మల్లన్న సేవలో మంజునాథ్ కమిటీ
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను మంజునాథ కమిటీ మంగళవారం దర్శించుకున్నారు. వీరిలో చైర్మన్ మంజునాథ్, సభ్యులు కృష్ణమోహన్, పూర్ణచంద్రరావు, సత్యనారాయణ, సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు. ప్రధానాలయ గోపురం వద్ద జేఈఓ హరినాథ్‌రెడ్డి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. స్వామివార్లకు రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేకపూజలను నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు పలుకగా, జేఈఓ స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలను అందజేశారు. వారి వెంట ఆర్డీఓ రఘుబాబు, ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ, తహశీల్దార్ విజయుడు, సీఐ విజయకృష్ణ, వన్‌టౌన్,టూటౌన్ ఎస్‌ఐలు వరప్రసాద్, ఓబులేష్, వీఆర్వో నాగచంద్రుడు తదితరులు ఉన్నారు.