సాక్షి, న్యూఢిల్లీ : అన్ని రంగాల్లో జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం శనివారం జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... ‘అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. అందరికీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలి.చట్టసభల్లో 14%, ఉద్యోగాల్లో 9%, వ్యాపార వాణిజ్య రంగాల్లో ఒక్క శాతం మాత్రమే బీసీలకు ప్రాతినిథ్యం ఉంది. బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలి. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా బీసీలకు తమ వాటా దక్కలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment