మంజునాథ కమిటీ ఎదుట నినాదాలు
కాపులను బీసీ కులాల్లో చేర్చే అంశంపై జస్టిస్ మంజునాథ కమిటీ తిరుపతిలో ప్రజాభిప్రాయం సేకరిస్తోంది.
తిరుపతి: కాపులను బీసీ కులాల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ మంజునాథ కమిటీ తిరుపతిలో ప్రజాభిప్రాయాలను సేకరిస్తోంది. రాష్ట్రంలో బీసీ కులాల్లో మార్పులు, చేర్పులు, ఆయా కులాల్లోని వ్యక్తుల సామాజిక, ఆర్థిక, విద్యా పరమైన అంశాలను అధ్యయనం చేసేందుకు వచ్చిన కమిటీ సభ్యులు..సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో కాపులను బీసీల్లో చేర్చడంపై వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా.. ఓవైపు తమను బీసీల్లో చేర్చాలంటూ కాపులు, మరోవైపు కాపులను బీసీల్లో చేర్చొద్దంటూ బీసీలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇరు వర్గాల నినాదాలతో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది.