న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లను అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌ఈ) ఫిబ్రవరి 1 నుంచే అమలు చేయనున్నాయి. ప్రస్తుతం మొత్తం 339 సీపీఎస్‌ఈల్లో కలిపి 10.9 లక్షల మంది ఉద్యోగులున్నారు. గత ఆర్థిక ఏడాదిలో ఆ సంఖ్య 11.55 లక్షలు. ఫిబ్రవరి 1 తర్వాత సీపీఎస్‌యూల్లో విడుదలయ్యే అన్ని ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్లలోనూ అగ్ర కులాల్లోని పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించాలంటూ అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ప్రభుత్వ రంగ సంస్థల విభాగం (డీపీఈ) ఆదేశాలు పంపింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని విద్యా సంస్థల్లోనూ ఈ రిజర్వేషన్లను అమలు చేయాలంటూ ఇప్పటికే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది.
1 నుంచి 10% కోటా అమలు
Published Mon, Jan 28 2019 2:57 AM | Last Updated on Thu, Jul 11 2019 5:07 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment