ebc 10 percent reservations
-
వ్యవసాయ భూమి... ఐదెకరాల్లోపే ఉండాలి
సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లకు కుటుంబ వార్షిక ఆదాయం ఒక్కటే కొలమానం కాదు. ఇతరత్రా ఆస్తులనూ పరిగణనలోకి తీసుకుంటారు. కుటుంబానికి ఐదెకరాలు, ఆపై వ్యవసాయ భూమి ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అనర్హులే. అలాగే 1,000 చదరపు అడుగులు, ఆపై వైశాల్యంలో నివాస గృహం/ఫ్లాట్ ఉన్నా ఈ రిజర్వేషన్ వర్తించదు. నోటిఫైడ్ పురపాలికలు, మున్సిపాలిటీల్లో 100 చదరపు గజాలు, ఆపై విస్తీర్ణంలో నివాస స్థలం(ప్లాట్) కలిగి ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో 200 చదరపు గజాలు, ఆపై విస్తీర్ణంలో నివాస స్థలం కలిగి ఉన్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించవు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండి, పైన పేర్కొన్న పరిమితుల్లోపు స్థిరాస్తులు ఉంటేనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ మేరకు ఈడబ్ల్యూఎస్ అమలుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీఓపీటీ) 2019 జనవరి 19న ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ... లాంటి ఏ ఇతర రిజర్వేషన్ల కిందకు రాని వారు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోటాకు అర్హులు. యూపీఎస్సీతో సహా ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్ పేరుతో అగ్ర కుల పేదలకు 10 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ సవరణ ద్వారా 2019 జనవరిలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.(చదవండి: ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం కోటా: కేసీఆర్ ప్రకటన) ఈ క్రమంలో... దాదాపు రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో సైతం 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు మూడు రోజుల్లో సమీక్ష నిర్వహించి ఈ రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు జారీ చేస్తామని ఈ నెల 21న సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎవరికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయి? అనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు జారీ చేయ బోతోంది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు అవకాశాలున్నాయి. కుటుంబ ఆదాయ గణన ఇలా.. ఈడబ్ల్యూఎస్ కోటా కోరుకునే వ్యక్తి కుటుంబ వార్షిక వేతనం రూ.8 లక్షల లోపు ఉండాలి. ఇక్కడ కుటుంబ వార్షిక ఆదాయాన్ని లెక్కించే సమయంలో సదరు వ్యక్తి తల్లిదండ్రులు, 18 ఏళ్లలోపు ఉన్న తొబుట్టువులు, జీవిత భాగస్వామి, 18 ఏళ్లలోపు ఉన్న సంతానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. కుటుంబంలో 18 ఏళ్లకు పైబడిన తోబుట్టువులు, సంతానమున్నా వారి ఆదాయాన్ని కుటుంబ ఆదాయం కింద లెక్కించరు. కుటుంబ సభ్యుల వేతనాలు, వ్యవసాయం, వ్యాపారం, వృతి అన్ని మార్గాల నుంచి వచ్చే ఆదాయాన్ని కుటుంబ ఆదాయంగా లెక్కిస్తారు. -
జూన్ 2న సివిల్స్ ప్రిలిమ్స్
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షను యూపీఎస్సీ ఈ ఏడాది జూన్2న నిర్వహించనుంది. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత ఉద్యోగాల్లో 896 పోస్టుల భర్తీల కోసం ప్రిలిమ్స్ పరీక్షను చేపడుతున్నట్లు యూపీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొంది. అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి కేటాయించిన 10శాతం రిజర్వేషన్ ఈ నోటిఫికేషన్‌కూ వర్తింపజేస్తున్నట్లు కేంద్రం స్పష్టంచేసింది. 896 ఖాళీల్లో అంధులు, యాసిడ్ దాడి బాధితులు తదితర వికలాంగులకోసం 39 పోస్టులు రిజర్వ్‌చేశారు. మార్చి 18వ తేదీ సాయంత్రం ఆరు గంటల్లోపు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్స్ పరీక్షను ఏటా మూడు దశల్లో( ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ) కేంద్రం నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు ఆరు అటెంమ్ట్లను మాత్రమే అనుమతిస్తారు. 1987 ఆగస్ట్2లోపు, 1998 ఆగస్ట్ ఒకటికి ముందు జన్మించిన వారు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. అంటే దరఖాస్తు చేయడానికి కనీస వయసు 21ఏళ్లు. అలాగే, 32 సంవత్సరాలు నిండనివారు కూడా అర్హులేనని నోటిఫికేషన్ పేర్కొంది. -
ఈబీసీ కోటాకు వ్యతిరేకంగా ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నా
-
10% కోటాపై కేంద్రానికి నోటీసులు
న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లపై ఈ నెల 26లోపు సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలకు కేంద్రం సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. మరోవైపు ఆర్.కృష్ణయ తన పిటిషన్లో కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికగా అమలు చేస్తారో తెలిపాలని కోరారు. కాగా ఈబీసీ రిజర్వేషన్లపై గతంలోనూ వ్యాపారవేత్త తెహసిన్ పూనావాలా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈబీసీ రిజర్వేషన్ల చట్టంపై న్యాయస్థానం స్టే నిరాకరించింది కూడా. ఇక కేంద్ర ప్రభుత్వం అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం జనరల్ కోటాగా ఉన్న 50 శాతం నుంచే మరో పది శాతాన్ని పక్కకు తీసి ఈ రిజర్వేషన్లు కల్పిస్తారు. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో మార్పు ఉండదు. -
చంద్రబాబుకు ముద్రగడ లేఖ
సాక్షి, తూర్పు గోదావరి : కాపు రిజర్వేషన్లపై స్పష్టతనివ్వాలని సీఎం చంద్రబాబుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈబీసీ కోటాలో తమ జాతికి ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ బిల్లు పంపారని, బీసీల ప్రాతిపదికగా ఇస్తున్న ప్రయోజనాలు తమకు వర్తిసాయా అని ఆ లేఖలో చంద్రబాబును ప్రశ్నించారు. 2017లో తీర్మానం చేస్తూ.. కేంద్రానికి పంపిన బీసీ-ఎఫ్ అమలు చేస్తారా? లేక 2019 ఈబీసీ బిల్లు అమలు చేస్తారో స్పష్టతనివ్వాలని కోరారు. 2019 బిల్లు మీరు ఇచ్చిందా? కేంద్రంలో ఉన్న బీజేపీ ఇచ్చిందా చెప్పాలంటూ ప్రశ్నించారు. అసలు కాపులకు పది శాతం రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశం ఉందా అని మండిపడ్డారు. రిజర్వేషన్ తరగతులకు అందే ప్రయోజనాలు తమ జాతికి అందేంతవరకు తన ఉద్యమం ఆగదని అన్నారు. -
రెడ్డి సుబ్రహ్మణ్యం హడావుడి
సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన కులాలకు (ఈబీసీ) కేంద్రం ఇచ్చిన పది శాతం రిజర్వేషన్లను రెండు వర్గాలుగా విభజించి కాపులకు విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కారు తెచ్చిన బిల్లును శాసనమండలి శుక్రవారం ఆమోదించింది. ఎటువంటి చర్చ లేకుండానే బిల్లును శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం హడావుడిగా ఆమోదించడం విమర్శలకు దారితీసింది. బిల్లుపై సమగ్రంగా చర్చిచాలని బీజేపీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్‌లతో పాటు పీడీఎఫ్ సభ్యులు పట్టుబట్టినా డిప్యూటీ చైర్మన్ వినిపించుకోలేదు. ఆయన వైఖరిపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్చ జరగకుండా బిల్లును ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. తాము మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ బీజేపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. గందరగోళం నడుమ ఆరు బిల్లులను శాసనమండలి ఆమోదించిన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. ఈబీసీ రిజర్వేషన్ల బిల్లులను శాసనసభ గురువారం ఆమోదించిన సంగతి తెలిసిందే. కీలకమైన బీసీ సబ్‌ప్లాన్ బిల్లుపై కనీస కసరత్తు చేయకుండా టీడీపీ సర్కారు మొక్కుబడిగా నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై కూడా విమర్శలు వచ్చాయి. చర్చ జరగకుండా ఆమోదమా? అప్పటికప్పుడు బిల్లులు అందించి, చర్చ జరగకుండానే వెంటనే ఆమోదించడం మంచి సంప్రదాయం కాదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు అన్నారు. శాసనమండలిలో ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చ జరిగి ఉంటే ఎన్నో విషయాలు చర్చించేవాళ్ళమని చెప్పారు. శాసనమండలిలో అర్ధవంతమైన చర్చ జరగలేదని మరో ఎమ్మెల్సీ కత్తి నరసింహ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. (బీసీలపై మరో వంచన వల!) -
ఆ ‘సవరణ’ బిల్లు ఎవరి లబ్ధికోసం?
ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి పరాభవం కలిగిన నేపథ్యంలో, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయంపై కలిగిన కలవరం ఫలి తంగానే అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఈబీసీలకు రిజర్వేషన్ రేపటి ఎన్నికలాట కోసం విప్పిన వరాలమూటే తప్ప మరేం కాదు. అడుగంటిపోయిన ఉపాధి, ఉద్యోగ అవకాశాల మధ్య అగ్రకులాలకు రిజర్వేషన్ ఎవరికీ మేలుకలిగించేది కాదు. జనాభా ప్రాతిపదికన 85 శాతం రిజర్వేషన్ కల్పిస్తే అన్ని వర్గాల, కులాలకు మేలు జరుగవచ్చు. రాజకీయ ప్రయోజనాలకై తీసుకొచ్చిన ఈ రాజ్యాంగ సవరణ ఎవరికీ లబ్ధి కలిగించదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొద్దిమంది ఎంపీలు తప్ప మిగిలిన అందరు సభ్యుల మద్దతుతో, దాదాపు ఏకగ్రీవమైన ఆమోదంతో, మన రాజ్యాంగానికి 124వ సవరణ ద్వారా కొత్త చట్టాన్ని తెచ్చింది. ఇప్పుడు ఎస్టీ, ఎస్సీ, బీసీలకు ఉన్న రిజర్వేషన్ దాదాపు 50 శాతంగా ఉండగా, ఈ కొత్త రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణాలలోని ఆర్థికంగా వెనుకబడిన (ఈబీఎస్) వారికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు మొదలైన వాటిలో మరో 10 శాతం మందికి రిజర్వేషన్ లభిస్తుంది. అంతేకాదు, వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణాల వారందరికీ ఈ రిజర్వేషన్ అమలవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అనుకూలంగా ప్రభుత్వాలు వ్యవహరించడం వలన ఈ కులప్రాతిపదిక రిజర్వేషన్ల వల్ల తమకు అవకాశాలులేకుండా పోతున్నాయని అగ్రవర్ణాలు బలంగా విశ్వసిస్తున్నారు. మేధాసంపత్తి కాకుండా, కులం ఆధారంగా రిజర్వేషన్ల వలన దేశ ప్రగతి కుంటుపడుతున్నదనీ తమలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆ వెసులుబాటు లేకపోవడం వల్ల, తాము నష్టపోతున్నామన్న భావన అగ్రవర్ణాల్లో ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఓబీసీలకు 10 శాతం రిజర్వేషన్ వలన తమకూ విద్య, ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో వీరున్నారు. ఈ భావన, ఆశ ప్రభావమెంతో ముందు పరిశీలిద్దాం. ఈ రిజర్వేషన్ ప్రస్తుతానికి ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రైవేట్ సంస్థలకు వర్తించదు. అసలు వాస్తవమేమిటంటే, మొత్తం ఉద్యోగ మార్కెట్లో ప్రభుత్వ ఉద్యోగాల వాటా 3.5 శాతం మాత్రమే. ఇందులో 10 శాతం అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల కంటే 0.35 శాతం మాత్రమే మేలు జరగవచ్చేమో! అయితే మోదీ ప్రభుత్వ హయాంలో ఈ ఉద్యోగ కల్పన దిగజారుతున్నది. నిజానికి మూడు నెలల క్రితమే విడుదల చేయవలసిన దేశ నిరుద్యోగ పరిస్థితిని మోదీ ప్రభుత్వం వెల్లడించడానికే భయపడుతోందనిపిస్తోంది. కొత్త ఉద్యోగాలు కల్పించలేకపోగా, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధానం వలన దేశవ్యాప్తంగా ఉద్యోగులు చిరుద్యోగులవుతున్నారు. చిరుద్యోగులు నిరుద్యోగులయ్యారు. వీరి సంఖ్య లక్షల్లో ఉంటోంది. మన చంద్రబాబు విషయానికివస్తే బాబు వస్తే జాబు వస్తుందని చేసిన ఊకదంపుడు ప్రచారం ఆచరణలో ఉన్న జాబులు ఊడిపోవడంగా ప్రతిఫలిం చింది. కనుక రిజర్వేషన్ వల్లనే తమ నిరుద్యోగ సమస్య తీరుతుందనుకోవడం భ్రమ. ప్రధానంగా కావలసింది కోట్లలో ఉద్యోగ కల్పన. ఇది చాతగాని ప్రభుత్వాలు ఏదో గోసాయి చిట్కాల వంటి సవరణ ద్వారా ఉద్యోగ కల్పన చేస్తున్నట్లు ప్రజలను మభ్యపెట్టి ప్రయోజనం లేదు. అగ్రవర్ణ విద్యావంతులు సైతం ఆలోచించవలసిన విషయం మరొకటి. కేవలం తమ కులం ఆధారంగానే, తగిన విద్య మేధాసంపత్తి లేకపోయినా ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారు ప్రతిభ లేకపోయినా నెగ్గుకొస్తున్నారన్న అభిప్రాయం వీరిలో ఉంది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల కోసం ఒక లెక్కప్రకారం ఏటా 4,50,000 మంది ప్రయత్నిస్తుంటారు. కానీ వారిలో అంతి మంగా 1100 మంది అర్హత సాధిస్తారు. ఇలాంటి పరిస్థితిలో, ఏదో పరీక్ష రాస్తే చాలు, రిజర్వేషన్ వర్తించే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తున్నాయని భావింపగలమా? అంతే కాదు. ప్రతిభ, మేధోసంపత్తులకు ఈరోజుల్లో పరీక్షలో వారు సాధించిన మార్కులే కొలబద్ద! అసలీ మార్కుల కొలబద్దే వాస్తవానికి ప్రశ్నార్థకం కూడా. ఈ మార్కుల విషయం ఆలోచిస్తే, ప్రస్తుత పరిస్థితిలో ఈ మార్కుల సాధన, ఆ విద్యార్థి కుటుంబ పరిస్థితి, చదువుకునే వెసులుబాటు, వాతావరణం, తగిన ప్రోత్సాహం, దానితో పాటు వ్యక్తిగత మేధోసంపత్తి వీటన్నింటిపై ఆధారపడి ఉంటుంది. ఈ వర్ణవ్యవస్థ దుర్మార్గం కారణంగా అంబేడ్కర్, ఎన్నో కష్టాలు, అవమానాలు స్వయంగా అనుభవించవలసి వచ్చింది. తన గురువు గారి ప్రోత్సాహం, ఆయన సమకూర్చిన సాయం, తన వ్యక్తిగత ప్రతిభ వలన ఆయన ఇంగ్లండ్, అమెరికా, దేశాలకు విద్యార్జన కోసం వెళ్లి రెండు డాక్టరేట్ డిగ్రీలు తీసుకుని భారతదేశం తిరిగొచ్చారు. కానీ మనదేశం తిరిగి వచ్చిన తర్వాత మామూలు కిరాయిబండి తోలుకునే వ్యక్తి కూడా, అంబేడ్కర్‌ని తన బండి ఎక్కించుకోలేదు. కారణం దళితుడి నీడ సైతం అంటరానిదే అనే తరతరాల భావదాస్యంలో ఉన్నవాడే ఆ వ్యక్తి కూడా. అంబేడ్కర్‌కు దాహం తీర్చుకోవడానికి మంచినీళ్లు ఇచ్చేందుకు సైతం మిగిలిన కులాలవారెవరూ సిద్ధపడలేదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ మతస్థులు కూడా ఎవరూ అంబేడ్కర్‌కు ఒక గది ఇచ్చేందుకు అంగీకరించలేదు. చివరకు తన ఆఫీసులో తన కింద పనిచేసే ఫ్యూన్ ఆఫీసు ఫైల్ సైతం అంబేడ్కర్ చేతికి అందించేవాడు కాడట. మైలపడిపోతామన్న మూఢవిశ్వాసమే కారణం. అందుకే అంబేడ్కర్ ఈ వర్ణ వ్యవస్థ అంతమయితే గానీ మన దేశానికి విముక్తి ఉండదని ‘కులనిర్మూలన’ అనే గొప్ప గ్రంథం రచించారు. కానీ మన సామాజిక జీవనంలో నేటికీ ఈ కులోన్మాద వికృత రూపం కనబడుతున్నది. భారతదేశం ప్రపంచంలోనే 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా పురోగమించినా, నేటికీ సామాజిక జీవనంలో, ఈ కులవ్యవస్థ అలాగే ఉంది. అందుకే సామాజిక న్యాయ సాధన అవసరం నేటికీ ఉంది. నిజానికి దళితుల ఆర్థికపరిస్థితి చెప్పనక్కరలేదు. నేడు విద్య, ఉద్యోగ, రాజకీయ పదవుల్లో ఈ మేరకైనా దళితుల అభివృద్ధి సాధ్యమైందంటే అందుకు రిజర్వేషన్లే ప్రధాన కారణం. గతంతో పోలిస్తే చాలామంది దళితులు మధ్యతరగతి స్థాయికి వచ్చారు. కానీ ఇంకా ఎంతటి వ్యత్యాసం ఉందంటే పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన దళిత, గిరిజనులు 0.4 శాతం కూడా లేరు. కనుక ఆర్థిక సమానత్వం పేరుతో, సామాజిక అన్యాయాన్ని తోసిరాజనడం సబబు కాదు. ఈ స్థితిలో కొత్తగా వచ్చిన ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా ప్రభుత్వం తెచ్చిన 10 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని కూడా స్థూలంగా పరిశీలిద్దాం. బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, వెలమ, వైశ్య, క్షత్రియ ఇత్యాది అగ్రకులాలు జనాభాలో 23 శాతం మించి ఉండరు. మామూలుగా ఈ చట్టం చేయబోయేముందే అలాంటి కులాల గణాంకాలు, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులు అన్నింటినీ సాధికారంగా ప్రభుత్వాలు ఇచ్చి ఉండాల్సింది. నిరుద్యోగ పరిస్థితిపై అంచనాను కేంద్రంలో మోదీ నేతృత్వంలో ఉన్న బీజేపీ (ఎన్డీఏ) ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచి ఉంచింది. కొత్తగా దళితులపై మైనారిటీలపై గోరక్షణ పేరుతోనో, మరో వంకతోనో బీజేపీ, వీహెచ్‌పీ వంటి మతతత్వ సంస్థల మూకదాడులు పెరిగిపోయాయి. దానికితోడు సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు తరి గిపోతున్నాయి. మోదీ డబ్బా వాయించుకున్న అవినీతి, అధికార కేంద్రీకరణ మరింతగా పెరిగిపోతోంది. మన రాజ్యాంగ వ్యవస్థలు చివరకు సర్వోన్నత న్యాయవ్యవస్థ సైతం ఈ విలువలు దిగజారుతున్న ఆరోపణలకు గురవుతున్నాయి. అన్నిటికీ మించి ఒకే దేశం, ఒకే జాతి, ఒకే పన్నుల విధానం, ఒకేసారి ఎన్నికలు, రాష్ట్రాల్లో, కేంద్రంలో ఒకే పార్టీ పాలన వంటి ప్రచారంతో ప్రజల్లో మోదీ ప్రతిష్ట మసకబారుతోంది. అందుకు ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే నిదర్శనం. దీనిపై తమ విజయంపై ఆందోళన చెందుతున్న బీజేపీ నేతలు, అగ్రవర్ణాల ఓటర్లను మరింతగా ఆకర్షించడమే మార్గం అని తన విశ్వసనీయమైన సర్వేల ద్వారా నిజనిర్ధారణకు వచ్చిందట! ఆ ఎన్నికలాటలో, వరాల మూటలో రూపొందినదే ఆర్థికంగా వెనుకబడిన కులాల రిజర్వేషన్ పేరుతో వచ్చిన చట్టం. పార్లమెంటు ఆమోదం పొందిన ఈబీసీ రిజర్వేషన్ వల్ల 8 లక్షల వార్షికాదాయం ఉన్న అగ్రవర్ణాల వారందరికీ విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో రిజర్వేషన్లు లభించినట్లే. ఆమేరకు రిజర్వేషన్ అనుభవిస్తున్న దళిత, ఆదివాసీ, బీసీలకు ప్రాధాన్యత తగ్గుతుంది. ఆర్థిక సమానత్వం ఉంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని చెబుతూనే ఇంకా ఆ స్థాయికి మన దేశం చేరుకోలేదు కాబట్టి అది సాధించాలని రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో దాన్ని చేర్చారు. ఇప్పుడు ఈ కొత్త చట్టం వల్ల సామాజిక న్యాయం మరింత దిగజారే అవకాశం ఉంది కనుక, విరుగుడుగా మరో 25 శాతం రిజర్వేషన్లను పెంచితే ఇప్పుడు కొత్తగా చేరినవారితో కలిపి దేశంలో 85 శాతం రిజర్వేషన్ అమలవుతుంది. నిజానికి వివిధ వర్గాల జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తే అణగారిన వర్గాలకే కాదు.. జనాభా మొత్తానికి సామాజిక న్యాయం తగురీతిలో జరుగుతుంది. ఇప్పటికే తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు 69 రిజర్వేషన్లను కల్పిం చాయి కాబట్టి 85 శాతం రిజర్వేషన్ అసాధ్యం అని కొట్టిపారవేయాల్సిన అవసరం లేదు. నిజానికి ప్రతి వ్యక్తికీ పని కల్పించి, కనీన అవసరాలు తీర్చే తరహా సామాజిక వ్యవస్థను నెలకొల్పడం ఈ ప్రభుత్వాలకు అసాధ్యం కాబట్టే దేశంలో నిరుద్యోగుల సంఖ్య హనుమంతుని తోకలాగా పెరిగిపోతోంది. ఈ స్థితిలో దళిత, గిరిజన, ఇతర వెనుకబడిన కులాలకు కనీసం ఇప్పుడున్న రిజర్వేషన్కి ఏదో మేర నష్టం కలుగకుండా నిలబెట్టుకోవాలి. కమ్యూనిస్టులు, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు సైతం రిజర్వేషన్ చట్టానికి సవరణలు కావాలని కోరుతూ పార్లమెంటులో ఓటింగులో పాల్గొనకుండా ఉండాల్సింది. కానీ దాదాపుగా అన్నిపార్టీలూ ఈ 124వ రాజ్యాంగ సవరణకు మద్దతు ఇచ్చాయి. సామాజిక న్యాయ అంశాన్ని కూడా ఓటు బ్యాంకు రాజకీయాల దృష్టితో చూడటం సరికాదు. ఓట్లాటలో మధ్యతరగతి ముఖ్యం కనుక వారి ఓట్లకోసమే అన్ని పార్టీలు రాజ్యాంగ సవరణను ఏకగ్రీవంగా అంగీకరించాయని అనుకోవాలి. ఈరోజు ప్రగతిశీల శక్తులు ఎన్నికల విజయాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకూడదు. సామాజిక న్యాయసాధన అవసరమైన అన్ని వర్గాల, అస్తిత్వ పోరాట శక్తుల ఐక్యత పునాదిగా సమరశీల ప్రజా ఉద్యమమే సామాజిక న్యాయ సాధనకు పరిష్కారం. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్ : 98480 69720 -
‘చట్టసభల్లో, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కావాలి’
సాక్షి, న్యూఢిల్లీ : అన్ని రంగాల్లో జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం శనివారం జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... ‘అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. అందరికీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలి.చట్టసభల్లో 14%, ఉద్యోగాల్లో 9%, వ్యాపార వాణిజ్య రంగాల్లో ఒక్క శాతం మాత్రమే బీసీలకు ప్రాతినిథ్యం ఉంది. బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలి. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా బీసీలకు తమ వాటా దక్కలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. -
‘అగ్ర’ కోటా మౌలిక సూత్రాలకు వ్యతిరేకం
హైదరాబాద్ : అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, సామాజిక న్యాయానికి తీవ్ర వ్యతిరేక మని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ఓ బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ వంగాల ఈశ్వరయ్య అన్నారు. బిల్లుకు వ్య తిరేకంగా ఫిబ్రవరి 11న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు ఈశ్వరయ్య తెలిపారు. బిల్లును వ్యతిరేకించిన ఆర్జేడీ, ఆప్, ముస్లింలీగ్, ఎంఐఎం పార్టీలను ధర్నాకు ఆహ్వానిస్తామన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలభార తీయ ఓబీసీ ఫెడరేషన్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, బీసీ మహాజన సమితి సంయుక్త ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడారు. సామా జికంగా వెనకబడి ఉన్న వారికి రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఉంటే దాన్ని పట్టించుకోకుండా రిజర్వేషన్లు కల్పించడమంటే ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల రాజ్యాంగం పరం గా అంటరాని తనం చూపినట్లే అన్నారు. బీసీలకు అన్యాయం చేసిన పార్టీకి మద్దతుగా గులాబీ , పచ్చ పార్టీలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలం గాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై వీధిపోరాటం చేస్తూనే న్యాయపోరాటం చేస్తున్నామని దీనిలో భాగంగానే ఢిల్లీలో ధర్నా నిర్ణయం, తాను హైకోర్టులోనూ, జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశామని గుర్తు చేశారు. ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 9 శాతం, ఆఖరుకు 9.5 శాతం ఉన్న అగ్రవర్ణాలకు కూడా 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చి 56 శాతం ఉన్న బీసీలకు మాత్రం 27 శాతం ఇవ్వడం దారుణమన్నారు. 56 శాతం ఉన్న బీసీలు ఉద్యోగాల్లో 8 శాతం మాత్రమే ఉన్నారని ఇంకా రిజర్వేషన్లలో కోత విధించడం సబబా అని ప్రశ్నించారు. గతంలో వర్సి టీ యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు ఇచ్చేవారని, కానీ అగ్రవర్ణాలకు చెందిన కొందరు కోర్టుకు వెళ్లగా డిపార్ట్మెంట్ యూనిట్‌గా కేటాయించాలని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిందని, దీనితో సుప్రీంకోర్టు కూడా ఏకీభవించిందన్నారు. దీనివల్ల బీసీలకు నష్టంవాటిల్లుతోందని, వర్సిటీ ఉన్నత ఉద్యోగాల్లో ఇక బీసీలు ఉండరని తెలిపారు. బీసీ మహాజన సమితి అధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడుతూ, అసమానతల మధ్య సమాన పోటీ ఉండరాదని రిజర్వేషన్లు కేటాయించగా తిరిగి అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇవ్వ డం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. 85 శాతం ఉన్న బడుగులకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి మిగిలిన 50 శాతం జనరల్ కోటా కింద 15 శాతం ఉన్న అగ్రవర్ణాలకు, అందరికీ కేటాయించారని ఇంకా వారికి రిజర్వేషన్లు ఎందుకన్నారు. వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే బీసీల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చి పాలకులకు తగిన బుద్ధి చెపుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు పలువురు పాల్గొన్నారు. -
మర్రి శశిధర్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన జరగకుండా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం తగదని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై హైకోర్టులో గతేడాది ఆగస్టులో తొలుత పిటిషన్ దాఖలు చేయగా దాన్ని విచారించిన హైకోర్టు ఆ పిటిషన్‌ను తెలంగాణ అసెంబ్లీ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తోసిపుచ్చింది. దీన్ని సవాలు చేస్తూ శశిధర్‌రెడ్డి తిరిగి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రాగా పిటిషనర్ తరపున న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని, నియోజకవర్గాల పునర్విభజన చట్టంలోని సెక్షన్ 11ను, ప్రజాప్రాతినిథ్య చట్టాన్ని సవరించాల్సి ఉన్నా అవేవీ జరగకుండానే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు జారీచేసిందని నివేదించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. విచారణ అనంతరం శశిధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్లో అభ్యర్థనలను మార్చజాలమని, ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో సాంకేతిక కారణాల దృష్ట్యా తమ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించిందని పేర్కొన్నారు. ‘ఈడబ్ల్యూఎస్’ను సవాలు చేస్తూ ఆర్.కృష్ణయ్య పిటిషన్ అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ‘అగ్రకులాల్లోని పేదలను అభివృద్ధి పరచాలంటే ఆర్థిక పరమైన స్కీములు, పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి పరచాలి. అంటరానితనం, సాంఘిక వివక్షకు గురవుతున్న కులాలకు రిజర్వేషన్లు కల్పించడం, విద్యా, ఉద్యోగ, పాలన రంగంలో ప్రాతినిథ్యం లేని కులాలను గుర్తించి వారికి ప్రాతినిథ్యం కల్పించడం రిజర్వేషన్ల లక్ష్యం. ఉద్యోగాల్లో వారికి వారి జనాభా ప్రకారం ప్రాతినిథ్యం లేదని ఇస్తారా? వారు చదువుకోవడం లేదని ఇస్తారా? లేక సమాజంలో అగ్రకులాల వారికి సామాజిక గౌరవం లేదని ఇస్తారా? అనే కోణంలో చూడాలి. ఈ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని స్టే ఇచ్చి విచారణ జరపాలి’అని పిటిషన్లో అభ్యర్థించారు. -
1 నుంచి 10% కోటా అమలు
న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లను అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈ) ఫిబ్రవరి 1 నుంచే అమలు చేయనున్నాయి. ప్రస్తుతం మొత్తం 339 సీపీఎస్ఈల్లో కలిపి 10.9 లక్షల మంది ఉద్యోగులున్నారు. గత ఆర్థిక ఏడాదిలో ఆ సంఖ్య 11.55 లక్షలు. ఫిబ్రవరి 1 తర్వాత సీపీఎస్‌యూల్లో విడుదలయ్యే అన్ని ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్లలోనూ అగ్ర కులాల్లోని పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించాలంటూ అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ప్రభుత్వ రంగ సంస్థల విభాగం (డీపీఈ) ఆదేశాలు పంపింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని విద్యా సంస్థల్లోనూ ఈ రిజర్వేషన్లను అమలు చేయాలంటూ ఇప్పటికే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది. -
కోటాపై విపక్షాల దుష్ప్రచారం: ప్రధాని
సాక్షి,చెన్నై : అగ్రవర్ణ పేదలకు జనరల్ కేటగిరీలో పది శాతం రిజర్వేషన్లు కల్పించడం అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనేందుకు సంకేతమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అగ్రవర్ణ కోటాపై వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమిళనాడులోని తోపూర్‌లో ఆదివారం జరిగిన ర్యాలీలో ప్రధాని కోరారు. సమాజంలోని అన్ని వర్గాలకూ విద్య, ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడిఉందన్నారు. ఇప్పటికే రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతున్న దళితులు, గిరిజనులు, ఓబీసీలపై ఎలాంటి ప్రభావం లేకుండా అగ్రవర్ణ పేదలకు కోటా వర్తింపచేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తమిళనాడులో కొన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనం కోసం పది శాతం కోటాపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా అంతకుముందు కేరళలోని కొచ్చిలో బీపీసీఎల్‌లో ఇంటిగ్రేడెట్ రిఫైనరీ విస్తరణ కాంప్లెక్స్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.మరోవైపు తమిళనాడులోని మధురైలోనూ ఎయిమ్స్ ఆస్పత్రికి శంకుస్ధాపన చేశారు. -
ఈబీసీ రిజర్వేషన్: కేంద్రానికి సుప్రీం నోటీసులు
-
అగ్రవర్ణ కోటాపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణాల్లో పేదలకు పదిశాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం స్పందించింది. ఈబీసీ రిజర్వేషన్ల చట్టంపై స్టేకు నిరాకరించిన సుప్రీం కోర్టు మూడువారాల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈబీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ వ్యాపారవేత్త తెహసిన్ పూనావాలా ఈ పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్ల కోసం వెనుకబాటుతనాన్ని కేవలం ఆర్థిక ప్రాతిపదికనే పరిగణనలోకి తీసుకోలేమని చెబుతూ ఈ బిల్లును కొట్టివేయాల్సిందిగా పిటిషనర్ న్యాయస్ధానాన్ని కోరారు. జనరల్ కేటగిరీలో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్ కల్పించడం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించిన 50 శాతం రిజర్వేషన్లను మించిపోయిందని పిటిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఈనెల 8, 9 తేదీల్లో పార్లమెంట్ ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేయడంతో ఇది చట్ట రూపం దాల్చిన సంగతి తెలిసిందే. -
‘ఈబీసీ కోటాలో మా వాటా ఎంతో తేల్చండి’
సాక్షి, గుంటూరు : అగ్రవర్ణ పేదలను ఆదుకునేందుకు కేంద్రం ఈబీసీలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లో తమ వాటా ఎంతో తేల్చాలని ఆర్యవైశ్య సంఘం నేతలు డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో భాగంగా ఈ విషయంపై సమాలోచనలు చేశారు. ఇందులో భాగంగా ఈబీసీ రిజర్వేషన్లో కనీసం ఐదు శాతం వాటాను తమకు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఈ విషయమై మాజీ సీఎం రోశయ్యతో కూడా చర్చలు జరపాలని భావించిన ఆర్యవైశ్య సంఘం సీనియర్ నేతలు.. హైద్రాబాద్‌కు పయనమయ్యారు. రానున్న రెండు రోజుల్లో రిజర్వేషన్ విషయమై తమ పూర్తి డిమాండ్లను వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
కోటా కోసం 16,000 సీట్ల పెంపు
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కోటా అమలు కోసం ఢిల్లీ యూనివర్సిటీ కసరత్తు చేపట్టింది. ఈబీసీ కోటాను వర్తింపచేసేందుకు 2019-20 విద్యాసంవత్సరంలో వివిధ కోర్సుల్లో అదనంగా 16,000 సీట్లను పెంచాలని ఢిల్లీ యూనివర్సిటీ నిర్ణయించింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మొత్తం సీట్లలో 25 శాతం పెరుగుదల ఉండాలని కేంద్ర మానవ వనురుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా ఢిల్లీ యూనివర్సిటీలో ప్రస్తుతం గ్రాడ్యుయేట్ అడ్మిషన్లు 56,000 కాగా, పీజీ అడ్మిషన్ల కింద 9500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పది శాతం కోటాను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ధేశించడంతో ఆయా విద్యాసంస్ధలు మౌలిక వసతులను మెరుగుపరచకుండానే సీట్ల సంఖ్యను పెంచాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇక ఐఐటీ ఢిల్లీ, జేఎన్‌యూలు ఇప్పటికే తమ సీట్ల సంఖ్యను వరుసగా 590, 346 సీట్లకు పెంచాయి. ఈ విద్యా సంస్ధల్లో హాస్టల్ వసతి పరిమితంగా ఉండటంతో పెరిగే విద్యార్ధులకు వసతి కల్పించడంపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్ధల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే జనరల్ కేటగిరీలో అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తామని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్య, ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. వివరణ ఇవ్వాలని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈడబ్ల్యూఎస్ చట్టాన్ని కొట్టేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ సోమవారం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర సామాజిక న్యాయశాఖ కార్యదర్శి, రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ చట్ట సవరణ వల్ల రాజ్యాంగ మౌలిక స్వరూపం మారిపోతుందని పిటిషనర్ తెలిపారు. దీని వల్ల ఓపెన్ కాంపిటీషన్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఆర్థిక వెనుకబాటుతనం ప్రస్తావన లేదని తెలిపారు. -
ఈబీసీ కోటా అమలుకు రెడీ
పట్నా : అగ్రవర్ణ పేదలకు జనరల్ కోటాలో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అవసరమైన న్యాయ సలహా తీసుకుంటున్నామని, త్వరలోనే దీని అమలుకు పూనుకుంటామని బిహార్ సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు. అగ్రవర్ణ పేదలకు జనరల్ కోటాలో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యాంగ సవరణను చేపట్టిన సంగతి తెలిసిందే. అత్యంత వెనుకబడిన కులాల వారికి జాతీయ స్దాయిలో ప్రత్యేక రిజర్వేషన్‌ను కల్పించాలని నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. కాగా తమ పార్టీ పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకమని ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. బిహార్‌లో ఇటీవల చోటుచేసుకున్న మూక హత్యలను ప్రస్తావిస్తూ ఇవి శాంతి భద్రతల సమస్యకు సంబంధించినవి కావని, వీటిని నియంత్రించేందుకు సామాజిక చైతన్యం పెరిగేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. -
సర్కారీ కొలువులకు కోత
న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లోని పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన కేంద్రం ప్రభుత్వం.. ఏటా వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మాత్రం పట్టించుకోవడం లేదు. 2014 నుంచి ఏటికేడు సర్కారీ కొలువులు తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇలా 78 వేలకు పైగా ఉద్యోగాల్లో కోత పడగా కొత్తగా ప్రవేశపెట్టిన 10శాతం రిజర్వేషన్ వల్ల ఒరిగేదేమిటన్న ప్రశ్న యువజనుల మదిని తొలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను వెల్లడిస్తూ.. వచ్చే ఏడాది ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నదీ చెబుతుంది. కేంద్ర ప్రభుత్వంలో మొత్తం 55 మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఉన్నాయి. రైల్వే ఉద్యోగులను కూడా కేంద్ర సిబ్బందిగానే పరిగణిస్తారు. అయితే, రక్షణ దళాల సిబ్బందిని వీరితో కలపరు. 2018–19 బడ్జెట్ ప్రకారం మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 32 లక్షల 52వేలు. 2014 మార్చి 1వ తేదీ నాటికి వీరి సంఖ్య 33 లక్షల 30 వేలు. అంటే, ఈ నాలుగేళ్లలో సుమారు 78 వేల ఉద్యోగాలు తగ్గి పోయాయన్న మాట. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా వచ్చే ఏడాదికి ఉద్యోగాలను 35 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది. అయితే, కేంద్రం ఈ హామీని ఏ ఒక్క ఏడాది కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇవ్వడమే సర్కారీ కొలువుల కోతకు కారణం. కేంద్రం గత కొన్నేళ్లుగా పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగుల్ని నియమించుకుంటోంది. ముఖ్యంగా ప్యూన్లు, డ్రైవర్లను ఈ పద్ధతిలో నియమిస్తోంది. మరోవైపు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల స్థానాలను చాలా ఏళ్లుగా భర్తీ చేయడం లేదు. ఇదికూడా ఉద్యోగాల సంఖ్య తగ్గడానికి కారణమవుతోంది. రైల్వేలో 2010లో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారో 2018 నాటికి కూడా అంతమందే ఉన్నారు. 2016 నాటికి రైల్వేలో 13.31 లక్షల మంది ఉండగా, 2017లో 23వేల మందిని తొలగించారు. ఆ లోటు ఇప్పటికీ భర్తీ చేయలేదు. అయితే, పోలీసు శాఖలో ఉద్యోగుల సంఖ్య 10.24 లక్షల నుంచి 11.25 లక్షలకు పెరిగింది. అలాగే, ప్రత్యక్ష పన్నుల విభాగంలో ఉద్యోగులు 45 వేల నుంచి 80 వేలకు పెరిగారు. కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ విభాగాల్లో కూడా 54 వేల నుంచి 93 వేలకు పెరిగారు. కొన్ని విభాగాల్లో పెరిగినా మొత్తం మీద చూస్తే ఉద్యోగాల్లో తగ్గుదలే స్పష్టంగా కనబడుతోంది. -
‘10 శాతం కోటా’పై కేంద్రానికి నోటీసులు
సాక్షి, చెన్నై/హైదరాబాద్: జనరల్ కేటగిరిలోని అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఫిబ్రవరి 18లోగా వివరణ ఇవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ తమిళనాడు డీఎంకే ఈ పిటిషన్ దాఖలు చేసింది. రిజర్వేషన్.. పేదరిక నిర్మూనలకు ఉద్దేశించిన కార్యక్రమం కాదని పిటిషన్లో పేర్కొన్నారు. సామాజికంగా వెనుబడి, ఎన్నో శతాబ్దాలుగా విద్యాఉద్యోగాలకు దూరంగా ఉన్న కులాల కోసం రిజర్వేషన్లు పెట్టారని వివరించారు. తెలంగాణ హైకోర్టులోనూ పిటిషన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టు పిటిషన్ దాఖలైంది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ పిటిషన్ వేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్ల బిల్లు.. రాజ్యాంగానికి, రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్ బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టు విచారణ జరపనుంది. -
‘రిజర్వేషన్లు’ రాజకీయ సంకల్పం
అహ్మదాబాద్: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చేపట్టిన రాజ్యాంగ సవరణ తమ ప్రభుత్వ రాజకీయ సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ రిజర్వేషన్లను ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తామని అన్నారు. అహ్మదాబాద్‌లో గురువారం ఆయన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ..‘కొత్త రిజర్వేషన్లను ఈ విద్యా సంవత్సరం నుంచే దేశవ్యాప్తంగా ఉన్న 40వేల కాలేజీలు, 900 వర్సిటీల్లో అమలు చేస్తాం. ఆయా సంస్థల్లో అందుబాటులో ఉండే సీట్లను మరో 10% పెంచుతాం. అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’అని తెలిపారు. దేశవ్యాప్తంగా 100 రోజుల్లో 7 లక్షల మంది పేదలు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకం కింద వైద్య సేవలు పొందారని ఆయన తెలిపారు. హెలిప్యాడ్, ఎయిర్ అంబులెన్స్ ఉన్న ఏకైక ఈ 1500 పడకల ఆస్పత్రి పనులు 2012లో మొదలయ్యాయి. అధునాతన సదుపాయాలున్న ఈ సూపర్ స్పెషాలిటీ ప్రజా వైద్య శాలను అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్మిం చింది. ఆయుష్మాన్ భారత్ కోసమే నిర్మించిన ఈ ఆస్పత్రి పేపర్ వినియోగం లేకుండా సేవలందించనుంది. కోట్లాది ఉద్యోగావకాశాల సృష్టి తమ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో వివిధ రంగాల్లో కోట్లాది ఉద్యోగావకాశాలను సృష్టించిందని ప్రధాని మోదీ అన్నారు. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ ప్రేరణతో నిర్వహిస్తున్న అహ్మదాబాద్ షాపింగ్ ఫెస్టివల్– 2019ను ప్రారంభించిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ..‘పర్యాటకం కావొచ్చు, తయారీ లేక సేవల రంగం కావొచ్చు.. కోట్లాది ఉద్యోగావకాశాలను గత నాలుగున్నరేళ్లలో సృష్టించాం. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనను సాధ్యమైనంత మేర ప్రోత్సహించాం. చిన్న పరిశ్రమల కోసం రూపకల్పన చేసిన జెమ్ (గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్) వేదికగా రూ.16,500 కోట్ల వ్యాపారం జరిగింది’అని తెలిపారు. ఇకపై జీఎస్టీ రిటర్నుల ఆధారంగానే బ్యాంకులు అప్పులు ఇచ్చే విధానం రాబోతోందన్నారు. పరోక్ష పన్నుల విధానాన్ని కుదించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామీణరంగం దెబ్బతిన్న కారణంగా 2018లో దాదాపు కోటికిపైగా ఉద్యోగావకాశాలు తగ్గిపోయినట్లు ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా’అనే స్వతంత్ర సంస్థ తెలిపిన నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రభుత్వం కోట్లాది ఉద్యోగావకాశాలను సృష్టించిందంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. వైబ్రెంట్ గుజరాత్ ట్రేడ్ షో ప్రారంభం ప్రధాని మోదీ గాంధీనగర్‌లో వైబ్రెంట్ గుజరాత్లో భాగంగా మహాత్మా మందిర్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ట్రేడ్ షోను ప్రారంభించారు. అనంతరం ఆయన కొన్ని స్టాళ్లను పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. 22వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 25 పారిశ్రామిక, వాణిజ్య రంగాల వారు పాల్గొంటున్నారు. గుజరాత్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి 2003లో సీఎంగా ఉన్న సమయంలో మోదీ వైబ్రెంట్ గుజరాత్‌ను ప్రారంభించారు. శుక్రవారం ఆయన తొమ్మిదో ఎడిషన్ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభిస్తారు. శనివారం సూరత్‌లో హజీరా గన్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు. తర్వాత కేంద్రపాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అదే రోజు ముంబై చేరుకుని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా కొత్త భవనాన్ని మోదీ ప్రారంభిస్తారు. -
అమల్లోకి ‘పేదల’ 10% కోటా
న్యూఢిల్లీ: జనరల్ కేటగిరీలో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోని పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాల్లో 10% రిజర్వేషన్లు కల్పించే చట్టం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019, జనవరి 14 నుంచి అమల్లోకి వచ్చినట్లు సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్లకు అదనంగా 10% రిజర్వేషన్లు కల్పించాలని ఇందులో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 15, 16 అధికరణాలను సవరిస్తూ రూపొందించిన బిల్లును ఇటీవలే పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పౌరుల అభివృద్ధి కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించుకునే అవకాశం రాష్ట్రాలకు కల్పిస్తూ ఒక క్లాజ్‌ను సంబంధిత అధికరణల్లో చేర్చారు. ఆర్థిక వెనుకబాటుతనానికి సంబంధించి కుటుంబ ఆదాయం, ఇతర సూచీల ఆధారంగా ప్రభుత్వం నిర్ధారించే వర్గాలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా పరిగణిస్తారని చట్టంలో స్పష్టం చేశారు. -
పేదల కోటాకు రాజముద్ర
న్యూఢిల్లీ: విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రాజ్యాంగ(103వ సవరణ) చట్టం పేరిట తెచ్చిన ఈ బిల్లు ఇప్పటికే పార్లమెంట్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి సంతకంతో చట్టరూపం దాల్చింది. ప్రభుత్వం త్వరలో ప్రకటించే తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనకబడిన ప్రజల అభివృద్ధికి ప్రత్యేక నిబంధనలు చేరుస్తూ రాజ్యాంగంలోని 15వ, 16వ నిబంధనల్ని సవరించి ఈ చట్టం రూపొందించారు. మైనారిటీ విద్యా సంస్థలు మినహా అన్ని విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో జనరల్ కేటగిరీలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. కుటుంబ ఆదాయం, ఇతర ఆర్థిక పరిమితుల ఆధారంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలను ప్రభుత్వం కాలానుగుణంగా గుర్తిస్తుందని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటన జారీచేసింది. ఈ రిజర్వేషన్లకు అర్హులు ఎవరంటే.. ► వృత్తిగత, వ్యవసాయిక వార్షికాదాయం రూ.8 లక్షల కన్నా తక్కువ ఉన్నవారు ► 5 ఎకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి, 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారు ► నోటిఫైడ్ మునిసిపల్ ప్రాంతంలో 100 గజాల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు కలిగిన వారు ► నాన్ నోటిఫైడ్ మునిసిపల్ ప్రాంతంలో 200 గజాల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు కలిగిన వారు -
ఈబీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు శనివారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదంతో భారత ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేయడంతో ఈబీసీ రిజర్వేషన్ల చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు విద్యాసంస్థల్లో అగ్రవర్ణపేదలకు 10 శాతం రిజర్వేషన్ లభించనుంది. 124వ రాజ్యంగ సవరణ పేరిట తెచ్చిన ఈ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభల్లో వెనువెంటనే ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఎన్డీఏ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించినప్పటికీ 2/3 మెజార్టీతో పార్లమెంట్ ఆమోదించింది. మరోవైపు ఈ బిల్లును సవాలుచేస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలైంది. ఈ బిల్లుతో కోటా పరిమితి 50 శాతం దాటిపోతుందని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంను ఆశ్రయించింది. అర్హులు ఎవరంటే.. అగ్ర కులాల్లోని పేదలను గుర్తించేందుకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. (విశ్వసనీయ సమాచారం ప్రకారం) ఐదెకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉండకూడదు కుటుంబ వార్షికాదాయం రూ. 8 లక్షలలోపు ఉండాలి వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో సొంతిల్లు ఉండొద్దు మున్సిపాలిటీల్లో 100 గజాలు, మున్సిపాలిటీ కాని ప్రాంతాల్లో 200 గజాలకు మించిన స్థలాలు ఉండకూడదు. -
ఉద్యోగాలే లేనప్పుడు రిజర్వేషన్లు ?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఉద్యోగాలే లేనప్పుడు ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల లాభం ఏమిటని సోషల్ మీడియాలో హాస్యోక్తులు వైరల్ అవుతున్నాయి. ఉద్యోగాలను బీజేపీకీ చెందిన బాలీవుడ్ నటుడు అనుపమ్ కేర్ గుండుతో పోలుస్తూ రిజర్వేషన్లను జుట్టు దువ్వుకునే దువ్వెనతో పోలుస్తున్నారు. ఇంకా బాగా చెప్పాలంటే గణితం ప్రకారం సున్నాను ఏ అంకెతో గుణించినా ఫలితం సున్నానే అవుతుంది. పది శాతం రిజర్వేషన్లను సున్నా ఉద్యాగాలతో గుణిస్తే సున్నానే వస్తుంది. కనుక పది శాతం రిజర్వేషన్లు సున్నాతో సమానం. దేశంలో ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తానంటూ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఆయన మాట హామీగానే ఉండిపోవడమే కాదు. 2018లో దేశంలో ఉన్న ఉద్యోగాలు కోటి పది లక్షలు ఊడిపోయాయని ఆజిమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీకి చెందిన ఆర్థిక పరిశోధన మండలి ఓ అధ్యయనంలో తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 84 శాతం ఉద్యోగాలు పోగా, పట్టణ ప్రాంతాల్లో 16 శాతం ఉద్యోగాలు పోయాయి. వారిలో 88 లక్షల మంది మహిళల ఉద్యోగాలు పోగా, మిగతావి పురుషుల ఉద్యోగాలు పోయాయట. ఫలితంగా 2018వ సంవత్సరం డిసెంబర్లో 27 నెలల్లో అత్యధిక నిరుద్యోగుల శాతం 7.75 శాతంగా నమోదయింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వైఫల్యాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. జాతీయ స్థూల ఉత్పత్తి సవరించిన స్కేల్ ప్రకారం గతేడాది 7.4 శాతం ఉండగా, ఈ ఏడాది అది 7.2 శాతానికి చేరుకుంది. జీఎస్టీ వసూళ్లు బడ్జెట్ అంచనాలకు 40 శాతం దిగువున ఉన్నాయి. ఈ ఒక్క సంవత్సరమే ఇప్పటికే ద్రవ్య లోటు 15 శాతానికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 32 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 47 రూపాయలు సగటున సంపాదిస్తే దారిద్య్ర రేఖకు ఎగువున ఉన్నట్లు భావిస్తున్న నేపథ్యంలో సంవత్సరానికి ఎనిమిది లక్షలు, అంటే రోజుకు 2,192 రూపాయలకుపైగా సంపాదించే వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఫలితం ఏమిటని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి జన్‌ధన్ ఖాతాలోకి 15 లక్షల రూపాయలు వచ్చినట్లే రేపు పది శాతం రిజర్వేషన్లు కూడా అమలవుతాయని ఛలోక్తులు విసురుతున్నారు. -
‘పేదల కోటా’పై సుప్రీంలో పిటిషన్
న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదించిన బిల్లును సవాలుచేస్తూ సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్ దాఖలైంది. యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్‌ను వేసింది. తాజా బిల్లుతో కోటా పరిమితి 50 శాతం దాటిపోతుందని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. 124వ రాజ్యాంగ సవరణ పేరిట తెచ్చిన ఈ బిల్లును రద్దుచేయాలని, అది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తోందని, రిజర్వేషన్లకు ఆర్థిక స్థోమత ఒక్కటే ప్రాతిపదిక కావొద్దని అన్నారు. ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లను జనరల్ కేటగిరీకే పరిమితం చేయొద్దని, అదే సమయంలో కోటా పరిమితి 50 శాతం దాటిపోకూడదని అభిప్రాయపడ్డారు. తాజా సవరణలతో ఆర్థికపరంగా రిజర్వేషన్ల పరిధి నుంచి ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలను తొలగించడం ద్వారా జనరల్ కేటగిరీలోని పేదలకే లబ్ధిచేకూరుతుందని ఆరోపించారు. ఓబీసీలకు అందిస్తున్న 27 శాతం రిజర్వేషన్లను కూడా ఆర్థిక ప్రాతిపదిక కిందికి తీసుకురావాలని డిమాండ్ చేసింది. -
ఓట్ల కోసం ‘కోటా’లో పాగా!
కోటా రాజకీయాల చరిత్రలో కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టిన రాజకీయ వేత్త పి.వి. నరసింహారావు. రిజర్వేషన్ల ఫలాలు అందుకొని బాగుపడిన పైతరగతిని కోటానుంచి తప్పించాలనే క్రీమీలేయర్ విధానం మొదటిది. అన్ని వర్గాల్లో (కులాలు మతాలతో సహా) పదిశాతం ఆర్థికంగా వెనుకబడిన వారికి కోటాను వర్తింపజేయడం రెండోది. కొన్ని వర్గాలు ప్రతిఘటించినా క్రీమీలేయర్ మార్పు నిలబడింది. రెండోదీ విలువైనదే అని ఈరోజు పరిణామాలు సూచిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం అన్ని సాంకేతిక లోపాల్ని సవరించి రాజ్యాంగాన్ని రెండురోజుల్లో మార్చేసింది. ప్రభుత్వ సర్వీసులలో (ప్రయివేటు సర్వీసులలో కాదు), అన్ని విద్యా సంస్థల (ప్రయివేటు సంస్థలతో సహా, మైనారిటీ కాకుండా) ప్రవేశాలలోఇదివరకు రిజర్వేషన్ పొందని వర్గాలలో పది శాతం ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఇచ్చే వీలు కల్పిస్తూ భారత సంవిధానం ఆర్టికల్స్ 15, 16 లను సవరించే 124వ రాజ్యాంగ సవరణ జరిగిపోయింది. కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలు ఇదేమిటో పూర్తిగా అర్థం చేసుకునే లోగానే సవరణ బిల్లు పాస్ అయిపోయి బైట పడింది. రిజర్వేషన్ వ్యతిరేకులు కూడా వ్యతిరేకించడానికి వీల్లేకుండా పాలసీని హఠాత్తుగా ప్రకటించారు. కులాధార రిజర్వేషన్లను ఇవ్వడానికి వీల్లే దని కూడా అనేక ధర్మాసనాలు వివరించాయి. ఫలానా కులంలో పుట్టిన వారు ఆర్థికంగా విద్యా సామాజిక పరంగా కూడా వెనుకబడి ఉంటే ఆ కులాన్ని వెనుకబడిన కులంగా పరిగణించడంలో తప్పులేదని, కులాన్ని అప్పుడు ఒక వర్గంగా గుర్తించవచ్చని న్యాయస్థానాలు వివరించాయి. ఓట్ల కోసం కోటాను రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయనే విమర్శలు, నిందలు ఎన్ని ఉన్నా, సంవిధాన రూపకల్పనా సమయంలో షెడ్యూల్డు కులాలు, తెగలకు ప్రాతినిధ్యం కల్పించాలని ప్రతి పాదించిన వారికి అధికార కాంక్షతోకూడిన రాజకీయ స్వార్థాన్ని అంటకట్టడం న్యాయం కాదు. ఈ సందర్భంలో మిత్రుడు అరుణ్ పెండ్యాల కోటా విధానాలు ఏ విధంగా పుట్టాయి, అవి ఏరూపం తీసుకున్నాయి, చివరకు ఏ విధంగా పరిణమించాయి. పోనీ, ఆశించినట్టు ఏమైనా ఓట్లు తెచ్చి గెలిపించాయా? అని ఆలోచించారు. ఆ పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంలో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నకాలంలో ఆయనపైన సోషలిస్టు వర్గాలు కోటా కోసం ఒత్తిడి తెచ్చాయి. మొరార్జీ 1979 జనవరి ఒకటో తేదీన ఇతర వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల గురించి మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కానీ 1980 జనవరిలో అంటే కమిషన్ ఏర్పాటయిన ఏడాది తరువాత అంతర్గత విభేదాలతో ఆ ప్రభుత్వం కూలిపోయింది. మండల్ కమిషన్ 1980 డిసెంబర్ 31న నివేదిక ఇచ్చింది. ఓ దశాబ్దం తరువాత ఈ నివేదికకు ప్రాణం పోసిన ఘనుడు వి.పి. సింగ్. 1990 దశకం మొదట్లో చాలా బలహీనమైన సంకీర్ణప్రభుత్వానికి ఆయన అధినేతగా ఉన్నారు. రాజకీయంగా బలపడడానికి ఉపయోగపడుతుందన్న పేరాశతో మండల్ కమిషన్ నివేదికను ఆమోదించారు. రాజ్యాంగ సవరణ చట్టాలు తేలేదు కాని, పరిపాలనాపరమైన ఉత్తర్వులతో కోటాను అమలుచేయాలని, అప్పటికి ఉన్న ఓటు కోటలను బద్దలు కొట్టాలని అనుకున్నారు. కానీ జనం వీధినపడ్డారు. యువకులు ప్రాణాలు బలితీసుకున్నారు. మండల్ మంటల ఆందోళనలతో దేశం దద్దరిల్లింది. కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైనాయి. సరిగ్గా ఆ దశలోనే మండల్‌కు పోటీగా బీజేపీ మత కమండలంతో రంగంలో ప్రవేశించింది. బాబ్రీ మసీదు స్థానంలో భవ్యమైన శ్రీరామ మందిర నిర్మాణమే తక్షణ కర్తవ్యమంటూ రథయాత్రకు బయలుదేరారు లాల్‌కృష్ణ అడ్వాణీ మహాశయుడు. మండలానికి కమండలానికి జరిగిన పోటీలో కమండలం బయటపడి మండలం మరుగున పడింది. మండల్ ప్రయత్నాలన్నీ హిందువులను చీల్చడానికి వాడుకుంటున్నవేనని సమస్తిపూర్ సభలో 23.10. 1990న అడ్వాణీ ప్రకటించారు. ‘మీరు శ్రీరామ మందిరం ఉద్యమం పేరుతో రథం వేసుకుని బిహార్‌లో ప్రవేశిస్తే మేం రానివ్వం, అరెస్టుచేస్తాం’ అని నాటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. అదేవిధంగా అడ్వాణీ అరెస్టయ్యారు. వెంటనే వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించడం, ఆయన పదకొండు నెలల పాలన అంతటితో అంతరించడం తెలిసిందే. తరువాత మరో మైనారిటీ సంకీర్ణాన్ని సమర్థవంతంగా అయిదేళ్లు నడిపి సంకీర్ణంలోనూ స్థిరత్వం, సుపాలన సాధ్యమే అని నిరూపించిన పీవీ నరసింహారావు మరొక పాలనా ఉత్తర్వు ద్వారా అగ్రవర్ణాల పేదలకు ఇచ్చిన పదిశాతం కోటా ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాని క్రీమీలేయర్ సంస్కరణను ఆమోదించడం విశేషం. కోటా సాయంతో మళ్లీ అధికారానికి రావాలని ప్రవేశపెట్టిన ఈ పదిశాతం రిజర్వేషన్ల యత్నం ఎంత వరకు ఫలిస్తుందనేది ప్రశ్న. కేవలం ఆర్థిక ప్రాతిపదిక ఆధారంగా కోటాను సుప్రీంకోర్టు ఆమోదిస్తుందా? వ్యాసకర్త కేంద్ర మాజీ సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
కోరిక తీరేనా? కొత్తగాలి వీచేనా?
సమకాలీనం లోకసభకు జరుగబోయే సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌పై తీసుకున్న నిర్ణయం రాజకీయంగా నెరవేర్చే మేళ్లకన్నా దానివల్ల కలిగే సామాజిక ప్రయోజనాలు, కొత్తగా తలెత్తే సందేహాలే ప్రధానాంశాలవుతున్నాయి. తాజా ప్రతిపాదన దేశంలో న్యాయ, రాజకీయ, సామాజిక పరమైన ఏయే కొత్త వివాదాలకు దారితీస్తుందోనన్న భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం కదిపిన ఈ తేనెతుట్టె ఎన్నికల్లో గెలవడమనే కోరికను తీరుస్తుందా లేక రిజర్వేషన్ల చిక్కుముడిపై కొత్తగాలి వీస్తుందా అనేది అసలు ప్రశ్న. ఈ అంశంపై చర్చ తప్పక కొనసాగుతుంది. పర్యవసానాలు వేచి చూడాల్సిందే. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ ప్రతిపాదన స్థూలంగా మొత్తం రిజర్వేషన్ల అంశాన్నే మరో మారు చర్చకు పెట్టింది. ఒక్క నిర్ణయంతో తేనెతు ట్టెను కదిల్చినట్టయింది. కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న రిజర్వేషన్ డిమాం డ్లు–ఉద్యమాలకు దీన్కొక పరిష్కారంగా చూపుతున్నా, సమాధానం లేని తాజా ప్రశ్నలెన్నింటికో ఆస్కారం కల్పిస్తోంది. కొత్త కోటాను సాధ్యపరిచే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభించినా, ఈ పది శాతం రిజర్వేషన్ల అమలు ఎలా ఉంటుందనే అంశమే ఉత్కంఠ రేపుతోంది. లోకసభకు జరుగ బోయే సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో బీజేపీ నేతృత్వపు ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా నెరవేర్చే మేళ్లకన్నా సామాజికంగా ఒనగూర్చబోయే ప్రయోజనాలు, కొత్తగా తలెత్తే సందేహాలే ప్రధానాంశాల వుతున్నాయి. రిజర్వేషన్లపై ఇప్పటివరకూ ఏర్పడ్డ సందిగ్దతను, దురభిప్రా యాన్ని తొలగించే క్రమంలో ఇదొక ముందడుగని సమర్థించే వారున్నారు. దానికి భిన్నంగా, అసలు రిజర్వేషన్లను శాశ్వతంగా ఎత్తివేసే దిశలో ఇది దుందుడుకు చర్య అనే వారూ ఉన్నారు. అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యో గాల్లో రిజర్వేషన్ల కల్పనకుద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో గురువారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పడింది. తాజా ప్రతిపాదన దేశంలో న్యాయ, రాజకీయ, సామాజికపరమైన ఏయే కొత్త వివాదాలకు దారితీస్తుందోనన్న భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఇదే చర్చను రగి లిస్తోంది. దాదాపు అన్ని ప్రధాన పార్టీలు తమ ‘రాజకీయ’విధానాలకు అనుగుణంగా ఉభయసభల్లో ఈ బిల్లుకు మద్దతిచ్చినా, బిల్లు తీసుకువచ్చిన తీరే బాగోలేదని విపక్షాల సన్నాయినొక్కులు. ఈ దిశలోనే... రాజకీయ, రాజ కీయేతర వర్గాల్లో తాజా రిజర్వేషన్ కోటాకు అనుకూల–ప్రతికూల చర్చ ఊపందుకుంటోంది. ప్రభుత్వ రంగంలో విద్య, ఉద్యోగావకాశాలు ఏ మేర కున్నాయి? అగ్రవర్ణాల్లో ఏయే కులాల జనాభా ఎంత? అందులో ఆర్థిక స్థితి గతులకు సంబంధించిన గణాంకాలున్నాయా? పేదరిక గణనకు విధించిన సంపద పరిమితులు హేతుబద్దమా? వీటన్నింటిపై సమగ్ర కసరత్తు జరి గిందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ప్రాతిపదికపైనే పంచాయతీ! రిజర్వేషన్ల వర్తింపు ఏ ప్రాతిపదికన అన్నదే మొదట్నుంచి వివాదాస్పద అంశం. కులాల వారిగా రిజర్వేషన్లు ఇస్తూ, నిరంతరం దాన్ని సంరక్షిస్తూ కుల వ్యవస్థను, వివక్షను నిర్మూలించాలనడం ఓ అర్థరహిత చర్చ అనే వాదన ఉంది. రిజర్వేషన్లను గట్టిగా వ్యతిరేకించే వారు, ఉంటే గింటే అవి ఆర్థిక స్థితి గతుల ఆధారంగా ఉండాలంటారు. అగ్రవర్ణాల్లో పేదలు, దళిత–బలహీన వర్గాల్లో సంపన్నులు ఉన్నపుడు వర్గాల వారిగా రిజర్వేషన్లు తప్పని, ఆర్థిక స్థితిగతుల్ని బట్టి పేదలకు రిజర్వేషన్ వర్తింపజేయాలని, అదే సామాజిక న్యాయమని వీరంటారు. రిజర్వేషన్ల కారణంగా ప్రతిభ తిరస్కారానికి గుర వుతోందనే తమ వాదనకు ఈ అంశాన్ని జోడించి వేదికలపై హోరు ప్రసం గాలు చేస్తుంటారు. బీజేపీ విధానాల్ని ప్రభావితం చేసే ఆరెస్సెస్ సిద్దాంత కర్తల వాదన మొదట్నుంచీ ఇదే! మరోవైపున పూర్తి విరుద్ద వాదన! సమా జంలోని కొన్ని వర్గాలే ప్రగతి ఫలాలు అనుభవించి, నిమ్నజాతి వర్గాలను అణచివేస్తూ సాగిన సుదీర్ఘ చరిత్ర తాలూకు తప్పిదాల్ని సరిదిద్దడానికే రిజర్వేషన్లని వీరంటారు. రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లను, వాటి కొనసాగింపును సమర్థించే వారి వాదన ఇది. సమాజంలో ఇప్పటికీ కొన సాగుతున్న ప్రత్యక్ష–పరోక్ష వివక్షను సమర్థంగా ఎదుర్కొనే ప్రతిచర్యే ఈ రిజర్వేషన్లని వీరంటారు. ఆర్థిక స్థితిగతుల్ని బట్టి రిజర్వేషన్లు కల్పించాలనే వాదనను వీరు వ్యతిరేకిస్తారు. వామపక్షీయులు దీనికి ప్రధాన మద్దతుదా రులు. రాజ్యాంగ నిర్మాణ సమయంలోనూ ఈ చర్చ విస్తృతంగా సాగి, సామాజిక వర్గాల వారిగా రిజర్వేషన్లు కల్పించడానికే నాటి పెద్దలు మొగ్గారు. ఇది సున్నితమైన అంశమని, ఒకవైపు సమసమాజ స్థాపన మరోవైపు కుల నిర్మూలన... పరస్పర విరుద్ధ ప్రయోజనాల్ని నెరవేర్చాల్సి ఉంటుం దనేదీ వారి ఎరుకలోని అంశమే! రాజ్యాంగ నిర్మాణ కమిటీలో మెజారిటీ అగ్రవర్ణ ప్రముఖులే ఉన్నప్పటికీ నిర్ణయం అలా జరిగింది. రిజర్వేషన్ల వర్తింపునకు కేవలం ఆర్థిక స్థితిగతులు ప్రాతిపదిక కారాదనే వారలా నిర్ణయించారు. ‘రాజ్యాంగ స్ఫూర్తి’ని ఎక్కడ్నుంచి తీసుకోవాలి? రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అయినప్ప టికీ సుప్రీంకోర్టు పరిమితి విధించింది. రాజ్యాంగ అధికరణాలు 15 (4), 16 (4)ను ఉటంకిస్తూ ‘ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు ఈ మాట చెప్పింది. అప్పట్నుంచి ఎవరు, ఏ వర్గానికి రిజర్వేషన్లు పెంచాలన్నా, కొత్తగా కల్పించాలన్నా పరిమితికి లోబడాల్సి వస్తోంది. అన్ని రిజర్వేషన్లు కలిపి 50 శాతం దాటకుండా ఉండటం హేతు బద్దమని చెప్పిందే కానీ, అది 50 శాతమే ఎందుకో? ఏ 40 శాతమో, 60 శాతమో ఎందుకు కాకూడదో సుప్రీంకోర్టు చెప్పలేదు. దీనిపై వివిధ స్థాయిల్లో లోతైన చర్చలే జరిగాయి. ఈ పరిమితిపై ఎన్నో అనుకూల, ప్రతి కూల వాదనలు వస్తున్నాయి. రాజ్యాంగంలోని ఏ అంశం ఈ ‘పరిమితి’ని నిర్దేశిస్తుందో న్యాయస్థానం చెప్పలేదు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ పరిమి తిని దాటాయి. ఇంకొన్ని రాష్ట్రాలు దాటేలా కొత్తగా రిజర్వేషన్లు ప్రతిపాదిస్తు న్నాయి. అందులో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. తమిళనాడు ఈ పరి మితిని దాటి రిజర్వేషన్లు (69శాతం) కల్పించినా ఒక ప్రత్యేక చర్య ద్వారా అవి చెల్లుబాటయ్యేలా చేసుకోగలిగింది. సుప్రీంకోర్టు విధించిన పరిమితిని దాటొద్దని మద్రాస్ హైకోర్టు తిరస్కరించినపుడు, నాటి ముఖ్యమంత్రి జయ లలిత ప్రభుత్వం కేంద్ర సహకారంతో, న్యాయసమీక్షకు ఆస్కారం లేని విధంగా రాజ్యాంగాన్ని సవరింపజేసి, ఈ అంశాన్ని 9వ షెడ్యూల్లో పెట్టుకు న్నారు. ‘అయినా మేం సమీక్షిస్తాం, సమీక్షించగలమ’నే అర్థం వచ్చేలా ఒక సందర్భంలో సుప్రీం పేర్కొంది. ఇక ఈ అవకాశం తర్వాత ఏ ఇతర రాష్ట్రా లకూ కేంద్రం కల్పించలేదు. ఇప్పుడు స్వయంగా కేంద్రమే మరోమార్గంలో సుప్రీంకోర్టు విధించిన ఈ ‘పరిమితి’ని దాటేందుకు నిర్ణయించింది. న్యాయస్థానం అంగీకరించేనా? పేదలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుజా గ్రత్తతో వ్యవహరించింది. పార్లమెంటులో సదరు బిల్లు తీసుకురావడానికి ముందే రాజ్యాంగ సవరణకు సిద్దపడింది. దీన్ని ప్రత్యర్థి రాజకీయ పక్షాలేవీ వ్యతిరేకించలేవనే ధీమాతో సభల్లో అసరమైన మెజారిటీపై సందేహించ లేదు. అంతా అనుకున్నట్టే జరిగింది. కానీ, దీన్ని సుప్రీంకోర్టు అంగీకరి స్తుందా అన్నదే ప్రశ్న! రాజ్యాంగ అధికారణాలు 15, 16 ను సవరించడం ద్వారా కేంద్రమీ భూమిక సిద్దం చేసింది. ‘సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన...’ (అ:15) అన్న పదజాలానికి ‘ఆర్థికంగా వెనుకబడిన...’ అన్న పదాల్ని జతపరుస్తూ సవరణ ప్రతిపాదించారు. ఇంకోచోట ‘ఎస్సీ, ఎస్టీలు...’ (అ:16) అన్న మాటలకు ‘ఈబీసీలు’ అనే పదం చేర్చడం మరో సవరణ. రాజ్యాంగాన్నే సవరిస్తున్నాం కనుక ఇప్పుడు సుప్రీం అభ్యంతరం చెప్పదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అంటున్నారు. ‘అదేం కుదరదు, మాటల సవరణతో మాయజేసి, రిజర్వేషన్లను 50 శాతం దాటించి, రాజ్యాంగ స్ఫూర్తికే భంగం కలిగించారని సుప్రీంకోర్టు కొట్టివేయవచ్చ’నేది ప్రత్యర్థుల వాదన. అధికరణం 368 కింద ఇలాంటి మార్పులు చేసే అధి కారం పార్లమెంటుకు ఉందని ప్రభుత్వం చెబుతోంది. అలా చేసే ఏ సవరణ యినా, రూపొందించే ఎలాంటి చట్టమైనా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉండొద్దని, రాజ్యంగ మౌలిక స్వరూప–స్వభావాల్ని మార్చకూడదని ‘కేశ వానంద భారతి– కేరళ ప్రభుత్వం’ కేసులో 13 మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పిచ్చింది. ఇక్కడ రిజర్వేషన్ల ప్రాతిపదిక సామాజిక వర్గాల వారిగా కాకుండా ఆర్థిక స్థితిగతుల ప్రాతిపదికన చేయడం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడమేనని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పాలక పక్షం దీన్ని ఖండిస్తోంది. ‘‘ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా సమాన అవకాశాలు కల్పించాలి’’ అన్నది రాజ్యాంగ పీఠికలోనే ఉందని, తామదే చేస్తున్నామని ప్రభుత్వ వాదన. మళ్లీ తెరపైకి క్రీమీ లేయర్? అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ లబ్దిదారుల ఎంపికకు నిర్ణయించిన సంపద పరిమితులే విస్మయం కలిగిస్తున్నాయి. ఇది కొత్త వివాదానికి దారి తీసే అవకాశముంది. అయిదెకరాలకు పైబడి భూమి, 8 లక్షలకు మించి వార్షికా దాయం, నగరాల్లో 1000 చదరపు అడుగులకు మించి నివాసస్థలం ఉన్న వారు అర్హులు కారనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అంటే, ఆయా పరిమితులకు లోబడి సంపద కలిగిన వారంతా ఈ 10 శాతం రిజర్వేషన్లకు అర్హులే! ఇంత ఉదారంగా సంపద పరిమితిని విధించి, ‘ఆర్థి కంగా వెనుకబడినవారి’గా అగ్రవర్ణాల్లోని అత్యధికుల్ని (80–90 శాతం) ప్రసన్నం చేసుకోవాలనే వ్యూహం కనబడుతోంది. గత కొన్ని సంవత్సరా లుగా జాట్లు, పటేళ్లు, మరాఠీలు, కాపులు తమకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నారు. బీజేపీకి గట్టి మద్దతుదారు లైన అగ్రవర్ణాలూ క్రమంగా దూరమౌతున్నాయని ఇటీవలి 3 రాష్ట్రాల ఎన్ని కల ఫలితాల విశ్లేషకులు తేల్చారు. సదరు వర్గాల్ని ప్రసన్నం చేసుకునేందుకే ఈ ఎత్తుగడ అని ప్రత్యర్థుల ఆరోపణ. ఉదారపరిమితి వల్ల కోటా మిగిలి పోవడమనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. దళిత, వెనుకబడిన వర్గాలతో పోల్చి చూస్తే చాలా రాష్ట్రాల్లో అగ్రవర్ణాల జనాభా తక్కువ. మొన్నటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం తెలంగాణాలో వీరి జనాభా 9 శాతమే! ఒడిశాలో 6 శాతాన్ని మించదు. అంత తక్కువ శాతం జనాభాలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం, సంపద పరిమితికి ఉదారమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. కొన్ని విద్యాసంస్థల్లో దళిత, ఓబీసీ రిజర్వు సీట్లు నిండటం లేదు. ఒక వైపు ఏడున్నర ఎకరాల పొలం, నెలకు 65 వేల రూపాయల జీతం, నగరంలో 1000చ.అ లవిస్తీర్ణపు ఇల్లూ ఉన్న అగ్రవర్ణపు వారికి రిజ ర్వేషన్తో సర్కారు కొలువు ఖాయమై, అక్కడే ఒక దళితుడికో, బీసీకో కోటా నిండి ఉద్యోగం దొరక్కపోతే ఆర్థిక సమానత్వం సాధ్యమా అన్న ప్రశ్న తలెత్త వచ్చు! జనాభా ప్రాతిపదిక (దామాషా పద్దతి)న రిజర్వేషన్ల డిమాండ్ పెరిగే ఆస్కారముంది. దళిత, వెనుకబడిన వర్గాల్లో సంపన్నుల సంగతేమిటనే ప్రశ్న తెరపైకి వస్తుంది. ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు ఒక్క అగ్ర వర్ణాలకేనా? దళిత, వెనుకబడిన వర్గాల్లోనూ సంపన్న వర్గాల (క్రీమీ లేయర్) రిజర్వేషన్‌ను కట్టడి చేయాలనే డిమాండ్ తెరపైకి రావచ్చంటు న్నారు. ఎస్సీల్లో ఎ.బి.సి.డి వర్గీకరణకు ఒత్తిడి పెరిగే ఆస్కారమూ ఉంటుం దనే వాదన ఉంది. తాజా ప్రతిపాదన ఒక చర్చనైతే లేవనెత్తింది. పర్యవసానాలు వేచి చూడాల్సిందే! ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఈబీసీ బిల్లుపై సుప్రీంలో పిల్
సాక్షి, న్యూఢిల్లీ : అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈబీసీ బిల్లును సవాల్ చేస్తూ గురువారం భారత అత్యున్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. రిజర్వేషన్లకు ఆర్థిక ప్రమాణాలే ఏకైక ఆధారం కాదని, పార్లమెంట్ ఆమోదించిన బిల్లును కొట్టివేయాలంటూ యూత్ ఫర్ ఈక్వాలిటీ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లుకు న్యాయపరమైన అడ్డంకులు తప్పవని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ పిల్ దాఖలవడం విశేషం. (రాజ్యసభ ముందుకు ఈబీసీ బిల్లు.. విపక్షాల ఆందోళన) ఇక దశాబ్దాలుగా ఉన్న డిమాండ్‌కు తలొగ్గుతూ అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఈనెల 7న ఆమోదం తెలిపగా.. 8న లోక్‌సభ, 9న రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈబీసీ బిల్లుపై ఉభయ సభల్లో వాడివేడి చర్చ జరిగిన విషయం తెలిసిందే. (అగ్రవర్ణ పేదలకు 10% కోటా) చదవండి: పేదల కోటాకు ‘పెద్దల’ ఆమోదం -
‘మోదీని అడుగుపెట్టనివ్వం’
గువహటి: పౌరసత్వ (సవరణ) బిల్లును లోక్‌సభ ఆమోదించడంపై అస్సాంలో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. అనేక చోట్ల ప్రజలు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, కళాకారులు, సాహితీవేత్తలు, మేధావులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉన్న అస్సాం గణపరిషత్ (ఏజీపీ)కి చెందిన మంత్రులు బుధవారం తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రభుత్వం నుంచి ఏజీపీ రెండ్రోజుల క్రితమే బయటకు రావడం తెలిసిందే. బుధవారం పలుచోట్ల ఆందోళనకారులు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి సోనోవాల్ తదితరుల దిష్టిబొమ్మలను కాల్చారు. సచివాలయాన్ని ముట్టడించారు. మోదీ, ఇతర కేంద్ర మంత్రులను అస్సాంలో అడుగుపెట్టనివ్వబోమనీ, అలాగే ముఖ్యమంత్రి, ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్రంలో ఎక్కడా సభలు, ర్యాలీలు నిర్వహించకుండా అడ్డుకుంటామని కృషక్ ముక్తి సంగ్రామ సమితి అధ్యక్షుడు అఖిల్ గొగోయ్ ప్రకటించారు. 70 సంస్థలు సచివాలయం వద్ద ఆందోళనలు చేశాయి. -
పేదల కోటాకు ‘పెద్దల’ ఆమోదం
న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిం చే బిల్లు చట్టరూపం దాల్చేందుకు మరింత చేరువైంది. 124వ రాజ్యంగ సవరణ పేరిట తెచ్చిన ఈ బిల్లుకు బుధవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో 165 మంది సభ్యులు అనుకూలంగా, ఏడుగురు వ్యతిరేకంగా ఓటేశారు. మంగళవారం లోక్‌సభలో ఈ బిల్లు 323–3 తేడాతో నెగ్గిన సంగతి తెలిసిందే. రెండు రోజుల వ్యవధిలో రెండు సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లు తదుపరి దశలో రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, సున్నితమైన రిజర్వేషన్ల అంశంలో ప్రతిపక్షాలు సహకరించడంతో ఈ బిల్లు పార్లమెంట్ అడ్డంకిని అధిగమించింది. లోక్‌సభలో మాదిరిగానే రాజ్యసభలోనూ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విపక్షాలు అంతిమంగా అనుకూలంగానే ఓటేశాయి. ప్రతిపక్షాలు సూచించిన పలు సవరణలు వీగిపోయాయి. బిల్లు రాజ్యాంగబద్ధతపై సందేహాలు వ్యక్తం చేసిన విపక్షాలు..ఈ చట్టం అమలులో సంక్లిష్టతలు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. జనసంఖ్యకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించకుండానే కేంద్రం హడావుడిగా ఈ తతంగాన్ని ముగించిందని ఎండగట్టాయి. బిల్లుపై ఓటింగ్ మొదలయ్యాక సభ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), సీపీఐలు వాకౌట్ చేశాయి. సెలక్ట్ కమిటీ పంపాలని విపక్షం డిమాండ్ సామాజిక న్యాయ మంత్రి థావర్‌చంద్ గహ్లోత్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా,రాత్రి 11 గంటల వరకు సుదీర్ఘ చర్చ జరిగింది. అంతకుముందు, ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు పట్టుపట్టడంతో కొంతసేపు రభస చోటుచేసుకుంది. కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి వెళ్లారు. బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయ్ గోయల్ ఆరోపించారు. బిల్లుకు కాంగ్రెస్ అనుకూలంగానే ఉందని, కానీ దాన్ని ప్రవేశపెట్టిన విధానంలోనే అభ్యంతరాలున్నాయని కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ అన్నారు. బిల్లును హడావుడిగా తీసుకురావాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ మరో సభ్యుడు ముధుసూదన్ మిస్త్రీ ప్రశ్నించారు. బిల్లు ఉద్దేశాల్ని అందులో పేర్కొనలేదని, నిబంధన ఉల్లంఘన జరిగిందని ఆరోపించారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పం పాలని, తాను ప్రతిపాదించిన సవరణల్ని పరిశీలించాలని డీఎంకే ఎంపీ కనిమొళి డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌ను కోరారు. కాంగ్రెస్ ఎంపీలతో పాటు సీపీఐ సభ్యుడు రాజా ఆమెకు మద్దతుగా నిలిచారు. ‘నోట్లరద్దు’ మాదిరే అవుతుంది: సిబల్ సభ తిరిగి ప్రారంభమయ్యాక మొదలైన చర్చలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ మాట్లాడుతూ.. అగ్రవర్ణాల కోటా బిల్లును కేంద్రం శ్రద్ధ పెట్టకుండా తీసుకొచ్చిందని, న్యాయపర అడ్డంకులు తప్పవని అన్నారు. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొంది చట్టరూపం దాల్చిన తరువాత కూడా నోట్లరద్దు మాదిరిగా అమలులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అగ్రవర్ణ పేదలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం ప్రభుత్వం వద్ద లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు. ‘బిల్లును ఉన్న పళంగా హడావుడిగా తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అన్ని ఒక్కరోజులోనే చేయాలనుకోవడం సబబేనా? ఎలాంటి సమాచారం లేకుండానే బిల్లును తీసుకొచ్చారు. కోటా పారామితుల్ని నిర్ధారించే ముందు ఏదైనా నివేదిక రూపొందించారో? లేదో? చెప్పండి. బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేముందు సెలక్ట్ కమిటీకి పంపి సభ్యుల సూచనలు, అభిప్రాయాలు తీసుకోవాల్సింది’ అని సిబల్ అన్నారు. బిల్లును రూపొందించే ముందు వేర్వేరు కులాలు, వర్గాలకు చెందిన జనసంఖ్య సమాచారాన్ని కేంద్రం సేకరించిందా? అని ప్రశ్నించారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మండల్ కమిషన్ సిఫార్సును సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతిని ప్రస్తావించారు. తాజా బిల్లులో రాజ్యాంగ సంబంధ సంక్లిష్ట విషయాలున్నాయని, శ్రద్ధపెట్టకుండా రూపొందించి, సెలక్ట్ కమిటీకి పంపకుండా నేరుగా పార్లమెంట్ ముందుకు తెచ్చారని ఆరోపించారు. చిరస్మరణీయ రోజు: గహ్లోత్ జనరల్ కేటగిరిలో పేదలందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా తాజా బిల్లు గొప్ప ముందడుగు అని కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌చంద్ గహ్లోత్ అన్నారు. హడావుడిగా ఈ బిల్లును తీసుకురాలేదని, కోటా ప్రయోజనాలు అందకుండా దూరంగా ఉన్న పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తాము రూపొందించామని చెప్పారు. కోట్లాది మంది పేదలకు లబ్ధి చేకూర్చే ఈ బిల్లు ఆమోదం పొందిన రోజు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. ఇది సామాజిక న్యాయ విజయం: మోదీ కోటా బిల్లును పార్లమెంటు ఆమోదించడం సామాజిక న్యాయ విజయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం అభివర్ణించారు. దేశం మార్పువైపు పయనిస్తున్న తరుణంలో ఈ బిల్లు వల్ల యువత ఆ మార్పులో భాగమై అభివృద్ధికి దోహదపడగలరని అన్నారు. ఈ బిల్లుకు ఇంతటి మద్దతు లభించడం తనకు ఆనందం కలిగించిందని ట్విట్టర్లో చెప్పారు. ఈ బిల్లును ఆమోదించడం ద్వారా రాజ్యాంగ నిర్మాతలకు, స్వాతంత్య్ర సమరయోధులకు పార్లమెంటు నివాళి అర్పించిందన్నారు. దేశం మార్పువైపు పయనిస్తున్న తరుణంలో ఈ బిల్లు వల్ల యువత అందులో భాగమై అభివృద్ధికి దోహదపడగలదు. ఈ బిల్లుకు ఇంతటి మద్దతు లభించడం నాకు ఆనందం కలిగించింది. బిల్లును ఆమోదించడం ద్వారా రాజ్యాంగ నిర్మాతలకు, స్వాతంత్య్ర సమరయోధులకు పార్లమెంటు నివాళి అర్పించింది – ట్విట్టర్లో ప్రధాని మోదీ అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్రం శ్రద్ధ పెట్టకుండా తీసుకొచ్చింది. బిల్లుకు న్యాయపరమైన అడ్డంకులు తప్పవు. ఇది పార్లమెంటు ఆమోదం పొంది చట్టరూపం దాల్చిన తరువాత కూడా నోట్ల రద్దు మాదిరిగా అమల్లో ఇబ్బందులు తప్పవు. అగ్రవర్ణ పేదలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం ప్రభుత్వం వద్ద లేకపోవడమే ఇందుకు కారణం – కపిల్ సిబల్ ఈ కోటా ముందున్న సవాళ్లు ఏంటి? ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు(ఈబీసీ) పది శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టమయ్యాక న్యాయ సమీక్షకు నిలవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోటా అమలును అడ్డుకునేందుకు ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రిజర్వేషన్లపై గతంలో విధించిన 50% పరిమితిని తొలగించేందుకు సుప్రీంకోర్టు అంగీకరిస్తే అన్ని రాష్ట్రాలూ తమ పరిధిలోని రిజర్వేషన్లను, తమ రాజకీయ ప్రయోజనాల కోసం భారీగా పెంచుకోవడానికి సిద్ధమవుతాయి. ఒకవేళ కోటాల గరిష్ట పరిమితి 50 శాతం మించడాన్ని సుప్రీం తిరస్కరిస్తే అగ్రవర్ణ పేదల కోటాను అమలు చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటాను తగ్గించాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఈ 10% ఈబీసీ కోటాను ప్రస్తుతమున్న 50 శాతంలోనే చేర్చాల్సి ఉంటుంది. దాన్ని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తాయి. అగ్రకులాలన్నింటికీ మేలు జరిగేనా? పది శాతం కోటాను అగ్రవర్ణాలకు చెందిన వారు సమర్థిస్తారు. ఈ కొత్త కోటా అగ్ర కులాల ప్రజలను కాషాయ పక్షం వైపు మళ్లేలా చేయవచ్చు. అయితే, దీని వల్ల బీజేపీకి ఏ స్థాయిలో రాజకీయ ప్రయోజనం చేకూరుతుందో చెప్పలేం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రస్తుతమున్న 50 శాతానికి అదనంగానే ఈబీసీ పది శాతం కోటా ఉంటుందని కేంద్రం చెబుతున్నా.. కోటా గరిష్ట పరిమితిని పెంచడానికి సుప్రీం నిరాకరిస్తే తమ కోటా వాటా తగ్గిపోతుందని వారు ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. ఆర్థిక ప్రాతిపదికను రాజ్యాంగం ఆమోదిస్తుందా? ఎంతో కాలంగా సాంఘికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా (ఈ మూడు విధాలా) అన్యాయానికి గురైన వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగం, న్యాయస్థానాలు చెబుతున్నాయి. పేదరికం అనేది సామాజిక, వ్యవస్థాపరమైన అణచివేత కిందకు రాదని కూడా రాజ్యాంగం ప్రకటిస్తోంది. కొన్ని వర్గాల ప్రజలకు కోటా అమలుకు రాజ్యాంగంలో మార్పులు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. కాని చట్ట సవరణ ద్వారా రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చడానికి అధికారం లేదు. రాజ్యాంగంలో సమానత్వ సూత్రం అమలుకు రిజర్వ్డ్ సీట్లు, ఓపెన్ కేటగిరీ సీట్లు చెరి సగం ఉండేలా కోటా పరిమితిని 50 శాతంగా సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ సమానత్వం కాపాడే ఏర్పాటును రాజ్యాంగంలోని మౌలిక సూత్రంగా పరిగణిస్తున్నారు. 50 శాతానికి పైన అదనంగా పది శాతం కోటా ఇవ్వడం అంటే సమానత్వ సూత్రాన్ని ఉల్లంఘించడంగా పలువురు భావిస్తున్నారు. ఈ కారణంగా ఈబీసీ కోటా చట్ట రూపంలోకి వచ్చి అమలు జరిగితే దానిపై కోర్టుల్లో వివాదాలు తలెత్తే అవకాశాలున్నాయి. ఈబీసీ కోటా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో జనరల్ కేటగిరీలోని పేద వర్గాలను ఎంత వరకు ప్రభావితం చేస్తుందో వేచిచూడాలి. 50 శాతం దాటకూడదని రాజ్యాంగంలో లేదు: ప్రసాద్ వెనుకపడిన వర్గాల(బీసీ) రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలపై తాజాగా రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లు ఎలాంటి ప్రభావం చూపదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 124వ రాజ్యాంగ సవరణ ప్రకారం తీసుకొస్తున్న ఈ చట్టం కేంద్రం, రాష్ట్రాలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాజ్యసభలో బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ..‘రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. దీన్ని సుప్రీంకోర్టు మాత్రమే చెప్పింది. తాజాగా ఈబీసీ బిల్లులో భాగంగా మేం ప్రాథమిక హక్కుల్లోని రెండు ఆర్టికల్స్‌ను సవరిస్తున్నాం. రాజ్యాంగంలోని 15వ ఆర్టికల్‌కు ఆర్థికంగా వెనుకపడిన వర్గాలను నిర్వచించేలా ఓ క్లాజ్‌ను జతచేస్తున్నాం. అలాగే ఆర్టికల్ 16లో ఎస్సీ,ఎస్టీలతో పాటు వీరికి రిజర్వేషన్ కల్పించేలా ఆరో క్లాజును చేరుస్తున్నాం. తద్వారా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లో ఈబీసీలకు అవకాశం లభిస్తుంది. ఈబీసీ రిజర్వేషన్ బిల్లు ప్రత్యేకత ఏంటంటే ఎస్సీ,ఎస్టీ, బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్‌పై దీని ప్రభావం ఏమాత్రం ఉండదు’ అని ప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రాలకు ముందుగా తెలియజేయకుండా ఈ బిల్లును లోక్‌సభలో ఎందుకు ప్రవేశపెట్టారన్న డీఎంకే ఎంపీ కనిమొళి ప్రశ్నకు స్పందిస్తూ.. ఆర్టికల్ 368 కింద రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు బిల్లు రాష్ట్ర విధానసభకు వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. బుధవారం రాజ్యసభలో ఆందోళన చేస్తున్న విపక్ష పార్టీల సభ్యులు -
ఈబీసీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లు బుధవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 149 ఓట్లు వచ్చాయి. బిల్లుకు వ్యతిరేకంగా 7 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ సమయంలో రాజ్యసభలో 156 మంది సభ్యులున్నారు. బిల్లుకు దాదాపు అన్ని పార్టీలూ మద్దతు తెలిపాయి. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలిపిన సంగతి తెల్సిందే. నేడు రాజ్యసభలో కూడా ఆమోదం పొందడంతో బిల్లును రాష్ట్రపతి సంతకం కోసం పంపించనున్నారు. రాష్ట్రపతి సంతకం తర్వాత బిల్లు అమల్లోకి వస్తుంది. -
రాజ్యసభకు ఈబీసీ బిల్లు.. విపక్షాల ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన ఈబీసీ బిల్లును రాజ్యసభ ముందుకు తీసుకువచ్చారు. మంగళవారం లోక్‌సభలో ఆమోదం పొందిన ఈబీసీ బిల్లును కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లట్ ఎగువ సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో సునాయాసంగా ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభలో మాత్రం కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది. బిల్లును పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, బిల్లును పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కీలకమైన బిల్లుపై చర్చించేందుకు తగిన సమయం లేదని, ఇంత హడావిడిగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏంటని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ లబ్ధికోసమే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు బిల్లును తీసుకువచ్చిందని విపక్ష సభ్యులు పోడియం ముందు ఆందోళనకు దిగారు. బిల్లుపై చర్చించిన డీఎంకే సభ్యురాలు కనిమొళి పలు సవరణలు కోరారు. ఈబీసీ బిల్లుపై గెహ్లట్ మాట్లాడుతూ.. సామాజిక సమనత్వం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. సభ్యుల ఆందోళనతో సభను రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. సభ ప్రారంభమైన అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బిల్లుపై ప్రసంగించనున్నారు. కాగా 124వ రాజ్యాంగ సవరణకు లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాజ్యసభ కూడా 2/3 వంతు మెజార్టీతో ఆమోదం తెలిపితే బిల్లు చట్టరూపం దాల్చనుంది. -
రిజర్వేషన్లపై అధికారం మాకే అప్పగించండి
సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వేషన్లను పెంచుకునే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెట్టాలని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆర్థిక వెనకబాటు రిజర్వేషన్ల బిల్లుపై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఈ బిల్లును టీఆర్ఎస్ స్వాగతిస్తోంది. సమాజం సమ్మిళితంగా, బలోపేతంగా ఉండేలా చేసే అన్ని మార్గాలను మేం స్వాగతిస్తాం. ఈ బిల్లుద్వారా ఆర్థికంగా వెనకబాటుకు గురైన వారికి మేలు జరుగుతుంది. కులప్రాతిపదికన వెనకబాటు తనం, ఆర్థిక వెనకబాటు తనం రెండూ వేరువేరని ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం చెబుతోంది. ఆర్థికంగా వెనకబాటు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? స్వతంత్ర భారతంలో కూడా ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించకపోవడం, సాగునీరు, విద్యుత్తు, వ్యవసాయ సాయం కల్పించకపోవడం వల్ల ఆర్థిక వెనకబాటుతనం ఏర్పడింది. అది కాంగ్రెస్ పార్టీ కావొచ్చు.. బీజేపీ కావొచ్చు. పాలనలో ఎవరున్నా.. సగటు మనిషి గురించి ఆలోచించకుండా పైచేయి కోసమే ప్రయత్నించారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఆర్థిక వెనకబాటు తనం అనే పదం వెలుగులోకి వచ్చింది. రిజర్వేషన్లు లభించక, మౌలిక వసతులు సమకూరక కొన్ని వర్గాలు ఆర్థికంగా వెనుకబాటుకు గురయ్యాయి. ఏపీ విభజన అనంతరం తెలంగాణలో సామాజిక సమీకరణాలు మారాయి. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలు 8% ఉండగా.. ప్రత్యేక రాష్ట్రంలో 12 శాతంగా ఉన్నారు. ఎస్టీలు ఉమ్మడి రాష్ట్రంలో 6% ఉండగా.. తెలంగాణ ఏర్పాటయ్యాక వారి సంఖ్య 10%కు పెరిగింది. ఈ మార్పుల వల్ల తెలంగాణ సర్కారు 2017లో ముస్లింలకు 12%, గిరిజనులకు 10% రిజర్వేషన్లు పెంచుతూ చట్టం తెచ్చింది. దీన్ని కేంద్రం వ్యతిరేకిస్తోంది. మరోసారి కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని తీసుకొస్తున్నాం. దేశంలో ఒకే చట్టం ఉండాలి. తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఉన్నాయి. షెడ్యూలు 9లో ఈ అంశాన్ని చేర్చారు. రిజర్వేషన్లు పెంచుకునే అధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకే కట్టబెట్టాలి. జనాభా దామాషా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంది. అందువల్లే ఈ డిమాండ్ కోసం మేం పార్లమెంటులో పోరాటం చేశాం. కేంద్రం వద్ద ఈ అధికారాన్ని పెట్టుకుంటే రాష్ట్రాల్లోని జనాభా దామాషా మేరకు వారికి న్యాయం జరగదు. ఈ బిల్లును స్వాగతిస్తూనే కొన్ని సవరణలు ప్రతిపాదిస్తున్నాం’అని ఆయన పేర్కొన్నారు. అయితే చర్చ అనంతరం సామాజిక న్యాయ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ సమాధానంలో జితేందర్ రెడ్డి లేవనెత్తిన అంశాలను ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో ఆయన లేచి మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. అంతలోనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ వెంటనేVఆ బిల్లుపై ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. -
రిజర్వేషన్లు అంతిమ లక్ష్యం కాదు
అగ్రవర్ణ పేదలకు విద్యా, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం విశేషం. లోక్‌సభ సమావేశాల చివరిలో, రాజ్యసభ సమావేశాల్ని కొంత పొడిగించి మరీ ఈబీసీ రిజర్వేషన్ బిల్లుని చట్టంగా మార్చాలని తలపోస్తున్నారు. పార్లమెంటు ప్రభుత్వ నిర్ణయాన్ని, రాజ్యాంగ సవరణపై ఎలా స్పందిస్తుందో చూడాలి. రాజ్యాం గంలో రిజర్వేషన్ హక్కు సామాజిక వివక్ష, అణచివేత నేపధ్యం ప్రాతిపదికన ఇవ్వబడింది కానీ పేదరికం ప్రాతిపదికన కాదు. వెనకబడిన వర్గాలకు కూడా ఆ వెసులుబాటు సామాజికపరమైన, విద్యాపరమైన వెనుకబాటు ముఖ్య ప్రాతిపదికన తప్పితే ఆర్ధికపరమైన ప్రాతిపదికన లభించలేదు. అందుకనే అగ్రవర్ణ పేదలకు ఆ రక్షణ కల్పించాలంటే ముందుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 15,16ల్లో ఆర్థికాంశం కూడా అర్హతగా చేర్చి సవరణ చెయ్యాలి. తరువాత అవరోధం సుప్రీం తీర్పు. గతంలో మండల్ కేసులో సుప్రీం తీర్పుననుసరించి రిజర్వేషన్లు మొత్తం ఏభై శాతం దాటకూడదు. ఇప్పుడీ చట్టం అమలైతే యాభై శాతం దాటిపోతుంది. ఇక పేదరికం ప్రాతిపదికగా అర్హత ఎలా నిర్ణయిస్తారు? ఒకే స్థాయి ఆదాయం కలిగిన ఇద్దరు వేర్వేరు వర్ణాల అభ్యర్థులు సమానమైన మార్కులతో పోటీ పడితే అందులో ఎవర్ని ఏ ప్రాతిపాదికన సెలెక్ట్ చేస్తారు? ఒక జిల్లాలో పదిహేను ఎకరాలున్నా, మరొక జిల్లాలో అరెకరం ఉండడం మంచి ఆర్ధిక స్థితి అయినప్పుడు, ఎకరాల లెక్క బట్టీ ఫలానా జిల్లా వాసిని అర్హుడని తేల్చడం న్యాయమౌతుందా? నకిలీ కులధృవ పత్రాలు సంపాదించి అడ్డదారిన ఫలాలు పొందడమే సులువైనప్పుడు, తప్పుడు ఆదాయం పత్రాలు సంపాదించడం కష్టమా! ఊళ్ళో పేద కన్నా పెద్దనే ఆలా ఫలితం పొందితే అడ్డుకోగలరా? రానురానూ ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. లక్షలాది ఉద్యోగాలు బ్యాక్లాగ్ ఉంటున్నాయి. విద్యలో కూడా ప్రయివేట్ సంస్థలే రాజ్యమేలుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో అందరి జీవితాలూ మెరుగవ్వడానికి, ఆర్ధికంగా ఎదగడానికి, ఎదిగే అవకాశాలు లభించడానికి, జరగాల్సిన కృషి చాలానే ఉంది. పేదరిక నిర్మూలన, సమగ్ర సామాజిక అభివృద్ధి అన్న పెద్ద లక్ష్యాల సాధన దిశగా రిజర్వేషన్ కల్పన అన్నది చిన్న అడుగు. అంతే తప్ప దానికదే లక్ష్యం కాదు. చిలకా శంకర్, హైదరాబాద్ -
ఈబీసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. లోక్‌సభలో ఆమోదంతో ఈబీసీ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రానుంది. 124వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోద ముద్ర పడింది. మూడింట రెండొంతులకు పైగా సభ్యులు ఈబీసీ బిల్లుకు మద్దతు తెలిపారు. సభలో ఉన్నవారిలో కేవలం ముగ్గురు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈబీసీ బిల్లు పాసైనట్లు ప్రకటించారు. అంతకుముందు సుమారు 5 గంటల పాటు ఈబీసీ బిల్లుపై చర్చ జరిగింది. పలు పార్టీల నేతలు బిల్లుపై అభ్యంతరాలు చెప్పినా...పంతంతో బీజేపీ బిల్లును నెగ్గించుకుంది . ఆర్థికంగా వెనకబడి అగ్రకులాల ప్రజలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సోమవారం మోదీ కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. చట్టబద్దత కోసమే ఆర్టికల్ 15,16లకు అదనపు క్లాజ్లు జోడించామని కేంద్రం తెలిపింది. అలాగే ఈబీసీల రిజరేషన్లకు సంబంధించిన అర్హత ధ్రువీకణలు రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. బిల్లు ఆమోదం పొందిన అనంతరం లోక్‌సభ నిరవధికంగా వాయిదాపడింది. -
ఈబీసీ బిల్లును స్వాగతించిన టీఆర్ఎస్
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లును తమ పార్టీ సమర్థిస్తుందని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. లోక్‌సభలో మంగళవారం రిజర్వేషన్ల రాజ్యంగ సవరణ బిల్లు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలస్యమైనా అగ్రవర్ణ పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ముస్లింలకు 12 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని గుర్తు చేశారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ అమలవుతున్న తీరుగా.. తెలంగాణలో కూడా రిజర్వేషన్ల పెంపునకు అనుమతించాలన్నారు. విభజన జరిగాక తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోందని తెలిపారు. -
అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ బిల్లుపై చర్చ
న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 124వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడానికే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా గెహ్లాట్ స్పష్టం చేశారు. అగ్రవర్ణ పేదలకు న్యాయం చేయడానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, రిజర్వేషన్లు కాకుండా వేర్వేరు మార్గాల్లో వారికి ఊరట కలిగించే ప్రయత్నాలు కూడా జరిగాయన్నారు. ఆర్థిక స్థోమత లేక, రిజర్వేషన్ల పరిధిలోకి రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని, సామాజిక సమానత్వం కోసమే ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సబ్కా సాత్.. సబ్కా వికాస్ నినాదాన్ని పరిపూర్ణం చేయడానికే.. ఈ రిజర్వేషన్ల రాజ్యంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టామన్నారు. రాజ్యాంగంలోని అధికరణం 15, 16లను సవరణలను ప్రతిపాదిస్తూ బిల్లును తీసుకొచ్చామన్నారు. ఇప్పటికే జరిగిన రాజ్యంగ సవరణలు ప్రభుత్వానికి కొంత వెసులుబాటు కలిగించాయన్నారు. తొందరపాటు చర్య : కాంగ్రెస్ ఎంపీ అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తొందరపాటుగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎంపీ కేవీ థామస్ అభిప్రాయపడ్డారు. ఈ తరహా నిర్ణయాలు.. అనేక సమస్యలకు దారి తీస్తాయన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు హయాంలో ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు తెచ్చారని, కానీ ఆ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు కొట్టేసిందని ఈ సందర్భంగా థామస్ గుర్తు చేశారు. ఆ అనుభవం దృష్ట్యా ఇందులో ఎన్నో చట్టపరమైన అంశాలున్నాయని తెలిపారు. ఎన్డీయేకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉందని, తొందరపాటుతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఎన్డీయే తప్పుల మీద తప్పులు చేస్తోందన్నారు. అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఈ రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారో చెప్పాలన్నారు. రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు : అరుణ్ జైట్లీ అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌తో న్యాయం జరుగుతోందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ రాజ్యంగ సవరణ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం అవసరం లేదన్నారు. ఈబీసీ రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగ సవరణకు ఎలాంటి ఇబ్బందుల్లేవని, దేశంలోని పేదలకు మేలు చేసేందుకే ఈ బిల్లు తీసుకొచ్చామన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకే తమ ఈ ప్రయత్నమని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారిని పైకి తీసుకురావాలన్నదే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ అన్న అంశాన్ని 15వ అధికరణ క్లాజ్(5) సవరణ సమయంలోనే చేర్చారని, అదే ప్రకారం ఇప్పుడు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను కల్పించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. పీవీ హయాంలో ప్రత్యేక చట్టం ఏమీ చేయలేదని, అందుకే కోర్టు కొట్టివేసిందన్నారు. చాలా మంది రిజర్వేషన్లు 50శాతం దాటితే కోర్టు కొట్టివేస్తుందని అంటున్నారని, ఆ ఆందోళన నిజమే అయితే ఇప్పటివరకు రిజర్వేషన్లకు ఆర్టికల్ 15, 16 కల్పించిన వెసులుబాటులే మూలమని చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 16(4)లో కులాల ఆధారంగా రిజర్వేషన్ల ప్రస్తావన ఉందని జైట్లీ వెల్లడించారు. ఇదో రాజకీయ జిమ్మిక్కు: టీఎంసీ రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లు ఓ రాజకీయ జిమ్మిక్కనే అనుమానం కలుగుతోందని తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు కొట్టిపారేశారు. ఈ సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈబీసీ బిల్లు ఉద్దేశం మంచిది: శివసేన ఈబీసీ బిల్లును తీసుకొస్తున్న ఉద్దేశం చాలా మంచిదని, అన్ని రాష్ట్రాల్లోను రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్నారన్నారని శివసేన ఎంపీలు పేర్కొన్నారు. అర్హత ఉండి రిజర్వేషన్లు కోల్పోయిన వారికి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఇంత తొందరేంటి: ఏఐడీఎంకే ఈబీసీ బిల్లును తొందరగా తీసుకురావాల్సిన అవసరం ఏంటని ఏఐడీఎంకే ఎంపీ తంబిదురై ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయకపోవడం వల్లే ఇంకా పేదరికం ఉందని, 70 ఏళ్ల స్వాతంత్ర భారత్‌లో ఇంకా కుల వివక్ష ఉందన్నారు. ఈ రాజ్యంగ సవరణ బిల్లుకు ఉభయ సభల్లో 2/3 వంతు మెజార్టీ అవసరం కాగా.. ఈ నిర్ణయంతో రిజర్వేషన్లు 50 శాతం దాటనున్నాయి. ప్రస్తుతం అమలవుతున్నరిజర్వేషన్ల శాతం 49.5 శాతం కాగా.. ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5, బీసీలకు 27 శాతంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. -
‘బిల్లుకు మద్దతు తెలుపకపోతే కర్రు కాల్చి వాతపెడతారు’
సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక వెనుకబాటు ఆధారంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం చరిత్రాత్మక నిర్ణయమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ కొనియాడారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలన్నీ అగ్రవర్ణ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలుపకపోతే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు దశాబ్దాల డిమాండ్ అని సామాజిక వివక్షకు సంబంధించిన రిజర్వేషన్లతో పాటు ఆర్థిక వెనుకబాటు ఆధారంగా కూడా రిజర్వేషన్లు అవసరమన్నారు. ఈ సాహసోపేత నిర్ణయం అమలు చేసిన ఘనత మోదీనే అని తెలిపారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తుందని ఆరోపించారు. అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు అర్ధరహితమని పేర్కొన్నారు. అసదుద్దీన్ ది నోరా.. తాటి మట్టా? అని ఫైర్ అయ్యారు. సమాజంలోని అసమానతలు తొలగించడానికే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పేదలకు రిజర్వేషన్లు ఇస్తే కొందరు జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. అన్ని కోణాల్లో ఆలోచించి ఎలాంటి చిక్కులు రాకుండా ఉండే విధంగానే ఈ బిల్లు రూపొందించామని తెలిపారు. ఇది ముమ్మాటికీ ఎన్నికల స్టంట్ కాదని, కాన్షీరామ్ కూడా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇస్తామన్నారని గుర్తు చేశారు. మాయావతి, ములాయం కూడా అగ్రవర్ణ రిజర్వేషన్లు సమర్ధించారని తెలిపారు. కేసీఆర్ మతపరమైన రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెడితే బీజేపీ ఎమ్మెల్యేలుగా అడ్డుకున్నామని, ఆర్థిక ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరామని తెలిపారు. మేము ఆనాడు చెపితే కేసీఆర్ కు అర్థం కాలేదు, కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే పెరిగిన 10శాతం రిజర్వేషన్లు తెలంగాణలో అమలు చేయాలన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసి పెరిగిన రిజర్వేషన్లను అమలు పరచాలన్నారు. సామాజిక వివక్షను, ఆర్థిక వెనుకబాటును దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించారు. సిన్హా కమీషన్ నివేదిక పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. -
అగ్రవర్ణాలకు రిజర్వేషన్: ఎవరూ వ్యతిరేకం కాదు కానీ..!
సాక్షి, న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ఈ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదు.. కానీ సమగ్ర చర్చ జరిగే సమయం లేకుండా సభలో బిల్లును ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్రం నిర్ణయం ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఉందన్నారు. అగ్రకులాల వారికి రిజర్వేషన్లు ఇవ్వడంతో జనరల్ కేటగిరిలో తమకి స్థానం దక్కదని వేరే వాళ్లు అనుకుంటే ఇబ్బంధులు తలెత్తుతాయని హెచ్చరించారు. ఎన్నికల ముందు అగ్రకులాల పేదలకు తాయిలాలు ఇచ్చేలా కేంద్రం దీన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. సీబీఐ కేసులో సుప్రీం తీర్పు ప్రధాని మోదీ, సీవీసీ చౌదరికి చెంపపెట్టు అని అన్నారు. స్వతంత్ర సంస్థల్లో కేంద్రం జోక్యం మానుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. మోదీ నిరంకుశ పాలనకు ప్రజలు తగిన బుద్ది చెబుతారని అన్నారు. -
రిజర్వేషన్లు తలకిందులవుతాయా?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా రంగంలో తమకు కూడా రిజర్వేషన్లు కల్పించాలంటూ దేశవ్యాప్తంగా పటేళ్లు, ఠాకూర్లు, రాజ్‌పుత్‌లు, మరాఠాలు గత రెండు, మూడేళ్లుగా ఆందోళన చేస్తున్నా చలించని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనూహ్యంగా అకస్మాత్తుగా అగ్రవర్ణాల వారికి ఉద్యోగ, విద్యారంగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సోమవారం నాడు నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రానున్న 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్షాలు విమర్శించడంలో నిజం లేకపోలేదు. అగ్రవర్ణాల రిజర్వేషన్లకు సంబంధించి చట్టం తీసుకురావాలంటే రాజ్యాంగంలోని 15, 16 అధికరణల్లో సవరణలు తీసుకరావాలి. ముఖ్యంగా 15 అధికరణలోని నాలుగవ క్లాజ్‌ను సవరించాల్సి ఉంటుంది. ‘సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన తరగతుల పురోభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి రాజ్యాంగంలోని 29వ అధికరణలోని రెండో క్లాజ్ ఎంతమాత్రం అడ్డంకి కాదు’ అని 15వ అధికరణలోని నాలుగవ క్లాజ్ స్పష్టం చేస్తోంది. వెనకబడిన తరగతుల తర్వాత ‘అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన తరగతులు’ అన్న పదాలను చేరిస్తే సవరణ సరిపోతుంది. (అగ్రవర్ణ పేదలకు 10% కోటా) అయితే ఈ సవరణ అత్యున్నత న్యాయ స్థానం ముందు నిలబడుతుందా, లేదా ? అన్నదే ప్రధాన సమస్య. రిజర్వేషన్లు యాభై శాతానికి మించరాదని, మించితే రిజర్వేషన్ల ఉద్దేశమే దెబ్బతింటుందని 1992లోనే సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఏకపక్షంగా ఈ తీర్పు చెప్పిందంటూ ఆ తీర్పును లెక్క చేయకుండా తమిళనాడు రాష్ట్రం ప్రస్తుతం 69 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోంది. యాభై శాతానికి మించిన రిజర్వేషన్లు సబబేనంటూ నిరూపించుకునే డేటా ఉన్నట్లయితే మించినా ఫర్వాలేదని 2010లోనే సుప్రీం కోర్టు చెప్పింది. అందుకనే సుప్రీం కోర్టు తమిళనాడు రిజర్వేషన్లలో జోక్యం చేసుకోలేదు. ఆ మాటకొస్తే ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకపక్షంగానే నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రధాన, ప్రాంతీయ రాజకీయ పార్టీలకు రేపటి ఎన్నికల ప్రయోజనాలే ముఖ్యం కనుక కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని కాదనలేక పోతున్నాయి. అవి తీసుకొచ్చిన ‘టైమ్’నే ప్రశ్నిస్తున్నాయి. ఏది ఏమైన న్యాయస్థానం ముందు నెగ్గుతుందా, లేదా అన్నదే కోటి రూకల ప్రశ్న. దేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాల వారికి రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు వచ్చినవే కులాల ప్రాతిపదిక. ఆర్థికంగా వెనకబాటును పరిగణలోని తీసుకుంటే సమాజంలో అట్టడుగున జీవిస్తున్న ఎస్సీ,ఎస్టీ తరగతుల వారికి అన్యాయం జరుగుతుందన్న వాదనతో కులాలనే రిజర్వేషన్లకు ప్రాతిపదికగా తీసుకున్నారు. అందుకని ఎస్సీ, ఎస్టీలకు విద్యా, ఉద్యోగావకాశాల్లో 22.5 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఆ తర్వాత 1980లో మండల కమిషన్ సిఫార్సుల మేరకు ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తెచ్చారు. ఈ అంశం కూడా సుప్రీం కోర్టు ముందుకు వెళ్లగా, సమాజంలో వెనకబడిన తరగతులను గుర్తించేందుకు కులాలను ప్రాతిపదికగా తీసుకోవాలా లేదా ఆర్థిక వెనకబాటు తనాన్ని రిజర్వేషన్లకు ప్రాతిపదికగా తీసుకోవాలా? అన్న అంశం చర్చకు వచ్చింది. ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారు ఏయే కులాల్లో ఎంత శాతం మంది ఉన్నారో తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి డేటా లేకపోవడంతో సుప్రీం కోర్టు రాజ్యాంగ పరిషత్తులో రిజర్వేషన్లపై జరిగిన చర్చనే ప్రాతిపదికగా తీసుకుని తీర్పు చెప్పింది. ఈ న్యాయ ప్రక్రియ ముగియడానికి దాదాపు పదేళ్లు పట్టడంతో ఓబీసీ రిజర్వేషన్లు 1992 నుంచి అమల్లోకి వచ్చాయి. పలు కేసుల రూపంలో ఏదోవిధంగా సుప్రీం కోర్టు దృష్టికి ఈ రిజర్వేషన్ల అంశం తరచూ వస్తూనే ఉంది. ఇన్నేళ్ల తర్వాత కూడా కులాలను ప్రాతిపదికగా తీసుకోవాలా, ఆర్థికంగా వెనకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకోవాల? అన్న అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. దీన్ని తేల్చడానికి దేశంలో ఏయే వర్గాలు ఆర్థికంగా వెనకబడి ఉన్నాయో 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకొని డేటాను సమర్పించాల్సిందిగా కూడా కేంద్రాన్ని సుప్రీం కోర్టు కోరింది. అయితే ఆ డేటా తమ వద్దలేదని కేంద్రం చేతులు ఎత్తేసింది. 2021లో జరుగనున్న జనాభా లెక్కల్లో ఏయే కులాల వారు, ఏయే సామాజిక వర్గాల వారు ఎంతశాతం మేరకు వెనకబడి ఉన్నారో వివరాలను సేకరిస్తామని కేంద్రం తెలిపింది. మళ్లీ అదే ప్రాతిపదికపై చర్చ అగ్రవర్ణాల వారికి పదిశాతం రిజర్వేషన్ల బిల్లు చట్ట రూపం దాలిస్తే ఎవరో ఒకరు సుప్రీం కోర్టుకు వెళ్లడం ఖాయం. రిజర్వేషన్లకు కులాలను ప్రాతిపదికగా తీసుకోవాలా లేదా ఆర్థికంగా వెనకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలా? అన్న అంశం మళ్లీ చర్చకు రాక తప్పదు. ఇంతకుముందు నిమ్న కులాల వారికి కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చినందున అగ్రవర్ణాల వారికి ఆర్ధిక వెనకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం వాదించవచ్చు. మరి నిమ్న వర్గాల వారి రిజర్వేషన్ల కూడా ఆర్థిక వెనకబాటుతనాన్నే అమలు చేయవచ్చుకదా? అని సుప్రీం కోర్టు ఎదురు ప్రశ్నించవచ్చు. అప్పుడు అది మొత్తం రిజర్వేషన్ల వ్యవస్థనే తలకిందులయ్యేందుకు దారితీయవచ్చు. ఇంత పెద్ద తలనొప్పి ఇప్పుడే ఎందుకంటూ 2021 జనాభా లెక్కల వరకు నిరీక్షంచనూవచ్చు. ఏదేమైనా న్యాయ ప్రక్రియ ముగిసి అగ్రవర్ణాల వారికి రిజర్వేషన్లు అమల్లోకి రావడానికి కొన్నేళ్లు పడుతుందనడంలో సందేహం లేదు. అందుకనే మోదీ ప్రభుత్వం దృష్టిలో మూడేళ్ల నుంచే ఈ ప్రతిపదన పరిశీలనలో ఉన్న ఇప్పుడు తీసుకొచ్చింది. -
లోక్‌సభలో రిజర్వేషన్ల బిల్లు.. టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్..
సాక్షి, న్యూఢిల్లీ: అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లట్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు 124వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ముందుకు తీసుకువచ్చింది. బిల్లుపై చర్చించిన అనంతరం ఉభయ సభలు 2/3 వంతు మెజార్టీతో ఆమోదం తెలపాల్సి ఉంటుంది. లోక్‌సభలో బీజేపీ స్పష్టమైన మెనార్టీ ఉన్నందున బిల్లు సునాయాసంగా ఆమోదం పొందవచ్చు. అసలు పరీక్ష రాజ్యసభలో ఎదురుకానుంది. ఎగువ సభలో అధికార పక్షానికి సరిపడ బలం లేనందున విపక్షాలు పలు సవరణలు డిమాండ్ అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పట్టిన బిల్లుపై టీఆర్ఎస్ ఎంపీలు ఏవిధంగా వ్యవహరించాలో తెలంగాణ సీఎం కేసీఆర్ వారికి దిశానిర్ధేశం చేశారు. తెలంగాణ శాసనసభ ఆమోదించిన ముస్లిం, మైనార్టీ రిజర్వేషన్ల బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధంగా మోదీని కోరాలని సూచించారు. దీంతో ముస్లింలకు 12శాతం, ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్ల కొరకు టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. -
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లపై మాయావతి..
లక్నో: అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై బీఎస్పీ అధినేత్రి, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం మాయావతి స్పందించారు. వెనుకబడిన అగ్ర కులాల వారికి రిజర్వేషన్లు కల్పించడం మంచిదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు మాయావతి తెలిపారు. అయితే ఎన్నికల వేళ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాజకీయ గిమ్మిక్కుగా ఆమె వర్ణించారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని గతంలో ఆమె ఇచ్చిన హామీను గుర్తుచేశారు. కాగా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అగ్రవర్ణ కులాల ఓట్లకు గాలం వేసేందుకే రిజర్వేషన్ల అంశాన్ని మోదీ తెరపైకి తెచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా సంబంధిత బిల్లును కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లట్ నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అగ్రవర్ణ పేదలకు 10% కోటా -
అగ్రవర్ణ పేదలకు 10% కోటా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ : మరో నాలుగు నెలల్లో లోక్‌సభకు సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం సోమవారం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా ఉన్న డిమాండ్‌కు తలొగ్గుతూ అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జనరల్ కోటాగా ఉన్న 50 శాతం నుంచే మరో పది శాతాన్ని పక్కకు తీసి ఈ రిజర్వేషన్లు కల్పిస్తారు. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో మార్పు ఉండదు. అగ్ర కులాలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణల బిల్లును కేంద్రం మంగళవారమే పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ప్రభుత్వానికి ఇవే చివరి పూర్తిస్థాయి పార్లమెంటు సమావేశాలు కావడం గమనార్హం. ఇది బీజేపీ ఎన్నికల గిమ్మిక్కు అనీ, మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే జరగుతుందని భయపడి ఉన్నపళంగా రిజర్వేషన్లను తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్ విమర్శించింది. ఈ బిల్లును ఉభయసభలూ మూడింట రెండొంతుల ఆధిక్యంతో ఆమోదించాల్సి ఉంది. ఈ రిజర్వేషన్లు అమలైతే బ్రాహ్మణ, కమ్మ, కాపు, రాజ్‌పుత్, జాట్, మరాఠా, భూమిహార్ తదితర కులాల్లోని పేదలకు లబ్ధి చేకూరనుంది. కాపులు, మరాఠాలు, జాట్లు ఇటీవలి కాలంలో రిజర్వేషన్ల కోసం ఆందోళనలు నిర్వహించడం, అవి హింసాత్మకంగా మారడం తెలిసిందే. గతంలో ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం దాటకూడదు. మిగతా 50 శాతం సీట్లు, ఉద్యోగాలను పూర్తిగా ప్రతిభ ఆధారంగా (జనరల్ కోటా)నే భర్తీ చేయాలి. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలను మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్లా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తంగా 49.5 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లను మరో 0.5 శాతానికి మించి పెంచే వీలు లేదు. ఈ సమస్యను అధిగమించేందుకే కేంద్రం రాజ్యాంగ సవరణ చేపట్టనుంది. ఈ బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే మొత్తం రిజర్వేషన్ల శాతం దాదాపు 60కి చేరుతుంది. రాజ్యాంగంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ల గురించి ప్రస్తావనేదీ లేదు కాబట్టి అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి. అధికరణం 15, 16లను సవరించడం ద్వారా రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర మంత్రి ఒకరు మాట్లాడుతూ ‘బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించాక రాజ్యాంగాన్ని సవరించి, అగ్ర కులాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తాం. ప్రాథమిక హక్కులను అనుసరించి అగ్ర కులాల్లోని వారికి ఈ రిజర్వేషన్లు ఇస్తాం. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు నిబంధన.. రాజ్యాంగాన్ని సవరించకుండా పార్లమెంటును నిలువరించలేదు’అని చెప్పారు. పలువురు బీజేపీ నేతలు ఈ రిజర్వేషన్ల ప్రతిపాదనను స్వాగతించారు. ఈ నిర్ణయం చరిత్రాత్మకమైనదనీ, అందరి తోడుగా అందరి వికాసమనే ప్రభుత్వ విధానంలో ఇది భాగమని పలువురు పేర్కొన్నారు. బీజేపీ మిత్రపక్షం ఎల్జేపీ అధ్యక్షుడు, దళిత నేత రాం విలాస్ పాశ్వాన్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానించారు. కేంద్ర మంత్రి, ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అఠవాలే కూడా ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. నిమ్న, అగ్ర కులాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసేందుకే: కాంగ్రెస్ ప్రజలను మోసగించేందుకే బీజేపీ ఈ రిజర్వేషన్ల ప్రతిపాదనను తీసుకొచ్చిందనీ, ఆ పార్టీకున్న ఓటమి భయానికి ఇది నిదర్శనమని కాంగ్రెస్ విమర్శించింది. అయితే తాము ఈ బిల్లుకు మద్దతు ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మనుసింఘ్వీ మాట్లాడుతూ ‘పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు అవసరమైనంత ఆధిక్యం బీజేపీకి లేదన్న విషయం ఆ పార్టీకి బాగా తెలుసు. అయినా దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకే, ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల ముందు ఈ బిల్లు తీసుకొస్తున్నారు. మరి గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు ఏం చేశారు?’అని నిలదీశారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటులో మూడింట రెండొంతుల మంది సభ్యులు మద్దతు తెలపడం తప్పనిసరి. విపక్షాల మద్దతు లేకుండా బీజేపీ ఈ బిల్లును ఆమోదింపజేసుకోవటం అసాధ్యం. అయితే అగ్ర కులాల ఓట్ల కోసం ఈ బిల్లుకు అడ్డుచెప్పే ప్రయత్నాన్ని ఏ పార్టీ చేయబోదని బీజేపీ విశ్వసిస్తున్నట్లు సమాచారం. రిజర్వేషన్ల బిల్లుతో సాధారణ ఎన్నికల్లో అగ్ర కులాల ఓట్లు తమకు గణనీయంగా పడతాయని బీజేపీ భావిస్తోంది. అర్హులు ఎవరంటే.. అగ్ర కులాల్లోని పేదలను గుర్తించేందుకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. (విశ్వసనీయ సమాచారం ప్రకారం) ఐదెకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉండకూడదు కుటుంబ వార్షికాదాయం రూ. 8 లక్షలలోపు ఉండాలి వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో సొంతిల్లు ఉండొద్దు మున్సిపాలిటీల్లో 100 గజాలు, మున్సిపాలిటీ కాని ప్రాంతాల్లో 200 గజాలకు మించిన స్థలాలు ఉండకూడదు. -
గుజరాత్ సర్కారుకు ఎదురుదెబ్బ
ఈబీసీల 10 శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్సును కొట్టేసిన హైకోర్టు అహ్మదాబాద్: గుజరాత్లో బీజేపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ! ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈబీసీలు)కు గుజరాత్ ప్రభుత్వం కల్పించిన 10 శాతం కోటా ఆర్డినెన్స్‌ను రాష్ట్ర హైకోర్టు గురువారం కొట్టేసింది. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వీలుగా ఈ ఆదేశాల అమలుపై హైకోర్టు రెండు వారాలు స్టే విధించింది. పటేళ్ల ఆందోళన చల్లార్చేందుకు ఈబీసీలకు విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మే నెలలో గుజరాత్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడం తెలిసిందే. కుటుంబ వార్షికాదాయం రూ. ఆరు లక్షల కంటే తక్కువ ఉన్నవారికి ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపినకోర్టు ఈబీసీ కోటాను రద్దు చేస్తూ, ఈ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకం ఈ ఆర్డినెన్సు వల్ల రిజర్వేషన్ లేని వర్గాలకు సీట్లు తగ్గిపోతాయని.. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశానికి ఇది వ్యతిరేకమన్న పిటిషనర్ల వాదనను కోర్టు సమర్థించింది. అయితే రిజర్వేషన్లు లేని వర్గాలను మరింతగా వర్గీకరించి ఆర్థికంగా వెనుకబడిన వారికి మాత్రమే ఈ రిజర్వేషన్లు వర్తింపజేస్తామని పేర్కొంది. కాగా, కోర్టు ఆదేశాలను పటేళ్ల నేత హార్దిక్ పటేల్ స్వాగతించారు. ‘మేం రాజ్యాంగం ప్రకారం కోటా పొందాలనుకుంటున్నాం’ అని ఆయన అన్నారు