఆయన కుమారుడు గిరిబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా తండ్రికి నివాళులర్పించిన అందరికీ మా కృతజ్ఞతలు. నా తండ్రిని బతికించేందుకు వైఎస్ జగన్ చాలా ప్రయత్నం చేశారు. ముద్రగడ ఆరోగ్యం గురించి వైఎస్ జగన్ ఫోన్ చేసి తెలుసుకునేవారు. ముద్రగడను బతికించేందుకు వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడేవారు’’ అని గిరిబాబు తెలిపారు.నా తండ్రి పాడెను వైఎస్ జగన్ మోయడం ఎప్పటికీ మర్చిపోలేం. ఇది రాజకీయ లబ్ధికాదు. కుమారుడు తండ్రికి ఇచ్చిన గౌరవం. వైఎస్ జగన్ పట్ల మా కుటుంబంలో మరింత గౌరవం పెరిగింది. ముద్రగడ చెప్పినట్టే నడుచుకున్నాం. మా సోదరి క్రాంతిని రానివ్వద్దని ముద్రగడ మాకు చెప్పారు. కానీ పోలీసులు బలవంతంగా క్రాంతిని తీసుకొచ్చారు. మేం క్రాంతిని తీసుకురావద్దని చెప్పినా పోలీసులు వినలేదు’’ అని ముద్రగడ గిరిబాబు చెప్పారు.అంబటి రాంబాబుపై కేసు పెట్టడం సరికాదు. అంత్యక్రియలకు అధికార లాంఛనాలు వద్దని మేమే చెప్పాం. మా తండ్రి అంత్యక్రియలు ప్రశాంతంగా చేసుకోనివ్వలేదు. నా సోదరి క్రాంతిని అడ్డుపెట్టుకుని జనసేన రాజకీయం చేస్తోంది. నా సోదరి క్రాంతి చేసింది మహాపాపం’’ అని గిరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వంగవీటి తర్వాత కాపులను కాపు కాసిన వ్యక్తి ముద్రగడ
-
ముద్రగడ కుటుంబాన్ని పరామర్శించిన మంద కృష్ణ మాదిగ
-
ముద్రగడ ఫ్యామిలీని పరామర్శించిన సజ్జల
-
ముద్రగడ రాజకీయాల్లో ఉన్నత పదవులు ఎప్పుడు ఆశించ లేదు
-
ముద్రగడ కుటుంబానికి సజ్జల పరామర్శ
కాకినాడ: ఇటీవల కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యుల్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం(జూలై 20వ తేదీ) పరామర్శించారు. దీనిలో భాగంగా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు సజ్జల. ఈ క్రమంలోనే ముద్రగడ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు.అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ‘ ముద్రగడ తన జీవిత కాలం పేదల కోసం... తాను నమ్మిన సిద్దాంతల కోసం పని చేశారు. రాజకీయాల్లో ఉన్నత పదవులు ఎప్పుడు ఆశించ లేదు. వైఎస్ జగన్ ఆశయాలు నచ్చి 2024 లో ముద్రగడ వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్ చేతిలో రాష్ట్రం బాగుంటుంది... ప్రజల జీవితాలు బాగుంటాయి అని భావించారు. మరోసారి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చెయ్యాలని ముద్రగడ పని చేశారు. కాపునాడు- కాపు ఉద్యమంలో ఎంతో మంది ఆయన వెనుక వచ్చారు. కాపు ఉద్యమంలోను వెనుక బాటు తనం ఉందని ముద్రగడ నమ్మారు. ఆ లక్ష్యసాధన కోసం పని చేసేవారికి ముద్రగడ ఆదర్శంగా ఉంటారు’ అని పేర్కొన్నారు. -
ఎన్టీఆర్ చేతిరాత లేఖ.. ముద్రగడపై ఎంత ప్రేమో తెలుసా?
-
రాజకీయం కాదు.. ప్రాణం ఇచ్చే స్నేహం! వంగవీటి ఆశా కిరణ్ కన్నీటి నివాళి..
-
ముద్రగడ మరణించినా వదలరా?
సాక్షి, అమరావతి : మాజీమంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బతికుండగా వేధించారు.. మరణించాక కూడా రాజకీయం చేస్తారా? ఆయన ఆత్మను క్షోభకు గురిచేస్తారా? అంటూ కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కేఆర్పీఎస్) ఘాటుగా స్పందించింది. ముద్రగడపై పథకం ప్రకారం సాగిన రాజకీయ కక్షసాధింపును గమనించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కేఆర్పీఎస్ రాష్ట్ర చైర్మన్ కాజా సత్యనారాయణ, వర్కింగ్ చైర్మన్ మసాబత్తుల శ్రీనివాస్, కన్వీనర్ రావి శ్రీనివాస్, కో–ఆరి్డనేటర్ జె.టి.రామారావు, కో–కనీ్వనర్లు కాకిలేటి హరనాథ్, వలవల శ్రీధర్‌నాయుడు ఆదివారం బహిరంగలేఖను విడుదల చేశారు.రాష్ట్రంలో పాలకపక్షం ముద్రగడ అనారోగ్యం, మరణం, మరణానంతరం కూడా రాజకీయం చేసే ప్రయత్నాలకు పాల్పడిన తీరును రాష్ట్రంలోని యావత్ కాపు సమాజం, కాపు ప్రజాప్రతినిధులు, కాపు సంఘాలు నిశితంగా గమనించాలని సూచించారు. వ్యక్తిగత అనారోగ్యాన్ని సైతం రాజకీయాలకు వాడుకోవడం, వారి కుటుంబంలో ఉన్న మనస్పర్ధలను రాజకీయం చేయడం, కన్నతండ్రి పైనే కూతురిని ఉసిగొల్పడాన్ని గమనిస్తే మనవేలితో మనకళ్లే పొడుస్తున్నారనే విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు. కొత్తగా కాపులను కాపులతోటే చంపించే సంస్కృతికి తెరలేపారన్నారు.విజయవాడలో చనిపోయిన వ్యక్తి, చంపిన సీఐ కూడా కాపులేనని బహిరంగ వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రకటించేస్థాయికి దిగజారిపోయారన్నారు. ఎన్టీఆర్‌కు పథకం ప్రకారం ముద్రగడను దూరం చేసిందెవరనేది అందరికీ తెలుసునని పేర్కొన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ముద్రగడ తన పదవికి రాజీనామా చేసి.. బలమైన కాపు ఉద్యమం చేపట్టి ఏడురోజుల ఆమరణ దీక్షతో సాధించిన జీవో 30 అమలు చేయకుండా తుంగలో తొక్కింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. రాజకీయ స్వార్థం కోసం కూతురుతో తండ్రిని తిట్టించిందెవరు? రాజకీయ స్వార్థం కోసం కూతురును జనసేనలో చేర్పించి కన్నతండ్రినే తిట్టించింది ఎవరు? తల్లిదండ్రులను కనీసం తన ఇంట్లోకి రానివ్వని కూతురు ఆయన మరణం తర్వాత ఆడిన సానుభూతి డ్రామాకు ఒక వర్గం భారీ ప్రచారం కల్పించడంలో ఎవరి ప్రమేయం ఉంది? చివరకు మాటకు కట్టుబడి పేరు మార్చుకుంటే కులం మార్చుకున్నారంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడింది ఎవరు? అనే అనేక ప్రశ్నలకు జవాబులు వెదికితే.. వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో కాపు సమాజం గమనించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.చివరకు అధికార లాంఛనాలను సైతం చంద్రబాబు ప్రభుత్వం ఉదారంగా ఇచ్చినట్టు.. వాటిని వైఎస్సార్సీపీ అడ్డుకుందనే తప్పుడు ప్రచారం చేశారని గుర్తుచేశారు. వాస్తవానికి మాజీమంత్రి అంత్యక్రియలకు అధికార లాంఛనాలనేవి ఎవరి భిక్ష కాదు.. అది ఆనవాయితీ అనే విషయం తెలియదా? అని ప్రశ్నించారు. ముద్రగడ కుటుంబసభ్యులే అధికార లాంఛనాలు వద్దని స్పష్టంగా చెప్పినా కూడా పోలీసులు ఎవరి ఒత్తిడితో చేయడానికి ప్రయత్నించారని నిలదీశారు. గతంలో చంద్రబాబు అమలు చేయని రిజర్వేషన్లను వైఎస్ జగన్ నిలిపేసినట్టు ప్రచారం చేసిన విధంగానే ఇప్పుడు ముద్రగడకు అధికార లాంఛనాలపైనా తప్పుడు ప్రచారం చేయడం వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో గమనించాలని కోరారు. ఇప్పటికైనా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కాకినాడ జిల్లాకు ముద్రగడ పద్మనాభం, కృష్ణాజిల్లాకు వంగవీటి మోహన్‌రంగా పేర్లు పెట్టి, కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని కేఆర్పీఎస్ డిమాండ్ చేసింది. -
సిద్ధాంతాల కోసం సాగిన ప్రయాణం.. ముద్రగడ పోరాట ప్రస్థానం
-
శవరాజకీయాలా..? పచ్చ మీడియాకు ముద్రగడ కుటుంబం వార్నింగ్
-
ముద్రగడ సమాధి దగ్గర ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు
-
ముద్రగడ ఫ్యామిలీని పరామర్శించిన PV సునీల్ కుమార్.. ఏం మాట్లాడారంటే?
-
జగన్ ముద్రగడకు ఇచ్చిన గౌరవం.. ఎప్పటికీ చెరిగిపోని...
-
నా కూతురు మా కాంపౌండ్‌లో కాళ్ళు పెట్టడానికి వీలు లేదు అని...
-
పవన్ చేసిన ఒక్క అవమానం.. కూతురిని రానివ్వక పోవడానికి అసలు కారణం..
-
మీకు దండం పెడుతున్న... ముద్రగడ మరణంపై బొత్స ఎమోషనల్
-
చనిపోయే ముందు రోజే ఆయన చెప్పిన నాలుగు మాటలు.. ముద్రగడ స్నేహితుడు షాకింగ్ నిజాలు
-
ముద్రగడ ఫ్యామిలీని పరామర్శించిన YSRCP నేతలు
-
మీడియాకు ముద్రగడ కుమారులు సంచలన లేఖ
-
మీడియాకు ముద్రగడ కుమారుల లేఖ
సాక్షి,కీర్లంపూడి: కాపు ఉద్యమ నేత, దివంగత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమారులు బాలు, గిరిబాబులు మీడియాకు లేఖ రాశారు. ‘వ్యక్తిత్వానికి, ఆత్మాభిమానానికి ముద్రగడ నిలువుటద్దం. ఆయన మరణాంతరం ఏం చేయాలనే దానిపై.. ఆయన మాకు చాలా స్పష్టంగా చెప్పారు. ముద్రగడ నిర్ణయం మేరకే అంత్యక్రియల ప్రక్రియ నడిచింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి లాంఛనాలు వద్దని చెప్పారు.ఆయన నిర్ణయం మేరకు అధికారిక లాంఛనాలను తిరస్కరించాం. ఈ విషాద సమయంలో మాకు అండగా ఉండి.. ముద్రగడపై అపార గౌరవాన్ని చాటిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.‘మాకు, బార్లపూడి క్రాంతి కుటుంబానికి మధ్య.. కొన్నేళ్లుగా సంబంధాలు, రాకపోకలు లేవు. ఆమె కడచూపుకు రాకూడదన్న నిర్ణయం ముద్రగడదే. మమ్మల్ని మానసిక క్షోభకు గురిచేసే కథనాలు.. ప్రసారం చేయొద్దని మీడియాను వేడుకుంటున్నాం’అని లేఖలో పేర్కొన్నారు. -
ప్రభుత్వ లాంఛనాలు తీసుకోకపోతే ముద్రగడ ఫ్యామిలీపై కేసు పెడతారా..
-
చనిపోయే ముందు రోజే ఆయన చెప్పిన నాలుగు మాటలు..
-
ముద్రగడ పద్మనాభంపై తప్పుడు ప్రచారం.. నీ టాస్క్ ఫోర్స్ ఎక్కడ బాబు
-
‘చంద్రబాబు, లోకేష్, డీజీపీ నాపై కక్ష కట్టారు’
సాక్షి,గుంటూరు: చంద్రబాబు, లోకేష్, డీజీపీ నాపై కక్ష కట్టారు. ఏదో విధంగా నన్ను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కిర్లంపూడిలో జరిగిన ఘటనపై అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ క్రమంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్, డీజీపీ నాపై కక్ష కట్టారు. ఏ విధంగా నన్ను అణచివేసేందుకు యత్నిస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ కుటుంబాన్ని వేధించారు. మహిళలను అసభ్య పదజాలంతో తిడుతూ అవమానించారు. అధికారిక లాంఛనాలు వద్దని ముద్రగడ కుటుంబమే చెప్పింది. అయినా పోలీసులు ఎందుకు వచ్చారు? అని ప్రశ్నించారు. -
కూతురు క్రాంతి గురించి అనుచరులు బయటపెట్టిన నిజాలు
-
మా నాన్న చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు
-
నన్ను, నా తమ్ముడు గణేష్ ను సొంత కొడుకులులా చూసుకునేవారు
-
చనిపోయాక తండ్రి గుర్తొచ్చాడా? ముద్రగడ కూతురు క్రాంతి పై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్
-
కాపునగధీరుడి శకం ముగిసింది.. మరణంలోనూ ట్రోలింగ్ ఆపని ఎల్లో సైకోలు
-
ఉద్యమ కెరటం అస్తమించింది.. ముద్రగడకు వీడ్కోలు
ఒక ఉద్యమ కెరటం ఆగిపోయింది.. ఒక ఆత్మీయ అనుబంధం తెగిపోయింది. మాటకు, పట్టుదలకు మారుపేరు అయిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అనారోగ్యానికి గురై మరణించడం అందరిని కలచివేస్తుంది. ముద్రగడ కాపు ప్రజల కోసం ఎంతో కృషి చేసి ఆ వర్గానికి చాలా మేలు చేశారు కాని, తాను మాత్రం రాజకీయంగా నష్టపోయారని చెప్పాలి. ఎవరు కాపుల ప్రయోజనాలకోసం కృషి చేశారో, చేస్తారో తెలుసుకునే టైమ్‌కి ముద్రగడ కన్ను మూయడం దురదృష్టకరం.ఆయన కాపు సామాజికవర్గ డిమాండ్లపై ఉద్యమాలు చేసినా, ఇతర సామాజికవర్గాలతో ఎప్పుడూ ఘర్షణ పడలేదు. అదే ఆయన ప్రత్యేకత. ఉమ్మడి ఏపీలోకాని, విభజిత ఏపీలో కాని సామాజికవర్గ నేతలు అతి తక్కుమంది ప్రభావం చూపించారు. వారిలో ముద్రగడ అగ్రగణ్యుడుగా ఉన్నారు. కాపులు పేరుకు అగ్రవర్ణం అయినా, పేదల శాతం ఎక్కువగా ఉంది. వారిని ఆకర్షించడానికి కొన్ని రాజకీయ పార్టీలు పలు హామీలు ఇవ్వడం, మభ్యపెట్టడం, ఆ తర్వాత మర్చిపోవడం మామూలు అయింది.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయాలని కోరుతూ 2014-19 టరమ్‌లో ముద్రగడ నడిపిన ఉద్యమం ఏపీని కుదిపివేసింది. ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టి ఉద్యమాన్ని అణచివేయాలని చూసినా, ఉద్యమ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా, రకరకాల నిరసన పద్దతులను అవలంబించి ముద్రగడ చరిత్ర సృష్టించారు. మహిళలతో సహా కాపువర్గం వారంతా పళ్లాలతో నిరసన తెలుపుతూ చేపట్టిన ఆందోళన ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. తుని వద్ద ఆయన జరిపిన సభకు వేలాదిగా ఆ సామాజికవర్గ ప్రజలు స్వచ్చందంగా తరలివెళ్లడం ఒక చరిత్ర. అనూహ్యంగా తుని వద్ద రైలు దగ్దం ఘటనతో ఆయనతో సహా అనేక మంది ఉద్యమకారులపై కేసులు వచ్చినా చలించలేదు.టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసులను జగన్ ప్రభుత్వం ఎత్తివేసింది. తన కుటుంబ సభ్యులపై పోలీసులతో బూతులు తిట్టించారని అప్పటి టీడీపీ ప్రభుత్వంపై పలుమార్లు బాధపడ్డారు. ఆయనను రాజమండ్రి ఆస్పత్రిలో నిర్బంధించి ఎవరిని కలుసుకోవడానికి కూడా అనుమతించేవారు కాదని ఆయన చెబుతుండేవారు. రైతులకు సమస్య వచ్చినా, తన అనుచరులపై అక్రమ కేసులు పెట్టినా, రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన ఆందోళనలకు దిగేవారు. ఉత్తరకంచి గ్రామంలో జరిగిన ఒక ఘటనపై ఆయన దీక్ష చేయడం ఆ రోజుల్లో పెద్ద సంచలనం. కొన్నిసార్లు తన ఇంటిలోనే తలుపులు వేసుకుని దీక్ష చేసేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం టైమ్‌లో కూడా ఆయన కాపుల డిమాండ్లపై దీక్ష చేపట్టారు. అప్పట్లో ఆయన ఆ పార్టీలోనే ఉన్నా ప్రజల కోసం ఉద్యమించడానికి ముందుండేవారు.కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రి రోశయ్యను హెలికాఫ్టర్‌లో పంపించి ముద్రగడతో రాయబారం చేసి కాపులకు పలు వరాలను ఇవ్వడానికి అంగీకరించింది. ఆ తర్వాత లక్షల మందితో ఒక సభను పెడితే కోట్ల స్వయంగా హాజరయ్యారు. కొన్నిసార్లు అవసరమైతే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవిని వదలుకోవడానికి కూడా ఆయన వెనుకాడేవారు కారు. ముద్రగడ తండ్రి వీరరాఘవరావు రెండుసార్లు ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. ఆ తర్వాత రాజకీయాలలోకి వచ్చిన పద్మనాభం 1978 నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి ఎంపీ అయ్యారు. గతంలో జనతా, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో ఉన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పట్ల ప్రత్యేక అభిమానం కలిగి ఉన్నారు.ముద్రగడను హైదరాబాద్ పంపి, ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేయించి, కోలుకోవడం కోసం జగన్ ఎంతో కృషి చేసినా అది ఫలించలేదు. ముద్రగడ ఆత్మీయత అనేది ఒక అరుదైన అనుభవం. ఆయన ఇంటికి ఎవరు వెళ్లినా ఆతిథ్యం తీసుకోకుండా వెళ్లడానికి ఒప్పుకునేవారు కారు. నిత్య సంతర్పణ మాదిరిగా ఇంటి వద్ద కోలాహలం ఉంటుందంటే ఆశ్చర్యం కాదు. రాజకీయాలలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ, తన వ్యక్తిత్వాన్ని ఎన్నడూ వదలుకోలేదు. తనను నమ్ముకున్నవారిని వదలిపెట్టలేదు. ఆయా సందర్భాలలో ప్రభుత్వ నేతలకు లేఖలు రాసి తన అభిప్రాయాలను చెబుతుండేవారు.చంద్రబాబుకు ఆ లేఖలు బాగా చికాకు పెట్టించేవి. ముద్రగడ వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయేవారు. టీడీపీ ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తే, జగన్ ప్రభుత్వం కాపు నేస్తంతో సహా పలు పథకాలను వారి సంక్షేమం కోసం అమలు చేసింది. తద్వారా కాపులకు కూడా ఇతరవర్గాలతో పాటు మేలు చేసిన వ్యక్తిగా జగన్‌ను ఆయన గుర్తించారు. జగన్ కూడా ఆయనను పితృ సమానుడుగా చూశారు. తన సంతాప సందేశంలో అదే విషయం పేర్కొన్నారు. జనసేనకు చెందిన ఒక ప్రముఖ నేత గత ఎన్నికల ముందు ఆయన ఇంటికి వస్తున్నట్లు ఆ పార్టీ నేతలు సమాచారం ఇచ్చారు. దాంతో ఆయన తగు ఏర్పాట్లు చేసుకున్నారు. కాని ఆయన ఇంటికి రాకపోవడంతో ముద్రగడ చాలా బాధపడ్డారు. మాటపై నిలబడడం కాని, పట్టుదలకు కాని ముద్రగడ పెట్టింది పేరు.గత ఎన్నికలలో వైఎస్సార్సీపీకి ఓటమి ఎదురుకాదని ఆయన విశ్వసించారు. అలా జరిగితే తన పేరు మార్చుకుంటానని శపథం చేశారు. సాధారణంగా రాజకీయాలలో ఇలాంటి సవాళ్లు జరుగుతుంటాయి. ఆ తర్వాత వాటిని విస్మరిస్తుంటారు. కాని ముద్రగడ మాత్రం అందుకు భిన్నంగా తన పేరును పద్మనాభరెడ్డి అని గెజిట్‌లో నమోదు చేయించుకోవడం విశేషం. తన కుమార్తె జనసేనలో చేరి తనపైనే విమర్శలు చేసిన తీరు ఆయనకు తీరని ఆవేదన మిగిల్చింది. తాను మరణిస్తే ఆమెను రానివ్వద్దని అన్నారంటే ఎంత బాధపడ్డారో అర్ధం చేసుకోవచ్చు.ముద్రగడ పార్ధీవదేహం చూడడానికి వచ్చిన ఆమెను కుటుంబ సభ్యులు అనుమతించలేదు. కూటమి ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికార లాంచనాలతో చేయడానికి ముందుకు వచ్చినా వారు అంగీకరించలేదు. జీవించి ఉన్నప్పుడు ముద్రగడను ఎన్నో బాధలుపెట్టిన కూటమి నేతలు ఇప్పుడు మొసలికన్నీరు కార్చుతున్నారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ముద్రగడ ఏపీ చరిత్రలో తనకంటూ ఒక పేజీని ఏర్పాటు చేసుకున్నారు. గత ఏభై ఏళ్లలో కాపు సామాజికవర్గానికి ఇంతగా గుర్తింపు తెచ్చిన నేత ముద్రగడ తప్ప మరోకరు కాదని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నారా లోకేష్ నోటి దూల.. ముద్రగడ కుమార్తెకు నో ఎంట్రీ.. అసలేం జరిగింది!
-
కన్నీళ్లు పెట్టిస్తున్న ముద్రగడ చివరి లేఖ
-
నెల రోజులు ముద్రగడ ఆసుపత్రిలో ఉంటే కూతురికి పరామర్శించే సమయం లేదా ?
-
ఇచ్చిన మాట కోసం పేరునే మార్చుకున్న గొప్ప నాయకుడు ముద్రగడ పద్మనాభం
-
కిర్లంపూడి: అంబటి రాంబాబుపై కేసు నమోదు
సాక్షి, కాకినాడ: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.ముద్రగడ పద్మనాభం మృతిచెందిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని తిరస్కరించారు. తమ కుటుంబ నిర్ణయం మేరకే అంతిమ కార్యక్రమాలు జరపాలని స్పష్టం చేశారు. అయితే.. ప్రభుత్వం తరఫున పోలీసులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ముద్రగడ అంత్యక్రియల సమయంలో.. గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించే సమయంలో అంబటి రాంబాబు, మరికొందరు వైఎస్సార్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అధికార లాంఛనాలు నిర్వహిస్తున్న పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఉన్నతాధికారుల సమక్షంలోనే విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు ఆరోపించారు.ఈ ఘటనపై ఏఆర్ ఎస్ఐ వెలుదూటి అప్పలరాజు, పలువురు కానిస్టేబుళ్లు ఫిర్యాదు చేశారు. గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తున్న సమయంలో అంబటి రాంబాబు పోలీసులను తోసివేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో అంబటి రాంబాబుతో పాటు మరికొందరు వైఎస్సార్సీపీ నేతలపై బీఎన్ఎస్ 132, 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు.. వైఎస్సార్సీపీ నేతలు ఈ కేసును ఖండిస్తున్నారు. ముద్రగడ కుటుంబం ప్రభుత్వ లాంఛనాలను వద్దని స్పష్టంగా చెప్పినప్పటికీ.. ప్రభుత్వం బలవంతంగా గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించిందని ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవించాల్సిన ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శిస్తున్నారు. -
అతనొక బ్రాండ్.. ముద్రగడ మరణంపై మధుసూదన్ రెడ్డి ఎమోషనల్ రియాక్షన్
-
కాపు నాయకుడికి ఘన నివాళి.. ముద్రగడ పాడె మోసిన జగన్..
-
ఈ దుష్ట ప్రభుత్వ లాంఛనాలు నాకు అవసరం లేదని చెప్పి... ముద్రగడ మరణం.. అంబటి షాకింగ్ నిజాలు
-
చెరగని ముద్ర ముద్రగడ ప్రస్థానం..
-
అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు
సాక్షి, కాకినాడ/ గోకవరం/ పిఠాపురం/ కిర్లంపూడి: కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం అంతిమ యాత్ర అభిమానులు, పార్టీ నాయకులు, శ్రేణులు, కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య సాగింది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి గ్రామంలోని ఆయన ఇంటి ఆవరణలో కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. శ్వాసకోశ వ్యాధితో హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముద్రగడ మంగళవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెల్సిందే. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి బుధవారం ఉదయం స్వగ్రామమైన కిర్లంపూడికి తీసుకొచ్చారు. ముద్రగడ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఆయన స్వగృహంలో ఉంచారు. తమ ఉద్యమ నేతను కడసారిగా చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు, ప్రజలు, వివిధ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు తరలిరావడంతో కిర్లంపూడి కిక్కిరిసిపోయింది. ముద్రగడ అభీష్టం మేరకు ఇంటి ఆవరణలోనే కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పాడె మోసిన మాజీ సీఎం వైఎస్ జగన్ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి మధ్యాహ్నం 2.55 గంటలకు చేరుకున్నారు. అనంతరం ముద్రగడ భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పూలను పక్కకు జరిపి ముద్రగడను చివరి చూపు చూసిన వైఎస్ జగన్ కాసేపు ఉద్విగ్నంగా కనిపించారు. అనంతరం ముద్రగడ సతీమణి పద్మావతి, కుమారులు బాలు, గిరిబాబు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి, తానున్నానని ధైర్యం చెప్పారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అక్కడే ఉండి ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొన్న వైఎస్ జగన్ స్వయంగా ఆయన పాడె మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యేవరకు వైఎస్ జగన్ కిర్లంపూడిలోనే ఉన్నారు. అంతిమ సంస్కారాల్లోనూ అదే ‘ముద్ర’!జీవించినంతకాలం కొన్ని విలువలకు కట్టుబడి ఉన్న మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం తాను మరణించిన తరువాత కూడా ఏమి చేయాలన్నది ముందుగానే నిర్ణయించారు. దానిని ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు తూచ తప్పకుండా పాటించడం విశేషం. ఆయన బతికున్నప్పుడే తన అంత్యక్రియలు ఎలా చేయాలనే విషయమై ముందుగానే పలు సూచనలు చేసినట్టు బంధువులు చెబుతున్నారు. తన భౌతికకాయాన్ని ఆయన ఇంటి ఆవరణలోనే ఖననం చేయాలని సూచించారట. తాను చనిపోయేటప్పటికి తన ఒంటిపై ఏది ఉన్నా వాటన్నిటితోనూ ఖననం చేయాలని, తనకు అంత్యక్రియల అనంతరం ఎటువంటి దిన కార్యాలూ చేయొద్దని ఆయన చెప్పారట. తన భార్య జీవించి ఉన్నంతకాలం సుమంగళిగానే ఉండాలని ఆయన కోరినట్టు చెబుతున్నారు. ఆయన కోరిక మేరకు అన్నీ ఆయన చెప్పినట్టే చేస్తున్నట్టు బంధువులు తెలిపారు. అలాగే ప్రత్యర్థులతో చేతులు కలిపి కుటుంబంపై విమర్శలు చేసిన తన కుమార్తె క్రాంతిని తన భౌతికకాయం వద్దకు రానివ్వవద్దని కూడా ఆయన కుటుంబసభ్యులకు చెప్పారట. వీటన్నిటినీ కుటుంబ సభ్యులు పాటించారు.ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి నివాళి అర్పిస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముద్రగడ సతీమణి పద్మావతిని ఓదార్చుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్ క్రాంతి రాకతో గందరగోళంవారించినా వినకుండా ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి భౌతికకాయం వద్దకు వచ్చే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ‘గో బ్యాక్ క్రాంతి’ అంటూ ముద్రగడ అభిమానులు నినాదాలు చేయడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం నెలకొంది. అలాంటి పరిస్థితిలో కూడా పైనుంచి ఆదేశాలందుకున్నట్లుగా పోలీసులు క్రాంతిని భౌతికకాయం వరకు వెంటపెట్టుకుని తీసుకువచ్చారు. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో ఆమెను బయటకు పంపించేయాలని ముద్రగడ భార్య, బంధువులు పోలీసులను కోరారు. తర్వాత ఆమెను అక్కడి నుంచి తరలించారు.ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన ముద్రగడ కుటుంబంనాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒక దఫా ఎంపీగా, రెండుసార్లు మంత్రిగా పని చేసిన ముద్రగడ పద్మనాభం రాష్ట్రానికి విశేష సేవలందించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను ముద్రగడ కుటుంబ సభ్యులు తిరస్కరించారు. బతికి ఉన్నప్పుడు బజారుకీడ్చి.. ఇప్పుడు లాంఛనాలు అనడంలో అర్థమేమిటని వారు ప్రశ్నించారు. ముద్రగడను, ఆయన కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేసిన ప్రభుత్వం నుంచి తనకు ప్రకటించే ఏవిధమైన సహాయం అందుకోకూడదని ఆయన బతికి ఉన్నప్పుడే నిర్ణయించారని, ప్రభుత్వ లాంఛనాలతో చేస్తే ఆయన ఆత్మ శాంతించదని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా ముద్రగడ భౌతికకాయాన్ని ఖననం చేసే సమయంలో ప్రభుత్వ లాంఛనాల ప్రకారం చేస్తున్నట్లుగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన ముద్రగడ అనుచరులు వెంటనే పోలీసులను అడ్డుకున్నారు.నాడు వేధించి నేడు నాటకాలా! చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభంను గతంలో అనేక రకాలుగా వేధించి, అవమానించారని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా గుర్తుచేశారు. ముద్రగడ కుటుంబ సభ్యుల విషయంలోనూ అసభ్యంగా ప్రవర్తించారని విమర్శించారు. ఆయన బతికున్నప్పుడు ఇబ్బందులకు గురిచేసి.. ఇప్పుడు మృతి తర్వాత మొసలికన్నీరు కార్చాల్సిన అవసరం లేదని జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. ముద్రగడ జీవించి ఉండగా అనేక విధాలుగా అవమానించారని, ఇప్పుడు అధికారిక గౌరవాలు, సానుభూతి అవసరం లేదని చెప్పారు. -
మీరు రావొద్దు... ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదు...
-
చనిపోక ముందే కుటుంబ సభ్యులకు ముద్రగడ లేఖ
సాక్షి, కాకినాడ జిల్లా: చనిపోక ముందే కుటుంబసభ్యులకు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. తనను ఎక్కడ ఖననం చేయాలో ముందే చెప్పిన ముద్రగడ.. ఇంటి ఆవరణలోనే తనను ఖననం చేయాలని చెప్పారు. ప్రభుత్వ లాంఛనాలు తనకు అవసరం లేదంటూ లేఖలో పేర్కొన్నారు. పోలీసుల గౌరవ వందనం కూడా అవసరం లేదని.. జీవించి ఉన్నప్పుడు ఇబ్బందులకు గురిచేసి.. మరణానంతరం ఇచ్చే గౌరవం తనకు అవసరం లేదని లేఖలో స్పష్టం చేశారు. తాను మరణించినా భార్య పుణ్య స్త్రీగానే ఉండాలని పేర్కొన్నారు.కాగా, ప్రభుత్వ తీరుపై ముద్రగడ పద్మనాభం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక లాంఛనాలు వద్దన్నా కానీ, ప్రభుత్వం.. గార్డ్ ఆఫ్ హానర్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదంటూ ముద్రగడ అభిమానులు ఆందోళనకు దిగారు. పోలీసులు గోబ్యాక్ అంటూ ముద్రగడ అభిమానులు నినాదాలు చేశారు.కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ జగన్.. వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. ముద్రగడ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొన్న వైఎస్ జగన్.. ఆయన పాడె మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు వైఎస్ జగన్ కిర్లంపూడిలోనే ఉన్నారు. -
‘ముద్రగడ చనిపోయినా చంద్రబాబు కక్ష సాధింపు’
సాక్షి, కాకినాడ జిల్లా: ప్రభుత్వ తీరుపై ముద్రగడ పద్మనాభం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక లాంఛనాలు వద్దన్నా కానీ, ప్రభుత్వం.. గార్డ్ ఆఫ్ హానర్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదంటూ ముద్రగడ అభిమానులు ఆందోళనకు దిగారు. పోలీసులు గోబ్యాక్ అంటూ ముద్రగడ అభిమానులు నినాదాలు చేశారు.వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ముద్రగడలేని లోటును ఎవరూ పూడ్చలేరన్నారు. ‘‘ఈ దుష్ట ప్రభుత్వ లాంఛనాలు వద్దని ముద్రగడ ఎప్పుడో చెప్పారు. అధికార లాంఛనాలు వద్దన్నా పోలీసులు తుపాకులతో వచ్చారు. ముద్రగడ చనిపోయినా చంద్రబాబు కక్ష సాధిస్తూనే ఉన్నారంటూ అంబటి మండిపడ్డారు. -
ముద్రగడ ఇంటి వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్ ఇచ్చిపడేసిన అంబటి
-
ముద్రగడకు YSRCP నేతల కన్నీటి వీడ్కోలు
-
ముద్రగడకు కన్నీటి వీడ్కోలు.. పాడె మోసిన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
LIVE: ముద్రగడ ఇంటికి వైఎస్ జగన్
-
ముద్రగడకు చివరి వీడ్కోలు.. పాడె మోసిన జగన్
-
కన్నీళ్ల మధ్య ముద్రగడ కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్
-
జగన్ ముందు కన్నీరుమున్నీరైన ముద్రగడ భార్య, కొడుకు
-
జగన్ కంటతడి.. ముద్రగడ వద్ద భావోద్వేగ క్షణాలు
-
ముద్రగడ ఇంటికి చేరుకున్న వైఎస్ జగన్
-
ముద్రగడ డైరీలో ఏముంది..? చివరి కోరిక ఏంటి?
-
ముద్రగడ మరణంపై అంబటి కూతురు ఎమోషనల్ రియాక్షన్
-
ముద్రగడ పద్మనాభం పాడె మోసిన వైఎస్ జగన్
సాక్షి, కాకినాడ: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ జగన్.. వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. ముద్రగడ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొన్న వైఎస్ జగన్.. ఆయన పాడె మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు వైఎస్ జగన్ కిర్లంపూడిలోనే ఉన్నారు. ముద్రగడ ఇంటి ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించారు.అంతకుముందు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన వైఎస్ జగన్.. ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో జగ్గంపేటకు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడి ముద్రగడ నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం పార్థివ దేహానికి రాజకీయ ప్రముఖులు, ప్రజలు, అభిమానులు నివాళులు అర్పించారు. అభిమానులు కిర్లంపూడికి పోటెత్తారు. కడసారి ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు, అభిమానులు.. అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
చేసిన అవమానం చాలు.. ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదు.. ముద్రగడ ఫ్యామిలీ
-
కాపు కెరటం ముద్రగడ.. NTR TDPలోకి వస్తే లోకేష్ కు సీన్ రివర్స్
-
కాపులకు బ్యాడ్ డే.. ఇచ్చిన మాట కోసం తన పేరునే మార్చుకున్నాడు
-
ముద్రగడ ఇంటి వద్ద భారీగా తరలివచ్చిన అభిమానులు..
-
ముద్రగడ కు నివాళులు అర్పించిన YS జగన్
-
ముద్రగడకు వైఎస్సార్సీపీ నేతల నివాళి
-
కూటమి పెద్దలకు షాక్.. ప్రభుత్వ లాంఛనాల్ని తిరస్కరించిన ముద్రగడ కుటుంబం
సాక్షి, కాకినాడ: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించారు. బతికున్న సమయంలో ముద్రగడను అనేక విధాలుగా అవమానించారని.. ఇప్పుడు అధికారిక గౌరవాలు, సానుభూతి అవసరం లేదని స్పష్టం చేశారు.కాకినాడ జిల్లా కిర్లంపూడిలో బుధవారం మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి రాజా.. ముద్రగడ పద్మనాభం ఏనాడూ అధికారం కోసం పాకులాడిన వ్యక్తి కాదని అన్నారు. ఆయన అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలిపారు. నివాస ఆవరణలోనే హిందూ సంప్రదాయాల ప్రకారం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.‘బతికున్నప్పుడు వేధించారు’ముద్రగడ పద్మనాభంను గతంలో అనేక రకాలుగా వేధించి, అవమానించారని జక్కంపూడి రాజా అన్నారు. ఆయన కుటుంబ సమస్యల విషయంలోనూ అసభ్యంగా ప్రవర్తించారని విమర్శించారు. “ముద్రగడ అధికారం వెంట పరిగెత్తిన వ్యక్తి కాదు. ప్రజా సమస్యలపై పోరాడిన నాయకుడు. ఆయన బతికున్నప్పుడు ఇబ్బందులకు గురిచేసి.. ఇప్పుడు మృతి తర్వాత మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు” అని జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు.ప్రభుత్వ నిర్ణయం.. కుటుంబం తిరస్కరణముద్రగడ పద్మనాభం ఇటీవల కన్నుమూయడంతో.. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ముద్రగడ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన సేవలను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మాట్లాడిన అనంతరం సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే.. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని ముద్రగడ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. తమకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని స్పష్టం చేశారు.కాపు ఉద్యమంలో కీలక పాత్రముద్రగడ పద్మనాభం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన పేరు చర్చకు వచ్చింది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన ఆయన రాజకీయ జీవితంలో పలు కీలక పరిణామాలకు కేంద్రబిందువుగా నిలిచారు. ప్రస్తుతం ముద్రగడ కుటుంబం ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ముద్రగడ మృతిపై టీడీపీ, జనసేన నీచ రాజకీయం..
-
సాక్షి తో ముద్రగడ పద్మనాభం ఆఖరి ఇంటర్వ్యూ
-
ముద్రగడ ఇంటివద్ద ఉద్రిక్తత.. కూతురు క్రాంతిని అడ్డుకున్న అనుచరులు
-
ముద్రగడ పద్మనాభం మృతిపై చిరంజీవి సంతాపం
కాపు ఉద్యమ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన.. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముద్రగడ మరణవార్తతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే విచారం వ్యక్తం చేశారు.ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ముద్రగడ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ట్వీట్ చేశారు. 'మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం ఇక లేరనే వార్త ఎంతో బాధాకరం. ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిన నిబద్ధత, తన నమ్మకాల కోసం రాజీ పడని వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. శ్రీ ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, మద్దతుదారులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.ఓం శాంతి' అని చిరంజీవి రాసుకొచ్చారు.మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరనే వార్త ఎంతో బాధాకరం.ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిన నిబద్ధత, తన నమ్మకాల కోసం రాజీ పడని వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు…— Chiranjeevi Konidela (@KChiruTweets) July 15, 2026 -
ముద్రగడ మృతిపైనా ట్రోల్స్.. టీడీపీ, జనసేన నీచ రాజకీయం!
సాక్షి, విజయవాడ: రాజకీయ విభేదాలు సహజమే.. కానీ మరణించిన నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం? అనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపై సోషల్ మీడియాలో ట్రోల్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన్ని కించపరిచేలా టీడీపీ, జనసేన సోషల్ మీడియా ఖాతాల నుంచి పోస్టులు చేస్తున్నారు. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ప్రజా జీవితంలో దశాబ్దాల పాటు కొనసాగిన ముద్రగడ పద్మనాభం.. కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, ఉద్యమ నేతగానూ గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా పలుమార్లు ఎన్నికైన ఆయన.. రెండు ప్రభుత్వాల్లో మంత్రిగా, ఒకసారి ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు.ముఖ్యంగా కాపు సామాజిక వర్గ సమస్యలపై ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమాలు ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాలుగా నిలిచాయి.తన రాజకీయ జీవితంలో పలు సందర్భాల్లో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేలా ఉద్యమాలు చేపట్టారు. అరెస్టులు, నిరసనలు, దీక్షలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా పోరాడిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. అందుకే ఆయన మరణం తర్వాత కూడా ఆయన రాజకీయ ప్రస్థానం, ఉద్యమాలపై చర్చ కొనసాగుతోంది.అయితే.. ఆయన రాజకీయ నిర్ణయాలు, కొన్ని పార్టీలతో ఉన్న అనుబంధంపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీలో చేరడం, ఆ తర్వాతి రాజకీయ పరిణామాలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. కానీ రాజకీయ వైఖరిని విమర్శించడం వేరు.. ఒక వ్యక్తి మరణించిన తర్వాత వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యలు చేయడం వేరు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హద్దులు దాటేసి..ముద్రగడ పద్మనాభం జీవించి ఉన్న సమయంలోనే కాకుండా.. మరణం తర్వాత కూడా సోషల్ మీడియాలో ఆయనపై దుష్ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన అనుబంధ పేజీల పోస్టులు, వ్యాఖ్యలపై అభిమానులు, అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో భాగమే అయినప్పటికీ.. మరణించిన వ్యక్తిపై వ్యక్తిగత దాడులు చేయడం రాజకీయ సంస్కృతికి మంచిది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.రాజకీయాలకు అతీతంగా గౌరవం అవసరంఒక నాయకుడి విధానాలను, నిర్ణయాలను విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు, పోరాటాలను పూర్తిగా విస్మరించి.. కేవలం రాజకీయ అనుబంధాల ఆధారంగా అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు.ముద్రగడ పద్మనాభం జీవితంలో ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ప్రభుత్వాలను ఎదురించి ఉద్యమాలు చేశారు. తన నమ్మిన అంశాల కోసం పోరాడారు. ఆయనతో విభేదించిన వారూ ఉన్నారు.. ఆయనను సమర్థించిన వారూ ఉన్నారు. అయితే ప్రజా జీవితంలో ఉన్న ఒక నేత మరణించిన సమయంలో కనీస గౌరవం పాటించాలనే చర్చ.. తాజాగా సోషల్ మీడియా పోస్టుల నేపథ్యంలో మరోసారి మొదలైంది. -
కిర్లంపూడిలో ముద్రగడ నివాసం వద్ద ఉద్రిక్తత
సాక్షి, కాకినాడ: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్వగ్రామం కిర్లంపూడిలో ఈ ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బార్లపూడి క్రాంతిని కొంతమంది అభిమానులు, అనుచరులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ‘‘గో బ్యాక్ క్రాంతి’’ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం నెలకొంది. దీంతో ఆమెను బయటకు పంపించేయాలని ముద్రగడ భార్య పోలీసులను కోరారు.ముద్రగడ భౌతికకాయం స్వగ్రామం కిర్లంపూడికి చేరుకున్న నేపథ్యంలో ఆయన అభిమానులు, అనుచరులు భారీగా తరలివచ్చారు. ఇదే సమయంలో చివరి చూపు చూసేందుకు క్రాంతి అక్కడికి చేరుకున్నారు. అయితే తొలుత ప్రతిపాడు వద్ద పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులు వద్దన్నారని పోలీసులు ఆమెకు వివరించారు.అయితే తన తండ్రిని చివరిసారిగా చూసేందుకు అనుమతించాలని క్రాంతి పోలీసులను కోరడంతో.. పరిస్థితిని పరిశీలించిన పోలీసులు ఆమెను కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు సైతం పోలీసులను ఆదేశించినట్లు సమాచారం. నివాళులర్పించిన వెంటనే తిరిగి వెళ్లాలని పోలీసులు సూచించారు. అయితే ఇంటి వద్దకు చేరుకున్న తర్వాత కూడా ఉద్రిక్తత కొనసాగింది. ముద్రగడ అనుచరులు కొందరు గో బ్యాక్ క్రాంతి నినాదాలతో అడ్డుకున్నారు. భౌతికకాయం ఉన్న పెట్టెను కూడా తాకేందుకు ఆమెను అనుమతించలేదని సమాచారం. ఆమెను బయటకు పంపించాలని ముద్రగడ భార్య, కొందరు బంధువులు కోరారు. ఆ సమయంలో తండ్రిని చూడలేక క్రాంతి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె బిగ్గరగా రోదించడంతో సన్నిహితులు, పోలీసులు అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. అనంతరం పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముద్రగడ కుటుంబంలో విభేదాలు బయటకు వచ్చాయి. తన అభిష్టానికి వ్యతిరేకంగా బార్లపూడి క్రాంతి జనసేనలో చేరారు. అంతేకాదు ఆయనపై పలు విమర్శలు కూడా చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ సమయంలో.. తాను చనిపోతే క్రాంతిని దగ్గరకు రానివ్వొద్దని ముద్రగడ స్వయంగా చెప్పారు కూడా. తాజాగా ఆయన మరణం అనంతరం కిర్లంపూడిలో చోటుచేసుకున్న పరిణామాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. -
ముద్రగడ కుమారునికి ఫోన్ లో జగన్ పరామర్శ
-
కిర్లంపూడి చేరుకున్న ముద్రగడ భౌతికకాయం
-
ముద్రగడ ఇకలేరు.. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు
-
ఇచ్చిన మాట కోసం పేరు మార్చుకున్నాడు.. చరిత్రలో ఎవరు లేరు..
-
ఆయనను ఎదుర్కొనే దమ్ము లేక... కన్న కూతురితో తిట్టించారు
-
దివికేగిన ఉద్యమ పతాక.. ముద్రగడ ఇకలేరు
సాక్షి, కాకినాడ/గోకవరం/పిఠాపురం: రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. అవిశ్రాంత యోధుడి ఊపిరి ఆగిపోయింది. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న కాపు నేత హైదరాబాద్ గచ్చిబౌలిలోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం సాయంత్రం పరిస్థితి విషమించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కిర్లంపూడి నుంచి హుటాహుటిన హైదరాబాద్ పయనమయ్యారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన కాకినాడ జిల్లా కిర్లంపూడికి బుధవారం తరలించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఉంచిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముద్రగడకు ఇద్దరు కుమారులు ముద్రగడ వీరరాఘవరావు (బాలు), ముద్రగడ గిరిబాబు, కుమార్తె క్రాంతి ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ధృవతారగా వెలుగొందిన ప్రముఖ కాపు నేత మృతితో ఉమ్మడి గోదావరి జిల్లాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ముద్రగడ హఠాన్మరణంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, మంత్రులు, వైఎస్సార్ సీపీ నేతలు, వివిధ పార్టీల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గానికి, ఏపీ రాజకీయాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కిర్లంపూడికి వెళ్లి ముద్రగడ భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించనున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం, కిర్లంపూడి గ్రామంలో వీరరాఘవరావు, సత్యవతి దంపతులకు జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య స్వగ్రామమైన కిర్లంపూడిలో, ఎల్ఎల్సీ రాజమండ్రిలోని తన్నీరు బుల్లియ్య గురుకులంలో సాగింది. ముద్రగడది మొదటి నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తాతయ్య పద్మనాభం గ్రామానికి మునసబుగా పనిచేశారు. తండ్రి ముద్రగడ వీర రాఘవరావు రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. వీర రాఘవరావు 1962, 1967 ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండుసార్లు మంత్రిగా..ముద్రగడ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. 1978లో ప్రత్తిపాడు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983, 85 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎక్సైజ్, రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో తాటాకు గుడిసె లేని నియోజకవర్గంగా అర్హులందరికీ 3 సెంట్లతో గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. 1989లో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో పౌర సరఫరాలు, చేనేత జౌళి శాఖ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 1999లో కాకినాడ నుంచి ఎంపీగా గెలిచారు. 2024లో వైఎస్సార్సీపీలోకి.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన 2024 మార్చి 15న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి చేరారు. వైఎస్సార్సీపీ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా ఆయన సేవలందించారు. నిష్పక్షపాత వైఖరి, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు సంపాదించారు. సూటిగా మాట్లాడటం, అనుకున్నది నిర్మొహమాటంగా చెప్పడం ముద్రగడ ప్రత్యేకత. కాపు ఉద్యమానికి కేరాఫ్ ముద్రగడ పేరు వినగానే గుర్తుకొచ్చేది కాపు రిజర్వేషన్ ఉద్యమం. కాపులను వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి నాయకత్వం వహించారు. సభలు, దీక్షలు, పాదయాత్రలు, నిరాహార దీక్షలతో ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. 1994 జూలై 1న తన సతీమణి పద్మావతితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆరోగ్యం క్షీణించినా, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, తన డిమాండ్‌ను వెనక్కి తీసుకోలేదు. 2014లో కిర్లంపూడి కేంద్రంగా మరోమారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ ఉద్యమానికి రాష్ట్రం నలుమూలల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ఆయనకు మద్దతుగా కాపు సంఘం నాయకులు గ్రామ గ్రామాన రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్ష విరమింపజేసేందుకు టీడీపీ ప్రభుత్వం బలవంతంగా ముద్రగడను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించింది. 2016లో కాపు రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా ఆయన చేపట్టిన నిరాహార దీక్ష రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాపు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా కాపు గర్జన చేపట్టారు. ఇందులో భాగంగా జనవరి 31, 2016న తునిలో కాపు గర్జన బహిరంగ సభ నిర్వహించారు. సభకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా అభిమానులు, కాపు నాయకులు తరలివచ్చారు. ముద్రగడ ఒక్కసారిగా రైల్‌రోకో చేపట్టడం, తదనంతరం రైలుకి నిప్పంటుకోవడంతో తుని ఘటన ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఘటన తర్వాత ఆయనతో పాటు పలువురు కాపు నాయకులపై కేసులు నమోదయ్యాయి. అనేక ఇబ్బందులు, ఆరోపణలు ఎదురైనా ఉద్యమాన్ని విడిచిపెట్టలేదు. కాపు రిజర్వేషన్‌పై ప్రభుత్వాలకు ఆయన అనేక లేఖలు రాశారు. పోస్టుకార్డుల ఉద్యమమూ నడిపారు. అరుదైన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సామాజిక వర్గం ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకగా మారిన నాయకులు అరుదు. ముద్రగడ పద్మనాభం అలాంటి అరుదైన నాయకుల్లో ఒకరు. విజయాలు, పరాజయాలు, విమర్శలు, వివాదాలు, అన్నింటినీ ఎదుర్కొంటూ ఆయన సాగించిన రాజకీయ ప్రయాణం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుంది. మంత్రిగా కంటే ఉద్యమ నేతగా... రాజకీయ వేత్తగా కంటే కాపు ఆత్మగౌరవానికి ప్రతీకగా.. ముద్రగడ పద్మనాభం పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పలు పార్టీలతో అనుబంధం ఏర్పడినా, తన జీవితాంతం ప్రజా సమస్యలు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం హక్కుల అంశంపైనే దృష్టి సారించారు. ఎప్పుడూ ఆ లక్ష్యం నుంచి ఆయన దృష్టి మారలేదు. సమస్యలపై తనదైన రీతిలో స్పందించడం ముద్రగడకు అలవాటు. ఆతిథ్యంలో చెరగని ‘ముద్ర’గడ..! ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరినీ అతి«థిగా చూడటంలో ముద్రగడకు సాటి మరొకరు ఉండరు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ అల్పాహారం అయినా, భోజనం అయినా చేసి వెళ్లాల్సిందే. అల్పాహారంలోనూ, భోజనంలోనూ చాలా ప్రత్యేకతలుంటాయి. ఎంత మంది వచ్చినా అందరూ తిని వెళ్లే వరకు ఆయనే స్వయంగా దగ్గరుండి అందరినీ తిన్నారా..? లేదా..? అంటూ వాకబు చేసేవారు. ఆయన ఇంట్లో ప్రతి నిత్యం పదుల సంఖ్యలో భోజనాలు చేయాల్సిందే..కేసులు... దీక్షలు..1988లో టీడీపీ ప్రభుత్వం ఉత్తర కంచిలోని తన అనుచరులపై అక్రమంగా కేసులు బనాయించినప్పుడు వాళ్లకు మద్దతుగా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు కిర్లంపూడి నుంచి ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు. ప్రభుత్వం స్పందన లేకపోవడంతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దాంతో ప్రభుత్వం దిగివచ్చి అక్రమ కేసులు తొలగించింది. 1993లో విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రావులపాలెంలో కాపులపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. ఆ సమయంలో పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. 2005లో పోలవరం ఎడమ కాలువ, పుష్కరం ఎత్తిపోతల కోసం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భూములు కోల్పోతున్న రైతులకు అండగా నిలిచారు. భూమికి భూమి అనే నినాదంతో సొంత ఇంట్లో పక్కన ఒక తుపాకీ, తలకు రివాల్వర్ పెట్టుకొని ఆమరణ నిరాహార దీక్ష చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. -
ముద్రగడ భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్న వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లో పర్యటించనున్నారు. వైఎస్ జగన్ రేపు ఉదయం తాడేపల్లి నివాసం నుంచి తొలుత భీమవరం చేరుకుంటారు. అక్కడ ఆక్వా రైతులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ముఖ్యంగా ఫీడ్ ధరల విపరీత పెంపు, మార్కెట్లో గిట్టుబాటు ధరల లేమి తదితర కీలక అంశాలపై రైతులతో ముఖాముఖి చర్చించనున్నారు.భీమవరం పర్యటన ముగిసిన అనంతరం, మధ్యాహ్నం ఆయన హెలికాప్టర్లో జగ్గంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడికి వెళ్తారు.మంగళవారం కన్నుమూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి జగన్ నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు. -
ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైఎస్సార్సీపీ నేతల దిగ్భ్రాంతి
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతిపై వైఎస్సార్సీపీ నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ మృతి పట్ల బొత్స సత్యనారాయణ సంతాపం వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పోరాటం అద్భుతమని చెప్పారు. కాపుల కోసం ఆయన చేసిన ఉద్యమాలు స్ఫూర్తిదాయకమని అన్నారు.వైవీ సుబ్బారెడ్డి సంతాపం వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన నాయకుడిగా, కాపు సమాజ హక్కుల కోసం జీవితాంతం అంకితభావంతో పనిచేసిన వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం చిరస్మరణీయులని అన్నారు. ప్రజా జీవితంలో ఆయన ప్రదర్శించిన నిబద్ధత, ఉద్యమ స్ఫూర్తి, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం మరణం రాష్ట్ర రాజకీయాలకు, ముఖ్యంగా కాపు సమాజానికి తీరని లోటని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారుజూపూడి ప్రభాకరరావు దిగ్భ్రాంతిముద్రగడ పద్మనాభం మృతిపై దళిత ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ప్రగాఢ సంతాపం తెలిపారు. కాపు ఉద్యమానికి జీవితాంతం అంకితభావంతో సేవలందించిన ప్రముఖ ప్రజానేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ సారథి ముద్రగడ పద్మనాభం ఆకస్మిక మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేసిన ధీశాలి నాయకుడిగా, కాపు సమాజ హక్కులు, ఆత్మగౌరవం కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం చిరస్థాయిగా ప్రజల హృదయాలలో నిలిచిపోతారని అన్నారు.వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్ర సంతాపంకాపు ఉద్యమ నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి హఠాన్మరణం పట్ల మాజీ మంత్రి,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతిని,సంతాపాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ముద్రగడ పద్మనాభం గారు తన జీవితాంతం ప్రజల కోసం,ప్రత్యేకించి కాపు సామాజికవర్గ హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు.రాజకీయాల్లో ఆయన నిబద్ధత,నిష్కల్మషమైన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకే కాకుండా,ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.ముద్రగడ పద్మనాభం గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ,వారి కుటుంబ సభ్యులకు,అభిమానులకు వెలంపల్లి శ్రీనివాసరావు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారుముద్రగడ మృతి తీరని లోటు: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుముద్రగడ్డ పద్మనాభం మరణవార్త తనను ఎంతో కలచివేసిందని, ఆయన మృతి ప్రజా ఉద్యమాలకు, నగర రాజకీయాలకు తీరని లోటని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. విజయవాడ నగరంతో ముద్రగడ్డ పద్మనాభంకు దశాబ్దాల కాలంగా ఎంతో విడదీయరాని, ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తుచేశారు. ప్రస్తుత తరం నాయకుల్లో ఆయనలాంటి నిబద్ధత, నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తిని చూడటం చాలా అరుదు అని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. కాపు సామాజిక వర్గానికి తిరుగులేని ఉద్యమ నేతగా ముద్రగడ చరిత్రలో నిలిచిపోయారన్నారు. విలువలతో కూడిన రాజకీయాన్ని నమ్మి, దానికి కట్టుబడి జీవించిన ధీరుడు ముద్రగడ్డ పద్మనాభం అని ఆయన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు మల్లాది విష్ణు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో ఆ కుటుంబానికి కొండంత ధైర్యం కలగాలని ఆకాంక్షించారు.అనిల్ కుమార్ యాదవ్ దిగ్భ్రాంతి ముద్రగడ పద్మనాభం మృతి వైఎస్సార్సీపీకితీరని లోటని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఒక మంచి ఉద్యకారుడిని కోల్పోవడం చాలా బాధాకరమని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. కేకే రాజు సంతాపంముద్రగడ పద్మనాభం మృతిపై విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు సంతాపం తెలిపారు. రాష్ట్రం అనుభవజ్ఞుడైన నేతను కోల్పోయిందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముద్రగడ జీవిత కాలం కృషి చేశారని తెలిపారు. ముద్రగడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.-- -
ముద్రగడ లేకపోవడం కాపు సమాజానికి తీరని లోటు..
-
ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి...
-
ముద్రగడ పద్మనాభం మృతిపై ప్రముఖుల సంతాపం
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో కొనసాగుతూ ప్రజా సమస్యలపై తనదైన ముద్ర వేసిన నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గుర్తింపు పొందారని పేర్కొన్నారు. 1978లో తొలిసారి శాసనసభకు ఎన్నికై ప్రజా ప్రతినిధిగా సేవలందించడమే కాకుండా, శాసనసభ సభ్యుడిగా, కాకినాడ లోక్‌సభ సభ్యుడిగా ప్రజలకు సేవ చేశారని గుర్తుచేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలు, సామాజిక అంశాలపై ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు పీవీఎన్ మాధవ్. ముద్రగడ పద్మనాభం ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, మద్దతుదారులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ కుటుంబానికి ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రజా జీవితంలో ముద్రగడ పాత్ర చిరస్మరణీయంమాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ముద్రగడ పద్మనాభం పోషించిన పాత్ర చిరస్మరణీయమని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. దేశంలో ఎంతో ప్రభావం చూపించిన విలక్షణ నాయకత్వ లక్షణాలు ఉన్న గొప్ప నాయకులు ముద్రగడ అని అన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఆయన ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ తనదైన ముద్ర వేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని అన్నారు. ముద్రగడ పద్మనాభం మరణం రాజకీయ రంగానికి తీరని లోటని పేర్కొన్న మహేష్ కుమార్ గౌడ్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. కాపుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడుమాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారి మరణం పట్ల బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.ప్రజా జీవితంలో ఆయన తనదైన ముద్ర వేసి, కాపు సామాజిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలకు సేవలందించిన ఆయన రాజకీయ ప్రస్థానం చిరస్మరణీయమైనదన్నారు.ఆయన మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు హరీష్‌రావు. ఆయన మరణం ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది..మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం మరణపై రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఆయన మరణ వార్త ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని సంతాపం వ్యక్తం చేశారు. -
ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి,తాడేపల్లి: ప్రముఖ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ మరణవార్త తనను ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం.ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం. ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు.ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అంతకుముందు ముద్రగడ పద్మనాభం మరణంపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘ముద్రగడ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రజలకోసం ముద్రగడ చేసిన సేవలు చిరస్మరణీయం. ముద్రగడ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని వెల్లడించారు. మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా… pic.twitter.com/HReowspJ4e— YS Jagan Mohan Reddy (@ysjagan) July 14, 2026 -
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
సాక్షి, కాకినాడ: ప్రముఖ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ (జులై 14) హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముద్రగడ మరణవార్తతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. ఆయన ప్రాథమిక పాఠశాల విద్య స్వగ్రామంలోనే సాగింది. ముద్రగడది మొదటి నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తాతయ్య పద్మనాభం గ్రామానికి మున్సుబ్‌గా పని చేయగా, తండ్రి ముద్రగడ వీర రాఘవరావు రాజకీయాల్లో అత్యంత క్రియాశీలంగా ఉండేవారు. వీర రాఘవరావు 1962, 1967 ఎన్నికలలో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలోని నిరుపేదలు, దళితులకు ఆయన అత్యంత అభిమాన నాయకుడిగా నిలిచారు.మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి ముద్రగడ వీర రాఘవరావు అత్యంత ఆప్తుడు. 1977లో వీర రాఘవరావు మరణించిన తర్వాత, నీలం సంజీవరెడ్డి సూచన మేరకు ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నిరుపేదలు, గిరిజనులు, బీసీలు పద్మనాభంలో ఆయన తండ్రి రూపాన్ని చూసుకుని భారీ మెజారిటీతో గెలిపించారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. 1978, 1983, 1985, 1989 శాసనసభ ఎన్నికలలో వరుసగా నాలుగు సార్లు ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా, కాకినాడ నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా కూడా దేశ రాజధానిలో అడుగుపెట్టారు. రాజకీయ పదవుల కంటే కూడా కాపు సామాజిక వర్గాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలంటూ ముద్రగడ పద్మనాభం చేసిన పోరాటాలు ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఆయన తన జీవిత కాలంలో ఏకంగా ఏడుసార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు.2016లో తుని వేదికగా ఆయన నేతృత్వంలో నిర్వహించిన 'కాపు ఐక్య గర్జన' సభ అక్కడ జరిగిన రైల్వే ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఊపేసింది. ఈ ఘటనతో కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఆయన జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. తద్వారా కాపు సామాజిక వర్గానికి తిరుగులేని ఉద్యమ నేతగా ముద్రగడ చరిత్రలో నిలిచిపోయారు. -
వైఎస్ జగన్‌కు ఎప్పటీకీ రుణపడి ఉంటాం: ముద్రగడ గిరి
సాక్షి, తాడేపల్లి: తన తండ్రి ముద్రగడ పద్మనాభం అనారోగ్య సమస్య నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారని.. ప్రజల అందరి ఆశీస్సులతో తన తండ్రి ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని ముద్రగడ గిరి అన్నారు. తన తండ్రి అనారోగ్యం బారిన పడినప్పటి నుంచి ప్రతిరోజూ ముద్రగడ ఆరోగ్యంపై వివరాలుఅడిగి తెలుసుకుంటున్నారన్నారు.‘‘డాక్టర్లతోనూ వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. స్పెషల్ కేర్ తీసుకోవాలని డాక్టర్లతో చెప్పారు’’ అని గిరి తెలిపారు. నాన్నకు వైఎస్ జగన్ చేసిన సాయం మరిచిపోలేమని.. మేం ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటామని గిరి తెలిపారు. -
ఆస్పత్రిలో ముద్రగడను పరామర్శించిన బొత్స, తోట త్రిమూర్తులు
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ హైటెక్ సిటీలోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యల కారణంగా ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించగా, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.ముద్రగడ అనారోగ్యం గురించి తెలుసుకున్న వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు.ఈ సందర్భంగా నాయకులు ఇద్దరూ ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న వైద్య సేవలను, ఆరోగ్యం మెరుగుపడుతున్న తీరును అక్కడి వైద్యులను అడిగి ఆరా తీశారు. ముద్రగడ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు కూడా ఆసుపత్రికి వెళ్లి ముద్రగడను పరామర్శించిన విషయం తెలిసిందే. -
ముద్రగడ పద్మనాభంకు సజ్జల పరామర్శ
హైదరాబాద్ : గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడను సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. ముద్రగడ ఆరోగ్యం గురించి ఆరా తీశారు సజ్జల. అదే సమయంలో డాక్టర్లతో మాట్లాడి చికిత్స వివరాలను తెలుసుకున్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులకు రామకృష్ణారెడ్డి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరలోనే ముద్రగడ కోలుకుని ప్రజా జీవితంలోకి వస్తారని ఆకాంక్షించారు. -
ముద్రగడ ఆరోగ్యంపై వంగా గీత క్లారిటీ
-
మీ రాజకీయాల కోసం ముద్రగడను కించపర్చొద్దు: వైఎస్సార్సీపీ
సాక్షి, కాకినాడ: ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో బాధపడుతుంటే, కూటమి సర్కార్ ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యుల్ని మానసికంగా క్షోభపెట్టేలా వ్యవహరించడం దారుణమని వైఎస్సార్సీపీ కాపు సామాజిక వర్గ నేతలు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీలు వంగా గీత, తోటనర్సింహం, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు.ముద్రగడ ఆరోగ్యంపై వైఎస్ జగన్ రోజూ ఆరా తీస్తున్నారని, కానీ కూటమి నేతలు మాత్రం మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలనలో విఫలమైన చంద్రబాబు కుల రాజకీయాలతో దాన్ని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆక్షేపించారు.ముద్రగడపై ట్రోల్స్ సరికాదు: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుముద్రగడ పద్మనాభం ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకుని ఇంటికి రావాలని అందరూ కోరుకోవాలి. రాష్ట్రంలో కాపు సామాజికవర్గంలో వంగవీటి మోహన రంగా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే నాయకుడిగా ముద్రగడ పద్మనాభం ఉండే వారు. ఆయన ఎక్కడా అవినీతి మరకలు అంటని వ్యక్తి. అలాంటి వ్యక్తిపై ట్రోల్స్ చేయడం ఎంతవరకూ ధర్మం అన్నది ఆలోచించాలి. మేం అంతా ఆయన్ను పరామర్శించడానికి వెళ్లాలని భావించినా ఆస్పత్రిలో హడావిడి ఎందుకని రావొద్దని సూచించారు.చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేగా ఉండగానే ముద్రగడ పద్మనాభం మంత్రిగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని కించపర్చేలా మాట్లాడటం సరికాదు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గమే కాదు అన్ని వర్గాల్లోనూ ముద్రగడకు అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గురించి మా నాయకులు ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాలపైనే మాట్లాడాం. మేం కులాల గురించి ఎక్కడా మాట్లాడలేదు. రాజకీయంగా కాపులకు మేలు చేయడానికి మా ప్రయత్నం చేస్తున్నాంజఇతర రాజకీయ పార్టీల్లో ఉన్న కాపు నాయకులు కూడా వారి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప కులాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టే ప్రయత్నం జనసేన తప్ప ఎవరూ చేయలేదు. కులాల గురించి మాట్లాడొద్దంటూనే చంద్రబాబు విజయవాడలో లాకప్ డెత్‌పై స్పందిస్తూ సీఐ కాపు, హతుడు కాపు అంటున్నారు. మీ స్థాయికి ఇది తగునా చెప్పండి. మీరు కులాల గురించి మాట్లాడుతూ మేం మాట్లాడుతున్నామని ఎదురుదాడి చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనించాలని కోరుతున్నాం.ముద్రగడ సాయం తీసుకునే వ్యక్తి కాదు: కురసాల కన్నబాబువైఎస్సార్సీపీలో కాపు నాయకుల్ని తన ఇంటికి రమ్మని.. తాజా పరిణామాలపై మాట్లాడుకుందామని తోట త్రిమూర్తులు తన ఇంటికి పిలిస్తే చంద్రబాబు దీనిపై అందరినీ రెచ్చగొట్టారు. చనిపోయిన వారికి కులాలు ఆపాదిస్తారా అని ఇవాళ మళ్లీ అదే చంద్రబాబు అడుగుతున్నారు. కులాన్ని నరనరానా జీర్ణించుకుని మాట్లాడుతోంది ఎవరు? ఇవాళ చంద్రబాబు ఓపెన్ చేసిన బంగారు గనికీ, కులానికీ సంబంధం ఉందా? పవన్ కళ్యాణ్‌ను ఖబర్దార్ అని మేం అన్నామా? రౌడీలకు కులాలు ఉంటాయా అని మీరే ప్రశ్నిస్తున్నారు. కానీ ఇవాళ మళ్లీ కాపు కులం అని ప్రస్తావిస్తూ మిమ్మల్ని ఖబర్దార్ అంటున్నారు.సాయికృష్ణ హత్యను మేం శాంతిభద్రతల సమస్యగానే చూస్తున్నాం. సిట్ కోర్టుకు ఇచ్చిన నివేదికలో సాయికృష్ణది కస్టడియల్ డెత్ అని చెప్పింది. తీసుకొచ్చి కొట్టడం, చంపడం, తల్లి అడిగినా స్పందించినా స్పందించకపోవడం, సీసీ ఫుటేడ్ ఇవ్వకపోవడం ఇలా అన్నీ నేరాలే చేశారు. టాస్క్ ఫోర్స్ పట్టుకొస్తే, పోలీసులు చంపేసి బూడిద చేసేశారు. ఈ ఘటనను మేం కాపుల కోణంలో చూడటం లేదు శాంతిభద్రతల కోణంలోనే చూస్తున్నాం.కాకినాడ రూరల్‌తో మొదలుపెట్టి రాష్ట్రమంతా పోలీసులు తమకు ఓ ప్రత్యేక రాజ్యాంగం ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అక్రమంగా నిర్బంధాలు చేయడం, పచ్చిబూతులు తిట్టడం చేస్తున్నారు. పోలీసులు వైఖరి మార్చుకోకపోతే ప్రతిఘటన తప్పదు. ఇది చంద్రబాబు తప్పు అయితే మేం పవన్ కళ్యాణ్ ను ఎందుకు అడుగుతాం? నాలుగైదు రోజులుగా సాయికృష్ణను చంపిన నాగరాజుకు పూలదండలు వేసి హీరోలా కీర్తిస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు.ఇదేమైనా సినిమానా? మా ప్రభుత్వంలో కాళహస్తిలో ఓ కార్యకర్తను పోలీసు కొడితే నానా హంగామా చేశారు. ఇప్పుడు కాల్చి బూడిద చేసేస్తే మేం ప్రశ్నించకూడదా? ఇది కాపుల తగువు కాదు చంద్రబాబు తగువే. దీనికి కారణం ఆయన రెడ్ బుక్కే. ఈ ఘటనను కాపులపై రుద్దేసి తప్పించుకుందామనుకుంటున్నారు. కాపుల స్వాభిమానాన్ని దెబ్బతీయొద్దు. జీవితకాలం ఓ లక్ష్యంతో పనిచేసిన ముద్రగడ పద్మనాభం వంటి వ్యక్తిని ఎలా కించపరుస్తారు ? గతంలో అనారోగ్యానికి గురైతే ముద్రగడకు జగన్మోహన్ రెడ్డి ఎయిర్ అంబులెన్స్ పంపుతామంటే ఆయన ఒప్పుకోలేదు.డైవర్షన్ కోసమే చంద్రబాబు కుల ప్రస్తావనలు: దాడిశెట్టి రాజారాష్ట్ర పాలనపై చంద్రబాబు పట్టు కోల్పోయారు. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు కులాల ప్రస్తావన తెస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను ఏదో అన్నామని పదే పదే ప్రస్తావన తెస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్‌ను మేం ఏమీ అనలేదు. ముద్రగడ పద్మనాభం వంటి మీ పాత రాజకీయ సహచరుడు వెంటిలేటర్‌పై ఉంటే మీరు కుటుంబాన్ని వీధిలోకి లాగడం ధర్మంగా ఉందా? గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా వాటిలో చలనం తీసుకొచ్చింది ముద్రగడ పద్మనాభం ఉద్యమాలు, నిరసనలే. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంయమనం పాటించండి. ఆయన ఎవరూ సాయం చేస్తానన్నా తీసుకునే వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గుడి ప్రతిష్టకు వెళ్తే ఆయన గురించి చంద్రబాబు అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఇంతకన్నా పెద్ద సమస్య వస్తే మరోసారి తిరుపతి లడ్డూ ప్రస్తావన కూడా తెస్తారు.కాపులు పరస్పరం కొట్టుకోవాలా ?: తోట నర్సింహంచంద్రబాబు రాష్ట్రంలో అనేక రాజకీయాలతో పాటు కుల ప్రస్తావనలు కూడా తెచ్చే దౌర్బాగ్య స్థితికి చేరారు. మాలో ఎవరికీ అలాంటి ఉద్దేశాలు లేవు. అందరూ ఐకమత్యంగా ఉండాలి. కాపు సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడిగేందుకు తోట త్రిమూర్తులు తన ఇంట్లో సమావేశం పెడితే దానికి పెడార్ధాలు తీస్తున్నారు. గతంలో ఇతర సామాజిక వర్గాలతో పాటు కాపులకు కూడా ఎన్నో పథకాలు తెచ్చి మేలు చేశారు.ఇప్పుడు వాటిని ఆపేస్తున్నారనే దానిపైనే మా అభ్యంతరాలు. చంద్రబాబు ఇవాళ సీఐని ఓ ఉద్యోగిగా కాకుండా కాపు అని ప్రస్తావించడం దారుణం. అంటే కాపులు తమలో తాము కొట్టుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లుంది. ముఖ్యమంత్రి స్ధాయిలో ఉండి పవన్ కళ్యాణ్‌ను ఏమైనా అంటే ఖబడ్డార్ అని చెప్పడం దారుణం. అంటే పవన్ కళ్యాణ్‌ను ఏదో ఒకటి అనాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. గతంలో చంద్రబాబు వైఎస్సార్సీపీ వ్యక్తులు వస్తే ఏ పనీ చేయొద్దంటూ కార్యకర్తలకు, అధికారులకు చెప్పాలంటే అంత కన్నా దారుణం దేశంలో ఎక్కడా ఉండదు. అలా మాట్లాడిన వ్యక్తి మళ్లీ ఇవాళ కాపుల గురించి మాట్లాడుతున్నారు.పద్దతి మార్చుకోండి: జక్కంపూడి రాజారాష్ట్రంలో క్యారెక్టర్ లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు చంద్రబాబు. రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి ఆయన. గతంలో ఎన్టీఆర్‌కూ, ఆయన పిల్లలకూ చిచ్చుపెట్టి ఆయన్ను మానసికంగా వేధించి చంపేశారు. వైఎస్ జగన్ ఇంట్లో కూడా తగవులు పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఇవాళ ముద్రగడ పద్మనాభం ఇంట్లోనూ అదే పని చేస్తున్నారు. పద్మనాభం మీద కూతురితో రోజూ ఏదో ఒక ఆరోపణ చేయిస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారు.ముద్రగడ దగ్గర డబ్బుల్లేవని, వైద్యం చేయించుకునే పరిస్ధితి లేదని.. వైఎస్ జగన్‌కు ఫోన్ చేస్తే స్పందించడం లేదని తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు. ముద్రగడ అందరికీ పెట్టే వ్యక్తే కానీ, తీసుకునే వ్యక్తి కాదు. ఎవరైనా ఏదైనా ఇస్తామన్నా తీసుకోరు. పద్మనాభం ఇంటికెళ్తే పొట్టపగిలిపోయేలా వేల మందికి సంవత్సరాల తరబడి తినిపించిన వ్యక్తి. ఆస్తులు అమ్ముకున్నాడు కానీ ప్రభుత్వాల సాయం తీసుకోలేదు.మా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి ఆరోగ్యం బాగోలేకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నుంచి 50 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపి వైద్యసాయం అందించారు. పద్మనాభం కూడా ఎయిర్ అంబులెన్స్ ఇస్తామంటే వద్దని చెప్పానని గతంలో స్వయంగా లేఖలో చెప్పారు. పద్మనాభం కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. చంద్రబాబు మాత్రం కడుపు మంటతో ఆయన ఇంటిపైకి గతంలో పోలీసుల్ని పంపారు. ఇకనైనా చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు తమ పద్దతి మార్చుకోండి.చంద్రబాబువి దిగజారుడు వ్యాఖ్యలు: వంగా గీతముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి రావాలని మేం కోరుకుంటున్నాం. కొన్ని మీడియా ఛానళ్లు రెండు, మూడు రోజులుగా ఓ ఉద్యమ కారుడి గురించి, వాటి కుటుంబాన్ని మానసికంగా వేధించేలా కథనాలు ప్రసారం చేస్తూ చర్చలు పెడుతున్నాయి. పెద్ద ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోకపోతే చిన్న ఆస్పత్రికి తరలించామని చెప్తున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఓపెన్ చేసిన ఆస్పత్రి చిన్న క్లినిక్ అని ఎలా అంటారు. ఇంతకీ మీరంతా ఏం ఆశిస్తున్నారు? అంబేద్కర్ ఆశయాలకు భిన్నంగా విడదీయండి. ముక్కలు చేయండి అని చెప్తున్నట్లుంది. శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యక్తి, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కులాల గురించి మాట్లాడి తనను తాను దిగజార్చుకుంటున్నారు. వైఎస్ జగన్‌ను అవమానించే క్రమంలో మొత్తం కాపు జాతిని అవమానించాలనుకుంటున్నారు. కాపు జాతిలో పుట్టిన మాకు అందరూ సమానమే. అన్ని కుటుంబాలు మిమ్మల్ని ఆదరించాయి. కులాల రహితంగా మేం కూడా సేవలందించాం. దయచేసి ఎవరి మెప్పు కోసమో కాపు జాతిని తిట్టకండి. వైఎస్ జగన్ ముద్రగడ పద్మనాభం గారిని ఎంత గౌరవంగా చూస్తారో అందరికీ తెలుసు. ప్రతీ రోజూ ఆయన ఆరోగ్యంపై పర్యవేక్షణ చేస్తున్నారు. -
ముద్రగడను కలిసిన మాజీ మంత్రి అంబటి
సాక్షి, కాకినాడ జిల్లా: కిర్లంపూడిలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభంను మాజీ మంత్రి అంబటి రాంబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు, లోకేష్‌కు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. నాకు జరిగిన అన్యాయంపై న్యాయ స్థానం ద్వారా పోరాడతాను. ఇప్పటికే హై కోర్టులో రెండు రిట్ పిటిషన్లు వేశాను. త్వరలోనే మరో రెండు రిట్ పిటిషన్లు వేస్తాను’’ అని అంబటి పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ మా వెంట ఉన్నాడు.. ఇక కాపుల్ని ఏం చేసినా పర్వాలేదు అనుకుంటున్నారు. అంబటి రాంబాబును కొట్టినా పర్వాలేదు. ముద్రగడ కుటుంబాన్ని తిట్టిన పర్వాలేదు అనుకుంటున్నారు. ఇది తప్పు.. అక్రమం.. అన్యాయం.. ఈ అన్యాయాలను ఎదుర్కోవడానికి నా కులం, నా పార్టీ సిద్ధంగా ఉంది’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
‘చంద్రబాబు.. అరెస్టు చేస్తే భయపడుతారు అనుకోవద్దు’
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబును వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. అంబటి ఇంటిపై దాడి చేసి.. ఆయన్నే అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అరెస్టు చేస్తే భయపడుతారు అనుకోవద్దని హెచ్చరించారు. రాంబాబు ఇంటిపై దాడి బాధాకరమని అన్నారు. మాజీ మంత్రి అంబటిని కలిసిన వారిలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం ఉన్నారు.అనంతరం, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..‘అంబటి రాంబాబు ఇంటిపై ఏడు గంటలపాటు దాడి చేశారు. చెరపకురా చెడేవు అన్న సామెత గుర్తుపెట్డుకోండి. దాడులపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?. ముద్రగడ లాంటి వ్యక్తులపై కూడా దాడి చేశారు. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు అందరి లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు.ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ..‘రాంబాబు కుమార్తె ఫైర్ బ్రాండ్ మౌనికను పలకరించడానికి వచ్చాను. భవిష్యత్తులో మమతా బెనర్జీ స్థాయికి మౌనిక వెళ్లాలి. మాజీ మంత్రి ఇంటిపై దాడి బాధాకరం. రెండు సార్లు కాపుల సాయంతో చంద్రబాబు సీఎం అయ్యారు. చంద్రబాబు.. నన్ను నా కుటుంబాన్ని వేధించారు. మాకు జరిగిన అవమానాలు మీకు మీ భార్య, కొడుకు, కోడలికి జరిగితే ఎలా ఉంటుంది?. మేం బానిసలం కాదు. తిరుమల లడ్డుపై రోజూ అబద్దాలు ఆడుతున్నారు. మీ అబద్దాలను ఇకనైనా ఆపి క్షమాపణలు చెప్పండి. క్షమాపణ లేకపోయినా ఫరవాలేదు.. మాట్లాడడం ఆపేయండి. మీ ఉద్దేశం ఏంటి? అందరినీ జైలులో పెట్టాలనా?. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు.. సద్వినియోగం చేసుకోండి. మా ఇళ్లపై దాడిచేసే కార్యక్రమాలకు స్వస్తి పలకండి అని హెచ్చరించారు.మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ‘అరెస్టు చేసి జైలులో పెట్టడం ఎంతవరకు సమంజసం. అరెస్టు చేస్తే భయపడుతారు అనుకోవద్దు. అంబటి రాంబాబు, జోగి రమేష్, చెవిరెడ్డిని అరెస్టు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. మీరు ఏం చేస్తానన్నా మేం బయటకు వస్తాం. నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబుకు ఏ విధంగా పాలించాలో తెలియదా?. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తుకు గట్టి పునాది వేస్తున్నారు. అరెస్టులు ఇప్పటికైనా ఆపండి. తిరుమల లడ్డులో కల్తీ లేదని తేలింది అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ఏపీలో ఆటవిక పాలన నడుస్తోంది: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ అంబటి రాంబాబుతో ఆ పార్టీ నేతలు ముద్రగడ పద్మనాభం, తోట త్రిమూర్తులు, వేణుగోపాలకృష్ణ ములాఖత్ అయ్యారు. అనంతరం ముద్రగడ పద్మనాభం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రుల ఇల్లు తగలపెట్టే సంప్రదాయం రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందని.. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. ఇలాంటి విధానం రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదన్నారు.‘‘కల్తీ రిపోర్టు వచ్చింది. సారీ చెప్తున్నానని చంద్రబాబు చెప్పుంటే గౌరవం పెరిగి ఉండేది. తప్పించుకునేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు.. మీరు చేసే పనులు బాగోలేదు.. మీలో మార్పు రావాలి. దేశంలో మాజీ మంత్రుల ఇల్లు తగలబెట్టిన అరాచకం ఎక్కడా జరగలేదు’’ అని ముద్రగడ పేర్కొన్నారు.పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీమాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఆటవిక పాలన నడిపిస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘ఓటు ద్వారా అధికారం లభిస్తే చంద్రబాబు మళ్లీ ఆటవిక పాలనలోకి తీసుకెళ్లారు. ప్రజాస్వామ్యంలో బాధితులు ముద్దాయిలవుతున్నారు. తిరుమల లడ్డులో కల్తీ జరగలేదని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది. నెయ్యి కల్తీ జరిగిందని పోస్టర్లు వేయటం ఎంత దారుణం. అంబటి ఇంటిపై దాడి చేసిన 5 గంటల పాటు పోలీసులు నిస్తేజంగా ఉండిపోవటం దారుణం. దాడి సమయంలో ఇంట్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. బాధితులను చంద్రబాబు నిందితులుగా మారుస్తున్నారు. పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ అయింది..ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎన్ని రోజులైనా జైల్లో ఉంటానని అంబటి చెప్పారు. జైల్లో మాజీ మంత్రికి ఇవ్వాల్సిన మినిమం ప్రివిలైజేస్ కూడా ఫాలో కావటం లేదు. కేంద్ర మంత్రి పెమ్మసాని దారుణమైన వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారాన్ని తెలియజేయటానికి వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంట్లో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ప్రజా పక్షాన పోరాటం చేస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కటానికి ఎంత ప్రయత్నించినా వెనక్కి తగ్గేది లేదు’’ అని వేణుగోపాలకృష్ణ తేల్చి చెప్పారు. -
కాపులను టార్గెట్ చేస్తున్నారా? చంద్రబాబుకు ముద్రగడ లేఖ
-
చంద్రబాబూ.. కట్టుబట్టలతో కాపులను వెళ్లగొట్టండి
సాక్షి, కాకినాడ: చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పుడూ కాపుల మీద రగిలిపోతూనే ఉంటారని.. అందుకే రిజర్వేషన్ల విషయం సహా ప్రతీ దాంట్లోనూ మోసం చేస్తూ వస్తున్నారని కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం అంటున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి నేపథ్యం, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు ముద్రగడ సోమవారం ఓ బహిరంగ లేఖ రాశారు. ‘‘రాష్ట్రంలో గాడితప్పిన రాక్షస పాలనలో దహనకాండను చూస్తున్నాను. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్ లను ఘోరాతి ఘోరంగా అవమానించడం ఎంత వరకు న్యాయం?. తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ ఇచ్చిన నివేదికతో గతంలో మీరు చెప్పింది అబద్దమని తేలిపోయింది. దానిని కప్పిపుచ్చుకోవడానికి మీరు పడుతున్నపాట్లు అంతా ఇంతా కాదు. మీరు చెప్పిన అబద్దానికి మీ పార్టీనే ఎంతో నష్టపోయింది.. .. మీ పరిపాలనలో ఎంతసేపూ కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు. గతంలో నా కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారు. కాపుల మీద మీరు ఎప్పుడూ రగిలిపోతునే ఉన్నారు. గతంలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని హమీ ఇచ్చి మొండి చెయ్యి చూపించారు. డిప్యూటీ సీఎం(పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి..) మీద ప్రేమతో మళ్ళీ కాపులు మీకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు కాపులంతా మీ మీద కోపంతో ఉన్నారు. దయచేసి కాపులను ఈ రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయ్యండి’’ అంటూ చంద్రబాబు, లోకేష్‌ను ఉద్దేశించి ముద్రగడ పద్మనాభం లేఖలో పేర్కొన్నారు. -
ముద్రగడను పరామర్శించిన గుడివాడ అమర్నాథ్
-
Health Problem: హైదరాబాద్ హాస్పిటల్ కి ముద్రగడ
-
ఎయిర్ అంబులెన్స్ లో హైదరాబాద్ కు ముద్రగడ
-
అంబులెన్స్‌లోనే హైదరాబాద్‌కు ముద్రగడ
అనారోగ్యంతో అస్వస్థతకు గురైన మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభాన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు. సోమవారం అంబులెన్స్‌లోనే రోడ్డు మార్గం గుండా ఆయనను కుటుంబ సభ్యులు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ/హైదరాబాద్: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభంను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. తొలుత ఎయిర్ ఆంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి తరలించాలని అనుకున్నారు. అయితే చివరకు రోడ్డు మార్గం గుండానే తీసుకొస్తున్నట్లు సమాచారం. అనారోగ్యంతో అస్వస్థతకు గురైన పద్మనాభంకు రెండు రోజులుగా కాకినాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై వదంతులు ప్రచారంలోకి రాగా.. కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. అదే సమయంలో ముద్రగడ ఆరోగ్యంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో ఆరా తీశారు. వైద్యుల సూచన మేరకు అవసరమైతే ఎయిర్‌లిఫ్ట్ చేయాలని వైఎస్సార్సీపీ నేతలకు జగన్ చెప్పారు. అయితే.. ఈ ఉదయం ముద్రగడ కోరిక మేరకు తొలుత కిర్లంపూడి నివాసానికి ఆంబులెన్స్‌లో కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడి నుంచి ఆంబులెన్స్‌లోనే హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్‌కు కృతజ్ఞతలు: ముద్రగడ తనయులుతమ తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ముద్రగడ కుమారులు బాలు, గిరిబాబులు కృతజ్ఞతలు తెలియజేశారు. ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందని, తరలింపు నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందవద్దని వారు కోరుతున్నారు. జగన్ సూచన మేరకు ఇవాళే హైదరాబాద్‌కు తమ తండ్రిని తరలిస్తామని ప్రకటించారు. ముద్రగడ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకుని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ముద్రగడ తనయుడు, పార్టీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ గిరిబాబును ఫోన్లో పలకరించారు. పద్మనాభం ఆరోగ్య పరిస్థితి, కాకినాడ ఆస్పత్రిలో అందుతున్న వైద్యం గురించి వివరాలు అడిగి తెలుకున్నారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాటు చేస్తామని, ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో కాకినాడ వైద్యులూ హైదరాబాద్ తీసుకువెళ్లడం మంచిదని చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జగన్మోహన్రెడ్డి సాధ్యమైనంత త్వరగా ముద్రగడను ఎయిర్ అంబులెన్స్‌లో తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని పార్టీనేతలకు సూచించారు. అదివారం రాత్రి తరలించేందుకు సాంకేతికంగా ఇబ్బంది ఉండటంతో ఇవాళ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. -
ముద్రగడ కుమారుడికి వైఎస్ జగన్ ఫోన్.. తండ్రి ఆరోగ్యంపై ఆరా
-
ముద్రగడ ఆరోగ్యంపై వైఎస్ జగన్ ఆరా
సాక్షి, కాకినాడ జిల్లా: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ముద్రగడ కుమారుడు గిరిబాబుతో ఆయన ఫోన్లో మాట్లాడారు. అత్యవసరం అయితే కాకినాడ నుండి హైదరాబాద్‌కు ఎయిర్ లిఫ్ట్ చేయాలని వైఎస్ జగన్ సూచించారు. ఎయిర్ లిఫ్ట్‌కు సహకారం అందిస్తామని హమీ ఇచ్చారు. అస్వస్థత నుండి ముద్రగడ కోలుకుంటున్నారు. ఆయన్ని వైఎస్సార్సీపీ నేతలు చిర్ల జగ్గిరెడ్డి, వంగా గీతా పరామర్శించారు.ముద్రగడ పద్మనాభం కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం శ్వాస సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురి కావడంతో కాకినాడ అహోబిలం ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందించారు. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో మెరుగైన వైద్యం కోసం ఆయన్ను స్థానిక మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ముద్రగడ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
YSRCP నేత ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత
-
నిలకడగా ముద్రగడ ఆరోగ్యం
వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సాక్షి, ప్రతినిధి, కాకినాడ: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురయ్యారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం శ్వాస సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురి కావడంతో కాకినాడ అహోబిలం ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందించారు. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో మెరుగైన వైద్యం కోసం ఆయన్ను స్థానిక మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ముద్రగడ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆ ప్రచారాన్ని నమ్మొద్దుముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణించిందని వస్తున్న కథనాలను ఆయన తనయుడు ముద్రగడ గిరిబాబు ఖండించారు. ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందవద్దని తెలిపారు. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, ప్రచారాన్ని నమ్మొద్దని కోరారాయన. -
వైఎస్ జగన్‌కి ముద్రగడ పద్మనాభం లేఖ
కాకినాడ,సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి.. ఆ పార్టీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ముద్రగడ.. వైఎస్ జగన్‌కి లేఖ రాశారు. ఆ లేఖలో.. ‘వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమీటీ సభ్యునిగా నియమించడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి నా కృతజ్ఞతలు. నాపై పెట్టిన భాధ్యతను పార్టీ గెలుపు కోసం త్రికరణ శుద్దితో కష్టపడి పని చేస్తాను. పేదలకు మీరే అక్సిజన్. ఈ ధఫా మీరు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి పీఠంపై కన్నెత్తి చూడకుండా పదికాలల పాటు పరిపాలన చేయాలి’ అని పేర్కొన్నారు. -
ముద్రగడ ఇంటిపై దాడి హేయమైన చర్య : జగ్గిరెడ్డి
-
ముద్రగడ ఇంటిపై జరిగిన దాడిపై ప్రభుత్వం స్పందించాలి
కిర్లంపూడి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై జనసేన కార్యకర్త చేసిన దాడికి సంబంధించి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్సీ తోట త్రిమూ ర్తులు, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేశ్, దూలం నాగేశ్వరరావు, మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ తదితరులు బుధవారం కాకినాడ జిల్లా, కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకున్నారు.ఆయనకు, పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి ముద్రగడ గిరి బాబుకు సంఘీభావం తెలిపారు. వారు విలేకర్లతో మాట్లాడుతూ, ముద్రగడ ఇంటి మీదకు ఒక వ్యక్తి అర్ధరాత్రి వచ్చి పార్టీ కార్యకర్తను అంటూ బీభత్సం సృష్టించడాన్ని తీవ్రంగా ఖండించారు. కాపు ఉద్యమాన్ని నడిపి, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ముద్రగడపై జరిగింది చిన్న దాడి అని అనుకోవడం లేదన్నారు. 70 ఏళ్ల పైబడిన ఆయన అనేక అవమానాలు తట్టుకుని నిలబడ్డారని, ఆయన ఇంటిపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఇలాంటి అరాచక ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ మౌనవ్రతం వీడి ఖండించాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి గంజాయి తాగాడా.. మత్తు పదార్థాలు తీసుకున్నాడా అనేది తర్వాత విషయమన్నారు. తాను జనసేన మనిషేనని, ఆ పార్టీ జెండా మోశానని చెప్పిన వ్యక్తి అర్ధరాత్రి ముద్రగడ ఇంటి పైకి వచ్చి రచ్చ చేయడమే కాకుండా.. మళ్లీ ఉదయం వచ్చి ఇదంతా తానే చేశానని చెప్పడాన్ని చూస్తే.. కూటమి ప్రభుత్వ పాలనలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. నిందితుడి ఫోన్ డేటా ఇప్పటి వరకూ ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ బాధ్యత తీసుకుని వివరణ ఇవ్వాలన్నారు. దాడులపై విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని డిమాండ్ చేశారు. -
ముద్రగడ నివాసంపై దాడి ఘటన.. పోలీసుల తీరు వివాదాస్పదం
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి నివాసంపై దాడి ఘటనపై పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ఆయన నివాసంపై దాడి జనసేనకు సంబంధం లేదని ఆ పార్టీ నేతల ప్రకటించారు. అదే ప్రకటనను మీడియా గ్రూపులకు పోలీసు అధికారులు షేర్ చేశారు. దాడి అనంతరం ముద్రగడ నివాసం వద్ద జనసేన కార్యకర్త గంగాధర్ హల్ చల్ చేశాడు.తాను జనసేన పార్టీ అని.. పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ ఓవర్ యాక్షన్ చేశాడు. ట్రాక్టర్‌తో ముద్రగడ ఇంటిని దున్నేశానని గంగాధర్ చెప్పాడు. పోలీసుల తీరును జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు తప్పుబట్టారు. జనసేన పార్టీ తరుపున పోలీసులే ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారితే భాధితులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అంటూ కన్నబాబు ప్రశ్నించారు.కాగా, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై దాడి సంచలనం కలిగించింది. జనసేన కార్యకర్త ట్రాక్టర్‌తో వచ్చి ఆయన ఇంటి వద్ద హల్చల్ చేశాడు. బీభత్సం సృష్టించి ఆయన కారును ధ్వంసం చేశాడు. సదరు యువకుడు ఆదివారం ఉదయం ముద్రగడ నివాసం వద్దకు ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. ఇంటి ముందు ర్యాంప్‌పై పార్క్ చేసిన కారును ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. ఈ క్రమంలో కారు ధ్వంసమైంది. తర్వాత, జై జనసేన అంటూ నినాదాలు చేసుకుంటూ ఓవరాక్షన్ చేశాడు.కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలు.. దాడి ఘటనపై ఆరా తీశారు. ముద్రగడను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. ముద్రగడ నివాసంపై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ, కాపు నాయకులు ఖండించారు.ఇదీ చదవండి: నిందితుడిది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటా.. పవన్ నోరు మెదపరేం? -
ముద్రగడ ఇంటిపై దాడి.. పరామర్శించిన YSRCP నేతలు
-
నిందితుడిది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటా.. పవన్ నోరు మెదపరేం?
సాక్షి,గుంటూరు : ‘వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేసిన వ్యక్తి ‘నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా’ అని చెప్పుకుంటున్నాడు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోరు మెదపాలి’ అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు.ముద్రగడ ఇంటిపై దాడి ఘటన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేశారు. ముద్రగడ ఇంటి గేటును ట్రాక్టర్లో ఢీకొట్టి.. పోర్టికోలో ఉన్న కారును ఢీకొట్టారు. ముద్రగడ, ఆయన కుమారుడి ఫ్లెక్సీలు ధ్వంసం చేసి అరాచకం సృష్టించారు.‘‘ఆ వ్యక్తి నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పుకుంటున్నాడు. ఇలాంటి ఘటనలను ప్రోత్సహించడం పిఠాపురం తాలూకా ఎమ్మెల్యేకి సరికాదు. తక్షణం ఈ ఘటనపై పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరువిప్పాలి. ఈ దాడిని ఖండించకపోతే మీరు ఇలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహించినవారవుతారు. నివాసాలపైకి వెళ్లి దాడులు చేయడాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నాం’ అని అంబటి అన్నారు. -
సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి: ముద్రగడ
-
చంద్రబాబు గుర్తుంచుకో.. ముద్రగడ కౌంటర్
సాక్షి, కాకినాడ జిల్లా: అధికారం శాశ్వతం కాదని తెలుసుకోండి అంటూ చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం కౌంటర్ వచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ మిథున్‌రెడ్డి పై దాడి, వినుకొండలో రషీద్ హత్య అత్యంత హేయం అన్నారు.హత్యలు, దాడులను వెంటనే ఆపండి.. అధికారం శాశ్వతం కాదు.. అధికారంలో మీరే ఉండరని గుర్తించుకోండి. పౌర్ణమి తరువాత అమావాస్య వస్తుంది’’ అని ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. -
రాజకీయాల్లో ముద్రగడ లాంటి వాళ్లు అరుదు: అంబటి
సాక్షి, కాకినాడ: రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం వంటి నాయకులు అరుదుగా ఉంటారని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కాపుల కోసం.. కాపు రిజర్వేసన్ల కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన వ్యక్తి ముద్రగడ అని కొనియాడారు. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం కలిశారు.అనంతరం అంబటి మాట్లాడుతూ.. రాజకీయాల్లో నష్టపోయిన ముద్రగడ.. తన కులాన్ని ఏనాడు ఉపయోగించుకోలేదని అన్నారు. కాపునాడు సమావేశం సమయంలో టీడీపీకి రాజీనామా చేసి ఆ సమావేశానికి ముద్రగడ వచ్చారని తెలిపారు. ఆ సమయంలో వంగవీటి జైలులో ఉన్నారని, కేవలం ఒక సవాల్‌ను స్వీకరించి ముద్రగడ తన పేరును మార్చుకున్నారని పేర్కొన్నారు. పేరు మారినా.. ముద్రగడ.. ముద్రగడేనని, అందుకే ఆయన్ను అభినందించాలని కిర్లంపూడి వచ్చినట్లు చెప్పారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన ముద్రగడ, కాసు మహేష్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ నేతలు శుక్రవారం కలిశారు. వైఎస్ జగన్‌ని కలిసిన వారిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు. పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ జగన్ దిశనిర్దేశం చేశారు.కాగా, వైఎస్ జగన్ మరోసారి వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి(శనివారం) నుంచి మూడు రోజులపాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.షెడ్యూల్ ప్రకారం.. శనివారం ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ తన పర్యటనకు బయల్దేరతారు. తొలుత గన్నవరం నుంచి కడప ఎయిర్‌పోర్టు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. ఈ నెల 8వ తేదీన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
మాట ప్రకారం పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభం
-
ఇక నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి
అమరావతి/కాకినాడ, సాక్షి: అన్న మాట ప్రకారం పేరు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మార్చుకున్నారు. ఇక నుంచి ఆయన పేరు అధికారికంగా ముద్రగడ పద్మనాభ రెడ్డి. ఈమేరకు AP Gazette లో ప్రచురణ కూడా అయ్యింది.అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ప్రచార సమయంలో సవాల్ విసిరారు. అయితే.. ఎన్నికల్లో పవన్ నెగ్గడం, ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ తన సవాల్‌కు కట్టుబడి ఉంటానని ప్రకటించడమూ తెలిసిందే. తాజాగా.. ఆయన పేరు మారింది. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఈ మేరకు గెజిట్ విడుదలైంది. -
పవన్ కళ్యాణ్ గెలుపుపై ముద్రగడ రియాక్షన్
-
సవాల్‌కు కట్టుబడి ఉన్నా: ముద్రగడ
కాకినాడ: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై విసిరిన సవాల్‌పై తాను ఓడిపోయానని వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ సవాల్ ప్రకారం నా పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నా. దీని కోసం గెజిట్ ప్రకటన దస్త్రాలు సిద్ధం చేసుకున్నాను. నన్ను ఉప్మా పద్మనాభం అని కొందరు హేళన చేస్తున్నారు. వైఎస్ జగన్ పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ప్రజలు ఎందుకు దీనిని స్వీకరించలేదు అనేది నా ప్రశ్న. ప్రజల కోసం కష్టపడిన జగన్‌ను గౌరవించకపోవడం చాలా బాధాకరం. నా రాజకీయ నడక వైఎస్ జగన్ వెనుకే ’’ అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ గెలిస్తే.. తాను పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. -
ముద్రగడ కూతురు వీడియోపై సంచలన నిజాలు బయటపెట్టిన అడ్వకేట్ రామానుజం
-
ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
సాక్షి, కాకినాడ: ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలు, పిఠాపురంవాసులకు వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. జనసేన, టీడీపీ శాశ్వతంగా సముద్ర గర్భంలో ఉండిపోయేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను ముద్రగడ కోరారు.కాగా, ముద్రగడ లేఖలో..‘గతంలో గాజు గ్లాసు పగిలి ఆ ముక్కలు హాని కలిస్తాయని అందరూ స్టీల్ గ్లాసులు వాడుతున్నారు. ఎన్టీఆర్ పాలనలో అందరూ సైకిల్ తొక్కేవారు. ఇప్పుడు ఆ సైకిల్‌కి తుప్పు పట్టడంతో మోటర్ సైకిళ్లు, కార్లు వాడుతున్నారు. ప్రస్తుతం అందరి ఇళ్లలో ఫ్యాన్లు ఉన్నాయి. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రేమాశీస్సులు ఉంచమని కోరుతున్నాను.సీఎం జగన్‌కు ఓటు వేసే విషయంలో తప్పు చేస్తే శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ తర్వాత వచ్చే పాలకులు రాక్షస పాలన చూపిస్తారు. గతంలో వారి రాక్షస పాలన వీడియోలు సోషల్ మీడియాలో పెట్టాను ఒక్కసారి అందరూ చూడండి. జనసేన, టీడీపీ శాశ్వతంగా సముద్ర గర్భంలో ఉండిపోయేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాను. పేదల సంక్షేమం చూసే ముఖ్యమంత్రి జగన్‌ను గౌరవించాలని కోరుతున్నాను’అంటూ వ్యాఖ్యలు చేశారు. -
పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్
-
జగన్‌ది పేదవాడి ఆకలి తీర్చే మేనిఫెస్టో
నరసాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది పేదవాడి ఆకలి తీర్చే మేనిఫెస్టో అని, చంద్రబాబుది అధికార దాహం తీర్చుకునే మోసపూరిత మేనిఫెస్టో అని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం విమర్శించారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన కాపు ఆత్మీయ సమ్మేళనంలో ముద్రగడ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబు అమలు కాని హామీలు మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. తాను చాలామంది ముఖ్యమంత్రులను చూశానని, కానీ చెప్పింది చెప్పినట్టు చేసి చూపించి.. ప్రజల కోసం పాటుపడ్డ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. పేదవాడి చేతి ఐదు వేళ్లూ నోట్లోకి వెళ్లాలని కోరుకుని ఆ దిశగా తన ఐదేళ్ల పాలన కొనసాగించిన నేత జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. అలా మంచి చేసే ముఖ్యమంత్రికి ప్రజలు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు.కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి దిగజారాడు చంద్రబాబు అధికారం కోసం కులాల మధ్య చిచ్చుపెట్టే స్థాయి నుంచి చివరకు కుటుంబాల మధ్య కూడా చిచ్చుపెట్టే స్థాయికి దిగజారిపోయారని ముద్రగడ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెట్టారని, ఇప్పుడు తన కుటుంబంలో కూడా చిచ్చు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నీచ రాజకీయాలపై చంద్రబాబును అధికార పీఠంపై కూర్చోబెట్టాలని తపిస్తున్న సినీ నటుడు పవన్‌కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలన్నారు. తుని ఘటన తరువాత చంద్రబాబు తనను వేధించిన తీరు, అవమానాలు మర్చిపోలేకపోతున్నానని ఆయన వాపోయారు. మళ్లీ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. సభకు మాజీ జెడ్పీటీసీ, కాపు నేత చాగంటి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. నరసాపురం వైఎస్సార్సీపీ అ«భ్యరి్థ, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చినిమిల్లి వెంకటరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
-
నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయాల్లో నీకే దిక్కు లేదు. అటువంటి నువ్వు నా కుమార్తెకు సీటు ఇస్తావా? అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిప్పులు చెరిగారు. పవన్ కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు తానెప్పుడూ ప్రస్తావించకపోయినా.. తన కుమార్తెను రోడ్డు మీదకు తీసుకు వచ్చారని అన్నారు. భీమవరం, గాజువాకల్లో తరిమేస్తే పిఠాపురం వచ్చి పడ్డారని, ఇప్పుడు పిఠాపురం నుంచి కూడా తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పవన్‌పై ధ్వజమెత్తారు. ఇటీవల ముద్రగడ కుమార్తె క్రాంతి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, తాజాగా తుని సభలో పవన్‌ను క్రాంతి కలిసినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ ఘాటుగా స్పందించారు. తన కుమార్తెను తుని వేదికపై పరిచయం చేసినప్పుడు తన పేరు ఎందుకు ప్రస్తావించారని, ఆమె మామ పేరు ఎందుకు చెప్పలేదని ప్రశి్నంచారు. ఇది ఎదుటివారిని అవమానపరచాలనే ఉద్దేశంతో చేసినదే అని అన్నారు.తుని సభలో తన కుమార్తెను తన ఇంటి పేరుతో పరిచయం చేసి తన కుటుంబంలో చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఆడపిల్లకు వివాహమైన తరువాత తండ్రి ఇంటి పేరు ఉండదనే విషయం తెలియదా అని ప్రశి్నంచారు. తన ప్రతిష్టకు భంగం కల్గించేందుకు కుట్ర పన్నారని పవన్‌పై మండిపడ్డారు. ఇదంతా మీ గురువు ఆదేశాలతో పెట్టిన చిచ్చు కాదా? అని నిలదీశారు. తన కుటుంబంలో చిచ్చు పెట్టి, మళ్లీ సానుభూతిగా మాట్లాడటం సిగ్గుగా లేదా అని మండిపడ్డారు. రాజకీయాల్లో నటించడం మానేసి సినిమాల్లో మాత్రమే నటించాలని పవన్‌కు హితవు పలికారు. పైకి అతిగా గౌరవిస్తున్నట్టు నటిస్తూ, లోపల కుళ్లు, కుతంత్రాలతో తమ కుటుంబాన్ని విడదీయాలని పవన్ చూస్తున్నాడన్నారు. తన కుమార్తెను పిఠాపురంలో పాదయాత్రకు, ప్రచారానికి, అలాగే టీవీ డిబేట్లకు, స్టూడియోల్లో ఇంటర్వ్యూలకు తీసుకువెళ్లి ప్రచారానికి ఉపయోగించుకోండని సలహా ఇచ్చారు.వారాహి సభలో నన్నెందుకు దూషించారుపవన్ను కానీ, ఆయన అన్నయ్యను కానీ ఏ రోజూ ఒక్క మాట అనని తనను కాకినాడ వారాహి సభలో ఎందుకు దూషించారో చెప్పాలని ముద్రగడ నిలదీశారు. పవన్ కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలను తానెప్పుడూ ప్రస్తావించలేదన్నారు. మెగా ఫ్యామిలీలో మీ పిల్లల పరిస్థితి ఏమిటో పవన్ చెప్పాలన్నారు. ఆయన కుటుంబం నుంచి వచ్చి పబ్‌లో మద్యం సేవించి పట్టుబడిన అమ్మాయి, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి విషయాలు కూడా చెప్పాలన్నారు.పవన్ పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యలను పరిచయం చేసి, మూడో భార్యను సభలో పరిచయం చేసి ఉండాల్సిందంటూ ఎద్దేవా చేశారు. నా కుమార్తెకు జనసేనలో టికెట్ ఇస్తామంటున్నారు.. అప్పటి ఎన్నికల వరకూ అసలు మీ పార్టీ ఉంటుందా? అని ముద్రగడ ప్రశి్నంచారు. అబద్ధాలు చెప్పడానికి పవన్ సిగ్గు పడడం లేదన్నారు. తనకు, తన భార్యకు అనారోగ్య పరిస్థితి వచి్చనా తన కుమార్తెను తన ఇంటికి పంపవద్దని పెద్దలకు మనవి చేస్తున్నానని అంటూ ముద్రగడ భావోద్వేగానికి గురయ్యారు. -
నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే
-
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
సాక్షి, కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీరియస్ అయ్యారు వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం. పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాల్లో కాదు అని హితవు పలికారు. అలాగే, పైకి తనపైన ప్రేమ ఉన్నట్టు నటించాల్సిన అవసరంలేదని చురకలంటించారు.కాగా, ముద్రగడ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నేను ఏనాడూ చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడలేదు. ఇంట్లో ఉన్న నన్ను పవన్ రోడ్డు మీదకు లాగాడు. హైదరాబాద్ నుంచి వచ్చి నా కుటుంబంలో చిచ్చుపెట్టాడు. ముద్రగడ కూతురు అని నా కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు. మీరు వదిలేసిన మీ ఇద్దరు భార్యలను.. ఇప్పుడు కలిసున్న మూడో భార్యను అందరికీ ఎందుకు పరిచయం చేయలేదు?.అలాగే, మీ కుటుంబంలో డ్రగ్స్ సేవించి పట్టుబడిన అమ్మాయిని ఎందుకు పరిచయం చేయలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన మరో అమ్మాయిని ఎందుకు పరిచయం చేయడం లేదు. పైకి నా మీద ప్రేమ ఉన్నట్లు పవన్ నటిస్తున్నాడు. పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాలలో కాదు. నాకూ నా కుమార్తెకు బంధాలు తెగిపోయాయి అని ఆమె భర్త.. మామకు చెబుతున్నాను. వీలైతే ఆమెను టీవీ డిబెట్లు.. జనసేన ఎన్నికల ప్రచారాలకు తిప్పాలని వారిని కోరుతున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ
-
కుటుంబంలో చిచ్చుపెట్టారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయాల కోసం కుటుంబంలో చిచ్చుపెట్టి తనను బెదిరిస్తే బెదిరేది లేదని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా కుమార్తె క్రాంతి విడుదల చేసిన వీడియోపై ఆయన శుక్రవారం పిఠాపురంలో మీడియా సమావేశంలో స్పందించారు. వివాహమైన రోజు నుంచే తన కుమార్తె మెట్టినింటి మనిషయ్యిందన్నారు. పెళ్లిగాక ముందు వరకే తమ మనిషి అని, ఇప్పుడు మెట్టినిల్లే ఆమెకు ప్రపంచమని పేర్కొన్నారు. తన కుమారులు మాత్రమే తన మనుషులన్నారు. తన కుమార్తె మామ, జనసేన నాయకులు ఆమెతో తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని, ఎవరు బెదిరించినా బెదిరేది లేదని చెప్పారు. ఇలా తిట్లు తిట్టించడం వల్ల తనకు బాధ లేదని, అయితే రాజకీయం రాజకీయమే అని తెలిపారు.కుటుంబంలో చిచ్చుపెట్టిన వారికి ఆ భగవంతుడే సరైన సమయంలో సరైన శిక్ష విధిస్తాడని చెప్పారు. తాను 2009లో ఎమ్మెల్యేగా పోటీచేసినప్పుడు కూడా తన కుమార్తె మామ ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారని గుర్తుచేశారు. నాటినుంచి నేటివరకు వారు తనకు ఏ విషయంలోను, ఏ రోజూ సహక రించలేదని తెలిపారు. పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదుతాను 40 సంవత్సరాలకుపైగా రాజకీయాల్లో ఉన్నానని, ఇటువంటి బెదిరింపులు, కుట్రలను ఎదుర్కోవడం తనకు కొత్తేమీ కాదని చెప్పారు. రాజకీయాల్లో ఇటువంటివన్నీ అలవాటయ్యాయన్నారు. తన తండ్రి ఎప్పుడూ ధైర్యంగా, నిజాయితీగా ఉండాలని ఇచ్చిన పిలుపుతో ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. అందుకే తాను ఈ రోజుకీ ఎవ్వరికీ భయపడకుండా, ఎవరి చేతి కిందా బతకకుండా ఉంటున్నానన్నారు. తాను ఎప్పుడూ ఎవరి దగ్గరకు వెళ్లి పదవులు కావాలని, ఉన్నతస్థానాలు, హోదాలు కల్పించాలని అడగలేదని చెప్పారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. పిఠాపురంలో పవన్‌కళ్యాణ్‌ను ఓడించాలని తాను వైఎస్సార్సీపీలో చేరినప్పటి నుంచీ తనవంతు కష్టపడుతూనే ఉన్నట్లు తెలిపారు. ఈ సమయంలో ఇటువంటి కుట్రలు పన్నడం రాజకీయాల్లో సహజమేనన్నారు.ఇటువంటి పథకాలు ఇచ్చే నాయకుడు భవిష్యత్‌లో పుట్టడు తాను ఒకసారి వైఎస్సార్సీపీలో చేరాక, ఇక పక్కచూపులు చూసేదిలేదని ముద్రగడ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తోడుగా ఉండటానికే తాను రాజకీయాల్లోకి తిరిగి వచ్చానన్నారు. ఎవరెన్ని అనుకున్నా జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పునరుద్ఘాటించారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు, మధ్యతరగతి వర్గాలకు ఊపిరి పోస్తున్నాయన్నారు.వైఎస్ తనయుడు జగన్ పేదల పెన్నిధిగా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారని తెలిపారు. రాజశేఖరరెడ్డి కుటుంబం నిత్యం పేదల కోసం పాటుపడేదన్నారు. పేదల కోసం ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసే నాయకుడు భవిష్యత్తులో పుట్టడన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన కొనసాగాలంటే జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల కోసం నిత్యం పరితపించే జగన్‌కు తోడుగా అన్ని వర్గాలు నిలవాలని కోరారు. కూటమి ప్రజాసేవ కోసం వస్తున్నది కాదని, కేవలం అధికార దాహం తీర్చుకునేందుకు మాత్రమే వస్తోందని చెప్పారు. షూటింగ్‌ల కోసమే పవన్‌కు ఎమ్మెల్యే పదవి కావాలని ఎద్దేవా చేశారు. కాపులు అంటే నోట్ల కోసం అమ్ముడుపోయే కులమని పవన్‌కళ్యాణ్ అన్న మాటలు గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. -
పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
సాక్షి, కాకినాడ: జనసేన అధినేత పవన్ కేవలం పదవి కోసమే పిఠాపురం వస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబుకు అధికారమనే ఆకలి తీర్చుకోవాలనే తాపత్రయం మాత్రమే ఉందని మండిపడ్డారు.కాగా, ముద్రగడ పద్మనాభం శుక్రవారం పిఠాపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను కలిశారు. ఈ సందర్బంగా ముద్రగడ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారు. యువత రాబోయే భవిష్యత్ గురించి ఆలోచన చేయాలి. ఓటర్లు చంద్రబాబు మేనిఫెస్టోను ఒక్కసారి గమనించాలి. చంద్రబాబుకు అధికారం అనే ఆకలిని తీర్చుకోవాలనే తాపత్రయంతో ఉన్నాడు. అందుకే ఇలాంటి మేనిఫెస్టోను తెచ్చారు.కానీ, ఓటర్లు చాలా తెలివైన వారు. చంద్రబాబు మాటలను, హామీలను నమ్మే పరిస్థితి లేదు. ఇక, పవన్ హైదరాబాద్‌కే పరిమితమయ్యే వ్యక్తి. అలాంటి పవన్ సీఎం కావాలని అనుకుంటున్నాడు. పదవి కోసమే మాత్రమే పవన్ పిఠాపురం వస్తున్నాడు. ముఖానికి రంగులు వేసుకుని పవన్ వస్తున్నాడు.ఇక, ఇదే సమయంలో తన కూతురు క్రాంతి వ్యాఖ్యలపై కూడా ముద్రగడ స్పందించారు. ఈ సందర్బంగా ముద్రగడ.. కొందరు వ్యక్తులు నా కూతురితో నన్ను తిట్టించారు. ఇది చాలా బాధాకరం. నా కూతురుకు పెళ్లి అయిపోయింది.. ఇప్పుడు మెట్టినిల్లే ఆమె ప్రాపర్టీ. రాజకీయం రాజకీయమే.. కూతురు కూతురే. నేను ఇప్పుడు వైఎస్సార్సీపీలో చేరాను. ఇక, పక్క చూపులు చూడను. ఎవరెన్ని అనుకున్నా సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం. నాకు పదవులేమీ వద్దు. నేను కేవలం సేవకుడిని మాత్రమే’అని కామెంట్స్ చేశారు. -
పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్
-
పవన్‌ను ఓడించి, తరిమేయడం ఖాయం: ముద్రగడ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ను పిఠాపురంలో ఓడించి, తన్ని తరిమేసేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం చెప్పారు. ముఖానికి రంగులు వేసుకొని వచ్చేస్తే ప్రజలు ఓట్లు వేసేస్తారా అని ప్రశ్నించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన పవన్, చంద్రబాబు తీరును ఎండగట్టారు. పిఠాపురంలో పవన్‌కళ్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభంరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. ఉప్మా, కాఫీలు పెడుతున్నారని విమర్శించడం పవన్‌కు తగదని, ఇంటికి వచ్చినవారికి మర్యాద చేయటం తమ కుటుంబానికి అలవాటని చెప్పారు. 2014 నుంచి బీజేపీతో కలిసే ఉన్న పవన్‌కళ్యాణ్ ప్రత్యేకహోదా ఎందుకు తీసుకురాలేదని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా ఎందుకు ఆపలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు.కాపు ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు?విషయాలపై అవగాహన లేక, తెలుసుకోవడానికి ఖాళీలేక పవన్ బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. తుని ఘటన 2016లో జరిగిందన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఆ సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు పవన్ పక్కన ఉన్న జ్యోతుల నెహ్రూ వైఎస్సార్సీపీలోనే ఉన్నారని, ఆ ఘటనకు చంద్రబాబే కారణమనే విషయం తెలుసుకోవాలని సూచించారు. తాను చేతగానివాడిననుకున్నప్పుడు కాపుల కోసం పవన్ ఏంచేశారు, ఎందుకు రోడ్డెక్కలేదని ప్రశ్నించారు. కాపు ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం ఎందుకు పారిపోయి వచ్చాడని ప్రశ్నించారు. అసలు పవన్ కల్యాణ్ అడ్రస్ ఏమిటి? ఎక్కడ పుట్టాడని అడిగారు. త్వరలో ప్యాకప్తెలంగాణ ఎన్నికల్లో పవన్ నిలబెట్టిన అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు కదా అని ఎద్దేవా చేశారు. సినిమాల్లో నటించండి.. ఇలా రాజకీయాల్లో నటించడం కుదరదని స్పష్టం చేశారు. త్వరలో పవన్ పార్టీ ప్యాకప్ అవుతుందన్నారు. 1978లో చంద్రబాబు, తాను ఒకేసారి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్లామన్నారు. 1978లో చంద్రబాబుకు శిథిలమైన పెంకుటింటికి మరమ్మతులు చేయించడానికి కూడా డబ్బులు లేని విషయం మర్చిపోయారా.. అని నిలదీశారు. 2019లో ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేశానని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బల్లగుద్ది మరీ చెబుతున్నారని, 2014లో ఇచ్చిన హామీలు సంపూర్ణంగా అమలు చేశానని చంద్రబాబు చెప్పగలరా అని ముద్రగడ ప్రశ్నించారు. ఈ సమావేశంలో ముద్రగడ గిరిబాబు, గౌతు స్వామి, గణేశుల లచ్చబాబు, గోపు చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. -
‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
కాకినాడ: అధికారం అనే ఆకలితో చంద్రబాబు నాయుడు అలమటిస్తున్నాడని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. కాపు ఉద్యమాన్ని అణిచివేసి... తన కుటుంబాన్ని వేధించిన ఘనుడు చంద్రబాబు నాయుడు అంటూ మండిపడ్డారు. అటువంటి చంద్రబాబుతో పవన్ కల్యాణ్ జత కడతారా? అంటూ ముద్రగడ ప్రశ్నించారు.చంద్రబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ పెంకుటింటికి మరమత్తులు చేయించుకోలేదా? ఎమ్మెల్యే అయ్యేంత వరకూ పెంకుటింట్లో ఉన్న చంద్రబాబు నాయుడు.. ఉన్న పళంగా అపరకోటీశ్వరుడు అయిపోయాడు. చంద్రబాబు ఎలా అపర కోటీశ్వరుడు అయ్యారో ప్రజలకు చెప్పమని కోరుతున్నాను. అధికారం అనే ఆకలితో చంద్రబాబు అలమటిస్తున్నాడు.వయస్సు పెద్దదైంది... ఆబద్దాలు ఆపేయండి. జగన్‌కు ఓటేయద్దని చెప్పే హక్కు చంద్రబాబుకు లేదు. పేదల పెన్నిధి జగన్. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. కుమిలి కుమిలి చనిపోయేలా చేశారు. రాష్ట్రంలో మీరు స్వేచ్చగా తీరుగుతున్నారు. మీరు, మీ సతీమణీ,.కుమారుడుకోడలు..వియ్యంకుడు,దత్తపుత్రుడుస్వేచ్చగాతిరుగుతున్నారు.ఇంకేమి స్వేచ్చ కావాలో తమ సతిమణీని అడగండి.కాపు ఉద్యమాన్ని అణిచివేసి.. .నా కుటుంబాన్ని వేధించిన చంద్రబాబుతో పవన్ జతకడతారా? నన్ను ప్రేమించే జగన్‌తో నేను జతకట్టకూడదా?, పవన్ సినిమా డైలాగ్‌లు చదువుతున్నారు. సినిమాల్లోను..రాజకీయాల్లోను పవన్ నటించేస్తున్నారు. యువతను పాడు చేయకండి..వారి జీవితాలను నాశనం చేయకండి.యువత జీవితాల్లో చీకటి నింపకండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని యువతను కోరుతున్నాను.సినిమా హీరోలతో తిరిగి మీ బంగారు భవిష్యతు పాడుచేసుకోకండి.మీ కుటుంబాలు నాశనం అవకుండా యువత మేలుకోండి. -
నన్ను తీహార్ జైలుకి పంపాలని కుట్ర చేశారు.. చంద్రబాబు, పవన్‌పై ముద్రగడ ఫైర్
-
బాబుది రాక్షస రాజ్యం
-
సీఎం జగన్ దాడిపై ముద్రగడ స్ట్రాంగ్ రియాక్షన్..
-
రాజకీయాల్లో నటించకు పవన్..
తాడేపల్లిగూడెం: ప్రజాసేవ అనే మాట పలకని పవన్‌కళ్యాణ్ తన జనసేన పార్టీని ప్యాకప్ చేసి, సినిమా షూటింగ్‌లకు వెళ్లిపోవడం మంచిదని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు ముద్రగడ పద్మనాభం సూచించారు. సినిమాల్లో నటించు.. కానీ రాజకీయాల్లో నటించొద్దంటూ హితవు పలికారు. ఈరోజు పేదల నోట్లోకి ఐదువేళ్లు వెళ్తున్నాయంటే అది జగన్ దయేనని.. పేదలను ఆదుకుంటున్న సీఎం వైఎస్ జగన్ బాగుండాలని, ఆయన పది కాలాలపాటు పేదలకు సేవచేయాలని ముద్రగడ ఆకాంక్షించారు. జగన్ ప్రకటించిన అభ్యర్థులను బలపరచాలని, వారి విజయానికి సహకరించాలని కోరారు. తాడేపల్లిగూడెంలో గురువారం జరిగిన కాపు సంఘీయుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాలొ్గన్నారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ.. కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దని పవన్‌ను కోరారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. కాపు, తెలగ, బలిజలను మోసగించిన బాబు.. 2014లో కాపు, తెలగ, బలిజలకు రిజర్వేషన్లు పునరుద్ధరిస్తానని చెప్పి చంద్రబాబు మోసగించాడు. ఇచ్చిన హామీని అమలుచేయమంటే నన్ను, నా కుటుంబాన్ని తీవ్రంగా అవమానించారు. ఆ ఐదేళ్లూ చంద్రబాబు పక్కనే ఉన్న పవన్ ముద్రగడను అలా ఎందుకు అవమానించారని ఏనాడైనా అడిగారా? పవన్‌కు దమ్ము, «ధైర్యం ఉండి మగాడైతే నన్ను తిట్టాలి.. అంతేగానీ మెసేజ్‌లు పెట్టడం మగతనం అనిపించుకోదు. 21 సీట్లకు పరిమితం కావడం దారుణం.. తెలుగుదేశం గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన సమయంలో పవన్ పొత్తువల్ల టీడీపీ గ్రాఫ్ పెరిగింది. పవన్ ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకునేవారు. 80 సీట్లు తీసుకుని, పవర్లో షేరు అడగాలని అందరూ భావించారు. కానీ, చంద్రబాబు మాత్రం లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి తనయుడితో యువగళం పాదయాత్ర చేయించారు. అడగాల్సినన్ని సీట్లు అడగకుండా.. పవర్ షేరింగ్ లేకుండా కేవలం 21 సీట్లకు పవన్ పరిమితం అయిపోవడం చాలా దారుణం. ఆ సీట్లు కూడా త్యాగం చేసి ఉంటే బాగుండేది. మీకు చెప్పుకోవడానికి ఏమీలేదా బాబూ? అసలు పేదల కోసం జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను మీరు అధికారంలోకి వస్తే చేస్తానని చెప్పడం ఏంటి.. మీకంటూ సొంతంగా చెప్పుకోడానికి ఏమీలేవా బాబూ? ఈ మాటలు చెప్పడానికి మీరు సిగ్గుపడటంలేదేమోగాని వినడానికి మాకు సిగ్గుగా ఉంది. వైఎస్సార్సీపీ ఓటుకు లక్ష రూపాయలు ఇస్తుందని మీరు చెప్పడం చూస్తే పిఠాపురం ప్రజలు అమ్ముడుపోయే మనుషుల్లా కనపడుతున్నారా పవన్? అయినా అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన నీరు ఇస్తామని చెప్పాలిగానీ స్వచ్ఛమైన సారా ఇస్తామని చెప్పడం ఏమిటి? నిజానికి.. పవన్‌కళ్యాణ్ ముందుగా తాడేపల్లిగూడెం నుంచి పోటీచేయాలనుకున్నారు. అయితే ఇక్కడి జనసేన అభ్యర్థి త్యాగాలు చేయడానికి సిద్ధంగాలేనని, వస్తే కాలూచేయీ తీసేస్తానని బెదిరించడంతో పవన్ పిఠాపురం వెళ్లిపోయారు. -
ధైర్యం ఉంటే నన్ను విమర్శించు పవన్
కిర్లంపూడి: గతంలో పవన్ కళ్యాణ్‌కు ఎవరికీ జరగని రీతిలో హైదరాబాద్‌లో ఘోరాతిఘోరంగా అవమానం జరిగిందని వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ఇంటికి వెళ్లి పవన్ టిఫిన్ చేసి వచ్చాడన్నారు. సీఎంను తిట్టడానికి బహిరంగ సభల్లో ఊగిపోతున్న ఆయనకు ఈ కోపం, పౌరుషం, పట్టుదల, ఆవేశం అప్పుడు ఎక్కడికి పోయాయన్నారు. పవన్‌కు జరిగిన అవమానం సామాన్యుడికి జరిగినా వారు నిలదీస్తారని.. కానీ ఈ పెద్దమనిషి ఒక్క మాటకూడా అనలేదని గుర్తు చేశారు. చిన్న సినిమా ఆర్టిస్టులతో తనను పవన్ తిట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు ధైర్యం ఉంటే నేరుగా తనను విమర్శించాలని సవాల్ విసిరారు. మీడియా ముందుకొచ్చి తనను కొన్ని ప్రశ్నలు అడిగితే తాను కూడా పవన్‌ను కొన్ని ప్రశ్నలు అడుగుతానన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి అగ్నికుల క్షత్రియులు, యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్దఎత్తున కాకినాడ జిల్లా కిర్లంపూడికి తరలివచ్చి ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయ న మాట్లాడుతూ పవన్ సినిమాలు తీసుకోవడానికి పిఠాపురంలో ఎమ్మెల్యే పదవి కావాలనడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్ తనతోపాటు నారా లోకేశ్‌ను, నందమూరి బాలకృష్ణను కూడా తీసుకొచ్చి రాష్ట్రమంతా ప్రచారం చేయించగలరా అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం ఇస్తామని, వైఎస్సార్సీపీ ఓటరుకి లక్ష రూపాయలు ఇస్తుందని మాట్లాడటం ప్రజలను అవమానించడమేనని ముద్రగడ మండిపడ్డారు. అప్పుడప్పుడూ రాజకీయాలు చేసేవారిని పక్కనపెట్టాలి అప్పుడప్పుడూ వచ్చి రాజకీయాలు చేసే నాయకులను పక్కన పెట్టి ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను, పిఠాపురం అభ్యర్థి వంగా గీతను గెలిపించి జగన్‌ను మరోసారి సీఎం చేయాలని ముద్రగడ అభ్యర్థించారు. మరో 30 ఏళ్లు వైఎస్ జగన్ సీఎంగా ఉంటారు.. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి త్వరలో పిఠాపురంలో సీఎం వైఎస్ జగన్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదవారికి కడుపు నిండా భోజనం పెడుతున్న వైఎస్ జగన్ మరో 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ముద్రగడ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమం చూడలేక, అధికారం దక్కదనే ఉక్రోశంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు బహిరంగ సభల్లో ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు బూతులు తిట్టడం సభ్యత అనిపించుకోదన్నారు. జగన్‌ను తిట్టడం, అధికార దాహంతో నోటికొచ్చిన అబద్ధాలు ఆడడం చంద్రబాబు స్థాయికి తగదన్నారు. -
పవన్ కల్యాణ్ మగాడే అయితే.. ముద్రగడ సవాల్
కాకినాడ, సాక్షి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ మగాడే అయితే నేరుగా తన మీద మాట్లాడాలంటూ ముద్రగడ సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. దమ్ముంటే.. మగాడే అయితే నేరుగా నా మీద మాట్లాడాలి. పవన్ హైదరాబాద్‌లో పుట్టారు. ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు. హైదరాబాద్ నుంచి పిఠాపురం వచ్చి పవన్ ఎమ్మెల్యే కావాలనుకోవడం ఎంత వరకు సబబు?. హైదరబాద్‌లో అవమానం జరిగినప్పుడు, ఈ పౌరుషం, కోపం, పట్టుదల పవన్‌కు ఏమయ్యాయి. అవమానం చేసిన వారి ఇంటికి వెళ్లి టిఫిన్ చేస్తారా? అంటూ ముద్రగడ పవన్‌ను నిలదీశారు. -
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కాపు నేతల ఆత్మీయ సమావేశం
-
చంద్రబాబు ఎస్టేట్‌కు పవన్ జనరల్ మేనేజర్: ముద్రగడ సెటైర్లు
సాక్షి, పశ్చిమ గోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు ఎస్టేట్‌కు జనరల్ మేనేజర్‌గా పవన్ కల్యాణ్ ఉన్నాడని ఎద్దేవా చేశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని ప్యాకప్ చేసి పంపాలని కోరారు. ఇదే సమయంలో నారా లోకేష్ ఎవరి కోసం యువగళం పాదయాత్ర చేశారని ముద్రగడ ప్రశ్నించారు. కాగా, మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఆధ్వర్యంలో తణుకులో కాపు నేతల ఆత్మీయ సమ్మేళనంలో ముద్రగడ పద్మనాభం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని పేదలకు అండగా ఉన్నారు. పేదలు ఐదు వేళ్లతో అన్నం తినే పరిస్థితి గతంలో ఎవరూ చేయలేదు. సీఎం జగన్ పాలనపై నేను ప్రశ్నించలేదంటున్న పవన్.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎక్కడ దాక్కున్నావ్. పవన్ పేకాట క్లబ్‌లు నడిపే వారితో నన్ను తిట్టిస్తున్నాడు. సోషల్ మీడియాలో చెత్త మెసేజ్‌లు పెడుతూ నన్ను అవమానిస్తున్నారు. కాపు రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో ఉందని సీఎం జగన్ నాడే చెప్పారు. పిఠాపురంలో తనను ఓడించేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారని పవన్ అంటున్నారు. మళ్లీ ఆయనే రెండు లక్షల మెజార్టీ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. 20 సీట్లకే పవన్ ముఖ్యమంత్రి అవుతారంట. చంద్రబాబు.. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని చూస్తాడు కానీ.. పవన్‌ను ఎందుకు సీఎంను చేయాలనుకుంటాడు. ఆ 20 సీట్లు కూడా త్యాగం చేసి జనసేనను క్లోజ్ చేస్తే ఆయన త్యాగశీలిగా మిగిలిపోతాడు. సినిమా షూటింగ్స్ చేసుకునే వారిని ఎమ్మెల్యే చేయాలని అంటున్నాడు. ప్రజల్లో ఉండే వారిని మాత్రమే గెలిపించండి. కూటమి అధికారంలోకి వస్తే సీఎం జగన్ పథకాలను అమలు చేస్తామంటున్నారు. దానికి మీకు అధికారం కావాలా?. నాణ్యమైన విద్య, వైద్యం, వస్తువులు అందిస్తామని అంటారు కానీ.. ఎవరైనా స్వచ్చమైన లిక్కర్ ఇస్తామని అంటారా?. పేదల పెన్నిది సీఎం జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలి. వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు. -
షూటింగ్‌లు మానేసి ప్రజాసేవకు సిద్ధమా?
కిర్లంపూడి: ముఖానికి రంగు వేసుకునే వారిని ప్రజలు నమ్మరని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం విమర్శించారు. షూటింగ్‌లు మానేసి, హైదరాబాద్‌లోని ఆస్తులు పూర్తిగా అమ్మేసి, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధం కావాలని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఎన్టీ రామారావును మాత్రమే ప్రజలు విశ్వసించారన్నారు. తన కుమారుడికి సీఎం పీఠం కట్టబెట్టడానికే చంద్రబాబు ప్రజాగళం యాత్ర తప్ప మరొకరికి అధికారం ఇవ్వడానికి కాదన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వివిధ సామాజికవర్గాల నేతలు ముద్రగడను, యువనేత ముద్రగడ గిరిబాబును కిర్లంపూడిలోని వారి నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ముద్రగడ నాయకత్వంలో పిఠాపురంలో వైఎస్సార్ సీపీని అఖండ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామని ఆ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు చెప్పారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ అఖండ మెజార్టీతో మరోసారి గెలిచి, ముఖ్యమంత్రిగా మరో 30 ఏళ్ల పాటు రామరాజ్యం స్థాపిస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీలో అన్నివర్గాలకు సముచిత స్థానం ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ, బీసీలకు సముచిత స్థానం కల్పించి, పదవులు ఇ చ్చిన ఏకైక ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్‌దేనని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ సముచిత స్థానం కల్పిస్తున్న వైఎస్సార్ సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకుని రావాలని కోరారు. ముద్రగడ పద్మనాభం మద్దతుగా నిలవడంతో వైఎస్సార్ సీపీకి మరింత బలం చేకూరిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమికి అధికారం అప్పగిస్తే రాష్ట్ర భవిష్యత్తు నియంతల చేతిలోకి పోతుందని హెచ్చరించారు. -
మీది పిరికితనం, చేతగానితనం
రాజమహేంద్రవరం రూరల్: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేతగానితనం, పిరికితనంతోనే బ్లేడ్ బ్యాచ్ దాడి చేయడానికి వచ్చేస్తోందంటున్నారని మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. అలాంటప్పుడు రాజకీయాలు మానేయాలని సూచించారు. రాజమహేంద్రవరం బొమ్మూరులోని వైఎస్సార్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్‌కళ్యాణ్‌కు కార్యకర్తలు వచ్చి షేక్‌హ్యాండ్ ఇవ్వకూడదని, వారిని అడ్డుకునేలా ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున జీతాలిచ్చి బౌన్సర్లను పెట్టుకున్నారని చెప్పారు. ప్రజలు ముట్టుకోకూడదని, షేక్‌హ్యాండ్ ఇవ్వకూడదనే.. బ్లేడ్‌బ్యాచ్ వచ్చేస్తోందంటూ పవన్ నెపం వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తామంతా ప్రజల్లోనే తిరుగుతున్నాం కదా.. తమపై బ్లేడ్‌బ్యాచ్ దాడులు చేయలేదే అని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు అసహ్యంగా ఉన్నాయి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాటలు వింటుంటే అసహ్యంగా ఉందని ముద్రగడ పద్మనాభం చెప్పారు. సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తామని చెబుతున్న చంద్రబాబు, ఆయన స్నేహితులు.. గతంలో ఆయన పాలనలో అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని సూచించారు. సీఎం జగన్‌కు ఒక చాన్స్ ఇచ్చానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డికి రాష్ట్ర ప్రజలు ఒక్కచాన్స్ ఇచ్చారని, ప్రజాసంక్షేమ పథకాలతో మంచిపాలన చేస్తునఆయన్ని మరోసారి సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పి.కె.రావు, మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామినాయుడు, వైఎస్సార్సీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, మాజీ వైస్ ఎంపీపీ నక్కా రాజబాబు, ప్రముఖ న్యాయవాది గొందేశి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ పాలనలోనే ఏపీలోని పేదలకు న్యాయం జరిగింది
-
పిఠాపురంలో పవన్ గెలవడు: ముద్రగడ
కాకినాడ, సాక్షి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం సినిమా గ్లామర్ వల్లే పవన్ రాజకీయ ఉనికి ఇంకా కొనసాగగలుగుతోందని ముద్రగడ కుండబద్ధలు కొట్టారు. సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముద్రగడ పలు అభిప్రాయాల్ని పంచుకున్నారు. పవన్ కల్యాణ్‌కు సినీ గ్లామర్ మాత్రమే ఉంది. అందుకే యువకులు ఆయన వెంటపడుతున్నారు. కానీ, ఏరకంగా చూసుకున్నా పవన్ కంటే ఆయన అన్న చిరంజీవి ఎంతో బెటర్. రాజకీయాలు పక్కనపెట్టి పవన్ చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడు. అసలు పిఠాపురంలో ఎట్టిపరిస్థితుల్లో పవన్ గెలిచే ప్రసక్తే లేదు అని ముద్రగడ చెబుతున్నారు. ఇక తనపై పోలీసుల దాడి అప్పట్లో నారా లోకేష్ ఆదేశాల మేరకే జరిగిందని ముద్రగడ సంచలన ఆరోపణ చేశారు. అలాగే.. ఏపీలో సీఎం జగన్ పాలనపై ముద్రగడ ప్రశంసలు గుప్పించారు. సీఎం జగన్ పాలనలో పేదలకు న్యాయం జరిగింది. వైఎస్ జగన్ మాదిరిగా ఏ సీఎం ఇంత స్థాయిలో ప్రజలకు సంక్షేమం అందించలేదు. అందుకే జ్యోతిబసు(పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి) కంటే ఎక్కువ కాలం జగన్ ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా చేయాలి అని ముద్రగడ ఆకాంక్షించారు. ఇక వైఎస్సార్సీపీలో చేరిన తాను.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని మరోమారు స్పష్టం చేశారు. -
ఓటర్లు డబ్బుకు అమ్ముడుపోతారనడం బాధాకరం
కిర్లంపూడి: ఓటర్లు డబ్బులకు అమ్ముడుపోతారనేలా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించడం బాధాకరంగా ఉందని కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ, మైనార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్దఎత్తున కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ స్వగృహానికి తరలివచ్చి ఆయనను, యువ నాయకుడు ముద్రగడ గిరిబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ముద్రగడను కలిశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం నియోజకవర్గంలోని ఒక్కో ఓటరుకు సీఎం జగన్ లక్ష ఇస్తున్నారంటూ ప్రజలను అవమానించేలా మాట్లాడడం పవన్‌కు తగదన్నారు. పవన్‌కు డబ్బు తీసుకునే జబ్బు ఉందని, ఆ జబ్బు అందరికీ ఉంటుందనుకోవడం బాధాకరమన్నారు. నియోజకవర్గ ఓటర్లు డబ్బు తీసుకునేవారా? అమ్ముడుపోయేవారమా? అని ముద్రగడ ప్రశ్నించారు. పిఠాపురం ప్రజలంతా డబ్బుకు అమ్ముడుపోతారనుకోవడం సరికాదన్నారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి.. ఇక రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలతోపాటు రాష్ట్రాభివృద్ధి సీఎం జగన్‌తోనే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్మోహన్రెడ్డిని అత్యధిక మెజార్టీతో అధికారంలోకి తీసుకురావడానికి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని పార్టీ శ్రేణులు, అభిమానులకు ముద్రగడ విజ్ఞప్తి చేశారు. ఆరునెలలకోసారి వచ్చి రాజకీయాలుచేసే పవన్ కన్నా నిత్యం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండే కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను, పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ విజయానికి శ్రమించిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకోవాలని సునీల్, గీతకు సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పి ప్రజలంతా ఆర్థికంగా బలపడేలా కృషిచేయాలని ముద్రగడ చెప్పారు. తద్వారా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, కొద్దిమంది కాపులవల్లే గతంలో తాను అధికారంలోకి వచ్చానన్నారు. నాకు రాజకీయ భిక్ష పెట్టిన ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలను ఎప్పుడూ మరచిపోనన్నారు. -
పేదలకు అన్నం పెట్టే దేవుడు సీఎం జగన్ పై ముద్రగడ అదిరిపోయే స్పీచ్
-
పిఠాపురంలో జనసేనకు భారీ షాక్.. వైఎస్సార్సీపీలోకి శేషకుమారి
సాక్షి, తాడేపల్లి: కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో జనసేనకు భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీ మాజీ ఇంచార్జి మాకినీడి శేషకుమారి వైఎస్సార్సీపీలో చేరారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆమె వైఎస్సార్సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శేషకుమారి పోటీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి. మిథున్‌రెడ్డి, పిఠాపురం వైఎస్సార్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాకినీడి శేషకుమారి మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికలలో 28 వేల ఓట్లు తనకు వచ్చాయని తెలిపారు. ‘పవన్ పార్టీకి ఒక నిబద్దతనేదే లేదు. పవన్‌ను జనం నమ్మే పరిస్థితి లేదు. జనసేనకి అసలు విధివిధానాలే లేవు. పిఠాపురం ప్రజల మనోభావాలను పవన్ అర్థం చేసుకోలేడు. జనాసేనలో అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. సీఎం జగన్‌తో అసలు పవన్‌ను ఎవరూ పోల్చుకోరు. సీఎం జగన్ స్థాయి వేరు. పవన్ చెప్పే సిద్ధాంతాలు మైకుల ముందే పరిమితం. ఆచరణలో ఏమీ చేయరు’ అని తెలిపారు. నన్ను జనసేనలోకి రమ్మనటం పవన్ అవివేకం డబ్బులతో రాజకీయం చేయాలని పవన్ అనుకుంటున్నారని పిఠాపురం నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘మేము గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే ఓట్లేయమని అడుగుతాం. కాపు కుల మహిళా నేతగా పిఠాపురంలో నాకు మంచి ఇమేజ్ ఉంది. నాకు బంధువులు, స్నేహితులు పిఠాపురంలో చాలా ఎక్కువ. నన్ను తన పార్టీలోకి రమ్మనటం పవన్ అవివేకం. పవన్‌ను కూడా నేను మా వైఎస్సార్సీపీలోకి రమ్మంటే బావుంటుందా?. సీఎం జగన్ మీద జనానికి నమ్మకం ఉంది. ఆయన్ను ఢీకొనలేక మిగతా పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తున్నాయి. అయినా గెలుస్తామన్న నమ్మకమే వారికి లేదు. పవన్‌కు అసలు రాజకీయాలపై క్లారిటీ లేదు. జనం డబ్బులకు అమ్ముడు పోతారని పవన్ వ్యాఖ్యలు చేయటం సరికాదు’ అని వంగా గీత అన్నారు. -
పవన్ కు ఇచ్చి పడేసిన ముద్రగడ
-
నువ్వు సినిమాలో హీరో.. నేను రాజకీయాల్లో హీరో: ముద్రగడ
-
నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నీకు మొలతాడు కూడా లేదు పిల్ల బచ్చ పవన్..


